Killer Artiste Review: కిల్లర్ ఆర్టిస్ట్ రివ్యూ.. బిగ్ బాస్ సోనియా ఆకుల సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ మెప్పించిందా?-killer artiste review in telugu telugu psycho crime thriller movie rating and impresses with grabbing scenes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Killer Artiste Review: కిల్లర్ ఆర్టిస్ట్ రివ్యూ.. బిగ్ బాస్ సోనియా ఆకుల సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ మెప్పించిందా?

Killer Artiste Review: కిల్లర్ ఆర్టిస్ట్ రివ్యూ.. బిగ్ బాస్ సోనియా ఆకుల సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ మెప్పించిందా?

Sanjiv Kumar HT Telugu

Killer Artiste Movie Review In Telugu And Rating: తెలుగులో సైకో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన మూవీ కిల్లర్ ఆర్టిస్ట్. సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, సత్యం రాజేష్, ప్రభాకర్, బిగ్ బాస్ సోనియా ఆకుల నటించిన ఈ సినిమా ఇవాళ (మార్చి 21) థియేటర్లలో రిలీజ్ కాగా.. ఎలా ఉందో కిల్లర్ ఆర్టిస్ట్ రివ్యూలో చూద్దాం.

కిల్లర్ ఆర్టిస్ట్ రివ్యూ

టైటిల్: కిల్లర్ ఆర్టిస్ట్

నటీనటులు: సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, సత్యం రాజేశ్, ప్రభాకర్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, భద్రమ్, తాగుబోతు రమేష్, సుదర్శన్. పి. కిరీటీ, వెంకీ మంకీ, సోనియా ఆకుల, స్నేహ మాధురి శర్మ తదితరులు

కథ, దర్శకత్వం: రతన్ రిషి

నిర్మాత: జేమ్స్ వాట్ కొమ్ము

సంగీతం: సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ: చందూ ఏజే

ఎడిటర్: ఆర్ఎం విశ్వనాథ్ కుచనపల్లి

విడుదల తేది: 21 మార్చి 2025

Killer Artiste Review Telugu And Rating: సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జోడీగా నటించిన తెలుగు సైకో థ్రిల్లర్ మూవీ కిల్లర్ ఆర్టిస్ట్. ఎస్‌జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ సినిమాకు రతన్ రిషి దర్శకత్వం వహించారు. ఇవాళ శుక్రవారం (మార్చి 21) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో కిల్లర్ ఆర్టిస్ట్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

విక్కీ (సంతోష్ కల్వచెర్ల), జాను (క్రిషేక పటేల్) ప్రేమలో ఉంటారు. విక్కీ చెల్లెలు స్వాతి (స్నేహ మాధురి శర్మ) దారుణంగా హత్యకు గురవుతుంది. దాంతో విక్కీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. విక్కీ మాములు మనిషి చేసేందుకు లవర్ జాను ట్రై చేస్తుంటుంది. ఈ క్రమంలో మహిళలను వరుస హత్యలు చేసిన పిచ్చి రవి అలియాస్ సైకో రవి జైలు నుంచి తప్పించుకుంటాడు. తన చెల్లిని చంపింది సైకో రవినే అని పగ పెంచుకుంటాడు విక్కీ.

ఈ క్రమంలో జాను ఇంట్లో పార్టీకి ఫ్రెండ్స్‌తో పాటు సైకో రవి కూడా వస్తాడు. కానీ, తన చెల్లెలిని చంపింది సైకో రవి కాదని విక్కీ తెలుసుకుంటాడు. మరి విక్కీ చెల్లిని చంపింది ఎవరు? పిచ్చి రవి నేపథ్యం ఏంటీ? జైలు నుంచి సైకో రవి ఎందుకు తప్పించుకున్నాడు? చివరికీ విక్కీ ఏం చేశాడు? అసలు హంతకుడుని కనిపెట్టాడా? వంటి థ్రిల్లింగ్ విషయాలు తెలియాలంటే కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

తెలుగులో తెరకెక్కిన సైకో పాత్ సీరియల్ కిల్లర్ జోనర్ మూవీనే కిల్లర్ ఆర్టిస్ట్. క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలను చాలా చూసిన ఆడియెన్స్‌కు ఇది పెద్ద ఇంట్రెస్టింగ్‌గా అనిపించకపోవచ్చు. కానీ, కథా, కథనం బాగున్నాయి. అక్కడక్కడ ట్విస్టులతో ఆకట్టుకుంది సినిమా. లవ్ ట్రాక్, కులం వంటి ఎమోషనల్ కంటెంట్‌ వైపు పోకుండా పూర్తిగా క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌పైనే ఫోకస్ పెట్టి ఉండాల్సింది.

హత్య అనేది 65వ కళ

చెప్పాల్సిన అంశాన్ని లవ్, ఎమోషన్స్‌తో ల్యాగ్ చేసినట్లుగా అనిపించింది. ఇక జాను ఇంటి ట్రాక్ బాగున్నా కాస్తా లెంతీ అనే ఫీలింగ్ కలిగింది. రిపీటెడ్‌గా అనిపిస్తుంది. కానీ, విక్కీ చెల్లెలి హత్య విషయంలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. కానీ, అదివరకే ఆడియెన్స్ కాస్తా సహనం కోల్పోయి ఉంటారు. చరిత్రలో మనకు తెలిసిన 64 కళలకు మించి అదనంగా హత్య చేయడం అనేది 65వ కళ అని చెప్పే పాయింట్ కొత్తగా ఉంది.

బీజీఎమ్-ట్విస్ట్

ఈ అంశం చుట్టూనే కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా సాగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్‌లో లాజిక్ పక్కన పెడితే కన్విన్సింగ్‌గా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ రతన్ రిషి. సినిమా చివరిలో ఇచ్చే మేసేజ్ పర్వాలేదు. సీరియల్ మర్డర్స్ అనేది రొటీన్ పాయింట్ అయినా టేకింగ్ బాగుంది. బీజీఎమ్ కూడా బాగుంది. క్రైమ్ థ్రిల్లర్‌కు సూట్ అయ్యే విధంగా ఉంది. విజువల్స్ బాగున్నాయి.

మెప్పించిన ప్రభాకర్

అక్కడక్కడ రక్తపాతం కనిపిస్తుంది. ఇక కొత్త హీరో అయినప్పటికీ సంతోష్ కల్వచెర్ల బాగా చేశాడు. పాత్రకు తగిన యాట్యిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించాడు. హీరోయిన్ క్రిషేక్ పటేల్ గ్లామరస్‌గా ఓకే అనిపించింది. పిచ్చి రవి అలియాస్ సైకో రవిగా ప్రభాకర్‌కు ఫుల్ లెంత్ రోల్ పడింది. దానిని ఆయన పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.

ఫైనల్‌గా చెప్పాలంటే

సైకో రవిగా ప్రభాకర్ మెప్పించడమే కాదు భయపెట్టాడు కూడా. బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల పర్వాలేదనిపించింది. పోలీస్‌గా సత్యం రాజేష్ ఇతర నటీనటులు బాగానే ఆకట్టుకున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూర్చోబెట్టే సైకో పాత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ ఆర్టిస్ట్.

రేటింగ్: 2.75/5

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం