ఓటీటీలో ఈ సినిమాను పిల్లలకు తప్పక చూపించండి! 5 కారణాలు ఇవే.. తెలుగులోనూ స్ట్రీమింగ్-kids must watch finding nemo movie in this summer holidays streaming on jiohotstar also in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో ఈ సినిమాను పిల్లలకు తప్పక చూపించండి! 5 కారణాలు ఇవే.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఓటీటీలో ఈ సినిమాను పిల్లలకు తప్పక చూపించండి! 5 కారణాలు ఇవే.. తెలుగులోనూ స్ట్రీమింగ్

కొన్ని సినిమాలను చూడడం వల్ల పిల్లలకు తెలియకుండానే చాలా మంచి విషయాలు తెలుస్తాయి. పాజిటివ్ అంశాలను కొన్ని చిత్రాలను పెంపొదిస్తాయి. అలాంటి ఓ సినిమాను పిల్లలకు తప్పనిసరిగా చూపించాలి. తెలుగులోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలో ఈ సినిమాను పిల్లలకు తప్పక చూపించండి!

పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చేశాయి. దీంతో ఈ హాలీడేస్‍లో పిల్లలతో ఏమేం చేయించాలనే ఆలోచనలో పెద్దలు ఉంటారు. కొత్త విషయాలను నేర్పించాలనుకుంటారు. ఈ క్రమంలో పిల్లలకు కొన్ని మంచి సినిమాలు చూపించడం వల్ల వారిలో విలువలు, పాజిటివిటీ పెరుగుతాయి. అందులోనూ యానిమేషన్ చిత్రాలంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. సినిమా ద్వారా పిల్లలకు మంచి విషయాలు తెలియాలనుకుంటే ‘ఫైండ్ నెమో’ (Finding Nemo) పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. 2003లో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ సాధించింది. సముద్రంలోని జీవులతో ఈ యానిమేషన్ చిత్రం సాగుతుంది. పిల్లలందరూ ఈ చిత్రాన్ని తప్పక చూడాలి. ఎందుకో 5 కారణాలు తెలుసుకోండి. ఓ ఓటీటీలో ఉందో కూడా చూడండి.

కుటుంబ బంధాలను తెలుపుతుంది

ఫైండింగ్ నెమో సినిమాా వల్ల పిల్లలకు కుటుంబ బంధాల గురించి మరింత తెలుస్తుంది. తండ్రీకొడుకుల మధ్య ఉండే బాండింగ్ ఎంత బలంగా ఉంటుందో అర్థమవుతుంది. పిల్లల క్షేమం కోసం తల్లిదండ్రులు ఎంత ఆరాటపడతారో, ఏం చేసేందుకైనా సిద్ధపడతారని ఈ మూవీ చెబుతుంది. తప్పిపోయిన తన కుమారుడు నెమో (క్లౌన్ ఫిష్)ను ఇంటికి తిరిగి తీసుకొచ్చేందుకు అతడి తండ్రి మార్లిన్ (క్లౌన్ ఫిష్) చేసే ప్రయత్నాలు, ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ ఈ యానిమేటెడ్ సినిమా ఉంటుంది.

స్నేహం విలువ తెలుస్తుంది

ఫైండింగ్ నెమో చిత్రంలో మార్లిన్, డోరీ (రేగల్ బ్లూ ట్యాంగ్ ఫిష్)మధ్య స్నేహం కూడా ఆకట్టుకుంటుంది. డోరీకి కాస్త మతిమరుపు ఉంటుంది. కానీ మార్లిన్‍కు సాయం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. కఠినమైన ప్రయాణంలో ఇద్దరూ ఒకరికి ఒకరు తోడు ఉంటారు. విభిన్నమైన లక్షణాలు ఉన్నా స్నేహితులుగా ఉండొచ్చని ఈ మూవీ తెలుపుతుంది. స్నేహం ఎంత విలులైనదో, పరస్పరం సాయం చేసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.

భయాన్ని దాటి.. ధైర్యంగా ఉండాలని..

అనుకున్నది చేయాలంటే భయాన్ని జయించాలని మార్లిన్ పోరాటం ఈ చిత్రంలో తెలియజేస్తుంది. లక్ష్యం సాధించాలంటే కంఫర్ట్ జోన్‍ను దాటేందుకు జంకకూడదనే మెసేజ్‍ను ఇస్తుంది. ఎదురయ్యే సవాళ్లకు భయపడుకుండా ముందడుగు వేయాలని చెబుతుంది. నెమోను వెతికేందుకు సముద్రంలో షార్క్స్, జెల్లీఫిష్‍లతో పాటు చాలా సవాళ్లను మార్లిన్ ఎదుర్కొంటాడు. అయినా, తన ప్రయాణాన్ని మాత్రం ఆపడు. నెమో కూడా తనకు శారీరక లోపం ఉన్నా ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధపడతాడు.

పట్టువదలకూడదని..

అనుకున్న లక్ష్యాన్ని చేరే క్రమంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా పట్టువదలకూడదని ఫైండింగ్ నెమో చిత్రం నేర్పుతుంది. మార్లిన్, డోరీకి చాలా ఛాలెంజ్‍లు, ప్రమాదాలు ఎదురవుతాయి. అయినా, వారు వెనుదిరిగేందుకు ఇష్టపడరు. జర్నీని అలాగే కొనసాగిస్తారు.

సముద్రపు అందాలు తెలుస్తాయి

ఫైండింగ్ నెమో చిత్రమంతా సముద్రంలోనే జలచర జీవులతో ఉంటుంది. రకరకాల చేపలు, తిమింగరాలు మరిన్ని సముద్ర జీవులు ఈ సినిమాలో కనిపిస్తాయి. సముద్రం ఎంత అందంగా ఉంటుందో ఈ చిత్రం ద్వారా పిల్లలకు తెలుస్తుంది. చాలా రకాల జీవుల గురించి కూడా అర్థమవుతుంది. సముద్రం గురించి, ప్రకృతి గురించి తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని పిల్లల్లో ఈ మూవీ పెంచగలదు.

స్ట్రీమింగ్ ఎక్కడంటే.. తెలుగులోనూ..

ఫైండింగ్ నెమో సినిమా జియోహాట్‍స్టార్ ఓటీటీలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. వీలైనప్పుడు పిల్లలకు ఫైండింగ్ నెమో మూవీని హాట్‍స్టార్ ఓటీటీలో చూపించండి. పెద్దలను కూడా ఈ సినిమా మెప్పిస్తుంది. ఈ చిత్రానికి ఆండ్రూ స్టాంటన్ దర్శకత్వం వహించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం