Max teaser: కిచ్చా సుదీప్ ఈజ్ బ్యాక్.. ఈగ విలన్ మాక్స్ మూవీ టీజర్ రిలీజ్.. విలన్‌గా సునీల్
Max teaser: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటిస్తున్న మాక్స్ మూవీ టీజర్ మంగళవారం (జులై 16) రిలీజైంది. టాలీవుడ్ నటుడు సునీల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు సిద్ధమవుతోంది.
Max teaser: తెలుగులో ఈగ మూవీ ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇప్పుడు మరో పవర్ ఫుల్ అవతార్‌తో వస్తున్నాడు. అతడు నటిస్తున్న మాక్స్ మూవీ కన్నడతోపాటు తెలుగు, ఇతర భారతీయ భాషల్లో రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మంగళవారం (జులై 16) మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సునీల్ విలన్ గా నటిస్తున్నాడు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
మాక్స్ టీజర్
ఈ మాక్స్ మూవీ టీజర్ లో కిచ్చా సుదీప్ ఓ డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్నాడు. నిమిషం పాటు ఉన్న ఈ టీజర్ లో సుదీప్ నర్సరీ రైమ్ బా బా బ్లాక్ షీప్ చెబుతుండగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మూవీలోని విలన్ సునీల్, ఫిమేల్ లీడ్ వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలను పరిచయం చేశారు. చివరికి సుదీప్ రెండు కత్తులు దూస్తూ తనపైకి దూసుకొస్తున్న వారిపైకి దూకడంతో టీజర్ ముగుస్తుంది.
మాక్స్ మూవీ కన్నడ, తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ అవుతోంది. టీజర్ చివర్లో అన్ని భాషల్లోనూ టైటిల్ రివీల్ చేయడం చూడొచ్చు. ఈ సినిమాను విజయ్ కార్తికేయ డైరెక్ట్ చేశాడు. సుదీప్ ను చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ పవర్ ఫుల్ పాత్రలో చూసిన ఫ్యాన్స్.. సుదీప్ ఈజ్ బ్యాక్ అని కామెంట్స్ చేస్తున్నారు.
రెండేళ్ల తర్వాత మళ్లీ..
సుదీప్ ఈ టీజర్ ను తన ఎక్స్ అకౌంట్లో రిలీజ్ చేస్తూ.. "మాక్స్ ఛార్జ్ తీసుకున్నాడు. మాక్స్ టీజర్ తో మాక్స్ మానియా మొదలైంది" అనే క్యాప్షన్ ఉంచాడు. సుదీప్ చివరిసారి 2022లో విక్రాంత్ రోణా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాక్స్ ఇండస్ట్రీ హిట్ అవడం ఖాయం అంటూ టీజర్ చూసిన తర్వాత ఓ అభిమాని కామెంట్ చేశాడు.
ఈ సినిమా ద్వారా విలన్ గా కన్నడ సినిమా ఇండస్ట్రీలో సునీల్ అడుగుపెట్టనుండటం విశేషం. అతడు ఇప్పటికే పుష్ప మూవీలోనూ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. పుష్ప 2తో మరోసారి అతడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మాక్స్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. కానీ టీజర్ ద్వారా అతి త్వరలోనే రానుందని మాత్రం వాళ్లు చెప్పారు.
మరోవైపు కిచ్చా సుదీప్ తెలుగులో ఈగ సినిమాలో విలన్ పాత్ర ద్వారా మంచి పేరు సంపాదించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ద్వారానే అతడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తర్వాత బాహుబలి మూవీలోనూ నటించాడు.