OTT Action: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి కిచ్చా సుదీప్ క‌న్న‌డ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే-kiccha sudeep kannada action thriller movie max to stream on zee5 ott from this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి కిచ్చా సుదీప్ క‌న్న‌డ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Action: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి కిచ్చా సుదీప్ క‌న్న‌డ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Published Feb 08, 2025 07:04 PM IST

OTT Action Thriller: కిచ్చా సుదీప్ హీరోగా న‌టించిన క‌న్న‌డ మూవీ మ్యాక్స్ ఓటీటీ రిలీజ్‌పై స‌స్పెన్స్ వీడింది. ఫిబ్ర‌వ‌రి 22న జీ5 ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఓటీటీ
యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఓటీటీ

OTT Action Thriller: కిచ్చా సుదీప్ హీరోగా న‌టించిన క‌న్న‌డ మూవీ మ్యాక్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఫిబ్ర‌వ‌రి 22 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని జీ5 ఓటీటీ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. కేవ‌లం క‌న్న‌డ వెర్ష‌న్ మాత్ర‌మే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే అదే రోజు నుంచి తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో మ్యాక్స్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

డిజాస్ట‌ర్‌...

మ్యాక్స్ మూవీకి విజ‌య్ కార్తికేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌తో పాటు టాలీవుడ్ క‌మెడియ‌న్ సునీల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ నెలాఖ‌రున‌ థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. అర‌వై ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ యాభై కోట్ల‌లోపే క‌లెక్ష‌న్స్‌ను ద‌క్కించుకున్న‌ది.

యాక్ష‌న్ ఎపిసోడ్స్‌...

సుదీప్ క్యారెక్ట‌ర్‌, అత‌డి మ్యాన‌రిజ‌మ్స్‌తో పాటు యాక్ష‌న్ ఎపిసోడ్స్ మాత్రం బాగున్నాయ‌నే కామెంట్స్ వినిపించాయి. థియేట‌ర్ల‌లో క‌న్న‌డం, హిందీతో పాటు మిగిలిన ద‌క్షిణాది భాష‌ల్లో మ్యాక్స్ మూవీ రిలీజైంది. క‌న్న‌డంలో మోస్తారు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మూవీ మిగిలిన భాష‌ల్లో బాక్సాఫీస్ వ‌ద్ద ఏ మాత్రం ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. కార్తి ఖైదీ మూవీతో పోలిక‌లు రావ‌డం ఈ మూవీకి మైన‌స్‌గా మారింది.

మ్యాక్స్ మూవీ క‌థ‌...

అర్జున్ మ‌హాక్ష‌య్ అలియాస్ మ్యాక్స్‌ (కిచ్చా సుదీప్‌) ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. నిజాయితీ, ముక్కుసూటిత‌నం వ‌ల్ల చాలా సార్లు స‌స్పెండ్ అవుతాడు. స‌స్పెన్ష‌న్ ముగిసి తెల్లారితే డ్యూటీలో జాయిన్ కావాల్సిన టైమ్‌లో డ్ర‌గ్స్ మ‌త్తులో మునిగిన‌ ఇద్ద‌రు మినిస్ట‌ర్స్‌ కుమారుల‌ను మ్యాక్స్‌ అరెస్ట్ చేస్తాడు. ఆ మినిస్ట‌ర్ కొడుకులు పోలీస్ స్టేష‌న్‌లోనే చ‌నిపోతారు. వాళ్లు ఎలా చ‌నిపోయారు?

పోలీస్ స్టేష‌న్‌లో ఉన్న మంత్రుల కుమారులను విడిపించేందుకు వ‌చ్చిన రౌడీల‌ను మ్యాక్స్ తో పాటు మిగిలిన పోలీసులు ఎలా ఎదుర్కొన్నారు?ఇన్స్‌పెక్ట‌ర్ రూప (వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్), గ్యాంగ్‌స్ట‌ర్ గ‌ని (సునీల్‌)కార‌ణంగా మ్యాక్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మినిస్ట‌ర్ కొడుకుల మ‌ర్డ‌ర్ కేసు నుంచి మ్యాక్స్‌తో పాటు మిగిలిన పోలీసులు ఏ విధంగా బ‌య‌ట‌ప‌డ్డార‌న్న‌దే మ్యాక్స్ మూవీ క‌థ‌. ఒక్క రోజులో జ‌రిగే క‌థ‌తో ద‌ర్శ‌కుడు విజ‌య్ కార్తికేయ ఈ మూవీని రూపొందించాడు.

Whats_app_banner

సంబంధిత కథనం