Action Thriller OTT: ఓటీటీలో కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ షురూ.. తెలుగులోనూ అందుబాటులోకి..
Max OTT Streaming: మ్యాక్స్ సినిమా ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. ఈ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన మ్యాక్స్ చిత్రం గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తొలి వారం మంచి కలెక్షన్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. అయితే, ఆ తర్వాత వసూళ్లలో డ్రాప్ కనిపించింది. ఈ మూవీకి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. మ్యాక్స్ మూవీ స్ట్రీమింగ్కు ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూశారు. అయితే అంచనాల కంటే ఆలస్యమైంది. ఎట్టకేలకు నేడు (ఫిబ్రవరి 15) మ్యాక్స్ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే
మ్యాక్స్ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. నేటి సాయంత్రం 7.30 గంటలకు ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది.
జీ కన్నడ టీవీ ఛానెల్లోనూ మ్యాక్స్ చిత్రం నేడు 7.30 గంటలకే ప్రసారమైంది. అదే సమయంలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. ఓటీటీలో నాలుగు భాషల్లో అందుబాటులో ఉంది.
మ్యాక్స్ మూవీలో కిచ్చా సుదీప్తో పాటు వరలక్ష్మి శరత్‌కుమార్, ఇలవరసు, సునీల్, సంయుక్త హొర్నాడ్, ఉగ్రమ మంజు, సుకృత వాగ్లే, శరత్ లోహితస్వ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ కార్తికేయ తెరకెక్కించారు. ఈ మూవీలో ఇన్స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ పాత్రలో సుదీప్ నటించారు. యాక్షన్‌తో అదరగొట్టారు.
మ్యాక్స్ కలెక్షన్లు
మ్యాక్స్ చిత్రం సుమారు రూ.62 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకున్నట్టు అంచనా. ఈ చిత్రం సుమారు రూ.65కోట్ల బడ్జెట్‌తో రూపొందిందని సమాచారం. ఈ చిత్రం ఆరంభంలో మంచి వసూళ్లు సాధించింది. అయితే మిక్స్డ్ టాక్ రావటంతో ఆ తర్వాత పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
కిచ్చా క్రియేషన్స్, వీ క్రియేషన్స్ బ్యానర్లపై హీరో కిచ్చా సుదీప్, కలైపులి ఎస్.థాను కలిసి మ్యాక్స్ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి అజ్నీశ్ లోకనాథ్ మ్యూజిక్ అందించారు. శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి గణేశ్ బాబు ఎడిటింగ్ చేశారు.
మ్యాక్స్ సినిమా స్టోరీలైన్
మ్యాక్స్ అలియాజ్ అర్జున్ మహాక్షయ్ (కిచ్చా సుదీప్).. సీఐగా విధులు నిర్వర్తిస్తుంటాడు. సస్పెండ్ అయి మళ్లీ వెంటనే మళ్లీ డ్యూటీలో చేరతాడు. ఈ గ్యాప్‌లో ఇద్దరు మంత్రుల కొడుకులను మ్యాక్స్ అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత కస్టడీలో వారిద్దరూ చనిపోతారు.
తమ వారిని అప్పగించాలని మంత్రుల మనుషులు, గ్యాంగ్స్టర్లు పోలీస్ స్టేషన్ వద్ద గొడవ చేస్తారు. ముట్టడిస్తారు. ఈ తరుణంలో మ్యాక్స్ ఓ రిస్కీ నిర్ణయం తీసుకుంటాడు. కస్టడీలో వారు ఎలా చనిపోయారు.. మ్యాక్స్ తీసుకున్న నిర్ణయమేంటి.. అతడు చేసిన ప్లాన్ ఏంటి.. ఆ తర్వాత ఏం జరిగిందనేది మ్యాక్స్ సినిమాలో ఉంటాయి. ఈ మూవీలో యాక్షన్ అదిరిపోయినా.. కథ బలంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్క్రీన్‌ప్లే కూడా ఊహించే విధంగానే సాగుతుంది. సుదీప్ యాక్షన్ ఈ మూవీలో హైలైట్‌గా నిలిచింది.
సంబంధిత కథనం