OTT Action Thriller: కిచ్చా సుదీప్ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
OTT Action Thriller: మ్యాక్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏదో వెల్లడైంది. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చో అంచనాలు బయటికి వచ్చాయి.
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మ్యాక్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. క్రిస్మస్ సందర్భంగా 2024 డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‍తో ఆరంభం నుంచే దూసుకెళుతోంది. దీంతో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. కన్నడతో పాటు తెలుగు, తమిళంలోనూ మ్యాక్స్ చిత్రం రిలీజ్ అయింది. ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ కూడా ఫిక్స్ అయింది.
ఏ ఓటీటీలో..
మ్యాక్స్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. శాటిలైట్ హక్కులను జీ నెట్‍వర్క్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.
ఎప్పుడు రావొచ్చు!
మ్యాక్స్ సినిమా జనవరి చివరి వారంలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. జనవరి 31న స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకు జీ5 సన్నాహకాలు చేస్తోందని సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై ఆ ప్లాట్‍ఫామ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం థియేటర్లలో మాత్రం ఈ చిత్రం దుమ్మురేపుతోంది.
సుదీప్ యాక్షన్‍పై ప్రశంసలు
మ్యాక్స్ మూవీకి విజయ్ కార్తీకేయ దర్శకత్వం వహించారు. పక్కా యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్సులు భారీగా ఉన్నాయి. ఇన్‍స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ అలియాజ్ మ్యాక్స్ పాత్రలో యాక్షన్ సీన్లలో సుదీప్ అదరగొట్టాడనే టాక్ వచ్చింది. సినిమాకు ఇదే హైలైట్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, కథాకథనాల విషయంలో మిక్స్డ్ టాక్ వచ్చింది.
మ్యాక్స్ చిత్రంలో సుదీప్‍తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇళవరసు, ఉగ్రం మంజు, సంయుక్త హోర్నాడ్, సుధ బెలవాడీ, సుకృత, శరత్ లోహిత్వస కీలకపాత్రలు చేశారు. ఈ మూవీకి అజ్నీష్ లోకనాథ్ సంగీతం అందించారు.
మ్యాక్స్ సినిమా కలెక్షన్లు
మ్యాక్స్ సినిమా ఇప్పటికే రూ.50 గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ చిత్రానికి ఇంకా జోరుగా కలెక్షన్లు వస్తున్నాయి. ఫుల్ రన్‍లో రూ.100కోట్ల మార్క్ చేరుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. అయితే, మూడో వారం వీక్‍డేస్‍లో ఈ చిత్రానికి అసలైన బాక్సాఫీస్ టెస్టు ఉండనుంది.
మ్యాక్స్ మూవీని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ పతాకాలపై కలైపులి థాను, సుదీప్ కలిసి ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ చేశారు. అజ్నీష్ లోకనాథ్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించింది. ఈ చిత్రం కోసం సుదీప్ జోరుగా ప్రమోషన్లను నిర్వహించారు.
సంబంధిత కథనం