Yash In Raavan Role : గ్యాంగ్‌స్టర్ టూ రావణ్‌.. లంకేశ్వరుడి పాత్రలో రాకీ భాయ్-kgf star yash to play raavan role in nitesh tiwari s ramayana here s complete details
Telugu News  /  Entertainment  /  Kgf Star Yash To Play Raavan Role In Nitesh Tiwari's Ramayana Here's Complete Details
యశ్
యశ్ (Twitter)

Yash In Raavan Role : గ్యాంగ్‌స్టర్ టూ రావణ్‌.. లంకేశ్వరుడి పాత్రలో రాకీ భాయ్

30 January 2023, 14:03 ISTAnand Sai
30 January 2023, 14:03 IST

Yash In Ramayana : కేజీఎఫ్ 2 సూపర్ సక్సెస్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో యశ్ తర్వాత సినిమాపై సహజంగానే అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే రావణసురుడి పాత్రలో యశ్ కనిపించనున్నట్టుగా టాక్ నడుస్తోంది.

కేజీఎఫ్ 2(KGF 2)తో కన్నడ నటుడు యశ్ పాన్ ఇండియా(Pan India) స్టార్ అయిపోయాడు. ఎక్కడకు వెళ్లినా.. రాకీ భాయ్(Rocky Bhai) అంటూ ఫ్యాన్స్ పిలుస్తుంటారు. కేజీఎఫ్ తర్వాత.. యశ్(Yash Movies) నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటనేది మాత్రం.. ప్రకటించలేదు. కానీ ఇప్పుడో ఇంట్రస్టింగ్ వార్త ఫిలీం సర్కిల్స్ లో వినిపిస్తోంది. రాకింగ్ స్టార్ యశ్ రావణసురుడి పాత్రలో కనిపించనున్నాడు. నితేశ్ తివారి దర్శకత్వంలో రానున్న రామయణంలో యశ్ లంకేశ్వరుడి పాత్ర పోషించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

నితేశ్ తివారి(Nitesh Tiwari) తీయనున్న రామయణంలో రాముడిగా రణ్ బీర్ కపూర్(ranbir kapoor) కనిపించనున్నాడు. అయితే మెుదట హృతిక్ రోషన్(hrithik roshan) రావణసురుడిగా నటిస్తాడని అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు నుంచి హృతిక్ తప్పుకున్నాడు. దీంతో యశ్ వైపు మెుగ్గు చూపినట్టుగా తెలుస్తోంది.

హృతిక్ రోషన్ నేరుగానే.. రావణసురుడి పాత్రను చేయలేనని నితేశ్ తివారితో చెప్పాడట. ఎందుకు చేయట్లేదని వివరణ కూడా ఇచ్చాడని టాక్. దీంతో హృతిక్ ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టైంది. మధు మంతెన, అల్లు అరవిద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే హృతిక్ తప్పుకొన్నాక.. ఆ టీమ్ చూపు.. కేజీఎఫ్ స్టార్ యశ్ మీదకు వెళ్లింది. అందుకే యశ్ ను రావణసురుడి పాత్రకు అడిగారట. నితేష్ ఇచ్చిన బ్రీఫ్.. రాకీ భాయ్ కి నచ్చిందట.. కానీ అధికారిక ప్రకటన మాత్రం చేయాల్సి ఉంది. ఒకవేళ యశ్ ఒకే చెబితే... ఈ భారీ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ పెరగనుంది.

గత ఏడాది కేజీఎఫ్ 2 విడుదలై బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. కన్నడ సినిమా వైపు అందరూ తిరిగి చూసేలా చేసింది. ఇక రావణుడి పాత్రలో యశ్ నటిస్తే.. రాకీ భాయ్ అనే గ్యాంగ్‌స్టర్ నుంచి రావణ్‌గా మారనున్నాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఈ భారీ చిత్రంలో యశ్ ని రావణ్‌గా చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్(KGF) తర్వాత.. యశ్ 4, 5 సినిమాలకు సైన్ చేశారని చెబుతున్నారు. వీటిలో ఒకటి నితేష్ తివారి రామాయణం అని కూడా అంటున్నారు. మరో రెండు నెలల్లో యశ్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.