Yash Bollywood Movie: బ్ర‌హ్మాస్త్ర సీక్వెల్‌లో య‌శ్ - బాలీవుడ్ స‌ర్కిల్‌లో కొత్త గాసిప్‌-kgf star yash likely to play key role in brahmastra sequel
Telugu News  /  Entertainment  /  Kgf Star Yash Likely To Play Key Role In Brahmastra Sequel
హీరో య‌శ్‌
హీరో య‌శ్‌

Yash Bollywood Movie: బ్ర‌హ్మాస్త్ర సీక్వెల్‌లో య‌శ్ - బాలీవుడ్ స‌ర్కిల్‌లో కొత్త గాసిప్‌

28 October 2022, 8:58 ISTNelki Naresh Kumar
28 October 2022, 8:58 IST

Yash Bollywood Movies: కేజీఎఫ్ 2 బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత బాలీవుడ్ నుంచి హీరో య‌శ్‌కు భారీ ఆఫ‌ర్స్ వ‌రిస్తున్నాయి. తాజాగా బ్ర‌హ్మాస్త్ర సీక్వెల్‌తో పాటు ఓ పౌరాణిక సినిమాలో య‌శ్ న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Yash Bollywood Movie: బాలీవుడ్‌లో భారీ బ‌డ్జెట్‌తో కూడిన పౌరాణిక సినిమాలో న‌టించే అవ‌కాశం హీరో య‌శ్‌కు వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కేజీఎఫ్ -2 సినిమాతో పాన్ ఇండియ‌న్ స్టార్‌గా మారిపోయాడు య‌శ్‌. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ 1200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

క‌లెక్ష‌న్స్ ప‌రంగా బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో ప‌లు రికార్డుల‌ను కేజీఎఫ్ 2 తిర‌గ‌రాసింది. ఈ అద్వితీయ విజ‌యం త‌ర్వాత య‌శ్‌తో సినిమాలు చేసేందుకు ప‌లువురు బాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

తాజాగా మ‌హాభార‌తంలోని క‌ర్ణుడి పాత్ర ఆధారంగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రాకేష్ ఓం ప్ర‌కాష్ మెహ్రా ఓ భారీ బ‌డ్జెట్ సినిమాను తెర‌కెక్కించేందుకు ప్ర‌య‌త్నిస్తోన్న‌ట్లు తెలిసింది. ఈ సినిమాలో క‌ర్ణుడి పాత్ర కోసం య‌శ్‌ను రాకేష్ ఓం ప్ర‌కాష్ మెహ్రా సంప్ర‌దించిన‌ట్లు చెబుతున్నారు. య‌శ్‌కు క‌థ వినిపించిన‌ట్లు తెలిసింది. రెండు భాగాలుగా క‌ర్ణ సినిమా రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం.

అలాగే బ్ర‌హ్మాస్త్ర సీక్వెల్ లో కీల‌క‌మైన దేవ్ పాత్ర‌లో య‌శ్ క‌నిపించే అవ‌కాశం ఉన్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ర‌ణ్‌బీర్‌క‌పూర్‌తో స‌మానంగా సెకండ్ పార్ట్‌లో య‌శ్‌ క్యారెక్ట‌ర్ క‌నిపిస్తుంద‌ని అంటున్నారు.

కాగా కేజీఎఫ్ 2కు కొన‌సాగింపుగా కేజీఎఫ్ -3ని తెర‌కెక్కించ‌బోతున్నారు. ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొంద‌నున్న ఈ మూడోభాగం వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకిరానున్న‌ట్లు చెబుతున్నారు. అలాగే ద‌ర్శ‌కుడు నార్త‌న్‌తో య‌శ్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.