Keerthy Suresh Baby John OTT Release: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది మహానటి కీర్తి సురేష్. దసరా, భోళా శంకర్, రఘు తాత వంటి సినిమాలతో రీసెంట్‌గా అలరించిన కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. కీర్తి సురేష్ చేసిన తొలి హిందీ మూవీ బేబీ జాన్.
కీర్తి సురేష్ బేబీ జాన్ మూవీలో హీరోగా వరుణ్ ధావన్ చేశాడు. కలీస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తమిళ డైరెక్టర్ అట్లీ నిర్మించాడు. పెన్ స్టూడియోస్, పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్ చిత్రంగా బేబీ జాన్‌ను రూపొందించారు. సుమారు రూ. 180 కోట్ల వ్యయంతో తెరకెక్కిన బేబీ జాన్ మూవీకి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు.
అట్లీ కుమార్, జ్యోతి దేశ్‌పాండే, మురద్ ఖేతని, కృష్ణప్రియ నిర్మాతలుగా వ్యవహరించిన బేబీ జాన్ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ హిట్ తేరి మూవీకి రీమేక్‌గా రూపొందించారు. 2016లో వచ్చిన విజయ్ దళపతి, సమంత తేరి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే, డిసెంబర్ 25న థియేటర్లలో క్రిస్మస్ కానుకగా చాలా గ్రాండ్‌గా విడుదలైన బేబీ జాన్ సినిమా మిశ్రమ రివ్యూలు అందుకుంటోంది.
2024లో చివరి బాలీవుడ్ చిత్రంగా విడుదలైన బేబీ జాన్ మూవీకి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు రోజుల్లో ఇండియాలో రూ. 23 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. బేబీ జాన్ సినిమాలో మొదటి 40 నిమిషాలు డీసెంట్‌గా ఉందని, ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాలు హైలెట్ అని నెటిజన్స్ చెబుతున్నారు.
ఇక సెకండాఫ్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని, క్లైమాక్స్, తమన్ బీజీఎమ్ అదిరిపోయిందని అంటున్నారు. అయితే, స్టోరీ మాత్రం రొటీన్‌గా ఉందని, ఊహించేలా సీన్స్ ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు. ఇలా మిక్స్‌డ్ టాక్‌తో రన్ అవుతోన్న బేబీ జాన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివరాలు ఆసక్తిగా మారాయి.
ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ బేబీ జాన్ ఓటీటీ రైట్స్‌ను మంచి ధరకు కొనుగోలు చేసుకుందని సమాచారం. అంటే, అమెజాన్ ప్రైమ్‌లోనే బేబీ జాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందట. ఇక థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాతే బేబీ జాన్ ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం.
అంటే, థియేట్రికల్ రిలీజ్‌కు నెల లేదా రెండు నెలల తర్వాత బేబీ జాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందన్నమాట. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఓటీటీలో బేబీ జాన్‌ను వీక్షించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను మొదట హిందీలోనే ఓటీటీ రిలీజ్ చేయనున్నారు.