OTT: ఒకే ఓటీటీలోకి కీర్తి సురేష్ రెండు సినిమాలు - ఒకటి థ్రిల్లర్ - మరోటి యాక్షన్ కామెడీ!
OTT: కీర్తి సురేష్ తమిళ సినిమాలు రివాల్వర్ రీటా, కన్నివేది ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ రెండు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. రివాల్వర్ రీటా యాక్షన్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోండగా... కన్నివేది ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.
OTT: ఇటీవేల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది కీర్తిసురేష్. చిరకాల స్నేహితుడు ఆంటోనీ తటిల్‌తో ఏడడుగులు వేసింది. గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి జరిగింది. ఓ వైపు గృహిణిగా బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే మరోవైపు సినిమాలపై ఫోకస్ పెట్టాలని కీర్తి సురేష్ నిర్ణయించుకుంది.

డిఫరెంట్ కాన్సెప్ట్...
ఈ ఏడాది తెలుగు,తమిళంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలతో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతోంది కీర్తిసురేష్. ఆమె హీరోయిన్‌గా నటించిన తమిళ సినిమాలు రివాల్వర్ రీటా, కన్నివేది సినిమాలు త్వరలో థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. రిలీజ్ ముందే ఈ సినిమాల ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి.
నెట్‌ఫ్లిక్స్...
రివాల్వర్ రీటా, కన్నివేది డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ హక్కులు కలిపి ఫ్యాన్సీ రేటుకు కీర్తి సురేష్ సినిమాల రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు చెబుతోన్నారు.
డైరెక్ట్‌గా ఓటీటీలోనే...
రివాల్వర్ రీటా, కన్నివేది సినిమాల షూటింగ్ పూర్తయ్యి చాలా రోజులు అవుతోంది. ఈ సినిమాల థియేట్రికల్ రిలీజ్‌లపై చాలా రోజులుగా ఎలాంటి అప్‌డేట్ లేదు. దాంతో ఈ రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
యాక్షన్ కామెడీ మూవీ...
రివాల్వర్ రీటా మూవీ యాక్షన్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు జేకే చంద్రు దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ సినిమాలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్‌లో కీర్తి సురేష్ కనిపిస్తోంది. ఓ మిడిల్ క్లాస్ యువతి క్రైమ్ వరల్డ్ లోకి ఎలా ఎంటరైంది అనే పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. రాధిక శరత్‌కుమార్ రెడిన్ కింగ్స్‌లే, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇన్వేస్టిగేట్ జర్నలిస్ట్...
కన్నివేది మూవీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. గణేష్ రాజ్ డైరెక్టర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఇన్వేస్టిగేట్ జర్నలిస్ట్‌గా కీర్తి సురేష్ కనిపించబోతున్నది. ఓ మర్డర్ మిస్టరీని ధైర్యసాహసాలతో ఓ లేడీ జర్నలిస్ట్ ఎలా సాల్వ్ చేసిందనే పాయింట్‌తో కన్నివేది రూపొందుతోన్నట్లు తెలిసింది. ఈ సినిమాలో అజయ్ ఘోష్, వీజే రక్షణ్ కీలక పాత్రలు పోషిస్తోన్నారు.