Keerthy Suresh: నా డేటింగ్ గురించి సమంతకు ముందే తెలుసు, 12వ తరగతి నుంచి ప్రేమించాను: లవ్ స్టోరీ చెప్పిన కీర్తి సురేష్
Keerthy Suresh About Samantha Vijay Atlee Over Her Dating: తన డేటింగ్, లవ్ రిలేషన్‌షిప్ గురించి సమంత, విజయ్, డైరెక్టర్ అట్లీతోపాటు మరో నలుగురికి ముందే తెలుసు అని హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా చెప్పింది. అలాగే, తన లవ్ స్టోరీ గురించి కూడా బయటపెట్టేసింది. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Keerthy Suresh About Samantha Vijay And Her Love Story: మహానటి కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంటోనీ తాటిల్‌ను గత ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకుంది. గోవాలో డిసెంబర్ 12న ముందుగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో కీర్తి సురేష్ వివాహం జరిగింది. అనంతరం క్రిస్టియన్ స్టైల్‌లో ఆంటోనీ తాటిల్‌ను మ్యారేజ్ చేసుకుని అతనికి లిప్ కిస్ పెట్టింది కీర్తి సురేష్.
డేటింగ్ విషయం
అయితే, తన పెళ్లికి ముందు తామిద్దరం 15 ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నట్లు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది కీర్తి సురేష్. దాంతో ఆమె అభిమానులతోపాటు కొంతమంది సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, తాను ఆంటోనీతో డేటింగ్ చేస్తున్నాననే విషయం సినీ పరిశ్రమలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసునని గలాటా ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది కీర్తి సురేష్.
ఏడుగురికి మాత్రమే
తన రిలేషన్ షిప్‌ను 15 ఏళ్ల పాటు సీక్రెట్‌గా ఉంచడం గురించి ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. "ఇది ఎవరికీ తెలియదు. నా సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఇండస్ట్రీలో కూడా సామ్ (సమంత రూత్ ప్రభు), జగదీష్ (పళనిసామి) మొదటి నుంచి తెలుసు. ఆ తర్వాత అట్లీ, ప్రియా, విజయ్ సర్, కళ్యాణి (ప్రియదర్శన్), ఐశ్వర్య లక్ష్మి.. ఇలా పరిశ్రమకు చెందిన చాలా తక్కువ మందికి, మా స్నేహితులకు తెలుసు." అని కీర్తి సురేష్ వెల్లడించింది.
సీక్రెట్స్ దాచడంలో
"ఏప్రిల్ 2022 నుండి మేము పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాం. అయితే, ఇది ఎవరికీ తెలియదు. ఆయన సీక్రెట్స్ బాగా దాస్తారు. ఇది ముందే బయటకు వస్తుందని నేను అనుకున్నాను. కానీ మేము ఎలాగోలా మ్యానేజ్ చేశాం. మేమిద్దరం మా వ్యక్తిగత విషయాలను వీలైనంత గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతాము" అని కీర్తి సురేష్ తెలిపింది.
మొదటి సోలో ట్రిప్ అప్పుడే
"తాటిల్‌కు మీడియా అంటే సిగ్గు. మేము ఒకరినొకరి చేతులు పట్టుకుని తిరగము. మేము మొదట 2017లో జగదీష్‌తో కలిసి బ్యాంకాక్ ట్రిప్‌కు వెళ్లాం. రెండేళ్ల క్రితం తొలిసారిగా మేము సోలో ట్రిప్‌కు వెళ్లాం" సోలో ట్రిప్ కు వెళ్లాం" అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. అలాగే, తన లవ్ స్టోరీ గురించి కూడా బయటపెట్టింది కీర్తి సురేష్.
12వ తరగతిలో ఉన్నప్పుడు
తాను 12వ తరగతిలో ఉన్నప్పుడు ఆర్కుట్‌లో ఆంటోనీని ఫాలో అయినట్లు కీర్తి సురేష్ చెప్పింది. కీర్తి సురేష్ కంటే ఆంటోనీ తాటిల్ ఏడేల్లు పెద్దవాడని, ఖతార్‌లో పనిచేస్తున్నట్లు, చాలా కాలం డేటింగ్ తర్వాత కొవిడ్ 19 సమయంలో అతని లవ్ ప్రపోజల్‌కు ఒప్పుకున్నట్లు కీర్తి సురేష్ తెలిపింది. అలాగే, ముందుగా తనకు ఆంటోనీనే లవ్ ప్రపోజ్ చేసినట్లు, ఓ రింగ్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు, పెళ్లి అయ్యేవరకు దాన్ని తీయలేదని, తను నటించిన సినిమాల్లో కూడా ఆ రింగ్ ఉంటుందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.
నిజమైన డ్రీమ్
ఇక 15 ఏళ్ల డేటింగ్ తర్వాత తమ పెళ్లి కలను నిజం చేసుకున్నట్లు సంతోషం వ్యక్తం చేసింది కీర్తి సురేష్. ఇదిలా ఉంటే, ఇటీవలే బేబీ జాన్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె చేతిలో రివాల్వర్ రీటా, కన్నివేది సినిమాలు ఉన్నాయి.