Keedaa Cola OTT Release Date: కీడా కోలా ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?
Keedaa Cola OTT Release Date: తరుణ్ భాస్కర్ కీడా కోలా మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. ఆహా ఓటీటీలో ఈ క్రైమ్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
Keedaa Cola OTT Release Date: తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన కీడాకోలా మూవీ ఓటీటీలోకి రాబోతోంది.ఈ క్రైమ్ కామెడీ మూవీ ఆహా ఓటీటీలో డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కీడా కోలా సినిమాలో తరుణ్ భాస్కర్‌తో పాటు చైతన్యరావు, రాగ్ మయూర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు.
నవంబర్ 3న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. కామెడీ బాగుందనే పేరొచ్చిన కాన్సెప్ట్ మాత్రం ఆడియెన్స్‌కు కనెక్ట్ కాలేకపోయింది. కీడా కోలా మూవీకి రానా దగ్గుబాటి ప్రజెంటర్‌గా వ్యవహరించాడు.
2018లో రిలీజైన ఈ నగరానికి ఏమైంది తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. కీడా కోలా సినిమాలో టాక్సీవాలా విష్ణు, జీవన్, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించారు.
కీడా కోలా కథేమిటంటే?
వాస్తు (చైతన్యరావు) కు కష్టాల నుంచి గట్టెక్కడానికి చాలా డబ్బు అవసరం అవుతుంది. తాత వరదరాజు (బ్రహ్మానందం) కోసం వాస్తు కొన్న కూల్‌డ్రింక్‌లో బొద్దింక వస్తుంది. వినియోగదారులు ఫోరంలో కేసు వేస్తానని కూల్‌డ్రింక్ సంస్థ యజమానిని బెదిరించి డబ్బు లాక్కోవాలని వాస్తు ప్లాన్ చేస్తాడు.
అతడికి స్నేహితుడు లాయర్ లంచం (రాగ్ మయూర్) సహకరిస్తాడు. నాయుడు (తరుణ్ భాస్కర్) అనే రౌడీ కారణంగా వాస్తు ప్లాన్ మొత్తం ఎలా మారిపోయిందన్నదే ఈ సినిమా కథ.