Bambai Meri Jaan OTT: ఓటీటీలోకి సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. రిలీజ్ ఎప్పుడు? ఎందులో తెలుసా?
Bambai Meri Jaan OTT Release Date: ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా ఎక్కువగా నడుస్తోంది. ప్రేక్షకుల అభిరుచి సైతం మారుతోంది. అందుకే డిజిటల్ ప్లాట్‍ఫామ్స్ పై వివిధ రకాల కంటెంట్‍తో సినిమాలు, వెబ్ సిరీసులు దర్శనం ఇస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో సిరీస్ రానుంది.
సినీ ప్రియులకు జోనర్‍తో పని లేదు. ఎలాంటి జోనర్ అయినా విభిన్నంగా ఉంటే తప్పకుండా ఆదరిస్తారు. క్రైమ్, హారర్, ఫాంటసీ, యాక్షన్, కామెడీ ఎలాంటి కంటెంట్‍తో వచ్చిన బాగుంటే ప్రేక్షకులు వీక్షిస్తారు. కొంతమంది మాత్రం కొన్ని జోనర్లను ఇష్టపడుతుంటారు. అందులో ఒకటే సస్పెన్స్ థ్రిల్లర్స్. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ తో ఉంచి ఆఖరిలో రివీల్ చేసే ట్విస్ట్ ను చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రానుంది.
ట్రెండింగ్ వార్తలు
తాజాగా ఓటీటీ ప్రేక్షకుల కోసం వస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ "బంబై మేరీ జాన్" (Bambai Meri Jaan Web Series). ఈ వెబ్ సిరీస్‍లో బాలీవుడ్ పాపులర్ యాక్టర్ కేకే మీనన్‍తో పాటు అవినాష్ తివరీ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే నివేదిత భట్టా చార్య, అమైరా దస్తూర్ మరో కీలక పాత్రలు పోషించారు. బంబై మేరీ జాన్ వెబ్ సిరీస్‍కు షుజత్ సౌదాగర్ దర్శకత్వం వహించారు. బంబై మేరీ జాన్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా (Amazon Prime Video) సెప్టెంబర్ 14 అంటే గురువారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బంబై మేరీ జాన్ సిరీసును అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీన్ని ఎక్సెల్ మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ నిర్మించింది. అయితే ఈ సిరీసును ప్రస్తుతం హిందీలో మాత్రమే విడుదల చేయనున్నారు. తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. హిందీ వెర్షన్ విడుదలైన వారం రోజులకు తెలుగు వెర్షన్ వచ్చే అవకాశం ఉంది. కాగా 1960లో ముంబై పోలీసులకు, గ్యాంగ్‍స్టర్స్ కు మధ్య జరిగిన పోరాటం చుట్టూ బంబై మేరీ జాన్ వెబ్ సిరీస్ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
టాపిక్