OTT Malayalam: ఒకేరోజు రెండు రెండు ఓటీటీల్లోకి వచ్చిన 2 మలయాళ సినిమాలు- ఒకటి కామెడీ సస్పెన్స్, మరోటి మిస్టరీ థ్రిల్లర్!-kattis gang ott streaming on sun nxt manoramamax and am ah ott release on amazon prime sun nxt with different genres ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Malayalam: ఒకేరోజు రెండు రెండు ఓటీటీల్లోకి వచ్చిన 2 మలయాళ సినిమాలు- ఒకటి కామెడీ సస్పెన్స్, మరోటి మిస్టరీ థ్రిల్లర్!

OTT Malayalam: ఒకేరోజు రెండు రెండు ఓటీటీల్లోకి వచ్చిన 2 మలయాళ సినిమాలు- ఒకటి కామెడీ సస్పెన్స్, మరోటి మిస్టరీ థ్రిల్లర్!

Sanjiv Kumar HT Telugu

Kattis Gang And Am Ah OTT Streaming: ఓటీటీలోకి రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలు కట్టిస్ గ్యాంగ్, అం అః సినిమాలు ఒకేరోజు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. కామెడీ, క్రైమ్ సస్పెన్స్ జోనర్‌గా కట్టిస్ గ్యాంగ్ మూవీ ఉంటే, మిస్టరీ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామాగా అం అః తెరకెక్కింది. మరి వీటిని ఏ ఓటీటీల్లో చూడాలంటే..?

ఒకేరోజు రెండు రెండు ఓటీటీల్లోకి వచ్చిన 2 సినిమాలు.. ఒకటి కామెడీ సస్పెన్స్, మరోటి మిస్టరీ థ్రిల్లర్.. ఇక్కడ చూడండి!

Kattis Gang And Am Ah OTT Release: ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉంటాయి. అయితే, ఒకేరోజు రెండు రెండు ఓటీటీల్లోకి 2 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. మరి ఆ రెండు సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కట్టిస్ గ్యాంగ్ ఓటీటీ

మలయాళంలో క్రైమ్, కామెడీ, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరెక్కిన సినిమా కట్టిస్ గ్యాంగ్. క్రిమినల్ పనులు చేసే ఒక ముఠాను కట్టిస్ గ్యాంగ్ అంటారు. వీరు క్రైమ్‌కు ఎక్కువగా కత్తి ఉపయోగిస్తారని సమాచారం. రాజ్ కార్తీ కథ అందించిన ఈ సినిమాకు అనీల్ దేవ్ దర్శకత్వం వహించారు.

6.9 ఐఎమ్‌డీబీ రేటింగ్

అల్తాఫ్ సలీమ్, స్వాతి దాస్ ప్రభు, ఉన్ని లాలు, సజిన్ చెరుకాయిల్, వరుణ్ ధార, సింధుజవిజ్జి ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది మే నెలలో 17న థియేటర్లలో విడుదలైన కట్టిస్ గ్యాంగ్ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ఐఎమ్‌డీబీ నుంచి కట్టిస్ గ్యాంగ్ మూవీ 6.9 రేటింగ్ సొంతం చేసుకుంది.

ఏప్రిల్ 18 నుంచి

రెండు ఓటీటీల్లో కట్టిస్ గ్యాంగ్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. సన్ ఎన్ఎక్స్‌టీ, మనోరమ మ్యాక్స్‌లలో కట్టిస్ గ్యాంగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 18న ఈ రెండింట్లో మలయాళంలో కట్టిస్ గ్యాంగ్ ఓటీటీ రిలీజ్ అయింది. కట్టిస్ గ్యాంగ్ సినిమాలో కథానాయకుడు సినిమాల్లో హీరో కావాలని కలలు కంటాడు. అందుకోసం సిటీకి వెళ్తే ఊహించని పరిస్థితిలో పడతాడు. ఆ తర్వాత ఏమైందనేదే కట్టిస్ గ్యాంగ్ కథ.

అం అః ఓటీటీ

మిస్టరీ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన మలయాళ చిత్రం అం అః. ఈ సంవత్సరం జనవరి 24 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు థామస్ కే సెబాస్టియన్ దర్శకత్వం వహించారు. కవిప్రసాద్ గోపినాథ్ కథ అందించారు. ఈ సినిమాలో దిలీష్ పోతన్, తెలుగు నటి దేవదర్శిని ప్రధాన పాత్రల్లో నటిస్తే.. మీరా వాసుదేవ్, జఫర్ ఇడుక్కి, టీజీ రవి, పార్వతి సతీషన్ ఇతరులు కీలక పాత్రలు పోషించారు.

అమెజాన్ ప్రైమ్‌లో కూడా

అం అః కూడా రెండు ఓటీటీల్లోకి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఏప్రిల్ 18 శుక్రవారం నుంచి రెండింట్లో అం అః ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సన్ ఎన్ఎక్స్‌టీతోపాటు అమెజాన్ ప్రైమ్‌లలో అం అః ఓటీటీ రిలీజ్ అయింది. అంటే, కట్టిస్ గ్యాంగ్, అం అః రెండు మలయాళ సినిమాలను ఒక్క సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీలో చూసేయొచ్చు.

రోడ్ కాంట్రాక్టర్‌గా

ఇక అం అః సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. సుమారు రెండు గంటల రన్ టైన్ ఉన్న ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 6.7 రేటింగ్ అందుకుంది. రోడ్ కాంట్రాక్టర్‌గా స్టీఫెన్ ఓ గ్రామానికి వెళ్తాడు. కొండ ప్రాంతంలో అతనికి రూమ్ ఇస్తారు. ఆ ఊరిలో విచిత్రమైన సంఘనటలు జరుగుతుంటాయి. మరి అక్కడ స్టీఫెన్ ఏం చేశాడు?, అతని గతమేంటీ? అనేది అం అః కథ.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం