Katrina Kaif Chhaava Review: నా భర్త ఓ ఊసరవెల్లి..: విక్కీ కౌశల్, రష్మిక మూవీ ఛావాకు కత్రినా కైఫ్ అదిరిపోయే రివ్యూ
Katrina Kaif Chhaava Review: తన భర్త విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా మూవీకి ఓ డిఫరెంట్ రివ్యూ ఇచ్చింది కత్రినా కైఫ్. ఈ సందర్భంగా తన భర్తను ఓ ఊసరవెల్లి అని ఆమె అనడం అనడం విశేషం. ఇంతకీ ఆమె అలా ఎందుకు అన్నదో చూడండి.

Katrina Kaif Chhaava Review: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన మూవీ ఛావా (Chhaava). ఈ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 14) రిలీజైంది. ఇందులో రష్మిక మందన్నా కూడా నటించింది. ఈ సినిమాకు చాలా వరకు పాజిటివ్ రివ్యూలు వస్తుండగా.. తాజాగా విక్కీ కౌశల్ భార్య, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ రివ్యూ ఇచ్చింది. ఇదొక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అంటూనే తన భర్తను ఓ ఊసరవెల్లి అని సరదాగా కామెంట్ చేసింది.
కత్రినా కైఫ్ ఛావా రివ్యూ
కత్రినా కైఫ్ శుక్రవారం (ఫిబ్రవరి 14) తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఛావా మూవీపై ఓ సుదీర్ఘ పోస్ట్ చేసింది. మరి ఆమె రివ్యూ ఎలా ఉందో చూద్దాం. "ఛత్రపతి శంభాజీ మహరాజ్ గొప్పతనాన్ని చాలా గొప్పగా చూపించారు.
ఇదొక మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్. లక్ష్మీకాంత్ ఉటేకర్ ఈ అద్భుతమైన స్టోరీని చాలా అద్భుతంగా చూపించారు. నాకు మాటలు రావడం లేదు. చివరి 40 నిమిషాలు మీరు నోరెళ్లబెట్టి చూస్తారు. ఈ సినిమాను మళ్లీ చూడాలని అనుకుంటున్నాను" అని కత్రినా కైఫ్ పోస్ట్ చేసింది.
నా భర్త ఊసరవెల్లి: కత్రినా
ఇక ఈ మూవీలో తన భర్త విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ గురించి కూడా కత్రినా స్పందించింది. ఈ సందర్భంగా అతన్ని ఊసరవెల్లి అనడం విశేషం. "ఈ సినిమా చూపిన ప్రభావం నేను మాటల్లో చెప్పలేను. విక్కీ కౌశల్ నువ్వు చాలా అద్భుతంగా చేశావు. నువ్వు స్క్రీన్ పైకి వచ్చిన ప్రతిసారీ, ప్రతి షాట్, నువ్వు స్క్రీన్ పైకి తీసుకొచ్చే తీవ్రత, నువ్వు పాత్రలను మార్చడంలో ఓ ఊసరవెల్లి. సులువుగా చేసేస్తావు. నువ్వు, నీ ప్రతిభకు నేను చాలా గర్వపడుతున్నాను" అని కత్రినా కైఫ్ చెప్పింది.
ఛావా మూవీని గురువారం (ఫిబ్రవరి 13) సాయంత్రం తన భర్త విక్కీ కౌశల్ తో కలిసి కత్రినా చూసింది. ఫ్లోరల్ శారీలో వచ్చిన ఆమె.. ఈ మూవీని చూసి బాగా ఎంజాయ్ చేసింది. ఛావా పేరుతో శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో విక్కీ కౌశల్ భార్య యేసుబాయిగా రష్మిక మందన్నా నటించింది. ఆమె నటనకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
సంబంధిత కథనం