స్టార్ మా టీవీ ఛానెల్ సీరియల్ ‘కార్తీక దీపం 2’లో భారీ ట్విస్ట్ ఎదురైంది. గౌతమ్‍తో నిశ్చితార్థం విషయంలో జ్యోత్స్న ఆడిన నాటకాలన్నీ దీపకు తెలిసిపోతాయి. జ్యోత్స్న, పారిజాతం మాటలను చాటుగా విన్న కావేరి.. దీపకు అంతా చెప్పేస్తుంది. గౌతమ్‍తో పెళ్లి తంతును అడ్డుపెట్టుకొని కార్తీక్ జీవితం నుంచి దీపను దూరం చేయాలని జ్యో ప్లాన్ చేసుకొని ఉంటుంది. గౌతమ్ చెడ్డవాడని బయటపడకుండా సత్తిపండుతో జ్యోత్స్ననే నాటకం ఆడించిందని దీపకు తెలుస్తుంది. దీంతో జ్యో పని పట్టేందుకు శివన్నారాయణ ఇంటికి వెళ్లిన దీపకు అనుకోని షాక్ ఎదురవుతుంది.
దీపను ఇంటి బయటే అడ్డుకుంటుంది జ్యోత్స్న. నిజం చెప్పొద్దని బెదిరిస్తుంది. ఇంతలో చంపేస్తానంటూ తాత శివన్నారాయణ లైసెన్స్డ్ గన్ తీసుకొచ్చేందుకు జ్యో లోపలికి వెళుతుంది. దీప కర్ర పట్టుకొని ఇంట్లోకి వెళుతుంది. దీపకు జ్యో గన్ గురిపెడుతుంది. కర్రతో కొట్టి గన్‍ను లాక్కొంటుంది దీప. ఇంతో జ్యో అరవటంతో దశరథ్, సుమిత్ర, శివన్నారాయణ, పారిజాతం అక్కడికి వస్తారు. నిజం చెప్పాలని గన్ గురి పెట్టి జ్యోత్స్నను బెదిరిస్తుంది దీప. జ్యోత్స్న మాత్రం నాటకం కొనసాగిస్తూనే ఉంటుంది. దీప అలాగే గన్ గురి పెట్టి ఉంటుంది. ఇంతలో తన కూతురి కోసం దశరథ్ అడ్డువస్తాడు. ఇంతలో దశరథ్ ఛాతిలో బుల్లెట్ దిగుతుంది. దీపపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దారుణానికి పాల్పడ్డావంటూ మాటలు అంటారు. దీప మాత్రం తాను కాల్చలేదనేలా చూస్తుంది.
ఇంతలో పోలీసులు వచ్చిన దీపను అరెస్ట్ చేస్తారు. జైలులో వేస్తారు. తాను గన్ కాల్చలేదని పోలీస్ స్టేషన్‍లో తన భర్త కార్తీక్‍కు దీప చెబుతుంది. దీంతో మరో మలుపు తిరిగింది. ఏప్రిల్ 12వ తేదీ ఎపిసోడ్‍లో ఈ కీలక ట్విస్టులు ఎదురయ్యాయి. దీంతో చాలా ప్రశ్నలు మిగిలాయి.
దశరథ్‍కు బుల్లెట్ తగులగా.. తాను గన్ పేల్చలేదని దీప చెప్పేసింది. కార్తీక్‍తో కాబట్టి నిజం చెప్పే ఉంటుంది. అయితే, మరి గన్ పేల్చిందెవరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీపను చంపేందుకు జ్యోత్స్న ఏదైనా ప్లాన్ చేసి.. ఎవరినైనా పురమాయించిందా.. గన్ గురితప్పి దశరథ్‍కు బుల్లెట్ తగిలిందా అనేది చూడాలి.
జ్యోత్స్న ప్రమేయం ఈ ఘటనలో తప్పకుండా ఉండే ఛాన్స్ ఉంది. గౌతమ్ సాయం ఏమైనా తీసుకుందా,ఎవరితోనైనా ఈపని చేయించిందా అనేది ఆసక్తికరం. గన్‍ను దీప పేల్చలేదని ఎలా నిరూపణ అవుతుంది, జైలు నుంచి ఆమె బయటికి ఎలా వస్తుందనేది కూడా పెద్ద ప్రశ్నలుగా ఉన్నాయి. కార్తీక దీపం 2 రానున్న ఎపిసోడ్లలో ఈ అంశాలు తేలనున్నాయి. అయితే, ఈ నిజాలు బయటపడేందుకు ఎన్ని ఎపిసోడ్లు పడుతుందో చూడాలి.
నిజానికి దశరథ్, సుమిత్రల అసలు కూతురు జ్యోత్స్న కాదు.. దీప. ఈ విషయం ప్రస్తుతం జ్యోత్స్న, ఆమె అసలు తండ్రి దాసుకే తెలుసు. కానీ దీప.. శివన్నారాయణ అసలు వారసురాలు అని తెలికూడదని జ్యోత్స్న కుట్రలు పన్నుతూ ఉంటుంది. దాసుపై దాడి చేసి గతం మరిచిపోయేలా చేసింది. తన బావ కార్తీక్‍ను దీప నుంచి దూరం చేసి తన సొంతం చేసుకోవాలని ప్లాన్‍లు వేస్తూనే ఉంది. దాసుపై జ్యోత్స్ననే దాడి చేసిందని దశరథ్‍కు కూడా తెలిసి ఉంటుంది. అయితే, ఎందుకు అలా చేసిందని మాత్రం తెలియదు. మొత్తంగా దశరథ్‍కు బుల్లెట్ తగలడం, దీప జైలు పాలవటంతో కార్తీక దీపం మరింత రసవత్తరంగా మారింది. రానున్న ఎపిసోడ్లపై ఇంట్రెస్ట్ పెంచింది.
సంబంధిత కథనం