Katha Sudha OTT: ఓటీటీలో సరికొత్తగా కథా సుధ.. ప్రతి ఆదివారం కొత్త ఎపిసోడ్‌తో స్ట్రీమింగ్.. 17 రోజుల్లో 4 సినిమాలు అంటూ!-katha sudha ott streaming on etv win new episode release on every sunday and director raghavendra rao speech in launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Katha Sudha Ott: ఓటీటీలో సరికొత్తగా కథా సుధ.. ప్రతి ఆదివారం కొత్త ఎపిసోడ్‌తో స్ట్రీమింగ్.. 17 రోజుల్లో 4 సినిమాలు అంటూ!

Katha Sudha OTT: ఓటీటీలో సరికొత్తగా కథా సుధ.. ప్రతి ఆదివారం కొత్త ఎపిసోడ్‌తో స్ట్రీమింగ్.. 17 రోజుల్లో 4 సినిమాలు అంటూ!

Sanjiv Kumar HT Telugu

Katha Sudha OTT Streaming Launch Press Meet: ఓటీటీలోకి సరికొత్తగా కథా సుధ స్ట్రీమింగ్ కానుంది. ప్రతి ఆదివారం సరికొత్త ఎపిసోడ్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించనుంది. దీనికి సంబంధించి కథా సుధ ఓటీటీ స్ట్రీమింగ్ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కథా సుధఓటీటీ రిలీజ్ పూర్తి వివరాల్లోకి వెళితే..!

ఓటీటీలో సరికొత్తగా కథా సుధ.. ప్రతి ఆదివారం కొత్త ఎపిసోడ్‌తో స్ట్రీమింగ్.. 17 రోజుల్లో 4 సినిమాలు అంటూ!

Katha Sudha OTT Release: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. వివిధ జోనర్లలో అవి ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు వీటన్నింటికి భిన్నంగా సరికొత్తగా కథా సుధ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ప్రతి ఆదివారం సరికొత్త ఎపిసోడ్‌తో కథా సుధ ఓటీటీ రిలీజ్ కానుంది.

కథా సుధ గొప్ప వేదిక

'కొత్తవారిని తయారు చేయడంలో ఆనందం వేరు. మంచి కథలకు, కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడానికి కథా సుధ గొప్ప వేదిక' అని దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు అన్నారు. కే రాఘవేంద్రరావు, దర్శకుడు సతీష్ వేగేశ్న సూపర్ విజన్‌లో కథా సుధ తెరకెక్కింది. ఈటీవీ విన్‌‌లో ఏప్రిల్ 6 నుంచి కథా సుధ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ప్రతి అదివారం ఓ అద్భుతమైన కథతో అలరించబోతోంది.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ పాల్గొని

'కథా సుధ' కి సంబధించిన టైటిల్, ప్రోమో లాంచ్ ఈవెంట్ శనివారం (మార్చి 29) నాడు గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో బ్లాక్ బస్టర్ డైరక్టర్ అనిల్ రావిపూడి, డైరెక్టర్ సతీష్ వేగేశ్న, బీవీఎస్ రవి, తనికెళ్ల భరణితో పాటు కథా సుధ టీం అంతా పాల్గొన్నారు.

వాటికోసం చాలా ఇబ్బంది పడతాం

కథా సుధ లాంచ్ ప్రెస్ మీట్‌లో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. బిగినింగ్ డేస్‌లో దర్శకుడు కావాలని అవకాశాల కోసం చాలా ఇబ్బంది పడతాం. ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది" అని అన్నారు.

కొత్త నీరు రావడం సహజం

"పాత నీరు వెళ్లి కొత్త నీరు రావడం సహజం. మనం ఫ్యూచర్‌లో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు.. అప్పుడే ఈటీవీ కూడా స్టార్ట్ అయింది. ఈటీవీ ద్వారా రామోజీరావు గారు, బాపినీడు గారు, అజయ్ శాంతి గారు అందరం కలిసి శాంతి నివాసం సీరియల్ స్టార్ట్ చేశాం. కొత్త దర్శకుల్ని రచయితల్ని నటీనటుల్ని పరిచయం చేయొచ్చు అనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం ఇది" అని రాఘవేంద్ర రావు తెలిపారు.

రాజమౌళి బాహుబలి ఇచ్చారు

"శాంతి నివాసం ద్వారా రాజమౌళిని పరిచయచేసి తర్వాత దర్శకుడిగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాని చేయడం జరిగింది. దానికి బహుమతిగా రాజమౌళి బాహుబలి సినిమాని ఇచ్చారు. శాంతి నివాసం నుంచి ఇప్పుడు కలిసుందాం రా వరకు ఈటీవీకి నాకు ఆ అనుబంధం కొనసాగుతూనే ఉంది" అని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చెప్పుకొచ్చారు.

17 రోజుల్లో 4 సినిమాలు

"యూట్యూబ్‌లో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభావంతులు ఉన్నారు. మంచి డైలాగ్స్ కథలు రాసిన వారిని సెలెక్ట్ చేసాం. కొత్తవారిని తయారు చేయడంలో ఆనందం వేరు. ఇందులో 30 నిమిషాలు రన్‌టైమ్ గల 4 సినిమాలను 17 రోజుల్లో తీశాం. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడానికి కథా సుధా గొప్ప వేదిక. కొత్త దర్శకులు రచయితలు నటీనటులు దీంతో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది" అని రాఘవేంద్ర రావు పేర్కొన్నారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం