OTT Crime Thriller: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్- అదిరిపోయే ట్విస్టులు- ఈ మూవీని ఇక్కడ చూసేయండి?
Bhaje Vaayu Vegam OTT Streaming Now: తెలుగు లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ భజే వాయు వేగం ఓటీటీలోకి వచ్చేసింది. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా క్రైమ్ థ్రిల్లర్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. మరి ఈ సినిమాను ఈ ఓటీటీలో చూసేయండి.
Bhaje Vaayu Vegam OTT Release: ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన సినిమా "భజే వాయు వేగం". క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా గత నెల అంటే మే 31న థియేటర్స్‌లో రిలీజై సూపర్ హిట్ అయ్యింది.
ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తండ్రికొడుకుల బంధాన్ని బాగా చూపించారని, రివేంజ్ సీన్స్ ఆకట్టుకున్నాయని ప్రేక్షకులు తెలిపారు. అలాగే మరొక వర్గం ఆడియెన్స్‌కు సినిమా అంతగా ఎక్కలేదని టాక్ కూడా వచ్చింది. స్పోర్ట్స్ డ్రామా అండ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన భజే వాయు వేగం ఓవరాల్‌గా మంచి టాక్ సంపాదించుకుంది.
అంతేకాకుండా సినిమాలన్నింటికి రేటింగ్స్ ఇచ్చే ఐఎమ్‌డీబీ భజే వాయు వేగానికి 10కి ఏకంగా 7.1 రేటింగ్ ఇచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఎంతగా ఆడియెన్స్ మెప్పు పొందిందో. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో భజే వాయు వేగం డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
భజే వాయు వేగం సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 28 అంటే శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో భజే వాయు వేగం సినిమా అందుబాటులో ఉంది. కాబట్టి, థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఎంచక్కా ఓటీటీలో చూసేయొచ్చు. ఈ వారానికి ఫ్యామిలితో కలిసి చూసేందుకు ఈ సినిమా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
ఇకపోతే భజే వాయు వేగం సినిమా ఓటీటీ హక్కులకు మంచి పోటీ ఎదురైంది. వాటన్నింటిని ఎదుర్కొని మిగతా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో పోటీ పడిన నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసుకుంది. కాగా భజే వాయు వేగం సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూస్తున్న ఆడియెన్స్ మూవీలో తమకు నచ్చిన సన్నివేశాల స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, "భజే వాయు వేగం" సినిమాలో కార్తికేయ గుమ్మకొండకు జోడీగా హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నటించింది. అలాగే హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
థియేటర్స్‌లో మంచి సక్సెస్ అందుకున్నభజే వాయు వేగం నెట్ ఫ్లిక్స్‌లోనూ టాప్‌లో ట్రెండ్ అయ్యేలా కనిపిస్తోంది. అందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. కాగా ఈ సినిమాలో కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్‌తోపాటు తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఇదిలా ఉంటే, ఆర్ఎక్స్ 100 వంటి తొలి సినిమాతో హీరోగా అదిరిపోయే క్రేజ్ అందుకున్నాడు కార్తికేయ గుమ్మకొండ. ఈ మూవీ ఆయనకు హీరోగా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత అంతటి రేంజ్‌లో ఆయన సినిమాలు రాలేదు, ఆడలేదు. ఈ మూవీ కంటే ముందుగా హీరోగా చేసిన బెదురులంక 2012 సినిమాతో యావరేజ్ టాక్ అందుకున్నాడు.