OTT Horror Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న హారర్ కామెడీ చిత్రం.. లక్కీ భాస్కర్‌ను అధిగమించి టాప్‍లో ట్రెండింగ్-kartik aaryan horror comedy blockbuster movie bhool bhulaiyaa 3 trending top on netflix ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న హారర్ కామెడీ చిత్రం.. లక్కీ భాస్కర్‌ను అధిగమించి టాప్‍లో ట్రెండింగ్

OTT Horror Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న హారర్ కామెడీ చిత్రం.. లక్కీ భాస్కర్‌ను అధిగమించి టాప్‍లో ట్రెండింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 01, 2025 02:06 PM IST

OTT Horror Movie: భూల్ భులయ్యా 3 సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయిన ఈ మూవీ ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది. ఈ సినిమా ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చింది.

OTT Horror Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న హారర్ కామెడీ చిత్రం.. లక్కీ భాస్కర్‌ను అధిగమించి టాప్‍లో ట్రెండింగ్
OTT Horror Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న హారర్ కామెడీ చిత్రం.. లక్కీ భాస్కర్‌ను అధిగమించి టాప్‍లో ట్రెండింగ్

బాలీవుడ్ హారర్ కామెడీ సినిమా ‘భూల్ భులయ్యా 3’ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. భారీ కలెక్షన్లను దక్కించుకుంది. సింగం అగైన్ లాంటి మల్టీస్టారర్ మూవీ పోటీలో ఉన్నా ఈ చిత్రం దుమ్మురేపింది. దీపావళి సందర్భంగా నవంబర్ 1వ తేదీన భూల్ భులయ్యా 3 విడుదలైంది. సుమారు రూ.410కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఈ బ్లాక్‍బస్టర్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది.

yearly horoscope entry point

ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍

భూల్ భులయ్యా 3 చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం (జనవరి 1, 2025) ఆ ప్లాట్‍ఫామ్ నేషనల్‍వైడ్ ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది. గత వారం డిసెంబర్ 27వ తేదీన ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరంభం నుంచి భారీ వ్యూస్ దక్కించుకొని ఇప్పుడు టాప్ ప్లేస్‍కు వచ్చేసింది.

లక్కీ భాస్కర్‌ను దాటేసి..

సూపర్ హిట్ తెలుగు మూవీ ‘లక్కీ భాస్కర్’ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో సత్తాచాటింది. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సుమారు నాలుగు వారాలు నేషనల్ వైడ్‍గా టాప్‍లో ట్రెండ్ అయింది. గ్లోబల్ రేంజ్‍లోనూ టాప్-5లో ట్రెండ్ అయింది. ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్‍లో లక్కీ భాస్కర్‌ను భూల్ భులయ్యా 3 అధిగమించింది. నేషనల్ వైడ్‍గా ట్రెండింగ్‍లో టాప్‍కు చేరింది. లక్కీ భాస్కర్ రెండో స్థానంలోకి వచ్చింది.

హారర్, కామెడీ మేళవింపుతో భూల్ భులయ్యా 3 చిత్రాన్ని దర్శకుడు అనీస్ బజ్మీ తెరకెక్కించారు. పాపులర్ ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా వచ్చిన ఇది కూడా బ్లాక్‍బస్టర్ కొట్టింది. ఈ మూవీలో విద్యాబాలన్, మాధురీ దీక్షిత్‍, తృప్తి డిమ్రి, విజయ్ రాజ్, రాజ్‍పాల్ యాదవ్, సంజయ్ మిశ్రా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో రుహాన్ రూహ్ బాబా పాత్రలో కార్తీక్ ఆర్యన్ అదరగొట్టారు.

భూల్ భులయ్యా 3 సినిమా సుమారు రూ.417 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. దాదాపు రూ.150కోట్లతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, సినీ 1 బ్యానర్లు ప్రొడ్యూజ్ చేశాయి. స్త్రీ 2 తర్వాత 2024లో ఎక్కువ వసూళ్లు దక్కించుకున్న హిందీ చిత్రంగా భూల్ భులయ్యా 3 నిలిచింది.

నెట్‍ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్‍లో ప్రస్తుతం (జనవరి 1, 2025) టాప్-10 సినిమాలు

  • భూల్ భులయ్యా 3
  • లక్కీ భాస్కర్
  • అమరన్
  • యోయో హనీ సింగ్: ఫేమస్
  • క్యారీఆన్
  • సోర్గవాసల్
  • విక్కీ విద్యా కా వో వాలా వీడియో
  • జిగ్రా
  • సికిందర్ కా ముఖద్దర్
  • దేవర

Whats_app_banner