కార్తీక దీపం సీరియల్ నేటి (మే 31, 2025) ఎపిసోడ్‍లో.. నా ఇంటికి నన్ను దగ్గర చేసేందుకు, రెండు కుటుంబాలకు కలిపేందుకు చేసే ప్రయత్నంలో మీతో నేనుంటానని కార్తీక్‍కు దీప చెబుతుంది. నీ మనసేంటో అర్థమయ్యాక కాదని ఎలా అంటానని కార్తీక్ చెబుతాడు. నేనే ఆశ్చర్యపడేలా నువ్వు మారావని, ఎప్పుడు ఏం చేయాలో చెబుతానని అంటాడు. ఇద్దరం కలిసే ఈ యుద్ధాన్ని చేద్దామని కార్తీక్ అంటాడు. ఇద్దరూ చేతులు కలుపుతారు.
ఇప్పుడు మన చేతులు కలిశాయ్.. రేపు మన కుటుంబాలను కలపాలని దీపతో కార్తీక్ అంటాడు. ఈ ఇంట్లో రాక్షసుల నుంచి మంచి వాళ్లను కాపాడేందుకు ఇక్కడికి వచ్చామని చెబుతూ ఉంటాడు. కొత్త పనోళ్లారా.. ఇంత సేపు మీటింగా అంటూ పారిజాతం అక్కడికి వస్తుంది. మాటల్లో మర్యాద తగ్గిపోతే ముఖం పగిలిపోతుందంటూ కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ పారును ఆటాడుకుంటాడు.
ఈ ఇంటి యజమానురాలికి జ్యూస్ తీసుకురా అని దీపకు పారిజాతం చెబుతుంది. అది పద్ధతి అంటే అనే పారు అంటుంది. కార్తీక్ గుర్రుగా చూస్తుంటాడు. లేనిపోని తంట ఎందుకు అని ఇంట్లోకి వెళుతుంది పారు. ఇప్పటి వరకు నేనే అనుకున్నా.. ఇప్పుడు నా భార్య కూడా తోడైంది.. మిమ్మల్ని ఉతికి దారికి తెచ్చే బాధ్యత మాది అని కార్తీక్ అనుకుంటాడు.
ఇక్కడే పని చేస్తానని దీప చెప్పిన మాటలను సుమిత్ర గుర్తు తెచ్చుకుటుంది. ఇంతలో చేయి తగిలి కుంకుమ భరిణ పడిపోతుంటుంది. కింద పడకుండా పట్టుకుంటుంది దీప. మా సుమిత్ర అత్త, దశరథ్ మామయ్యల కన్న కూతురివి అని కార్తీక్ చెప్పిన మాటలను దీప గుర్తు చేసుకుంటే.. దశరథ్‍ను దీప కాల్చిన విషయాన్ని సుమిత్ర తలుకుంటుంది. మీ పసుపు కుంకాలు నిండు నూరేళ్లు మీతోనే ఉండాలమ్మా అని దీప అంటుంది. నువ్వు దూరం చేయకపోతే నాతోనే ఉంటాయంటూ ఆగ్రహంగా సుమిత్ర మాట్లాడుతుంది.
“ఒకప్పుడు అమాయకురాలు అని నిన్ను అనుకున్నా. నా కూతురిని కొట్టావ్. నా భర్తలను కాల్చావు చూడు.. అప్పుడు నీ ఒరిజినాలిటీ అర్థమైంది” అని సుమిత్ర కోప్పడుతుంది. “ఒకప్పుడు నిజం అని నమ్మింది.. ఇప్పుడు అబద్ధమనుకుంటున్నారు. కానీ ఈ రోజు నిజం అని నమ్మింది ఏదో ఒక రోజు అబద్ధమని తెలుసుకుంటారు” అని దీప అంటుంది. దీంతో దీపకు నిజం తెలిసిందా అని జ్యోత్స్న కంగారు పడుతుంది.
ఈ మాటలు మీ ఆయన కార్తీక్‍కు, అత్త కాంచనకు చెప్పు అని సుమిత్ర చిరాకు పడుతుంది. వాళ్లకు కూడా నీ నిజస్వరూపం తెలిసినప్పుడు బయటికి గెంటేస్తారంటూ దీపపై నిందలు వేస్తుంది. నీ మెడలో మూడు ముళ్లు వేసిన కార్తీకే అదే చేతులతో తెంపేస్తాడని సుమిత్ర ఫైర్ అవుతుంది. దీపను నానా మాటలు అంటుంది. ఇంతలో పారిజాతం అక్కడికి వస్తుంది. పారిజాతమే మీకు జ్యూస్ ఇవ్వమన్నారని సుమిత్రతో పారు అంటుంది. యజమానురాలికి ఇవ్వమన్నానని పారు అంటుంది. అంటే నేను యజమానురాలి కాదని ఇలా డిసైడ్ చేశావా.. మొదటి దెబ్బే ఏం కొట్టావే అని పారు మనసులో అనుకుంటుంది. నాకు నీ సేవలు అవసరం లేదని దీపపై సుమిత్ర కోప్పడుతుంది. జ్యో లోలోపల ఆనందిస్తుంటుంది. దీప బాధగా చూస్తుంటుంది.
పురిట్లోనే తల్లిని మింగేసిన దానికి ఆ విలువ ఏం తెలుస్తుంది అని దీపను బాధపెట్టేలా పారిజాతం మాట్లాడుతుంది. ఘోరాలు చూడలేక తండ్రి కూడా చనిపోయాడని, కుటుంబ విలువ ఏం తెలుస్తుందే అని అంటుంది. దీప కన్నతల్లి ఎదురుగానే ఉంది గ్రానీ అని జ్యో మనసులో అనుకుంటుంది.
“నేను అమ్మానాన్న లేని అనాథను కాదు.. మా అమ్మానాన్న బతికే ఉన్నారు” అని దీప చెబుతుంది. దీంతో జ్యోత్స్న భయపడిపోతుంది. ఏంటిది ఇలా మాట్లాడుతోంది, నిజం తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటుంది. ఎక్కడ ఉన్నారని జ్యో అడుగుతుంది. ఇక్కడే ఉన్నారంటూ జ్యోను దీప మరింత భయపెడుతుంది. “ఇది ఇంటికి వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. దీనికి దాసు నిజం చెప్పేసినట్టున్నాడు” అని మనసులో జ్యో భయపడుతుంది.
కొంప తీసి మా సుమిత్రను పట్టుకొని నా సొంత తల్లి అంటావా ఏంటి అని దీపతో పారిజాతం అంటుంది. తెలియకపోయినా పారు నోటి నుంచి నిజం రావడంతో జ్యో కంగారు పడుతుంది. గ్రానీ అని అరుస్తుంది. మాటల వరుసకు కూడా ఆ మాట అనొద్దని అంటుంది. నిజాలు మాట్లాడుతుంటే భయం మొదలైందని జ్యోత్స్నను చూస్తూ మనసులో అనుకుంటుంది దీప. ఇలాంటి కూతురు పుట్టాలని ఏ తల్లి అనుకోదని సుమిత్ర కోప్పడుతుంది. మా అమ్మానాన్న నాతోనే, నాలోనే ఉంటారంటూ దీప అంటుంది. సుమిత్రే తన అసలైన కన్నతల్లి అనే నిజాన్ని దీప దాచేస్తుంది.
దీప నిజం చెప్పకపోయినా ప్రవర్తన ఏదో తేడాగా ఉందని జ్యోత్స్న అనుకుంటుంది. నువ్వు వెళ్లు అని దీపకు చిరాకుగా చెబుతుంది సుమిత్ర. దీప చేత్తో ఇచ్చిన కుంకుమ తీసుకోకుండా.. పడేసేయ్ అంటూ ఆగ్రహిస్తుంది. దీప తెచ్చిన జ్యూస్‍ను పారిజాతం తాగేస్తుంది. సుమిత్ర దీపకు భలే ఇచ్చింది కదే అని పారిజాతం అంటుంది. మనం ఓ చోటికి వెళ్లాలంటూ పారిజాతాన్ని జ్యోత్స్న తీసుకెళ్లింది.
కార్తీక్ తన వద్ద పనులు చేస్తున్న వీడియోలను శ్రీధర్‌కు కూడా జ్యోత్స్న పంపించి ఉంటుంది. నా కొడుకు ఆ ఇంట్లో పని చేస్తున్న వీడియోలు పంపిందంటే ఏంటి అర్థం అంటూ కావేరితో శ్రీధర్ కోపంగా మాట్లాడతాడు. అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారో తెలుసా అని కావేరి అడుగుతుంది. కార్తీక్ అష్టదరిద్రాలకు దీపే కారణం అని శ్రీధర్ అంటాడు. మీ మేనకోడలు చేసిన పనులకు దీపను ఎందుకంటారంటూ కావేరి వాదిస్తుంది. కార్తీక్, దీపను తక్కువ చేసి శ్రీధర్ మాట్లాడుతుంటాడు.
తాత దగ్గర తలవంచని కార్తీక్.. మరదలి దగ్గర వంచుతాడా.. ఏదో బలమైన కారణంతోనే సంతకం పెట్టాడని, ఇలా చేస్తున్నాడని కావేరి అంటుంది. రాద్ధాంతం చేయవద్దని అంటుంది. నన్ను “డైవర్ట్ చేయడానికి ఇలా మాట్లాడావ్ కానీ.. కారణాలు నిజం ఉన్నాయా, ఏమై ఉంటాయి. నా కొడును కదా అడగాల్సింది. ఇంత జరుగుతుంటే కాంచన ఏం చేస్తున్నట్టు” అని శ్రీధర్ ఆలోచిస్తాడు. ఈ సమస్యను పరిష్కరించి, రెండు ఇళ్లకు పెద్దరికం తెలియజేయాలనుకుంటాడు. వంటలక్క దీప వల్లే నా కొడుకుకు ఈ గతి పట్టిందని అనుకుంటాడు.
దీపకు నిజం చెప్పేశాడేమో అనే అనుమానంతో దాసు ఇంటికి జ్యోత్స్న వస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్పు అని పారిజాతం అంటుంది. నీ కొడుకు కార్తీక్‍కు నిజం చెప్పేసి సైలెంట్‍గా ఉన్నాడేమోనని తెలుసుకునేందుకు వచ్చానని మనసులో జ్యోత్స్న అనుకుంటుంది. తమ్ముడు.. తమ్ముడు అని కాశీని జ్యోత్స్న పిలుస్తుంది.
ఏమని పిలుస్తావని కాశీ ఆశ్చర్యపోతాడు. నువ్వు వరుసలు పెట్టి పిలుస్తుంటే ఆశ్చర్యంగా ఉందని జ్యోతో అంటాడు. మరి నేను అని స్వప్న అంటుంది. పిలిస్తే వరుస అవుతావ్.. పలకరిస్తే గొడవ అవుతావ్ అని జ్యో అంటుంది. ఎదుటివాళ్లను బట్టే మన మాటలు, చేష్టలు నా మాటలు చేష్టలు ఉంటాయని చిరాకుగా అంటుంది స్వప్న. మా ఇంటికి వచ్చి మమ్మల్నే తిడతావేంటి అని కాశీ కూడా కోప్పడతాడు. జ్యో మీ ఇంటికి రావడం అదృష్టమని పారు అంటే.. అంత అదృష్టం వద్దులే అని వెటకారంగా మాట్లాడుతుంది స్వప్న.
ఎందుకు వచ్చారని కాశీ అడుగుతాడు. నాన్నను చూడడానికి వచ్చానని జ్యోత్స్న చెబుతుంది. మా నాన్న లేడు అని ఓ లెటర్ తీసుకొచ్చి ఇస్తాడు కాశీ. నాకోసం వెతకవద్దు.. నేనే వస్తా అని దాసు రాసిన లెటర్ చదువుతుంది. ఏంటి దాసు వెళ్లిపోయాడా.. ఎక్కడికి వెళ్లాడు అని పారిజాతం కంగారు పడుతుంది. తెలియదని స్వప్న అంటాడు.
నాన్న ఎక్కడికి వెళ్లాడో తెలియకపోవడం ఏంట్రా అని జ్యోత్స్న ఆగ్రహంగా అరుస్తుంది. దాసును పదేపదే ‘నాన్న’ అని అంటుంది. దీంతో జ్యో అసలైన తండ్రి దాసు అనే అనుమానం కాశీకి వస్తుందేమోనని పారిజాతం కంగారు పడుతుంది. మా నాన్నను నువ్వు నాన్న అనిపిస్తున్నావంటే అని కాశీ అంటాడు. మాకు ప్రేమలు ఉన్నాయంటూ కవర్ చేస్తుంది పారు.
బాబాయ్ ఎక్కడికి వెళ్లాడు అని జ్యోత్స్న మాట మార్చి అడుతుంది. ఎక్కిడికి వెళ్లాడో తెలియదు.. వెతుకున్నామని కాశీ చెబుతాడు. మిస్ అయ్యాడని పోలీస్ కంప్లైట్ ఇవ్వాలి కదా అని పారిజాతం అంటుంది. ఏదో జరుగుతుందని జ్యోత్స్నలో అనుమానం బలపడుతోంది. “అక్కడ బావతో పాటు దీప ఇంటికి వచ్చింది. ఇక్కడ గ్రానీ కొడుకు లేడు. ఏదో జరుగుతోంది. ఆ రోజు నేను ఇచ్చిన వార్నింగ్‍కు భయపడి ఎక్కడికైనా వెళ్లాడా. లేదా గతం గుర్తొచ్చిన ఎవరికైనా చెప్పేందుకు వెళ్లాడా. చెబితే చచ్చినట్టే” అని మనసులో కంగారు పడుతుంది జ్యోత్స్న. బాబాయ్ గురించి తెలిస్తే ఫోన్ చెయ్ అని కాశీతో జ్యో చెబుతుంది.
నా కొడుకు దాసును వెతికి తీసుకురా అని కాశీతో పారిజాతం అంటుంది. మీ నానమ్మ ఎలా మాట్లాడుతుందో చూశావా అని స్వప్న అంటుంది. పెద్దవాళ్లు అంతే అంటూ కాశీ సర్దిచెబుతాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (మే 31) ఎపిసోడ్ ముగిసింది. జ్యోత్స్న నుంచి ప్రమాదం ఉండటంతో దాసును కార్తీకే సేఫ్‍గా దాచి ఉంచి.. మిస్ అయ్యాడని చెబుతూ ఉండొచ్చు.
సంబంధిత కథనం