కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 26: ‘నువ్వు నా మేనత్త కూతురివి’: దీపకు అసలు నిజాలు చెప్పేసిన కార్తీక్.. షాకైన వంటలక్క-karthika deepam today episode may 26th 2025 karthik tells truth to deepa star maa tv serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 26: ‘నువ్వు నా మేనత్త కూతురివి’: దీపకు అసలు నిజాలు చెప్పేసిన కార్తీక్.. షాకైన వంటలక్క

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 26: ‘నువ్వు నా మేనత్త కూతురివి’: దీపకు అసలు నిజాలు చెప్పేసిన కార్తీక్.. షాకైన వంటలక్క

కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మే 26: కార్తీక్‍ బూట్లు తుడిచిన వీడియో చూసి దీప, కాంచన బాధపడతారు. కార్తీక్ బాబును వదిలేయాలని జ్యోత్స్నకు ఫోన్ చేసి బతిమాలుతుంది దీప. కార్తీక్‍కు దీప అడ్డుపడుతుంది. దీంతో అసలు నిజాలు చెప్పేస్తాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 26: ‘నువ్వు నా మేనత్త కూతురివి’ దీపకు అసలు నిజాలు చెప్పేసిన కార్తీక్

కార్తీక దీపం 2 నేటి (మే 26, 2025) ఎపిసోడ్‍లో.. కార్తీక్ ఇంకా రాలేదంటూ కాంచన ఎదురుచూస్తూ ఉంటుంది. భోజనం చేయండని దీప అడుగుతుంది. నీకు ఆకలేస్తోందా అని కాంచన అంటుంది. భార్యవి నువ్వు అలా ఉంటే, తల్లిని నేనెంత తల్లడిల్లిపోవాలి అంటూ బాధపడతుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. కార్తీక్ కాల్ చేశాడేమోనని కాంచన అంటుంది. మీ మేన కోడలు కాల్ చేస్తోందని దీప అంటే.. అవసరం లేదు ఎత్తవద్దు అని కాంచన అంటుంది. ఏవో వీడియోలు పంపించిందని దీప చెబుతుంది.

వీడియోలు చూసి తల్లిడిల్లిన దీప, కాంచన

తాత ఇంట్లో బూట్లను కార్తీక్ తుడిచిన, భోజనం వడ్డించిన వీడియోలను జ్యోత్స్న పంపించి ఉంటుంది. ఆ వీడియోలను చూసి దీప, కాంచన తల్లిడిల్లిపోతారు. కన్నీరు పెట్టుకుంటారు. ఇంతలో కార్తీక్ వచ్చేస్తాడు. ఎందుకు అందరూ అలా ఉన్నారని అడుగుతాడు. ఫ్రెండ్ వాళ్ల బాబు పుట్టిన రోజు అని కాల్ చేస్తే అటు వెళ్లాలని కార్తీక్ చెబుతాడు. పుట్టిన రోజుకు వెళ్లావో.. ఊడిగాలు చేసేందుకు వెళ్లావో మేం చూశాం రా అని కాంచన అంటుంది. మీరు ఆ ఇంట్లో ఏం చేశావో జ్యోత్స్న వీడియోలు పెట్టిందని చూపిస్తుంది దీప. మీరు సంతకం పెట్టారా మీ జీవితాన్ని తాకట్టు పెట్టారా అని అనసూయ అడుగుతుంది.

జ్యోత్స్న నిన్ను బావ అనుకుంటుందా.. పని వాడు అనుకుంటుందా అని కాంచన బాధపడుతుంది. గెలిచానని అనుకుంటున్న మనిషి కాళ్ల దగ్గరికే మిమ్మల్ని తీసుకెళ్లిందని దీప అంటుంది. వేరేలా ఆలోచించాలని కార్తీక్ అంటాడు. చెప్పిన పనులు చేస్తే పని వాడే ఎందుకు అనుకోవాలని అని సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తాడు.

అది నాకు చిన్నతనం కాదు

అది నా తాతగారి ఇల్లు.. నా తాత షూస్ క్లీన్ చేయడం నాకు చిన్నతనం కాదని కార్తీక్ అంటాడు. మా అత్తగారి ఫ్యామిలీ అందరూ కూర్చుంటే భోజనం వడ్డించా.. నువ్వు ఎప్పుడు వడ్డించలేదా అని కాంచనను కార్తీక్ అడుగుతాడు. మనం కూర్చున్నప్పుడు మా అత్త వడ్డించలేదా అంటాడు. జ్యోత్స్న అగ్రిమెంట్ గురించి చెప్పింది కాబట్టి.. ఇలా చేస్తున్నాడేంటి అని మీరు బాధపడుతున్నారని చెబుతాడు.

అది దీపకు కూడా పుట్టిల్లే..

నా కొడుకుకు విలువ ఇవ్వని మనుషులు ఎవరూ వద్దు.. మేనకొడలైనా, అన్నయ్య అయినా, తండ్రి అయినా వద్దు అని కన్నీటితో అంటుంది సుమిత్ర. యుద్ధం మధ్యలో ఆపకూడదని కార్తీక్ చెబుతాడు. మీరు ఈరోజు పడుతున్న కష్టాన్ని చూస్తున్నారు.. నేను రేపు జరిగే మంచి కోసం చూస్తున్నానని కార్తీక్ చెబుతాడు. సమ్మెట పోట్లతో ఇనుము ఆయుధం అవుతుంటూ మాట్లాడతాడు. వాళ్లను వదిలెయ్ రా అని కాంచన అంటుంది. అది దీపకు కూడా పుట్టిల్లే అని మనసులో అనుకుంటాడు కార్తీక్. మాట ఇచ్చానని, తప్పితే బతికి ఉన్నా చచ్చినట్టేనని అంటాడు. ఏం చేయాలో మీరు చెప్పేలని అడుగుతాడు. మీరే చేయాలో నేను చెబుతానని మనసులో అనుకుంటుంది దీప.

జ్యోత్స్నకు దీప కాల్

ఆ వీడియోలను చూసి దీప రియాక్షన్ ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో జ్యోకు దీప కాల్ చేస్తుంది. నిన్ను రెచ్చగొట్టి తప్పులు ఎలా చేయించాలో నాకు తెలుసు కదా అని అనుకొని కాల్ ఎత్తుతుంది జ్యో. వీడియోలు చూశావా.. నచ్చాయా.. మరోసారి ఇంకా క్లారిటీగా వీడియోలు తీస్తా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది జ్యోత్స్న.

నీ మెడలో తాళి కావాలి

నీకు ఏం కావాలి అని దీప అడుగుతుంది. ‘నీ మెడలో తాళి కావాలి, నీప్రాణం కావాలి’ అని అంటాను అనుకుంటున్నావా అంటూ వెటకారంగా నవ్వుతుంది జ్యోత్స్న. అవసరం లేదు నీ దగ్గరే పెట్టుకో అంటూ చెబుతుంది. మరి ఏం కావాలి అని దీప మళ్లీ అడుగుతుంది. నీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని జ్యోత్స్న అంటుంది. నా మీద పగతోనే కార్తీక్ బాబుతో అగ్రిమెంట్ రాయించుకొని, పని వాడితో చేయించుకోవాల్సిన పనులు చేయిస్తున్నావని దీప అంటుంది. కోపంగా ఉందా, కొట్టాలనిపించడం లేదా అని జ్యోత్స్న అంటుంది.

జ్యోత్స్నను బతిమాలిన దీప

కార్తీక్‍ను వదిలేయాలని జ్యోత్స్నను దీప బతిమాలుతుంది. నీకు ఏం కావాలో ఇచ్చేసి కార్తీక్ బాబును విడిపించుకోవాలని ఉందని అంటుంది. దీప ఇలా మాట్లాడకూడదే.. కోపం వస్తే ఆవేశపడి కొట్టడానికి ఎగేసుకొని రావాలని అని వెటకారంగా అంటుంది. అలిసిపోయానని, అవమానాలు పడి, అభిమానించే వారికి దూరమవుతున్నానని దీప బాధపడుతుంది. జాలేస్తోంది దీప అని జ్యో అంటుంది. మీరంతా ఒకే కుటుంబం, కార్తీక్‍ షూ తుడుస్తుంటే నీ మనసు ఎలా ఆనందించగలిగింది అని దీప అడుగుతుంది. నువ్వు చేస్తున్నది తప్పు అని నీ మనసు చెప్పడం లేదా అని అంటుంది. లేదని జ్యో అంటుంది.

దండం పెడతా.. వదిలెయ్

ప్రాణం ఇవ్వమంటావా అని దీప అంటుంది. అవసరం లేదంటుంది జ్యోత్స్న. మరి కార్తీక్ బాబును వదిలెయ్ అని అడుగుతుంది. భయపెట్టే స్థాయి నుంచి బతిమాలే స్థాయికి దిగజారావా అని జ్యోత్స్న అంటుంది. మన కోసం బతికేవాళ్లు బాధపడుతుంటే కన్నీళ్లు తప్ప ఏ సమాధానం ఉండదని దీప చెబుతుంది. నాకు ఎందుకు ఫోన్ చేశావని జ్యోత్స్న అడుగుతుంది. నా మీద కోపంతో కార్తీక్ బాబును ఏం చేస్తావోనని భయంతో చేశానని అంటుంది.

దేవుడిలా చూస్తున్నా

ఈ భయం తాళికట్టించుకున్నప్పుడు ఉండాల్సిందని జ్యోత్స్న అంటుంది. నా ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనకు ఎలా కారణం అవుతానని దీప అంటుంది. ఇప్పటికీ మా బావను నువ్వు భర్తలా చూడడం లేదా అని జ్యోత్స్న అడుగుతుంది. దేవుడిలా చూస్తున్నానని దీప బదులిస్తుంది. నువ్వు దేవత అవుదామానా అని జ్యో అంటుంది. భక్తురాలిలాగా మిగిలిపోదామని దీప చెబుతుంది.

నేను వస్తా.. పనులు చేస్తా

కార్తీక్ బాబు బదులు నేను వచ్చి పనులు చేస్తానని దీప అంటుంది. కానీ జ్యోత్స్న అంగీకరించదు. అగ్రిమెంట్ చేసింది బావ అని అంటుంది. ఆసుపత్రిలో నేను చచ్చిపోయి ఉంటే అని దీప అంటే.. అప్పుడు ఈ అగ్రిమెంట్ ఉండేదే కాదు అని జ్యో అంటుంది. కార్తీక్ బాబు కోసం నేను ఏదైనా వదులుకుంటానని దీప అంటుంది. మరదలిని, ఆస్తిని, చివరికి తనను కార్తీక్ వదిలేసుకున్నాడని, నీ కోసం అన్నీ వదులుకునేంత ప్రేమ కార్తీక్‍లో ఎలా వచ్చిందని జ్యోత్స్న అంటుంది. తనకు ఇప్పటికీ క్లారిటీ దొరకని ప్రశ్న అదేనని చెబుతుంది.

అదెప్పటికీ జరగదు జోత్స్న

కార్తీక్ బాబును వదిలెయ్.. అక్కడికి రారు అని జ్యోత్స్నతో దీప అంటుంది. ఎలా రప్పించుకోవాలో తెలుసు అని జ్యో పొగరుగా చెబుతుంది. కార్తీక్ బాబును నాకు దూరం చేసి నీ వాడిని చేసుకోవాలనుకుంటున్నావేమో.. అదెప్పటికీ జరగదని దీప అంటుంది. కార్తీక్ బాబు మనసులో నువ్వు లేవు అని చెప్పేస్తుంది. కార్తీక్ నా మెడలో తాళి కట్టకపోయినా నిన్ను పెళ్లి చేసుకునే వాడు కాదని, ఆయనే ఈ విషయాన్ని చెప్పారని అంటుంది. నీ మెడలో తాళి అవసరం లేదని చెప్పా కదా అని అరుస్తుంది జ్యోత్స్న. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావని దీప అడుగుతుంది.

నేను కార్తీక్ బాబును రానివ్వనని దీప అంటుంది. వస్తాడు.. రప్పిస్తా అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. నా గొంతులో ప్రాణం ఉండగా కార్తీక్ బాబును రానివ్వనని దీప అంటే.. ట్రై చెయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది జ్యోత్స్న. ఇదంతా ఆపాలని దీప అనుకుంటుంది.

కార్తీక్‍ను అడ్డుకున్న దీప

కార్తీక్‍కు జ్యోత్స్న మేసేజ్‍లు చేస్తూనే ఉంటుంది. జ్యో దగ్గరికి వెళ్లేందుకు కార్తీక్ బయలుదేరతాడు. దీప కంటపడకుండా వెళ్లిపోవాలని అనుకుంటాడు. కార్తీక్‍ను దీప అడ్డుకుంటుంది. నా కోసం అగ్రిమెంట్‍పై సంతకం పెట్టారు కాబట్టి.. జ్యోత్స్న దగ్గరికి నేను వెళతానని దీప అంటుంది. ఇప్పటి నుంచి కార్తీక్ బాబు స్థానంలో నీకు అసిస్టెంట్‍గా నేను ఉంటానని జ్యోత్స్నతో చెబుతానని దీప అంటుంది. అందుకు నేను ఒప్పుకోనని కార్తీక్ తేల్చేస్తాడు. వెళ్లడానికి నేనూ ఒప్పుకోను దీప అంటుంది.

నా శవాన్ని దాటి వెళ్లండి

తప్పుకో.. మొండిపట్టు పట్టకు అని కార్తీక్ అంటాడు. అన్ని విషయాలు నీకు అర్థమయ్యేలా తర్వాత చెబుతానని చెబుతాడు. కానీ దీప వినదు. మిమల్ని ఆ జ్యోత్స్న బాధపెడుతుంటే చూడలేనని అంటుంది. ఆ బాధ వెనుక కారణం వేరే ఉందని, విసిగించకు, అర్థం చేసుకో అని కార్తీక్ అంటాడు. వెళ్లొద్దని దీప అంటూనే ఉంటుంది. “మతిలేకుండా మాట్లాడొద్దు.. జ్యోత్స్న చెప్పినట్టు తల ఆడించడానికి నేను అమాయకుడిని కాదు. నేను చేస్తున్న ప్రతీ పని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి” అని కార్తీక్ అంటాడు. నా కోసమే కదా అని దీప అంటుంది. అసలు వెళ్లనివ్వనని అడ్డంగా నిలిచి మొండికేస్తుంది. మర్యాదగా తప్పుకుంటావా.. తోసుకెళ్లనా అని కార్తీక్ అంటాడు. మీరు ఇక్కడి నుంచి వెళ్లాలనుకుంటే నా శవాన్ని దాటి వెళ్లండని దీప అంటుంది.

వెనుక కారణం ఉంది

నీకు మతిపోయింది దీప అని కార్తీక్ అంటాడు. మీరు పనులు చేస్తుంటే నిజంగానే మతిపోయిందని దీప చెబుతుంది. నేను చేసే వాటి వెనుక కారణం ఉందని కార్తీక్ చెబుతాడు. రెండు కుటుంబాలను కలిపేందుకే కదా.. అవసరం లేదని దీప అంటుంది. నిన్ను ఆ కుటుంబానికి దూరం చేయాలి కాబట్టి అని కార్తీక్ అంటుంది. ఎందుకు దగ్గర చేయాలని దీప ప్రశ్నిస్తుంది.

సుమిత్ర, దశరథ్ కూతురివి.. నా అసలైన మరదలివి

దీపను చేయి పట్టుకొని పక్కకు తీసుకెళతాడు కార్తీక్. “వాళ్లేనన్ను వద్దనుకొని, అసహ్యించుకున్నారు. ఇంకా ఆ కుటుంబం ఎందుకు కావాలి. నన్ను ఎందుకు కలపాలి అనుకుంటున్నారు” అని దీప అడుగుతుంది. నువ్వే సుమిత్ర, దశరథ్ అసలైన కూతురు అని దీపతో నిజం చెప్పేస్తాడు కాార్తీక్. “ఎందుకంటే నువ్వు నా మేనత్త కూతురివి కాబట్టి” అని చెబుతాడు. దీంతో దీప షాక్ అవుతుంది. మేనత్త కూతురినా అని అనుమానంగా అడుగుతుంది. “అవును నువ్వు ఎవరో కాదు.. మా సుమిత్ర అత్త, దశరథ్ మామయ్యల కన్నకూతురివి. నా సొంత మరదలివి. నా తల్లికి మేనకోడలివి. శివన్నారాయణకు సొంత మనవరాలివి. ఆ యావదాస్తికి ఒక్కగానొక్క వారసురాలివి” అని కార్తీక్ నిజాలు చెప్పేస్తాడు. దీంతో 'వంటలక్క' దీప షాక్ అవుతుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (మే 26) ఎపిసోడ్ ముగిసింది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం