కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 19: నువ్వు నా బానిసవి: కార్తీక్ అవార్డుకు ఎసరుపెట్టిన జ్యోత్స్న.. అయోమయంలో కార్తీక్-karthika deepam today episode may 19th 2025 jyotshna effort to steal award from karthik star maa tv serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 19: నువ్వు నా బానిసవి: కార్తీక్ అవార్డుకు ఎసరుపెట్టిన జ్యోత్స్న.. అయోమయంలో కార్తీక్

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 19: నువ్వు నా బానిసవి: కార్తీక్ అవార్డుకు ఎసరుపెట్టిన జ్యోత్స్న.. అయోమయంలో కార్తీక్

కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్ మే 19: కార్తీక్‍కు అగ్రిమెంట్‍తో షాకిచ్చింది జ్యోత్స్న. అవార్డును లాగేసుకునేందుకు ప్లాన్ చేసింది. జ్యో, దశరథ్‍పై శివన్నారాయణ ఫైర్ అవుతాడు. అవార్డు విషయంలో జ్యో కండీషన్‍తో కార్తీక్ అయోమయంలో పడతాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 19: నువ్వు నా బానిసవి: కార్తీక్ అవార్డుకు ఎసరుపెట్టిన జ్యోత్స్న.. అయోమయంలో కార్తీక్

కార్తీక దీపం 2 నేటి (మే 19, 2025) ఏం జరిగిందంటే.. కార్తీక్ నడుపుతున్న రెస్టారెంట్‍కు అవార్డు వచ్చిన సంబరంలో కుటుంబ సభ్యులు ఉంటారు. రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చినందుకు సెలెబ్రేట్ చేసుకుంటుంటారు. దీపకు స్వీట్ తినిపిస్తాడు కార్తీక్. ఇంతలో కార్తీక్‍కు మెసేజ్ వస్తుంది. ‘బావ నిన్ను అర్జెంట్‍గా కలవాలి.. త్వరగా రా’ అని జ్యోత్స్న మెసేజ్ చేసి ఉంటుంది. ఎవరు మెసేజ్ చేశారని దీప అడుగుతుంది. తెలిసిన వాళ్లు.. మీరు మాట్లాడుతూ ఉండండి నేను వచ్చేస్తానని కార్తీక్ అక్కడి నుంచి వెళతాడు.

కార్తీక్‍కు కంగ్రాట్స్ చెప్పిన జ్యో

జ్యోత్స్న దగ్గరికి కార్తీక్ వెళతాడు. ఎందుకు రమ్మని మెసేజ్ చేశావని అడుగుతాడు. కంగ్రాట్స్ బావ అని చేయి ఇస్తుంది జ్యోత్స్న. అప్పుడే విషయం నీ వరకు వచ్చిందా అని కార్తీక్ అడుగుతాడు. నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలియదు బావా అని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు నువ్వు కలలో ఉన్నావని చెబుతుంది. నేను కలలో ఉండొచ్చు.. కానీ నువ్వు భ్రమలో ఉన్నావని కార్తీక్ పంచ్‍ వేస్తాడు. అన్ని విషయాల్లో మనమే మేథావులం అనుకుంటే సరిపోవని అంటాడు.

కొత్త విషయాలు తెలుస్తుంటే..

దీప ప్రాణాలతో బయపడిన దగ్గరి నుంచి నీ మాటలు కొత్తగా ఉన్నాయ్ బావా అని జ్యోత్స్న అంటుంది. కొత్తకొత్త విషయాలు తెలుస్తుంటే.. మాటలు చేతలు, చూపులు అన్నీ కొత్తగానే ఉంటాయని కార్తీక్ చెబుతాడు. ఏంటో నీకు తెలిసిన విషయం అని జ్యో అడుగుతుంది. ఇంట్లో సెలెబ్రేషన్ మూడ్‍లో ఉన్నారని, తాను వెళ్లాలని కార్తీక్ అంటాడు. ఛాలెంజ్ చేశావ్.. గెలిచావ్.. కంగ్రాట్స్ బావా అంటూ మళ్లీ చేయి ఇస్తుంది జ్యో. షేక్ హ్యాండ్ ఇచ్చి చిరాకుగానే థ్యాంక్స్ అంటాడు కార్తీక్.

దీపకు సర్‌ప్రైజ్ ఇవ్వాల్సిందే

రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోనున్నావని దీప చాలా హ్యాపీగా ఉన్నట్టుందే అని జ్యోత్స్న అంటుంది. చాలా సంతోషంగా ఉందని అది చూస్తే నీకు ఆకలి వేయదు, నిద్రపట్టదు, నవ్వడం మానేస్తావంటూ కార్తీక్ కౌంటర్లు వేస్తాడు. అయితే, దీపకు సర్‌ప్రైజ్ ఇవ్వాల్సిందేనని జ్యోత్స్న అంటుంది. ఇంతలో కార్తీక్ సంతకాలు పెట్టిన అగ్రిమెంట్ పేపర్లు తీస్తుంది. సంతకం పెడితే సరిపోతుందా.. ఇందులో ఏం రాశానో తెలియాలి కదా అని జ్యో అంటుంది. అన్నీ ప్రేమతో రాశానని చెబుతుంది.

జ్యోత్స్నకు నాపై సర్వాధికారాలు ఉన్నాయి

అగ్రిమెంట్‍లో విషయాన్ని చదవాలని కార్తీక్‍కే ఇస్తుంది జ్యోత్స్న. అది చదివి కార్తీక్ షాక్ అవుతాడు. బయటికి చదవాలని జ్యో అంటుంది. మనం రాసింది ఎదుటివారు చదువుతుంటే చాలా మజాగా ఉంటుందని చెబుతుంది. “ఈ అగ్రిమెంట్ ప్రకారం జ్యోత్స్న ఏం చెబితే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నాకు సంబంధించిన అన్నింటి మీద తనకు సర్వాధికారాలు, సర్వ హక్కులు ఉన్నాయి. జ్యోత్స్న ఏం చెప్పినా వినడానికి ఏం చెప్పినా చేయడానికి, ఏం చెప్పినా చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నా. దీంట్లో ఎవరి బలవంతం లేదు. ఇది నా సొంత నిర్ణయం” అని అగ్రిమెంట్‍లో ఉన్న విషయాన్ని కార్తీక్ చదువుతాడు. ఇట్లు కార్తీక్ అని తమరు సంతకం చేశారు అని జ్యో అంటుంది.

నీ నుంచి ఏదైనా తీసుకోవచ్చు

ఈ అగ్రిమెంట్ ప్రకారం నీ నుంచి నేను ఏదైనా తీసుకోవచ్చు అని జ్యోత్స్న అంటుంది. మాటిచ్చానని హద్దులు మీర రాసుకున్నావని కార్తీక్ కోప్పడతాడు. “ఇది ప్రారంభమే. నేను ఫస్టే పేజీ మాత్రమే రాశాను. మిగిలినవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఫ్యూచర్‌లో ఒక్కొక్కటి రాస్తూనే ఉంటానని జ్యో అంటుంది. ఎన్నాళ్లు అని చిరాకుగా అంటాడు కార్తీక్. దీనికి ఎండ్ డేట్ లేదని జ్యో చెబుతుంది. నేను చెప్పింది చేయాల్సిందే అంటుంది.

నువ్వు నాకు రాజువి, బానిసవి

“నువ్వు నాకు రాజువి నాతో ఎలాగైనా ఉండొచ్చు. నీవ్వు నాకు మంత్రివి సలహాలు ఇవ్వొచ్చు. నువ్వు నా డ్రైవర్‌వి. నువ్వు న అసిస్టెంట్‍వి. నా ఫైల్స్ మోస్తూ వెనుక తిరగాలి. నువ్వు నా సీఈవోవి. అవసరమైతే నా కంపెనీని నడపాలి. నువ్వు నా వంట మనిషివి. నువ్వు నా ఫిజియెథెరపిస్ట్. భుజాలు పట్టేస్తే మసాజ్ చేయాలి. నువ్వు నా ఆఫీస్ బాయ్‍వి. నువ్వు నా వాచ్‍మెన్‍వి, మేనేజర్‌వి, నువ్వు నా బానిసవు” అని అంటుంది జ్యోత్స్న. కార్తీక్ కోపంతో రగిలిపోతుంటాడు. నా జీవితాన్ని తాకట్టు పెట్టాలా అని నువ్వు అన్నావ్ కదా.. ఎస్.. నువ్వు నీ జీవితాన్ని నీ భార్య కోసం నా దగ్గర తాకట్టు పెట్టావ్ అని జ్యో అంటుంది. ఈ అగ్రిమెంట్‍లో నాకు నచ్చినది రాసుకోవడానికి నాకు హక్కు ఉందని, అన్నింటికి ఒప్పుకొని సంతకం పెట్టావ్ అని పొగరుగా చెబుతుంది.

నేనెందుకు నో అంటా

నువ్వు మాట తప్పని నాకు తెలుసు బావ అని జ్యో అంటుంది. తప్పుతానని నేను చెప్పానా అని కార్తీక్ చెబుతాడు. దీంతో జ్యో అవాక్కవుతుంది. ఈ క్లాజ్‍లన్నీ నాకు ఓకే అని అంటాడు. అన్నీ ఒప్పుకుంటున్నావా.. ఆర్గ్యూ చేయవా అని జ్యో అడుగుతుంది. నేను ఎదురుచూస్తున్న అవకాశం ఎదురొస్తే నేనెందుకు నో అంటానని చెబుతాడు. నేను వింటున్నది నిజమేనా.. నువ్వేనా ఇలా మాట్లాడుతోంది అని ఆశ్చర్యపోతుంది జ్యోత్స్న. “ఎందుకు పాప అంత షాక్ అవుతావ్. ఇప్పడేగా మొదలైంది అన్నావ్. ఆట నువ్వు మొదలుపెట్టు. నేను ఆడతా. నువ్వు వద్దు బాబోయ్ అనేంత వరకు ఆడతా” అని కార్తీక్ అంటాడు. రివర్స్ అటాక్‍తో జ్యో కంగారు పడుతుంది.

నీతోనే నిజం చెప్పిస్తా

నేను మాట్లాడిందని నీకు అర్థమైందా అని జ్యో అంటే.. తెలుగులోనే కదా రాశావ్ అని కార్తీక్ అంటాడు. ఇంత సింపుల్‍గా రాజీ పడతావని అనుకోలేదని జ్యో చెబుతుంది. నువ్వేంటో. నీ పుట్టుక ఏంటో, నువ్వు ఎవరి కూతురివో, నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావో నాకు తెలుసే చిన్న మరదలా. నువ్వు ఎవరివో నీతోనే నిజం చెప్పించాలి. దీపను నీ స్థానంలో తీసుకురావాలి. ఇదంతా జరగాలంటే నీకు అందుబాటులో ఉండాలి. నీ పక్కనే ఉండాలి” అని మనసులో అనుకుంటాడు కార్తీక్. ఏదో ఆలోచిస్తున్నావని జ్యోత్స్న అడుగుతుంది. ఇప్పటి నుంచి ఊహించనివి చాలా జరుగాతాయని కార్తీక్ అంటాడు.

అవార్డుకు జ్యోత్స్న ఎసరు

కార్తీక్‍కు వచ్చిన రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కొట్టేసేలా జ్యోత్స్న ప్లాన్ చేసి ఉంటుంది. “సత్యరాజ్ రెస్టారెంట్‍లో నువ్వు తీసుకున్న బాధ్యతలు నిన్నటితో రద్దు అయ్యాయి. ఆ బాధ్యతలు జ్యోత్స్న రెస్టారెంట్ సీఈవో జ్యోత్స్నకు బదిలీ అయ్యాయి” అని జ్యో అంటుంది. ఆ రెస్టారెంట్ సత్యరాజ్‍ది అని కార్తీక్ అంటే.. పని చేస్తోంది నువ్వే కదా అని జ్యో అంటుంది. లీగల్‍గా ఆ బాధ్యతలు నీవే.. అంటే ఇక నుంచి నావే అని జ్యో చెబుతుంది.

అవార్డు నేనే తీసుకుంటా

రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సత్యరాజ్ రెస్టారెంట్‍కు వచ్చిందంటే నాకు వచ్చినట్టే అని తన కుట్రను జ్యోత్స్న బయటపెడతుంది. కార్తీక్ షాక్ అవుతాడు. “స్టేజ్ మీద రేపు అవార్డు అందుకోబోయేది నువ్వు కాదు బావ.. నేను” అని జ్యో అంటుంది. అవార్డును దీపతో కలిసి అందుకోవాలని నేను అనుకుంటున్నానని కార్తీక్ చెబుతాడు. కావాలంటే నాతో కలిసి తీసుకో అని జ్యో చెబుతుంది. కార్తీక్ చిరాకు పడతాడు. నేను స్టేజీ మీద అవార్డు తీసుకుంటుంటే.. నువ్వు నీ భార్య పక్కని నిలబడి చప్పట్లు కొట్టొచ్చని జ్యో అంటుంది.

ఇది నా ప్రెస్టేజ్.. వదిలేయ్

అవార్డు విషయం వదిలేయ్.. ఇది నా ప్రెస్టేజ్ అని కార్తీక్ అడుగుతాడు. ఒక్కసారి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాక నీకంటూ ఏదీ లేదని జ్యో చెబుతుంది. అంతా మనదే.. అంటే నాదే అంటుంది. అది నీదైనా.. నువ్వైనా అంతా నాదే.. రేపు అవార్డు ఫంక్షన్‍లో కలుద్దామని చెప్పి వెళ్లిపోతుంది జ్యోత్స్న. “కంగారు పడకు చిన్న మరదలా.. నీకు ముందుంది ముసళ్ల పండగ. అన్నింటికీ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా” అని మనసులో అనుకుంటాడు కార్తీక్. అవార్డు ఫంక్షన్‍కు వద్దంటే ఇంట్లో అగ్రిమెంట్ గురించి చెప్పాల్సి వస్తుందేమోనని కార్తీక్ అయోమయంలో పడతాడు. చెప్తే మళ్లీ అదో గొడవ అని అనుకుంటాడు.

దశరథ్, దశరథ్‍పై శివన్నారాయణ ఫైర్

కార్తీక్‍కు రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందని ఇన్విటేషన్ ద్వారా తెలిసి జ్యోత్స్న, దశరథ్‍పై శివన్నారాయణ కోప్పడతాడు. ఏమైందని దశరథ్ అడుగుతాడు. నువ్వు, నీ కూతురు చేతకాని వాళ్లు కాబట్టి అవార్డు వాడికి కట్టబెట్టారని ఫైర్ అవుతాడు. “సంవత్సరం తిరిగేలోపు ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ఇది ఇయర్ అవార్డు అందుకోకపోతే నా పేరు కార్తీక్ కాదు అని నా కూతురు కొడుకు సవాల్ చేశాడు.. వాడే గెలిచాడు” అని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ గెలిచాడా అని పారిజాతం అవాక్కయితే.. గెలిచాడు పిన్నీ అని ఆనందంగా అంటాడు దశరథ్. వాడి చేతిలో నేను ఓడాలా.. లేదు మీ తండ్రీకూతుళ్లను నమ్ముకున్న పాపానికి నన్ను ఓడించారని అంటాడు. వాడు నీ మనవడే కదా నాన్న అని దశరథ్ అంటే.. కాదు, వాడు తల్లి కూడా నా కూతురు కాదు అని కోపంగా అంటాడు శివన్నారాయణ.

గెలుపును తీసుకొచ్చి నీ కాళ్ల దగ్గర పెడతా

నీ పరువు పోనివ్వనని శివన్నారాయణతో జ్యోత్స్న అంటుంది. అలా చూస్తుండు.. గెలుపును తీసుకొచ్చి నీ కాళ్ల దగ్గర పెడతానని చెబుతుంది. జరిగిపోయిన దాని మార్చలేం అని శివన్నారాయణ అంటే.. రేపు సాయంత్రం చెబుతానని జ్యో చెబుతుంది. కొన్ని చెప్పడం కంటే చేయడం మేలని అంటుంది. నిన్ను తలదించుకోనివ్వని, నీ శత్రువును గెలువనివ్వనని గట్టిగా చెబుతుంది. కార్తీక్‍కు అవార్డు రాకుండా జ్యోత్స్న చేస్తుందా.. ఎలా కార్తీక్ గెలుపును ఆపుతుంది అని మనసులో అనుకుంటాడు దశరథ్.

కార్తీక్‍కు సూట్ ఇచ్చిన స్వప్న

కార్తీక్‍కు అవార్డు వచ్చినందుకు ఇంట్లో సెలెబ్రేషన్స్ కొనసాగుతుంటాయి. కాశీ, స్వప్న కూడా కార్తీక్ ఇంటికి వస్తారు. ఇంతలో కార్తీక్ ఇంటికి వస్తాడు. కార్తీక్‍కు కంగ్రాట్స్ చెప్పి స్వీట్ తినిస్తుంది స్వప్న. ఎవరినో కలిసేందుకు బయటికి వెళ్లావంట కదా అని కాశీ అంటే.. ముఖ్యమైన వ్యక్తిని కలిసేందుకు వెళ్లానని కార్తీక్ చెబుతాడు. అవార్డు ఫంక్షన్‍లో వేసుకునేందుకు కార్తీక్‍కు సూట్ ఇస్తుంది స్వప్న. అవార్డు అందుకుటప్పుడు స్పెషల్‍గా ఉండాలి కదా అని స్వప్న చెబుతుంది. రేపు అవార్డు అందుకోబోయేది నువ్వు కాదు.. నేను అని జ్యో అన్న మాటలను కార్తీక్ గుర్తు తెచ్చుకుంటాడు. మా అన్నయ్య సాధించిన విజయం మామూలుది కాదు.. పెద్ద విషయం అని స్వప్న అంటుంది. తాతయ్య మీద ఛాలెంజ్ చేసి సాధించావని కాశీ అంటాడు.

అవార్డు ఫంక్షన్‍కు గొప్పగొప్ప వాళ్లు వస్తారు.. మా అన్నయ్య, వదిన దిష్టి తగిలేలా ఉండాలని స్వప్న అంటుంది. దీపకు కాశీ పట్టుచీర ఇస్తాడు. వద్దు అని దీప అంటుంది. తీసుకోవాల్సిందేనని స్వప్న అంటుంది.

ఏం చెప్పాలో అర్థం కావడం లేదు

కార్తీక్ మాత్రం డల్‍గా ఉంటాడు. అవార్డు తానే తీసుకుంటానని జ్యో అన్న మాటలను తలుచుకొని, ఈ విషయం ఎలా చెప్పాలా అని అయోమయ పడుతుంటాడు ఏంటి అలా ఉన్నారని దీప అడుగుతుంది. గెలిచాననే ఆనందం ఓపక్క.. తాతను ఓడించానన్న బాధ మరో పక్క ఉన్నట్టుందని కాంచన అంటుంది. అలాంటివేమీ చెప్పుకోవద్దు.. మా నాన్న కూడా సంతోషిస్తారని చెబుతుంది. కానీ మా అన్నయ్య మంచిని శివన్నారాయణ కోరుకోడని స్వప్న అంటుంది. పెద్దవాళ్లు ఓ మాట అంటే ఎందుకు అంత పౌరుషం అని దీప అంటుంది. కార్తీక్ అవార్డు అందుకుంటే మనసులో అయినా తాత మెచ్చుకుంటారని దీప అంటుంది. తనకు డ్రెస్ తీసుకురాలేదని శౌర్య మారాం చేస్తుంది. కాశీ, స్వప్నను మంచి వాళ్లు కాదంటుంది. రాత్రి కల్లా కొత్త డ్రెస్ తీసుకొస్తానని కాశీ అంటాడు.

రేపు ఫంక్షన్ ఉంది కదా అన్నయ్య అని స్వప్న అంటుంది. “వెళ్లడం లేదని ఎలా చెప్పాలి. వెళ్లడం లేదంటే ఎందుకు అంటారు. అప్పుడు జ్యోత్స్న అగ్రిమెంట్ గురించి చెప్పాలి. జ్యోత్స్న నా ఫ్యామిలీ ఎమోషన్ మీద కొట్టావ్. నిన్ను తక్కువ అంచనా వేసి తప్పు చేశా. ముందు రేపు ఫంక్షన్‍కు వెళ్లడం లేదని వీళ్లందరికీ చెప్పాలి. కానీ ఎలా” అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (మే 19) ఎపిసోడ్ ముగిసింది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం