Karthika Deepam 2 Serial March 6: జ్యోత్స్న చెప్పిన నిజంతో పారిజాతం బెంబేలు.. శ్రీధర్ మాటలకు దీప కన్నీరు-karthika deepam today episode march 6 jyothshna tells truth deepa emotional with sridhar comments star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial March 6: జ్యోత్స్న చెప్పిన నిజంతో పారిజాతం బెంబేలు.. శ్రీధర్ మాటలకు దీప కన్నీరు

Karthika Deepam 2 Serial March 6: జ్యోత్స్న చెప్పిన నిజంతో పారిజాతం బెంబేలు.. శ్రీధర్ మాటలకు దీప కన్నీరు

Karthika Deepam 2 Today Episode March 6: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీప, శౌర్యపై చేసిన దాడి గురించి పారిజాతానికి జ్యోత్స్న చెబుతుంది. ప్రాణదాత దీపే అని తెలిసినా మరోసారి కార్తీక్ ఆటపట్టిస్తాడు. కార్తీక్ రెస్టారెంట్‍కు శ్రీధర్, కావేరి వస్తారు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam 2 Serial March 6: జ్యోత్స్న చెప్పిన నిజంతో పారిజాతం బెంబేలు.. శ్రీధర్ మాటలకు దీప కన్నీరు

కార్తీక దీపం 2 నేటి (మార్చి 6) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. చిన్నప్పుడు తనను కాపాడిన ప్రాణదాత దీపే అని నిజం తెలిసినా నిజం చెప్పకూడదని కార్తీక్ అనుకుంటాడు. దీపే చెప్పేలా చేస్తానని ఆలోచిస్తాడు. “నువ్వు బయటపడవని అర్థమైంది దీప. మరి నేనెందుకు బయటపడాలి. నువ్వు నాతో దాగుడుమూతలు ఆడినట్టు.. నేను నీతో దాగుడుమాతలు ఆడతా. నీ అంతట నువ్వే నేనే మీ ప్రాణదాతను కార్తీక్ బాబు అని చెప్పేలా చేస్తాను. నాలో కొత్త కార్తీక్‍ను చూస్తావ్” అని లాకెట్ చూస్తూ అనుకుంటాడు కార్తీక్.

ఆధారాలు దొరికితే మమ్మీనే పోలీసులకు అప్పగిస్తుంది

దీప తనను కొట్టి తీరు, ఇచ్చిన వార్నింగ్‍లను గుర్తు చేసుకొని జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటుంది. ఆధారాలు తెస్తానని, వదలనని దీప ఇచ్చిన హెచ్చరిక గురించి ఆలోచిస్తుంది. ఆధారాలు దొరికితే దీప కాదు.. మా మమ్మీనే కొట్టి పోలీసులకు అప్పగించేలా ఉంది అని మనసులో అనుకుంటుంది. ఇంతలో పారిజాతం అక్కడికి వస్తుంది. తప్పు చేసిన దానిలా ఇలా కూర్చున్నావంటి అని పారు అడుగుతుంది. దీపకు మీ అమ్మ (సుమిత్ర) గట్టిగా బుద్ది చెప్పిందని అంటుంది. దీప, సుమిత్ర ఒకేలాంటి వారని, ప్రశాంతంగా ఉన్నా.. తిరగబడితే పోలేరమ్మలే అని చెబుతుంది. తల్లిపోలికలు కూతురికి రాకుండా ఎందుకుంటాయని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

పారుకు నిజం చెప్పిన జ్యోత్స్న.. బెంబేలు

ఆధారాలు తెస్తానని దీప పోయిందని కదా.. నువ్వేమైనా చేస్తేనే కదా ఆధారాలు దొరకడానికి అని పారిజాతం అంటుంది. చేశాను అని జ్యోత్స్న అంటే.. ఏం చేశావని పారు అడుగుతుంది. ఇంటికి వచ్చి దీప చెప్పిందంతా నిజమే గ్రానీ అని జ్యోత్స్న అంటుంది. దీప, శౌర్యపై దాడి చేయించానని చెప్పేస్తుంది. దీంతో పారిజాతం బెంబేలెత్తిపోతుంది. షాకై చూస్తుంది. కానీ ఆధారాలు దొరకవని జ్యోత్స్న అంటుంది.

నోరు జారి కవర్ చేసుకున్న జ్యోత్స్న

ఇప్పుడు దాని కూతురు జోలికి నువ్వెందుకు వెళ్లావే అని పారిజాతం అరుస్తుంది. “ఈ ఇంట్లో దీప నా స్థానాన్ని ఆక్రమిస్తుంటే చూస్తుంటానా.. అందుకే తల్లీకూతుర్లను ఇద్దరినీ లేపేయాలని అనుకున్నా. కానీ బావ వచ్చి సేవ్ చేశాడు” అని జ్యోత్స్న అంటే.. పారిజాతం ఆశ్చర్యపోతుంది. దీపే ఆ ఇంటి వారసురాలు అనేలా నోరు జారుతుంది. ఇందాక ఏమన్నావ్.. దీప నీ స్థానాన్ని ఆక్రమించడం ఏంటే అని పారిజాతం అడుగుతుంది. “మళ్లీ నోరు జారానా” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఆ ఇంట్లో.. కార్తీక్ పక్కన భార్యగా ఆ స్థానం నాదే కదా అని చెప్పి కవర్ చేసుకుంటుంది.

చంపడమేంటే అని పారిజాతం అడుగుతుంది. వాళ్లు ఎదగడం, సంతోషంగా ఉండడం తనకు నచ్చడం లేదని, దీప పక్కన ఉంటే బావ ఎప్పుడూ జీరోగానే ఉండాలని జ్యోత్స్న అంటుంది. వదిలేస్తే బావను దీప గెలిపిస్తుంది గ్రానీ.. అందుకే చంపాలనుకున్నా అని జ్యోత్స్న చెప్పేస్తుంది.

అప్పటి వరకు దాసుకు గతం గుర్తురాకూడదు

నీ బావ కార్తీక్‍ను వదిలేయాలని, ఆశలు వదులుకోవాలని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. కార్తీక్‍ను దీప వదిలిపెట్టదని చెబుతుంది. దీపకు ఏ ఆధారాలు దొరకవని జ్యోత్స్న అంటుంది. ముందు వేరే పెళ్లి చేసుకోవాలని, ఆస్తి అంతా నీ పేరుపై రాస్తారని పారిజాతం అంటుంది. దీప ఎక్కడ అసలైన వారసురాలు అని తెలుస్తుందా.. నేను ఎక్కడ రోడ్డు మీద పడతానో అనే భయం ఉందని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. “నన్ను నేను కాపాడుకునేందుకు ఏదైనా చేస్తాను. దీపను ఏదైనా చేసే వరకు దాసుకు గతం గుర్తు రాకూడదు. అసలు దాసు ఈ భూమి మీద ఉండకూడదు” అని జ్యోత్స్న ఆలోచిస్తుంది.

కార్తీక్‍కు దీప గిఫ్ట్

కార్తీక్‍కు ఓ ఖరీదైన చొక్కాను ఇస్తుంది దీప. ఖరీదైనదిగా కనిపిస్తోందని, అవసరమా అని కార్తీక్ అంటాడు. విలువైన మనిషికి ఖరీదైన షర్టే ఉండాలని దీప అంటుంది. మీరు ఇప్పుడు నడిస్తుంది టిఫిన్ సెంటర్ కాదు.. పెద్ద రెస్టారెంట్‍ను అని దీప అంటుంది. ఒంటిమీద బట్టలను చూసి గౌరవం ఇచ్చే రోజులు ఇవి అని దీప అంటుంది. “నా శ్రీమతి ప్రేమగా అందమైన షర్ట్ కానుకగా ఇస్తే ఎందుకు వేసుకోకుండా ఉంటా. ఇప్పుడే వేసుకుంటా” అని కార్తీక్ అంటాడు. షర్ట్ వేసుకుంటాడు. దీప మురిసిపోతుంది. సూపర్ ఉంది నాన్న అని శౌర్య వస్తుంది.

మాటలతో దీపను ఆటపట్టించిన కార్తీక్

లాకెట్ తీసున్నందుకు తాను హర్ట్ అయ్యానని శౌర్య అంటుంది. లాకెట్ బాగుచేశానంటూ శౌర్యకు మళ్లీ ఇస్తాడు. లాకెట్ నిజంగా పోయి ఉంటే ఏం చేసేవాడివి నాన్న అని శౌర్య అడుగుతుంది. కొన్ని ఎక్కడికి పోవు రౌడీ.. మనకు తెలియకుండా మన చుట్టూ తిరుగుతుంటాయని కార్తీక్ అంటాడు. ప్రాణదాత దీపే అని తెలిసిపోయిందనేలా మాట్లాడతాడు. కానీ సూటిగా చెప్పకుండా ఆట పట్టిస్తాడు. దీప మాత్రం అయోమయంలో ఉంటుంది.

ప్రాణదాతను ఎలా కనిపెడతావని శౌర్య అంటే.. నా ముందే ఉంది కదా అని కార్తీక్ అంటాడు. దీంతో దీప కంగారు పడుతుంది. పెద్ద ప్రాణదాత కాదు.. చిన్న ప్రాణదాత అని శౌర్య అడుగుతుంది. తనకు ఎలా ఉంటుందో చెబితే.. కనిపెట్టేందుకు హెల్ప్ చేస్తానంటుంది. నా ప్రాణదాత దీపలా ఉంటుందని కార్తీక్ అంటాడు. ఇలా దాగుడుమూతలు కొనసాగిస్తాడు. మీ అమ్మలా ఎవరు ఉన్నా నాకు చెప్పు అని కార్తీక్ అంటాడు. స్కూల్‍కు వెళ్లమన్నానా అని దీప కసురుకుంటుంది. ప్రాణదాతను తాను వెతికిపెడతానని శౌర్య అంటుంది. ఎన్నాళ్లు నిజం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతావో చూస్తా.. ఈ ఎగ్జైట్‍మెంట్ భలే ఉందని కార్తీక్ అనుకుంటాడు.

కార్తీక్ రెస్టారెంట్‍కు శ్రీధర్, కావేరి

కార్తీక్, దీప నడిపిస్తున్న రెస్టారెంట్‍కు శ్రీధర్, కావేరి వస్తారు. శ్రీధర్ ఎక్కడ గొడవ చేస్తాడో అని.. వేరే రెస్టారెంట్ దొరకలేదా అని కావేరి అంటుంది. ఇక్కడ ఫుడ్ టేస్టీగా ఉంటుందని పబ్లిక్ టాక్ అని శ్రీధర్ అంటాడు. వాళ్లను ఏమీ అనకుండా ఉండాలని కావేరి చెబుతుంది. శ్రీధర్ తన వెటకారం కొనసాగిస్తాడు. ఏం గొడవ చేస్తారో ఏమో అని కావేరి భయపడుతుంది.

అందుకే వచ్చా

శ్రీధర్, కావేరిని కార్తీక్ చూస్తాడు. వాళ్లను చూసుకోవాలని దీపకు చెబుతాడు. ఎలా ఉన్నారని కావేరిని పలుకరిస్తుంది దీప. షర్టు బాగుందని కార్తీక్‍తో శ్రీధర్ అంటాడు. వెటకారంగా మాట్లాడతాడు. చిన్నమ్మను కూర్చోబెట్టి.. ఈ మనిషి ఎందుకు వచ్చాడో కనుక్కొని పంపెయ్ అని కార్తీక్ అంటాడు. తాను శివరాత్రి చందాలకు రాలేదని, తమరు మాకు రూ.41లక్షలు బాకీ ఉన్నారని శ్రీధర్ చెబుతాడు. అప్పు తీర్చే స్థాయిలో బిజినెస్ జరుగుతుందో లేదో చూసేందుకు వచ్చానని అంటాడు. టేబుళ్లు ఆన్‍లైన్‍లో బుక్ చేసుకోవాలని కార్తీక్ అంటాడు. అమ్మ మీరు కూర్చొండని దీప అంటే.. అమ్మ కాదు చిన్నత్తయ్య అని పిలువాలని కావేరి చెబుతుంది.

మీకు ఏం కావాలో చెప్పండి.. చిన్న అత్తయ్యకు వేరుగా తీసుకొస్తానని దీప అంటుంది. అంటే మేడంగారికి స్పెషల్ అన్న మాట.. నాకు అవే తగలెట్టండి అని శ్రీధర్ అంటాడు. అలాగే చెయ్ అని కార్తీక్ అంటాడు. కార్తీక్ బాబు మీరు వెళ్లండి.. నేను వీళ్లను చూసుకుంటానని దీప చెబుతుంది.

శ్రీధర్ మాటలకు బాధపడిన దీప

“బాబు ఏంటి.. కార్తీక్ నీ భర్త కదా.. ఏవండి అని పిలువు” అని దీపతో కావేరి అంటుంది. “వంట మనిషి కదా.. ఆవిడ స్థాయి ఏంటో ఆవిడకు తెలుసులే. నా కొడుకు చదువుకున్న చదువుకు.. వాడికి ఉన్న తెలివి, అందానికి జ్యోత్స్న లాంటి అమ్మాయి భార్యగా రావాలి. ఏం చేస్తాం రాసుకున్నోడికి రాసుకున్నంత” అని నానా మాటలు అంటాడు శ్రీధర్. దీంతో దీప కాస్త కన్నీరు పెట్టుకుంటుంది. ఆపుతారా అని కావేరి అంటుంది. దీప.. ఈయన ఏదో ఒకటి వాగుతుంటారు పట్టించుకోవద్దని కావేరి అంటుంది. దీప కన్నీరు పెట్టుకుందని ఫీల్ అవుతుంది.

శౌర్య గురించి కావేరి అడిగితే.. ఓసారి ఇంటికి రండి అని దీప పిలుస్తుంది. మీరు వడ్డిస్తున్నారేంటి, నేను చేస్తా అని దీపతో మేనేజర్ అంటాడు. నా రేంజ్ తెలుసా.. తెలుసుకో అంటూ వాగుడు వాగుతాడు శ్రీధర్. తాను చూసుకుంటానని దీప అంటుంది. నువ్వు మాకు వడ్డించడం ఏంటి అని కావేరి అంటే.. తన వృత్తే అది కదా అని మరోసారి నోటిదూల చూపిస్తాడు శ్రీధర్. వంటలు చేయడం, గిన్నెల కడగడం, జనాలకు వడ్డించడం అని మాటలు అంటాడు. శ్రీధర్ బాగా తింటాడు.

సగం బిల్ కట్టి వెళ్లండి.. శ్రీధర్‌కు షాక్

బిల్ ఎంతైదో అని శ్రీధర్ చూస్తాడు. రూ.1,240 అని అంటాడు. అలవాటు ప్రకారం బిల్ పంపించాం సారీ.. అని కార్తీక్ అంటాడు. పంపినా కట్టనులే అని శ్రీధర్ అంటాడు. “సారీ చెప్పింది బిల్ పంపినందుకు కాదు.. ఇద్దరికీ కలిపి పంపినందుకు. నా ఇంట్లో వాళ్లకు రెస్టారెంట్‍లో బిల్ ఉండదు మాస్టారు” అని కార్తీక్ అంటాడు. నువ్వు తిన్నదానికి సగం అమౌంట్ బిల్ కట్టి వెళ్లాలంటాడు.

కేవలం రూ.620.. క్యూఆర్ కోడ్ తీసుకురా అని శ్రీధర్ అంటాడు. కానీ ఫోన్ లేదని చూసుకొని షాక్ అవుతాడు శ్రీధర్. ముందు బిల్ కట్టాలని కార్తీక్ అంటాడు. కావేరి బిల్ కట్టు అంటే.. ఈయన దీపను అన్న మాటలకు ఇరికించాల్సిందే అని కావేరి మనసులో అనుకుంటుంది. తాను కూడా ఫోన్ మరిచిపోయానని చెబుతుంది. పర్లేదు తర్వాత ఇవ్వండని దీప అంటే.. ఏం మాట్లాడుతున్నావ్ దీప అని కార్తీక్ అడ్డుకుంటాడు. దీంతో శ్రీధర్ అవాక్కవుతాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (మార్చి 6) ఎపిసోడ్ ముగిసింది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం