Karthika Deepam Today March 19: కాంచన మాటలతో బాధపడిన దీప.. జ్యోత్స్నపై కార్తీక్, దీప అనుమానం.. జ్యో మరో ప్లాన్-karthika deepam today episode march 19 kanchana gets emotional karthik deepa doubts jyotshna star maa serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam Today March 19: కాంచన మాటలతో బాధపడిన దీప.. జ్యోత్స్నపై కార్తీక్, దీప అనుమానం.. జ్యో మరో ప్లాన్

Karthika Deepam Today March 19: కాంచన మాటలతో బాధపడిన దీప.. జ్యోత్స్నపై కార్తీక్, దీప అనుమానం.. జ్యో మరో ప్లాన్

Karthika Deepam Today Episode March 19: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కాంచనను నిశ్చితార్థానికి పిలిచేలా తాతను తాను ఒప్పిస్తానని దశరథ్, కాంచనతో జ్యోత్స్న చెప్పింది. కాంచన మాటలకు దీప నొచ్చుకుంటుంది. జ్యో కొత్త ప్లాన్ వేస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam Today March 19: కాంచన మాటలతో బాధపడిన దీప.. జ్యోత్స్నపై కార్తీక్, దీప అనుమానం.. జ్యో మరో ప్లాన్ (Photo: JioHotstar)

కార్తీక దీపం 2 నేటి (మార్చి 19)లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న నిశ్చితార్థానికి కాంచనను పిలుద్దామంటే.. వద్దేవద్దంటాడు శివన్నారాయణ. నేను ఎవరిని చెప్పానో వాళ్లే రావాలి వస్తారు.. నాకు ఒక్కడే కొడుకు, ఒక్కరే మనవరాలు అని అంటాడు. దీంతో దశరథ్, సుమిత్ర బాధపడతారు. నువ్వెందుకు ఏడుస్తావ్.. మీ మామయ్య చెప్పింది నిజమేనని సుమిత్రతో పారిజాతం అంటుంది. నువ్వు తాతలా మాట్లాడొద్దని జ్యోత్స్న చెబుతుంది.

తాతను నేను ఒప్పిస్తా

నిశ్చితార్థానికి, పెళ్లికి అత్త ఫ్యామిలీ రావాలని మమ్మీ, డాడీ కోరుకుంటున్నారు.. వాళ్లు వచ్చేలా నేను చేస్తానని జ్యోత్స్న. తాతను నేను ఒప్పిస్తానని అంటుంది. ఎలా ఒప్పిస్తావని సుమిత్ర అడుగుతుంది. తాను అత్త ఇంటికి వెళ్లివచ్చానని జ్యోత్స్న చెబుతుంది. కాంచన నీతో మాట్లాడిందా అని దశరథ్ అడిగితే.. వాళ్లంతా హ్యాపీ డాడీ అని జ్యోత్స్న. మీరు పిలవండి.. అఫీషియల్‍గా తాతను నేను ఒప్పిస్తానని చెబుతుంది. దీంతో కాంచన సంతోషిస్తుంది. ఇంతకు ముందు ఎంత బాధపెట్టావో ఇప్పుడు అంత సంతోషపెడుతున్నావ్ అని అంటుంది.

మార్పు భయంగానే ఉంది

“జ్యోత్స్నలో ఈ మార్పు నాకు భయంగానే ఉంది సుమిత్ర.. అసలు జ్యోత్స్న దాసు, శౌర్యను ఎందుకు చంపాలనుకుందో అర్థం కావడం లేదు. ఆ రెండింటికీ ఏంటి సంబంధం” అని మనసులో అనుకుంటాడు దశరథ్. “నువ్వు దాసును నేను చంపడం గురించే ఆలోచిస్తున్నావని తెలుసు డాడీ.. నీకు సగం మాత్రమే తెలిసింది.. ఎందుకు చంపాలనుకున్నానని తెలియలేదు. అది తెలిసే సరికి దాసు, దీప, శౌర్య ఉండరు” అని మనసులో అనుకుంది జ్యోత్స్న. ఓసారి అత్తతో మాట్లాడండి.. తాను నేను ఒప్పిస్తానని కాంచనతో జ్యోత్స్న చెబుతుంది. జ్యోత్స్న తనను ఎందుకు పక్కన పెడుతోందని పారిజాతం ఆలోచిస్తుంది.

దీప కొంగుపట్టుకున్న కార్తీక్

కార్తీక్‍కు జంతికలు తీసుకొచ్చి ఇస్తుంది దీప. చీటి కట్టేందుకు డబ్బు డబ్బాలో పెట్టాలని ఇద్దరూ మాట్లాడుకుంటారు. దీప వెళ్లిపోతుంటే చీర కొంగు పట్టుకుంటాడు కార్తీక్. దీంతో కొంగు ఎందుకు పట్టుకున్నాడని దీప ఆశ్చర్యపోతుంది. కొంగుకు అంటిన పిండిని కార్తీక్ తుడుస్తాడు. పైటకు ఏదో అంటుకుంది చూడు అని అంటాడు. పిండి అంటుకొని ఉంటుందని దీప చెబుతుంది. మాట్లాడాలని కాంచన పిలుస్తున్నారని అంటుంది. జంతికలు బాగున్నాయని, దీప హౌం ఫుడ్స్ అని ఒక స్టాల్ పెట్టిస్తే బాగుంటుందని కార్తీక్ అంటాడు.

కాంచనకు దశరథ్ ఫోన్

జ్యోత్స్న నిశ్చితార్థం గురించి చెప్పేందుకు కాంచనకు కాల్ చేయాలని దశరథ్, సుమిత్ర అనుకుంటారు. మీరే మాట్లాడండని కాల్ చేసి ఇస్తుంది సుమిత్ర. అన్నయ్య కాల్ చేస్తున్నాడే అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది కాంచన. జ్యోత్స్నకు పెళ్లి చూపులు ఓకే అయ్యాయంట కదా వినగానే సంతోషంగా అనిపించింది, దానికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తే నీ బాధ్యత తీరుపోతుందని కాంచన అంటుంది. ఈ మాటలను కార్తీక్, దీప వెనుక నుంచి వింటుంటారు. నీ ఇంటి కోడలు కావాల్సిందని దశరథ్ అంటే.. అవన్నీ ఇప్పుడు మాట్లాడొద్దని కాంచన అంటుంది. నువ్వు సంతోషంగా ఉన్నావ్ కదా చాలు అని కాంచన అంటే.. అంటే మీరు సంతోషంగా లేరనే కదా అని మనసులో అనుకుంటుంది దీప.

ఆస్తిలో వాటా రానందుకు నా మీద కోపం లేదా అని దశరథ్ అడుగుతాడు. దాని గురించి మాట్లాడేందుకు తనకు ఇష్టం లేదని కాంచన అంటుంది. మీరంతా సంతోషంగా ఉన్నారని, నేను కూడా సంతోషంగా ఉన్నానని చెబుతుంది. కలెక్టర్ అబ్బాయి అంట కదా.. మంచి సంబంధం అని అంటుంది.

పిలుపులకు కూడా దూరమయ్యాం

మనం వియ్యంకుడు, వియపురాలు అవుదామనుకున్నామని దశరథ్ అంటాడు. మాటలు.. నుదిటిమీద రాతలు కావని, గాలిలో కలిసిపోతాయని కాంచన అంటుంది. “ఎన్నో కలలు కన్నాం. అవన్నీ కన్నీళ్లలో కరిగిపోయాయి” అని బాధగా అంటుంది కాంచన. నాలుగురోజుల్లోనే వచ్చే బుధవారం జ్యోత్స్నకు నిశ్చితార్థం అని దశరథ్ చెబుతాడు. పిలవడానికి ఫోన్ చేశావా.. విషయం చెప్పేందుకేనా అని కాంచన అడుగుతుంది. దీంతో మౌనంగా ఉంటాడు దశరథ్. నీ మౌనం అర్థమైంది లే అన్నయ్యా.. కుటుంబంలా కలిసి ఉండాల్సిన వాళ్లం.. పిలుపులకు కూడా దూరమయ్యామని కాంచన బాధగా అంటుంది.

నా మేనకోడలిని కోడలిగా చేసుకుందామనుకున్నా

మన మధ్యలో దూరం ఉండకూడదనే నా మేనకోడలిని ఇంటి కోడలిగా చేసుకుందామనుకున్నానని దశరథ్‍తో కాంచన అంటుంది. ఈ మాటలు వింటున్న దీప బాధపడుతుంది. అన్నీ ప్రాణం లేని ప్రామాణాలే చేసుకున్నాం అన్నయ్యా అని కాంచన అంటుంది. తనకు ఫోన్ చేసినట్టు నాన్నకు చెప్పకు, నీ కూతురు పెళ్లి బాగా జరగాలని నీ చెల్లిగా మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కాంచన.

బాధపడిన దీప

మేనకోడలు జ్యోత్స్నను కోడలిగా చేసుకోలేకపోయానని కాంచన అన్న మాటలకు దీప బాధపడుతుంది. నీ మేనకోడలు నీ కోడలు కానందుకు బాధపడుతున్నావా అని తల్లి కాంచనను కార్తీక్ అడుగుతాడు. మరోవైపు తనకు ఎంతో ఇష్టమైన కాంచన బాధపడుతున్నందుకు తట్టుకోలేకపోతున్నానని సుమిత్రతో దశరథ్ అంటాడు. నా కూతురు నిశ్చితార్థానికి నా కూతురు రావాల్సిందేనని అనుకుంటాడు. ఫోన్‍లో మాట్లాడింది చూసిన తర్వాతే ఈ మాట అడుతున్నానని కాంచనను కార్తీక్ అడుగుతాడు. అన్నయ్య అప్పటి మాటలు గుర్తు చేయబోతే అలా మాట్లాడానని కాంచన అంటుంది. కానీ పుట్టింటి మీద ఆశ అయితే చావదు కదా అని చెబుతుంది. ఏం కోల్పోయానో ఆలోచించడం లేదని, ఏం ఉందో ఆలోచిస్తున్నానని అంటుంది.

“భర్తను వదిలేసుకున్నా కొడుకు ఉన్నాడు చాలు అనుకున్నా.. మేనకోడలిని వదిలేసుకున్నా, కోడలిగా దీప ఉంది చాలనుకున్నా. కాస్త బాధ ఉంది. కానీ బెంగ లేదు. నేను ఇక్కడ బాధపడుతున్నా. కానీ ఇంతకు రెట్టింపు మా అన్నయ్య బాధపుడుతుంటాడు. ఎవరినీ ఎవరూ ఓదార్చలేరురా” అని కార్తీక్‍తో కాంచన అంటుంది.

నువ్వూ నా మేనకోడలివే.. దీపకు సర్దిచెప్పిన కాంచన

దీప మాత్రం బాధపడుతూ అక్కడే నిల్చొని ఉంటుంది. నువ్వు కూడా నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా అని దీపతో కాంచన అంటుంది. మేనకోడలిని కోడలిని చేసుకోలేకపోయానన్న బాధ నాకు మీ కళ్లలో కనపడుతోందని దీప అంటుంది. మేనకోడలి స్థానంలో దీపను కోడలిగా చూస్తున్నా.. అనుకున్నది జరగలేదనే వెలితి జీవితంలో అలాగే ఉంటుంది కదా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. నాకు ఏ వెలితి లేదు దీప.. నా కొడుకు సంతోషంగా ఉన్నాడు చాలా అని కాంచన సర్దిచెబుతుంది.

మీరు కోరుకున్నట్టు మీ మేనకోడలు.. మీ కోడలు అయి ఉంటే బాగుండేదని బాధగా ఉంటుంది దీప. ఏ నువ్వు మాత్రం నాకు మేనకోడలివి కాదా అని కాంచన అంటుంది. మీ నాన్న కుబేర నాకు అన్నయ్య అవుతాడు.. అప్పుడు నేను నిన్ను మేనకోడలిగానే అనుకుంటే ఏ బాధ లేనట్టేగా అని కాంచన అంటుంది. నువ్వు నా మేనకోడలివే.. నాకు ఏ బాధలేదని కాంచన అంటుంది. ఏ బాధ లేదనుకుంటూనే.. బాధపడుతున్నారని దీప మనసులో అనుకుంటుంది.

సరిగా చదవడం లేదంట, మిస్ కాల్ చేసిందని శౌర్యతో కార్తీక్ అంటాడు. ఉదయం శౌర్య లేట్‍గా లేస్తూ.. హోం వర్క్ చేయడం లేదని దీప చెబుతుంది. మీరే శౌర్యను దారిలో పెట్టాలని అంటుంది. అలాగే అంటాడు కార్తీక్. మా అమ్మతో జ్యోత్స్న గురించి మాట్లాడుతున్నావేంటి అని దీపను కార్తీక్ అడుగుతాడు. బాధ తెలుసుకుంటున్నానని దీప చెబుతుంది.

మూడుముళ్లు పడ్డాకే నమ్ముతా.. దీప కూడా అనుమానం

తెలుసుకొని ఏం చేస్తావ్.. జ్యోత్స్న ఈ పెళ్లి చేసుకోదని నువ్వు నమ్ముతున్నట్టే కదా అని కార్తీక్ అంటాడు. “మీ మనసులో జ్యోత్స్న లేకపోతే ఈ పెళ్లి ఆగదు కార్తీక్ బాబు” అని దీప అంటుంది. పెళ్లిచూపులు అవతారంలో జ్యోత్స్న మన ఇంటికి వచ్చి పెళ్లికి ఒప్పుకున్నా.. మారిపోయానని చెప్పినా నేను నమ్మలేదని కార్తీక్ అంటాడు. మెడలో మూడుముళ్లు పడి.. నేను కళ్లారా చూశాకే నమ్ముతానని చెబుతాడు. కార్తీక్ బాబు చెప్పినట్టు జ్యోత్స్నలో మార్పు నిజం కాదా అని దీప కూడా అనుమానిస్తుంది. మళ్లీ ఏదైనా చేయబోతోందా.. చేస్తే ఏం చేస్తుందని మనసులో డౌట్ పడుతుంది.

జ్యోత్స్న క్యాటరింగ్ ప్లాన్

కార్తీక్‍ను ఎలాగైనా నిశ్చితార్థానికి వచ్చేలా చేయాలని కొత్త ప్లాన్ వేస్తుంది జ్యోత్స్న. తన ఎంగేజ్‍మెంట్‍కు క్యాటరింగ్‍ను కార్తీక్ రెస్టారెంట్‍కు ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. రెస్టారెంట్‍లోకి వెళ్లాలని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. కార్తీక్ తిట్టితరిమేస్తాడేమోనని పారు భయపడుతుంది. బావ, దీప రెస్టారెంట్‍లో లేరని, వాళ్లు వచ్చేలోగా త్వరగా చెప్పింది చేసుకొని రా అని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. నా ఎంగేజ్‍మెంట్‍కు బావ రెస్టారెంట్‍కు క్యాటరింగ్ ఇస్తున్నామని, పాపం ఏంటని జ్యోత్స్న అంటే..నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకు తెలియదా అంటూ కంగారుగా ఉంటుంది పారిజాతం.

రెస్టారెంట్‍లో అడుగుపెడుతుంది పారిజాతం. మేనేజర్‌తో పారిజాతం మాట్లాడుతుంది. మీ రెస్టారెంట్‍లో మీల్స్ అత్యధిక ధర ఎంత అని పారిజాతం అడుగుతుంది. 45 ఐటమ్స్ వస్తాయి.. ప్లేట్ రూ.3వేలు ఉంటుందని మేనేజర్ చెబుతాడు. ఎంగేజ్‍మెంట్‍కు 100 మందికి ఓకే చేసుకోవాలని, పెళ్లికి చాలా దాటిపోతుందని పారు చెబుతుంది. ఆన్‍లైన్‍లో రివ్యూలు చూసి వచ్చారా అని మేనేజర్ అడిగితే.. ఓ వీఐపీ చెప్పారని పారు చెబుతుంది. సగం అమౌంట్ ఇప్పుడు ఇవ్వాలని మేనేజర్ అంటే.. ఫుల్ అమౌంట్ ఇప్పుడే ఇస్తే సమస్యా అంటుంది పారిజాతం. రూ.3లక్షలు ఇచ్చేస్తుంది. పేరు, అడ్రెస్ రాసివ్వాలని మేనేజర్ అడుగుతాడు.

కార్తీక్, దీపను చూసి జ్యోత్స్న కంగారు

అప్పుడే సైకిల్‍పై కార్తీక్, దీప రెస్టారెంట్‍కు వస్తుంటారు. పారిజాతం కోసం వెయిట్ చేస్తున్న దీప.. వారిని చూస్తుంది. కంగారు పడుతుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (మార్చి 19) ఎపిసోడ్ ముగిసింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం