Karthika Deepam Today March 17: దీపను నానామాటలు అన్న శ్రీధర్.. కొట్టేస్తానంటూ కార్తీక్ ఫైర్, దీప కన్నీరు.. గౌతమ్‍పై కోపం-karthika deepam today episode march 17 sridhar hurts deepa karthik fumes star maa serial today jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam Today March 17: దీపను నానామాటలు అన్న శ్రీధర్.. కొట్టేస్తానంటూ కార్తీక్ ఫైర్, దీప కన్నీరు.. గౌతమ్‍పై కోపం

Karthika Deepam Today March 17: దీపను నానామాటలు అన్న శ్రీధర్.. కొట్టేస్తానంటూ కార్తీక్ ఫైర్, దీప కన్నీరు.. గౌతమ్‍పై కోపం

Karthika Deepam 2 Today Episode March 17: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీపను బాధపెట్టేలా చాలా మాటలు అంటాడు శ్రీధర్. దీంతో తండ్రి శ్రీధర్‌పై కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. కాంచన కూడా బాధపడుతుంది. జ్యోత్స్న పెళ్లి చూపులకు కూర్చుంటుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam Today March 17: దీపను నానామాటలు అన్న శ్రీధర్.. కొట్టేస్తానంటూ కార్తీక్ ఫైర్, దీప కన్నీరు.. గౌతమ్‍పై కోపం

కార్తీక దీపం 2 నేటి (మార్చి 17) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీపకు గాజులు తొడుగుతాడు కార్తీక్. దీంతో దీప మురిసిపోతుంది. గాజులు ఎలా ఉన్నాయని కార్తీక్ అంటే.. చాలా అందంగా ఉన్నాయని దీప చెబుతుంది. ఏంటో విచిత్రం గాజులు వేస్తే చేతికి అందం రావాలని కానీ, ముఖానికి వచ్చిందని నవ్వుతూ కార్తీక్ పొగుడుతాడు. నా ముఖం మీద మెరుస్తున్న అందం మీ మంచితనం కార్తీక్ బాబు. తాను రెస్టారెంట్‍కు వెళతామని కార్తీక్ చెబితే.. తాము వస్తామని కాంచన, అనసూయ మాట్లాడుతుంటారు. ఇంతలో శ్రీధర్ అక్కడికి వస్తాడు.

పొరపడిన శ్రీధర్

శుభవార్త అని కావేరితో స్వప్న ఫోన్‍లో చెప్పిన విషయం విని.. కార్తీక్‍కు శివన్నారాయణ ఆస్తి రాసిచ్చాడని తప్పుగా అర్థం చేసుకొని ఉంటాడు శ్రీధర్. దీంతో స్వీట్లు పట్టుకొని కొడుకు కార్తీక్ ఇంటికి వస్తాడు. సాయంగా ఉండేందుకు రెస్టారెంట్‍కు వస్తామని, ఇంట్లో ఉండి ఏం చేయాలని అనసూయ అంటుంటే.. ఇళ్లంతా ఊడ్చేయ్.. బూజులు దులిపేయ్ అంటూ ఎంట్రీ ఇస్తాడు శ్రీధర్. నోటికొచ్చినట్టు మాట్లాడతాడు శ్రీధర్. తలా ఓ కర్ర పట్టుకొని బూజును వదలకొడదామని శ్రీధర్‌ను ఉద్దేశించి కార్తీక్ అంటాడు. చీపుర్లు ఇంకా బాగుంటాయని అనసూయ అంటుంది.

చేతులు కూడా లేస్తాయ్

నువ్వు, నీ కొడుకు అవకాశవాదులు, స్వార్థపరులు అంటూ కాంచనను అంటాడు శ్రీధర్. దీంతో దీప అరుస్తుంది. నువ్వు కూడా గొంత లేపుతున్నావా అని శ్రీధర్ అంటాడు. మాట్లాడే తీరు మార్చుకోకపోతే గొంతు లేవడమే కాదు.. చేతులు కూడా లేస్తాయని అంటాడు కార్తీక్.

పిచ్చిపట్టినట్టుంది.. అసలు విషయం చెప్పిన కార్తీక్

లేస్తాయ్.. ఇప్పుడు మీరు కోటీశ్వరులయ్యారు కదా అని అంటాడు శ్రీధర్. ఏం మాట్లాడుతున్నావని కార్తీక్ అంటాడు. కావేరితో స్వప్న శుభవార్త అంటే తాను విన్నానని, నీకు ఆస్తిలో వాటాను తాత శివన్నారాయణ రాసిచ్చేశాడు కదా అని చెబుతాడు. వడదెబ్బతో పిచ్చి పట్టినట్టుంది, నిమ్మరసం తీసుకురావాలని కార్తీక్ వెటకారంగా మాట్లాతాడు. ఆ తర్వాత అసలు విషయం చెబుతాడు. స్వప్న శుభవార్త అని చెప్పింది.. జ్యోత్స్నకు పెళ్లి సంబంధ గురించి అని అసలు విషయాన్ని శ్రీధర్‌కు చెప్పేస్తాడు కార్తీక్. దీంతో శ్రీధర్ అవాక్కవుతాడు. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందా అని అంటాడు.

అయితే, ఆస్తిని మీరు వదిలేసినట్టే అని శ్రీధర్ అంటాడు. తాము ఎప్పుడూ ఆశపడలేదని, దాన్ని వదిలేయాలని కాంచన చెబుతుంది. మా నాన్న ఆస్తి ఎవరికి రాసుకుంటారో ఆయన ఇష్టం, మీరేం మాట్లాడకండని తెగేసి చెబుతుంది.

దీపకు తాళికట్టాక దరిద్రం పట్టింది

ఎప్పుడైతే నీ కొడుకు దీప మెడలో తాళికట్టాడో.. నీ కొడుకుకు దరిద్రం అప్పుడే పట్టిందని శ్రీధర్ అంటాడు. దీంతో మాస్టారు అంటూ కోప్పడతాడు కార్తీక్. దీప బాధపడుతుంది. “ఏం కాదా.. ఈవిడగారి మెడలో తాళికట్టగానే సీఈవో పోస్ట్ పోయింది. తర్వాత ఆ ఇంట్లో స్థానంపోయింది. బంగారం లాంటి మరదలు పోయింది. ఈరోజు జ్యోత్స్న కోటీశ్వరురాలు. దీప దగ్గర ఏముంది బూడిద” అని శ్రీధర్ నానామాటలు అంటాడు.

నీవల్లే ఈ కర్మ.. దీపను బాధపెట్టిన శ్రీధర్

ఇక్కడితో ఆపేస్తే ఇద్దరికీ మంచిదని వేలుచూపిస్తూ తండ్రి శ్రీధర్‌కు వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. నిన్ను కాదురా నీ భార్యనే అడుగుతా అని శ్రీధర్ అంటాడు. “ఏం దీప నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు.. నీ మెడలో నా కొడుకు తాళికట్టకపోతే రోడ్డున పడాల్సిన అవసరం ఏముంది. నీ కూతురు కోసం కష్టాలు పడాల్సిన అవసరం ఏముంది. జ్యోత్స్నకు భర్తగా.. ఆ ఆస్తికి ఏకైక వారసుడిగా బతకాల్సిన నా కొడుకు ఈ పెంకుటింట్లో బతకాల్సిన ఖర్మ ఏంటి. ఇదంతా నీవ్వు నీ జీవితంలో అడుగుపెట్టిన వేళావిశేషం. నీ పాదదూళి మహిమ” అని శ్రీధర్ నోటికి వట్టినట్టు వాగుతాడు.

దీప ఉన్నంతకాలం దరిద్రం తప్పదు

అవసరం లేదు మాస్టారు.. ఇప్పటికే ఎక్కువైందని శ్రీధర్‌పై కార్తీక్ కోప్పడతాడు. జ్యోత్స్నను పెళ్లి చేసుకొని ఉంటే అని శ్రీధర్ అంటే.. నువ్వు రెండో పెళ్లి చేసుకోకపోయి ఉంటే అందరి బతుకులు బాగానే ఏడ్చేవని కౌంటర్ ఇస్తాడు కార్తీక్. దీప మాత్రం బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటుంది. ఎంతైనా సమర్థించుకోరా.. దీప ఉన్నంతకాలం నీకు దరిద్రం తప్పదు అని శ్రీధర్ మళ్లీ నోటిదూల చూపిస్తాడు.

తండ్రిని కొట్టాడన్న అపవాదు నాకొద్దు

“అమ్మా ఆ మనిషిని బయలుదేరమని చెప్పు. భార్య కోసం తండ్రిని కొట్టాడన్న అపవాదు నాకొద్దు” అని కార్తీక్ ఫైర్ అవుతాడు. కొట్టరా.. కొట్టు అని శ్రీధర్ అంటాడు. సవతి కోసం నీ తల్లి భర్తను వదిలేస్తే.. నువ్వు భార్య కోసం తండ్రినే కొడతానని అంటున్నావ్ అని దెప్పిపొడుస్తాడు. నోరు తిన్నగా లేకపోతే ఏం చేయాలని చిరాకుగా అంటాడు కార్తీక్.

ఇంట్లో నుంచి పోతాడా లేదా.. కోపంతో ఊగిన కార్తీక్

మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి అని కాంచన అంటుంది. నీతో పాటు నీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నావని శ్రీధర్ అంటాడు. దీంతో ఆ మనిషి ఇక్కడి నుంచి పోతాడా లేదా అని టీపాయయ్‍ను కోపంగా ఎత్తుతాడు కార్తీక్. నాకోసం ఏవీ విరగొట్టొద్దని, నేనే వెళతానని శ్రీధర్ అంటాడు.

బ్రోకర్ పనులు ఎప్పటి నుంచి మొదలుపెట్టావ్

దీపను కాకుండా జ్యోత్స్నను పెళ్లి చేసుకొని ఉంటే రాజయోగం పట్టేదని, దీపకు మూడు ముళ్లు వేసి మునిగిపోయావని శ్రీధర్ అంటాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. దీపను వద్దనుకుంటే జ్యోత్స్నతో నీ పెళ్లి నేను జరిపిస్తానని శ్రీధర్ అంటాడు. ఇలాంటి బ్రోకర్ పనులు ఎప్పటి నుంచి మెదలుపెట్టావని కోప్పడతాడు కార్తీక్. కార్తీక్ అని గట్టిగా అరుస్తాడు శ్రీధర్. నీలా రెండో పెళ్లి చేసుకొని.. ఆస్తి కోసం రెండో పెళ్లి చేసుకోవడం నాకు చేతకాదని శ్రీధర్‌ను నిలదీస్తాడు కార్తీక్. నాలో ఉన్న రక్తం నీదే అయినా.. లక్షణాలు నీవి కాదని ఫైర్ అవుతాడు.

అన్నీ తెలిసే దీప మెడలో తాళి కట్టా.. నా పక్కన దీప ఉంది అని కార్తీక్ అంటాడు. దీప మాత్రం శ్రీధర్ మాటలకు బాధపడుతూ ఉంటుంది. దీపే నాకు కోట్ల ఆస్తి అని, నిజాయితీ విలువ తెలియని నీ లాంటి వాళ్లతో నా భార్య గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం లేదని కార్తీక్ అంటాడు. భార్య అంటే తన జీవితం అని చెబుతాడు. ఎవరి కింద ఎంతకాలం బతుకుతావో.. తలరాత ఎవరూ మార్చలేరు అంటూ వెళ్లిపోతాడు శ్రీధర్. దీప బాధతో అలాగే నిలపడి పోయి ఉంటుంది. కార్తీక్ మూడుసార్లు పిలిచాక పలుకుతుంది. రెస్టారెంట్‍కు వెళదాం పదా అని దీపతో అంటాడు కార్తీక్. ఎవరో ఒకరు వచ్చి తమ సంతోషాన్ని చెడగొతారని కాంచన బాధపడుతుంది. దీపకు బాధగా ఉండదా అని అనసూయతో అంటుంది.

దీప కన్నీరు

సైకిల్‍పై రెస్టారెంట్‍కు వెళుతుంటారు కార్తీక్, దీప. శ్రీధర్ అన్న మాటలను దీప గుర్తు చేసుకొని బాధపడుతుంటుంది. ఇంతలో సత్యరాజ్ కాల్ చేశారని కార్తీక్ అంటాడు. దీప కన్నీటిని కార్తీక్ చూస్తాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్.. మా నాన్న అన్న మాటలకా అని ప్రశ్నిస్తాడు. ఆయన కోపంగా చెప్పినా నిజాలే చెప్పాడు కదా అని, జ్యోత్స్నను పెళ్లి చేసుకొని ఉంటే ఆయన చెప్పినట్టే మీ జీవితం ఉండేది కదా అని దీప అంటుంది.

జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ముందే చెప్పాను కదా అని దీపతో కార్తీక్ అంటాడు. భార్యగా చూడలేని మనిషి పక్కన భర్తగా ఎలా ఉంటానని చెబుతాడు. నన్ను పెళ్లి చేసుకోవాలని కూడా ముందుగా అనుకోలేదు కదా అని దీప అంటుంది. ఇష్టంగానే నీతో జీవితాన్ని పంచుకుంటున్నా మన భార్యభర్తలం.. ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారని దీపకు సర్దిచెబుతాడు కార్తీక్.

మరో అమ్మాయితో గౌతమ్.. దీప ఆగ్రహం

జ్యోత్స్నను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న గౌతమ్ మరో అమ్మాయితో ఉండగా దీపకు కనిపిస్తాడు. ఆ అమ్మాయికి గౌతమ్ ముద్దుపెడతాడు. అప్పటికే తన ఇంట్లో పని చేసే అమ్మాయికి కడుపు చేసి డబ్బు ఇచ్చి గౌతమ్ బెదిరించిన విషయాన్ని దీప గుర్తు చేసుకుంటుంది. ఈ వెధవ ఎంత మంది జీవితాలను నాశనం చేస్తాడు.. చచ్చావ్ రా నా చేతిలో అనుకుంటూ దీప కోపంగా చూస్తుంటుంది. కారు ఎక్కి గౌతమ్ వెళ్లిపోతుంటే..రాయి విసురుతుంది దీప.

చెప్పు తీసుకొని కొడతా

ఏమైంది.. కారు మీదకు రాయి విసురుతున్నావని కార్తీక్ అడుగుతాడు. కారు మీదకు కాదు.. ఆ వెధవ మీదకు విసరాలని దీప కోపంగా అంటుంది. పనిమనిషిని తల్లిని చేసి డబ్బు ఇచ్చాడని చెప్పా కదా.. ఆ వెధవే వాడు అని దీప అంటుంది. ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అయ్యేలా ఉందని చెబుతుంది. వాడు మళ్లీ దొరికితే.. చెప్పుతీసుకొని కొడతా అనేలా దీప అంటుంది. ఇక వాడెక్కడ కనపడతాడని కార్తీక్ అంటాడు. వాడిని వదిలేయనని, ఆడదంటే గౌరవం లేని అలాంటి వాళ్లను నడిరోడ్డుపై పరిగెత్తించి కొట్టాలని దీప అంటుంది.

జ్యోత్స్న పెళ్లి చూపులు.. మంచోడిలా గౌతమ్ నటన

జ్యోత్స్న పెళ్లి చూపులు జరుగుతుంటాయి. మా అబ్బాయికి జ్యోత్స్న అంటే ఎంతో ఇష్టమని గౌతమ్ తండ్రి చెబితే దశరథ్ సంతోషిస్తాడు. కలెక్టర్ గారి అబ్బాయి కదా.. ఎంత పద్ధతిగా పెంచి ఉంటారో అర్థం చేసుకుంటాం అని శివన్నారాయణ అంటాడు. ఇంతకీ అబ్బాయి ఎక్కడండి అని సుమిత్ర అంటుంది.

ఇంతలో గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు. మమ్మీడాడీతోనే రావాలనుకున్నా.. గుడికి వెళ్లాలనిపించిందని గౌతమ్ అంటాడు. బుద్ధిమంతుడిలా నటిస్తాడు. అంతా మంచే జరగాలని దేవుడికి దండం పెట్టుకున్నానని అంటాడు. పద్ధతులు తులసి మొక్కలా ఉన్నాయంటూ పొగిడేస్తుంది పారిజాతం. జ్యోత్స్నను తీసుకొస్తుంది సుమిత్ర. గౌతమ్ అలాగే చూస్తుంటాడు. జ్యోత్స్న పెళ్లి చూపులకు కుర్చీలో కూర్చుంటుంది. అమ్మాయి ఫొటోలో కంటే బయట ఇంకా బాగుందని గౌతమ్ తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు. దీంతో కార్తీక దీపం 2 నేటి (మార్చి 17) ఎపిసోడ్ ముగిసింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం