Karthika Deepam January 28th Episode: నన్ను మోసం చేశావ్.. కార్తీక్ కాలర్ పట్టుకున్న దీప.. అనసూయ చెంపదెబ్బ
Karthika Deepam Today Episode January 28: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో కాంచనకు జరిగిన అవమానం గురించి సుమిత్ర బాధపడుతుంది. శౌర్య గురించి కార్తీక్ నోటి నుంచే నిజాన్ని రాబడుతుంది దీప. ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (జనవరి 28) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్ కోసం సాయం అడిగేందుకు వచ్చిన తన ఆడపడుచు కాంచనకు తమ ఇంట్లో జరిగిన అవమానాన్ని తలచుకొని సుమిత్ర బాధపడుతుంది. సాయం కోసం వచ్చిన మనిషిని కన్నీళ్లతో పంపారని భర్త దశరథ్‍తో అంటుంది. పుట్టిళ్లు సుఖసంతోషాలతో ఉండాలని దీవించాల్సిన నోటితోనే.. తండ్రికే శాపనార్థాలు పెట్టేలా చేశారంటూ సుమిత్ర కన్నీరు పెడుతుంది. మావయ్య శివన్నారాయణను ఎందుకు నిలదీయలేకపోయారని దశరథ్‍ను ప్రశ్నిస్తుంది. అన్నగా కాంచనకు అండగా నిలబడాల్సిందని, పుట్టింటి ఆదరణ లేక ఎంత బాధపడి ఉంటుందోనని సుమిత్ర బాధపడుతుంది.

శౌర్యను తీసుకొచ్చేద్దాం
కార్తీక్, కాంచన, అనసూయ ఇంటికి వస్తారు. దీప ఓ చోట నీరసంగా, బాధగా కూర్చొని ఉంటుంది. ఏమైంది దీప ఇక్కడ కూర్చున్నావేంటి అని కార్తీక్ అడుగుతాడు. శౌర్య త్వరలోనే చచ్చిపోతుందని జ్యోత్స్న అన్న మాటలను గుర్తుకు తెచ్చుకుంటుంది దీప. అడుగుతుంటే పలకవేం దీప అని కాంచన అంటుంది. కార్తీక్‍తో పాటు మా అత్త, మీ అత్త కూడా అబద్ధం చెప్పారని జ్యోత్స్న చెప్పిన మాటలను తలచుకుంటుంది దీప. కాస్త కళ్లు తిరిగినట్టు ఉంటే ఇలా కూర్చున్నానని చెబుతుంది. మీరెక్కడికి వెళ్లారో చెప్పండి అని దీప అడుగుతుంది. బయటికి వెెళ్లామంటూ తాత ఇంటికి వెళ్లిన విషయాన్ని కార్తీక్ దాచేస్తాడు.
శౌర్య గురించి తెలుసుకునేందుకు కార్తీక్‍తో దీప కూడా అబద్ధం ఆడుతుంది. మీ ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చేశారని, వాళ్లు ఇంతకు ముందే ఇంటికి వచ్చారని అంటుంది. తాను అబద్ధం చెబితే.. ఇంటికి వచ్చిన ఫ్రెండ్ ఎవరు అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. శౌర్య మనల్ని చూడాలని అంటోందట, వర్ష వాళ్ల ఇంటికి వెళదామని దీప అంటుంది. శౌర్యను తీసుకొచ్చేద్దామని అంటుంది.
కార్తీక్ నోటే నిజం చెప్పించిన దీప
దీపకు నిజం తెలిసిపోయినట్టు ఉందని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇప్పుడొద్దు.. తర్వాత వెళదామని చెబుతాడు. తనకు పని ఉందంటాడు. శౌర్యను చూపిస్తే చాలని దీప అంటుంది. శౌర్యను తానే తీసుకొస్తానని కార్తీక్ అంటాడు. ఇప్పుడే తాను శౌర్యను చూడాలని దీప తెగేసి చెబుతుంది. కార్తీక్ ఎంత నచ్చచెబుతున్నా.. దీప ఏ మాత్రం వినదు. శౌర్యను చూడాల్సిందే అంటూ వరుసగా ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. తర్వాత అని కార్తీక్ అంటే.. ఎప్పుడూ అని గట్టిగా అడుగుతుంది. తాను ఎక్కువ విసిగిపోయానని కసురుగా అంటుంది. ఎందుకు టార్చర్ పెడుతున్నావ్.. అర్థం చేసుకోవా అని కార్తీక్ అంటాడు. మీరు కొట్టానా పర్లేదు కార్తీక్ బాబు.. నేను నా కూతురిని చూడాలని అని దీప అంటుంది.
శౌర్యను చూడాల్సిందే అంటూ వరుసగా ప్రశ్నలు వేస్తుంటుంది దీప. దీంతో కార్తీక్‍లో సహనం నశిస్తూ వస్తుంటుంది. దీప ప్రశ్నలకు కాదు.. కాదు అంటూ సమాధానం ఇస్తుంటాడు. ఇప్పుడు శౌర్యను కలవడం కుదరదని గట్టిగా అంటాడు. అదే ఎందుకు అని అడుగుతున్నానని దీప గట్టిగా అడుగుతుంది. “ఎందుకంటే శౌర్య నా ఫ్రెండ్ ఇంట్లో ఉందనేది అబద్ధం కాబట్టి. ఆసుపత్రిలో ఉంది. ప్రాణాలతో పోరాడుతూ ఆసుపత్రిలో ఉంది” అని దీపతో కార్తీక్ నిజం చెప్పేస్తాడు. శౌర్య కళ్లు తిరిగిపడిపోయింది ఒంట్లో బలం లేకకాదు.. గుండెకు బలం లేక అని చెప్పేస్తాడు. మందులతో నయం అవుతుందనుకున్నానని, కానీ భగవంతుడు నా ఆశలను చంపేశాడని కన్నీరు పెట్టుకుంటాడు. రెండో రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే శౌర్య బతకదు అని అంటాడు. దీంతో దీప నిర్ఘాంతపోతుంది. షాక్ అవుతుంది.
కార్తీక్ కాలర్ పట్టుకున్న దీప
శౌర్య అనారోగ్యం విషయం తనకు ఎందుకు చెప్పలేదంటూ ఏకంగా కార్తీక్ కాలర్ పట్టుకుంటుంది దీప. ఇది చూసి కాంచన, అనసూయ షాక్ అవుతారు. “నా కూతురు బతకదన్న విషయం నా దగ్గర ఎందుకు దాచారు. ఎందుకు ఇన్ని రోజులు అబద్ధాలతో మోసం చేశారు. నా కూతురికి ఏమైనా అయినా కూడా నీ అబద్ధాలతో, మాట మాటలతో నన్ను నమ్మిస్తావా” అని కార్తీక్ కాలర్ పట్టుకొని గౌరవం లేకుండా కోప్పడుతుంది దీప. నన్ను మోసం చేస్తావా అంటూ ఏడుస్తుంది. నన్ను ఎందుకు మోసం చేశావని కార్తీక్‍ను నిలదీస్తుంది.
దీపకు అనసూయ చెంపదెబ్బ
కార్తీక్‍ను దీప నిలదీయడంతో అనసూయ ఆగ్రహిస్తుంది. దీప చెంపపై కొడుతుంది అనసూయ. ఎవరే నిన్ను మోసం చేసింది అని అంటుంది. కార్తీక్ బాబు కాలర్ పట్టుకున్నందుకు దీని రెండు చెంపలు పగులగొట్టాలని ఫైర్ అవుతుంది. నా కూతురు అనారోగ్యం గురించి దాచడం నన్ను మోసం చేయడం కాదా అని దీప అడుగుతుంది. కాదు అని అనసూయ అంటుంది. బాధనంతా కార్తీకే మోస్తున్నాడని చెబుతున్నాడు. నీ కూతురిని స్కూల్‍లో చేర్పించే ముందు, నీ మెడలో తాళి కట్టే ముందు నీకు చెప్పాడా అని అంటుంది. “అడగకుండా ఎన్నో వరాలు ఇచ్చిన దేవుడే కార్తీక్ బాబు” అని దీపతో అనసూయ అంటుంది. కనకుండానే శౌర్యకు తండ్రి అయ్యాడని చెబుతుంది. చంటిదాని గుండె సమస్య గురించి తెలిస్తే నువ్వు తట్టుకోలేవనే నిజం దాచాడని కన్నీటితో అంటుంది.
శివుడు కంఠంలో విషాన్ని దాచినట్టు..
శౌర్యను కాపాడుకునేందుకు నీ కంటే కార్తీక్ బాబు ఎక్కువ కష్టపడ్డాడే అని అనసూయ అంటుంది. శౌర్య ఆపరేషన్‍కు డబ్బుల కోసం తిండీతిప్పలు మానేసి సైకిల్‍పై ఊరంతా తిరుగుతూ కార్తీక్ ప్రయత్నిస్తున్నాడని బాధతో చెబుతుంది. శౌర్యకు ఎంత పెద్ద జబ్బు చేసిందని తెలిస్తే.. నీ గుండె ఎక్కడ ఆగిపోతుందో అని నిజాన్ని దాచాడని అంటాడు. “శివుడు విషాన్ని కంఠంతో దాచుకున్నట్టు ఈ బాధను తన గుండెలో దాచుకున్నాడే” అని అనసూయ అంటుంది. శౌర్య గురించి కార్తీక్ ఎందుకు నిజం దాచాడో గట్టిగా చెబుతుంది. దీంతో దీప కన్నీరు పెట్టుకుంటుంది.
నీకు అర్హత లేదు
నీకు తాళి కట్టి నీడ ఇచ్చాడని, కూతురి కోసం కూడా ఎండలో తానే తిరుగుతున్నాడని దీపతో అనసూయ చెబుతుంది. ఇలాంటి మనిషిని కాలర్ పట్టుకొని మోసం చేశావని అడుగుతున్నావా అని ప్రశ్నిస్తుంది. కార్తీక్ బాబును నిలదీసే అర్హత నీకు లేదు అని తెగేసి చెబుతుంది. “కార్తీక్ బాబు మొన్న ఒక మాట అన్నాడు చూడు.. నువ్వు శౌర్యను కడుపున మోస్తే.. నేను గుండెల్లో మోస్తున్నానని.. ఆ మాట నూటికి నూరుపాళ్లు నిజం” అని అనసూయ అంటుంది. శౌర్య కోసం కార్తీక్ బాబు ఎంతో కుమిలిపోతున్నాడని, కన్నతండ్రి కూడా కూతురి కోసం ఎంత చేయడని చెబుతుంది. శౌర్య విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకునే నిర్ణయం కార్తీక్‍కు ఉందని అంటుంది. చేతనైతే దేవుడిలాంటి ఆ బాబు కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవాలని అంటుంది. అలాంటి మనిషికి చేతులెత్తి దండం పెట్టకుండా.. కాలర్ పట్టుకొని నిలదీస్తావా అని దీపపై ఆగ్రహిస్తుంది అనసూయ.
కార్తీక్ కాళ్లపై పడిన దీప
అనసూయ మాటలతో దీప కరిగిపోతుంది. కార్తీక్ కాళ్లపై పడుతుంది. నన్ను క్షమించండి కార్తీక్ బాబు అని ఏడుస్తూ అంటుంది. “మీరు చేసిన ఏ మంచిని మరిచిపోలేదు. కానీ నా కూతురు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలియగానే.. నన్ను నేను మరిచిపోయాను” అని దీప చెబుతుంది. జీవితంలోని కష్టాలకు తాను ఎప్పుడో చచ్చిపోయేదానన్ని అని, తనకు ఉన్న ఏకైక ఆశ నా కూతురు అని కార్తీక్ చేతులు పట్టుకొని కన్నీరు పెట్టుకుంటుంది. ఇలా అయిపోతావనే ఈ నిజాన్ని ఇన్ని రోజులు నేనే మోశానని కార్తీక్ అంటాడు.
శౌర్య ప్రాణం పోనిస్తానా అంటూనే..
శౌర్య ప్రాణం తాను పోనిస్తానా అని కార్తీక్ అంటాడు. అది నా కూతురు దీప.. చావును చంపేనా దాన్ని బతికిస్తాను అని కార్తీక్ అంటాడు. శౌర్యను ఎలా ఇచ్చావో.. అలాగే అప్పగిస్తానని, తనను నమ్మాలని అంటాడు. మన కూతురికి ఏమీ కాదని చెబుతాడు. రేపే శౌర్యకు ఆపరేషన్ చేయాలని, అందుకు డబ్బులు కావాలని చెబుతాడు. కన్నీరు పెట్టుకుంటాడు. నా దగ్గర డబ్బు లేదంటూ కుంగిపోతాడు. భయంతో గుండె ఆదురుతోందని అంటాడు. కార్తీక్ చేయి కూడా వణికిపోతుంటుంది. అందరి కష్టంలో కుబేరుడిగా ఉన్న కార్తీక్.. తన కష్టంలో చేతిలో రూపాయి లేని కుచేలుడు అయిపోయాడు అండూ ఏడ్చేస్తాడు. దీంతో కుటుంబం మొత్తం కుమిలిపోతుంది.
ఇంకా 45లక్షలు కావాలి
తన దగ్గర ఉన్న కొంత డబ్బును కార్తీక్ చేతిలో పెట్టి మన శౌర్యను కాపాడుకుందామని దీప అంటుంది. “దోసిట్లో నిండే డబ్బుతో శౌర్య ప్రాణాలు నిలబడతాయంటే.. నా తల్లి తన మనసులను చంపుకొని డబ్బు కోసం పుట్టింటికి వెళ్లేదే కాదు దీప” అని కార్తీక్ అంటాడు. ఎంత కావాలి కార్తీక్ బాబు అని దీప అడుగుతుంది. రూ.50లక్షలు అని కార్తీక్ చెప్పగానే.. ఎలా అనేలా బాధపడుతుంది. రూ.5లక్షలు ఎందుకు అని అడిగావే.. అవి శౌర్యను ఆసుపత్రిలో చేర్పించేందుకు అని కార్తీక్ చెబుతాడు. ఇంకా రూ.45లక్షలు కావాలని అంటాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవమానాలు, సలహాలు వచ్చాయే కానీ సాయం అందలేదని కార్తీక్ అంటాడు. అయ్యో అంటూ దీప ఏడుస్తుంది.
ఆసుపత్రికి దీప
ముందు ఆసుపత్రికి వెళదాం, నా కూతురిని చూడాలి అంటూ ఇంట్లో నుంచి పరుగులు పెడుతుంది దీప. దీప ఆగు నేను వస్తా అంటూ కార్తీక్ వెంట వెళతాడు. మనం కూడా ఆసుపత్రికి వెళదామని కాంచన అంటే.. ఇప్పుడు మనం డబ్బు కోసం సంపాదించేందుకు ప్రయత్నించాలని అనసూయ చెబుతుంది. నాన్న జాలిచూపలేదని, అమ్ముకునేందుకు, తాకట్టు పెట్టేందుకు కూడా ఏమీ లేవని కాంచన అంటుంది. ఊర్లో నా తమ్ముడు కట్టించిన ఇంటికిని తాకట్టు పెట్టో, అమ్మో డబ్బు తీసుకొస్తానని అనసూయ అంటుంది. ఇప్పటికిప్పుడు ఎవరు కొంటారని కాంచన అంటే.. ప్రయత్నిస్తానని చెబుతుంది. ఇప్పుడే ఊరికి బయలుదేరతానని అనసూయ అంటుంది. నమ్మకంతో ఉండాలని కాంచనతో చెప్పి అనసూయ వెళ్లిపోతుంది. భగవంతుడా ఇంత పెద్ద కష్టాన్ని తెచ్చావ్.. ఆ పసిదాన్ని ఎలా కాపాడుకోవాలంటూ ఏడుస్తుంది కాంచన. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 28) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం