Karthika Deepam January 27th Episode: తండ్రికి కాంచన శాపనార్థాలు.. నిజం చెప్పేసిన జ్యోత్స్న.. గుండెలవిసేలా ఏడ్చేసిన దీప
Karthika Deepam Today Episode January 27: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. సాయం కోసం వచ్చిన కాంచనను నానా మాటలు అంటాడు తండ్రి శివన్నారాయణ. కార్తీక్ కూడా ఫైర్ అవుతాడు. శౌర్య గురించి దీపకు జ్యోత్స్న నిజం చెప్పేస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (జనవరి 27) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్ కోసం డబ్బు అడిగేందుకు వచ్చిన కూతురు కాంచనను చులకనగా మాట్లాడతాడు తండ్రి శివన్నారాయణ. డ్రామాలు ఆడుతున్నారనేలా అంటాడు. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. శౌర్య కార్తీక్‍కు కూతురు ఎలా అవుతందని వెటకారంగా మాట్లాడతాడు శివన్నారాయణ. దీనికి కార్తీక్ కౌంటర్ ఇస్తాడు.

మన లోపాలు ఎత్తిచూపిస్తే మండుతుంది
"మా అమ్మమ్మ చనిపోయిందని మీరు రెండో పెళ్లి చేసుకున్నారు.. పారు మా అమ్మని, మామయ్యను సొంత పిల్లల్లా చూసుకోలేదా. మావయ్య కూతురిని సొంత మనవరాల్లా చూసుకోవడం లేదా. పారు ఏమైనా వీరికి సొంత పిల్లలా. జ్యోత్స్న సొంత మనవరాలా” అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. జ్యోత్స్న తన సొంత మనవరాలే అని పారిజాతం మనసులో అనుకుంటుంది. బావ నిజాలే మాట్లాడుతున్నాడని జ్యోత్స్న అనుకుంటుంది. మీ కూతురు విషయంలో మీరు ఆలోచించినట్టు.. మీ భార్య మీ విషయంలో ఆలోచించి ఉంటే మంచి చెడులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కార్తీక్ అంటాడు. ఇంతలో కార్తీక్ అంటూ గట్టిగా అరుస్తాడు శివన్నారాయణ. దీంతో మన లోపాలు ఎదుటి వారు ఎత్తిచూపిస్తే ఇలాగే మండుతుందని కార్తీక్ అంటాడు.
అది ఈయన సంస్కారం
శౌర్య నీ మనవరాలు అని నువ్వు అంటుంటే.. నీ కొడుక్కి పుట్టిందా అని ఆయన అడుగుతున్నాడని తల్లి కాంచనతో కార్తీక్ అంటాడు. అది ఆయన సంస్కారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో నువ్వొచ్చి నాకు సంస్కారం నేర్పొద్దని శివన్నారాయణ అంటాడు. దీప ఎక్కడా అంటూ వెటకారంగా మాట్లాడతాడు. నానా మాటలు అంటాడు. ఈ క్రమంలో తాతామనవళ్ల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. శౌర్యకు అంత మాయదారి రోగం వచ్చిందా అని పారిజాతం వెటకారంగా మాట్లాడుతుంది. నోరు జారొద్దు.. శౌర్య నాకు కూడా కూతురే అని ఫైర్ అవుతాడు కార్తీక్.
దీప వస్తే సాయం చేస్తా
కాంచన సాయం కోసం ఎంత ప్రాధేయపడినా మాటలు అంటూనే ఉంటాడు శివన్నారాయణ. కార్తీక్ వద్దు అంటూనే ఉంటాడు. తాము వస్తున్నట్టు దీపకు తెలియదు నాన్న అని కాంచన చెబుతుంది. తన మనవరాలి ప్రాణం నిలబెట్టేందుకు సాయం చేయాలని, కాళ్లు పట్టుకుంటానని అడుగుతుంది. కార్తీక్ వద్దు అంటుంటే.. నువ్వు ఆగు అని కన్నీళ్లతోనే కాంచన అంటుంది. శివన్నారాయణ కరుగుతుంటే.. ఇదంతా అబద్ధం తాత అంటూ మరోసారి అడ్డుపడుతుంది జ్యోత్స్న. దీప ఆడిస్తున్న కొత్త నాటకం అంటుంది. పారిజాతం వత్తాసు పలుకుతుంది. దీపనే రావాలి కదా అంటుంది. సాయం చేయాలని కాంచన మళ్లీ అడుగుతుంది.
చెల్లి ఇంతలా ప్రాధేయపడుతుంటే తాను చూడలేకున్నానని, సాయం చేస్తానని చెప్పు నాన్న అని దశరథ్ అంటాడు. సరే సాయం చేస్తానని శివన్నారాయణ అంటే కాంచన, దశరథ్, సుమిత్ర సంతోషిస్తారు. అయితే, ఓ మెలిక పెట్టాడు. దీపకే డబ్బు ఇస్తానని అంటాడు. దీప వచ్చి ప్రాధేయపడితే దీప చేతికి డబ్బు ఇస్తానని చెబుతాడు. అప్పుడు మీరు చెప్పింది నిజమని నమ్ముతుతానని అంటాడు. అలాగైతే రూ.45లక్షలు కాదు.. రూ.కోటి అయినా ఇస్తానంటాడు.
తండ్రికి శాపనార్థం పెట్టిన కాంచన
దీప రాలేదని కాంచన అంటుంది. ఎందుకు రాదు.. మీ కంటే ఎక్కువ ప్రాధేయపడాల్సింది దీపే కదా అని శివన్నారాయణ అంటాడు. నా భార్య వచ్చి వీళ్ల కాళ్ల మీద పడి ప్రాధేయపడితేనే సాయం చేస్తారంట అని కార్తీక్ అంటాడు. దీప ఎందుకు రాదు బావ అని జ్యోత్స్న అంటే.. శౌర్య అనారోగ్యం గురించి దీపకు తెలియదని కార్తీక్ చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. మేం మరీ ఇంత అమాయకుల్లా కనిపిస్తున్నామా అంటూ వెటకారంగా శివన్నారాయణ మాటలు అంటాడు. దీప ఆడిస్తున్న డ్రామా ఇది అని అమానిస్తాడు. భార్య, మనవరాలి మాటలు చెప్పిన మాటలే నమ్మి ఊరేగుతారని, ఎంత కాలం భ్రమలో బతుకుతారో బతకండి అంటూ కార్తీక్ ఆగ్రహిస్తాడు. మాకు మీ సాం అవసరం లేదని అరుస్తాడు. నా ప్రాణాలు అడ్డుపెట్టైనా కాపాడుకుంటానని అంటాడు.
శౌర్యకు అనారోగ్యం అనేది నాటకం అంటూ శివన్నారాయణ మళ్లీ అంటాడు. దీపకు చెప్పకుండా జీవితాంతం దాస్తారా అని చెబుతాడు. ఇవన్నీ నిజాలైతే దీప వస్తే డబ్బు ఇస్తానని తేల్చేస్తాడు. దీంతో కాంచన తల్లడిల్లి పోతుంది. నాన్న ఆశతో వచ్చావ్ నాన్న కన్నీళ్లతో పంపిస్తున్నావ్ అని కాంచన అంటుంది. “దీప నీ కోడలు కాదు. శౌర్య నీ మనవరాలు కాదు. నీ కొడుక్కు పుట్టలేదు. అది ఆ రౌడీ వెధవ కూతురు” అని శివన్నారాయణ అంటాడు. దీంతో కాంచన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. “నాన్న నువ్వు పుట్టగతులు లేకుండా పోతావ్” అని తండ్రికే శాపనార్థం పెడుతుంది కాంచన. దీంతో అంతా షాక్ అవుతారు. శివన్నారాయణ బాధపడతాడు. తొందరలో పొరపాటున అలా అన్నానని, క్షమించాలని కాంచన అంటుంది. వంట మనిషి దీప కోసం.. తాతనే తిడతావా అని జ్యోత్స్న అంటుంది. నేను కన్నది నా కూతురిని కాదు.. చావును అని బాధగా అంటాడు శివన్నారాయణ. ఇక్కడి నుంచి వాళ్లను పొమ్మనండి అని చెబుతాడు.
మళ్లీ మీ గుమ్మం తొక్కం
“నువ్వు అన్న మాటలతో పోల్చుకుంటే.. నా తల్లి నిన్ను అన్నది తక్కువే తాత” అని కార్తీక్ అంటాడు. మిమ్మల్ని ప్రాధేయపడాల్సిన అవసరం లేదని, మా బతుకు మేం బతుకుతాం అని చెబుతాడు. అంత పౌరుషం ఉంటే ఇంకోసారి మా గుమ్మం తొక్కొద్దని శివన్నారాయణ ఆగ్రహిస్తాడు. దీంతో అది మీరీ చెప్పాల్సిన అవసరం లేదని, ఇంకోసారి మీ గుమ్మం తొక్కకనని సవాల్ చేస్తాడు కార్తీక్. అవసరమైతే మీ మా ఇంటికి రావాలని చెబుతాడు. మళ్లీ జన్మలో మీ ఇంటి గుమ్మం తొక్కనని అంటాడు. అక్కడి నుంచి కార్తీక్, కాంచన, అనసూయ వెళతారు. వాళ్లకు నా కంటే దీపే ఎక్కువని మరోసారి నిజం చేశారంటూ బాధపడతాడు శివన్నారాయణ.
శౌర్య చచ్చిపోతుంది.. జ్యోత్స్న గొంతు పట్టుకున్న దీప
వెంటనే దీప దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. ప్రశాంతంగా పూరి పిండి కలుపుతున్నావా అని అంటుంది. కార్తీక్ బావ, మీ అత్త, మా అత్త ఎక్కడికి వెళ్లారని జ్యోత్స్న అడుగుతుంది. దీప సమాధానాలు చెబుతుంది. ఎందుకొచ్చావో చెప్పు అని దీప అంటుంది. నీ కూతురు శౌర్య ఎక్కడ అని జ్యోత్స్న అడుగుతుంది. శౌర్య ఎక్కిడికి వెళితే నీకెందుకు అని దీప అంటుంది. ఎక్కడికి వెళ్లిందో చెప్పు అని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ బాబు వాళ్ల ఫ్రెండ్ ఇంట్లో శౌర్య ఉందని దీప అంటుంది. వాళ్ల ఫ్రెండ్ వాళ్లు ఊరెళితే వాళ్ల పాపకు శౌర్య తోడుగా ఉండేందుకు వెళ్లిందని చెబుతుంది. నటిస్తున్నావంటూ రెచ్చగొట్టేలా జ్యోత్స్న మాట్లాడుతుంది. జాగ్రత్తగా మాట్లాడకపోతే కొడతానంటూ దీప హెచ్చరిస్తుంది.
ఇడ్లీ బంతిని తగులబెట్టినా ఎక్కడా తగ్గలేదని జ్యోత్స్న అంటుంది. మరిచిపోయిన దాన్ని గుర్తు చేసి దెబ్బ తినొద్దని దీప చెబుతుంది. దీనికే ఇలా అంటే అసలు విషయం చెబితే ఏమవుతావో అని జ్యోత్స్న అంటుంది. నీకేమైనా నీ గుండె తట్టుకుంటుంది.. నీ కూతురికి ఏమైనా అయితే తట్టుకోలగదా అని జ్యోత్స్న అంటుంది. శౌర్యకు ఏమైందని దీప అడుగుతుంది. “నీ కూతురు త్వరలోనే చచ్చిపోతుంది” అని జ్యోత్న అంటుంది. దీంతో జ్యోత్స్న గొంతు పట్టుకుంటుంది దీప.
దీపకు నిజం చెప్పిన జ్యోత్స్న
జ్యోత్స్న పీక పట్టుకొని నలిపేస్తుంది దీప. ఇంకోసారి మళ్లీ ఆ మాట నీ నోటి నుంచి వస్తే గొంతు పిసికేస్తానని అంటుంది. “శౌర్య.. బావ ఫ్రెండ్ ఇంట్లో కాదు. ఆసుపత్రిలో ఉంది” అని నిజం చెప్పేస్తుంది జ్యోత్స్న. దీంతో దీప షాక్ అవుతుంది. ఏంటి కూతురు ఆసుపత్రిలో ఉందా నువ్వు అబద్ధం చెబుతున్నావని అంటుంది. నేను కాదు కార్తీక్ బావ, మీ అత్త, మా అత్త అబద్ధం చెప్పారని జోత్స్న అంటుంది. ఆపరేషన్ చేయకపోతే శౌర్య చచ్చిపోతుందని, డబ్బు కోసం వారు మా ఇంటికి వచ్చారని జ్యోత్స్న చెప్పేస్తుంది. నేను చెప్పేది అబద్ధమైతే బావ వాళ్ల ఫ్రెండ్ ఇంటికి వెళ్లే శౌర్య ఉందో లేదో చూడు.. లేకపోతే ఏ ఆసుపత్రిలోనే వెతికే ఐసీయూలో ట్రీట్‍మెంట్ చేయించుకుంటూ ఉంటుందని జ్యోత్స్న అంటుంది. నీకు తెలియకుండానే నీ కూతురు ఇంత జరుగుతుందంటే జాలిగా ఉందని వెటకారంగా అంటుంది జ్యోత్స్న. నీ కూతురు ప్రాణాలు పోకుండా కాపాడుకో అని పొగరుగా చెబుతుంది. మళ్లీ కలుద్దాం.. అప్పటికీ నీ గుండె ఆగిపోకుండా ఉంటే జ్యోత్స్న అంటుంది.
గుండెలవిసేలా ఏడ్చేసిన దీప
జ్యోత్స్న మాటలతో దీప షాక్ అవుతుంది. కింద కుప్పకూలి గట్టిగా ఏడుస్తుంది. గుండెలవిసేలా రోదిస్తుంది. కార్తీక్ ఇటీవల చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ కావాలనే నిజం దాచాడని దీపకు అర్థమై బాధడుతుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 27) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం