Karthika Deepam January 21st Episode: దాసును చంపేందుకు మళ్లీ ప్రయత్నించి వణికిపోయిన జోత్స్న.. నిజాలు తెలుస్తాయన్న దశరథ్
Karthika Deepam Today Episode January 21: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దాసు పరిస్థితిపై పారిజాతం మరింత బాధపడుతుంది. దాసును చంపేందుకు మరోసారి ప్రయత్నించి భయపడుతుంది జ్యోత్స్న. కార్తీక్, దీపకు అనుమానం వస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (జనవరి 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దాసుకు గాయమై ఉలుకూ పలుకూ లేకుండా ఉండడం చూసి పారిజాతం బాధపడుతుంది. ఈ గతి పట్టిదేంటి అని కన్నీరు పెట్టుకుంటుంది. నిన్ను కొట్టిన వారికి పోయే కాలం రావాలంటూ శాపనార్థాలు పెడుతూనే ఉంటుంది. తిడితే బాబాయికి నయం అవుతుందా గ్రానీ అని దాసుపై దాడి చేసిన జ్యోత్స్న అంటుంది. వరసలు బాగానే గుర్తున్నాయే అని వెటకారంగా అంటాడు కార్తీక్. జ్యోత్స్న కూడా కౌంటర్ ఇస్తుంది. గోల ఆపాలని ఏడుస్తూనే అరుస్తుంది పారిజాతం.
కాశీ మాటలతో జ్యోత్స్నలో భయం
నాన్న దాసుకు ఎలాంటి ప్రమాదం లేదని పారిజాతంతో కాశీ చెబుతాడు. “నానమ్మ… ఇప్పుడు నాన్నకు ఏ ప్రమాదం లేదు. ఈ మాట డాక్టర్ కాన్ఫిడెంట్‍గా చెప్పాకే ఇంటికి తీసుకొచ్చాం. అప్పుడప్పుడు స్పృహలోకి వస్తున్నాడంట. రెస్ట్ ఇవ్వమన్నారు” అని కాశీ అంటాడు. దాసు స్పృహలోకి వస్తున్నాడనే మాటతో జ్యోత్స్న భయపడుతుంది. నా మాలోకం కొడుకుకు చీమకు కూడా హానీ చేయని మనిషి, అలాంటి వారిని కొట్టారంటే వారు మనుషులేనా అని పారిజాతం బాధపడుతుంది.
దాసును దగ్గరే జ్యోత్స్న
చుట్టూ గుమిగూడి మాట్లాడితే నాన్న డిస్ట్రబ్ అవుతారని, బయటికి వెళదామని కాశీ అంటాడు. అందరం రూమ్ నుంచి వెళదామని చెబుతాడు. అయితే, తాను ఇక్కడే ఉంటానని జ్యోత్స్న అంటుంది. నువ్వెందుకు అక్కా అని కాశీ అడిగితే.. చంపడానికి అంటూ మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఉంటానంటోందని కదా.. ఉండనీ, మనం వెళదామని పారిజాతం ఏడుస్తూనే చెబుతుంది. బాధపడుతున్నట్టుగా జ్యోత్స్న నటిస్తుంది. “నీకు తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడు అర్థమైందే” అని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత అందరూ బయటికి వెళ్లగా.. గదిలో దాసు పక్కన జ్యోత్స్న ఒక్కటే ఉంటుంది.
నువ్వు లేస్తే నేను జైలుకే
దీపనే అసలు వారసురాలు అనే నిజం చెప్పే వెళతానని దాసు చెప్పిన మాటలను, తాను కొట్టిన విషయాలను జ్యోత్స్న గుర్తు చేసుకుంటుంది. “నా ప్రియమైన తండ్రి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నావా. నిన్ను అక్కడే కొంచెం గట్టిగా కొట్టి ఉంటే ఇప్పటికి నీ శవం ఎర్రగడ్డ శ్మశానంలో కాలుతూ ఉండేది. నువ్వు కళ్లు తెరిచావంటే దీపే శివన్నారాయణ అసలు వారసురాలు అని చెబుతావ్. అక్కడితో ఆగకుండా నిన్ను చంపాలనుకుంది నేను అని కూడా చెబుతావ్. వారసురాలు కానందుకు నన్ను బయటికి గెంటుతారు.. నిన్ను చంపాలనుకున్నందుకు జైలుకు పంపుతారు. ఇవన్నీ జరగకూడదంటే నివ్వు బతకకూడదు” అని కసిగా జ్యోత్స్న అంటుంది. నీ చూవే అన్ని సమస్యలకు సొల్యూషన్ అని అనుకుటుంది.
దాసును చంపేందుకు మరో ప్రయత్నం
దాసును తలపై రాడ్‍తో కొట్టి ప్రస్తుత పరిస్థితికి కారణమైన మరోసారి చంపేందుకు ప్రయత్నిస్తుంది. చుట్టూ ఎవరూ చూడడం లేదు కదా అని చూస్తుంది. ఆ తర్వాత దిండు చేతులో పట్టుకొని దాసుకు ఊపిరాడకుండా చేసి చంపాలని అనుకుంటుంది. చేతిలో దిండు పట్టుకొని చుట్టూ చూస్తుంది. వాళ్లు వచ్చేలోపు నీ ఊపిరి ఆపేయాలని అనుకుంటుంది. ముఖంపై దిండు పెట్టేందుకు చిన్నగా ముందుకు వస్తుంది.
కళ్లు తెరిచిన దాసు.. వణికిన జ్యోత్స్న
ఇంతలో దాసు సడెన్‍గా కళ్లు అలా తెరుస్తాడు. దీంతో భయంతో గట్టిగా కేక పెడుతుంది జ్యోత్స్న. వణికిపోతుంది. దీంతో అందరూ గదిలోకి వస్తారు. ఏమైందని జ్యోత్స్నను అడుగుతారు. బాబాయి కళ్లు తెరిచాడని అంటుంది. దీంతో నాన్న నా మాటలు వినిపిస్తున్నాయా అంటూ కాశీ బాధపడతాడు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయని డాక్టర్ చెప్పారు కదా.. బాధపడితే ఎలా చెప్పు అని కార్తీక్ సముదాయిస్తాడు.
దీప, స్వప్న ప్రశ్నలు
బాబాయి కళ్లు తెరిస్తే సంతోషించాలే కానీ.. ఎందుకు భయపడ్డావని జ్యోత్స్నను దీప ప్రశ్నిస్తుంది. దీంతో ఏం లేదంటుంది జ్యోత్స్న. దిండు ఎందుకు కిందపడిందని స్వప్న అనుమానంగా అడుగుతుంది. తల కింద పెడదామని తీశానని, కళ్లు తెరిచే సరికి ఉలికి పడటంతో చేయి జారికిందపడిందని కవర్ చేస్తుంది జ్యోత్స్న. అలవాటు లేని పనులు చేస్తే ఇలానే ఉంటుందని కార్తీక్ అంటే.. “కొన్ని ప్రేమలు నీకు అర్థం కావులేరా” అని పారిజాతం అంటుంది. అంత పెద్ద మాట వద్దులే పారు.. కొత్త వాళ్లు వింటే నిజం అనుకుంటారంటూ మళ్లీ వెటకరిస్తాడు కార్తీక్. మాకు బాధ్యత ఉందని జ్యోత్స్న అంటుంది.
ఇంటికి తీసుకెళ్లాలన్న ప్లాన్ ఫెయిల్
తమ ఇంటికి తీసుకెళితే దాసును చంపడం సులువు అవుతుందని జ్యోత్స్న అనుకుటుంది. అందుకే దాసును ఇంటికి తీసుకెళదాం గ్రానీ అని పారిజాతంతో చెబుతుంది. మీ ఇంటికి ఎందుకు అని కాశీ ప్రశ్నిస్తాడు. “మీ ఇంటికి దగ్గరైతే చంపేందుకు కుదరడం లేదు. అలాగని వీడిని వదిలేస్తే కళ్లు తెరుస్తాడు. నిజం చెబుతాడు. అప్పుడు నేను చావాలి” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. తాతను దృష్టిలో పెట్టుకొనే ఈ మాట అంటున్నావా అని కార్తీక్ ప్రశ్నస్తే.. మా తాత నా మాట కాదనడు అని అంటుంది. వెనకేసుకొచ్చి ఎద్దులా తయారు చేశాడని చిన్నగా అంటాడు కార్తీక్. ఏంటన్నావంటే మాట దాటేస్తాడు. దాసును తీసుకెళితే మీ తాత శివన్నారాయణ అసలు ఒప్పుకోడని, చెంబెడు నీళ్లు నెత్తినపోసుకొని భార్య, మనవరాలు చచ్చిందని అంటాడని పారిజాతం అంటుంది. నాన్నను నేను ఎక్కడికీ పంపను.. నేనే చూసుకుంటానని కాశీ అంటాడు. బయలుదేరాలని పారిజాతానికి చెబుతాడు. దీంతో జ్యోత్స్న ప్లాన్ ఫెయిల్ అవుతుంది.
త్వరగా కోలుకోరా.. నీకు ఏమైనా అయితే తట్టుకోలేమని పారిజాతం కన్నీరు పెట్టుకుంటుంది. ఏం కాదులే పదా అని కాశీ అంటాడు. దీంతో పారు, జ్యోత్స్న వెళ్లిపోతారు. కార్తీక్, దీప కూడా వారి ఇంటికి బయలుదేరతారు. దాసుకు ఏం కాదని స్వప్నకు దీప ధైర్యం చెబుతుంది.
డాక్టర్‌కు థ్యాంక్స్ చెప్పిన దశరథ్
దాసు విషయంలో నిజం దాచిన తన డాక్టర్ ఫ్రెండ్‍కు ఫోన్ చేసి థ్యాంక్స్ చెబుతాడు దశరథ్. దాసు ఏ క్షణమైనా స్పృహలోకి రావొచ్చని డాక్టర్ చెబుతాడు. ఈ విషయంలో ఎవరు ఏం అడిగినా తెలియదని చెప్పాలని దశరథ్ అంటాడు. ఇంతలో జ్యోత్స్న, పారిజాతం ఇంటికి వచ్చేస్తారు. దాసు ఎలా ఉన్నాడని పారిజాతాన్ని దశరథ్ అడుగుతాడు. ఎవరికీ అన్యాయం చేసి ఎరగని దాసును ఎవరో చంపబోయారంటూ అంటూ బాధగా చెబుతుంది పారిజాతం. ఏంటతయ్యా అని షాక్ అవుతుంది సుమిత్ర.
దశరథ్ మాటలతో జ్యోత్స్న కంగారు
“మమ్మీ.. గ్రానీ అన్నీ అలానే చెబుతుంది. అతను ఎక్కడో తాగి కిందపడి ఉంటాడు. తలకి దెబ్బ తగిలిగింది. ఎవరో ఆసుపత్రిలో జాయిన్ చేశారు” అని సుమిత్రతో జ్యోత్స్న అంటుంది. దాసుకు మంది తాగే అలవాటు లేదమ్మా అని దశరథ్ అంటాడు. అవి కొట్టిన దెబ్బల్లాగే ఉన్నాయని డాక్టర్ కూడా చెప్పాడంట అని పారిజాతం అంటుంది. దాసును కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని సుమిత్ర అంటుంది. “ఏమో సుమిత్ర.. ఎవరి ఆలోచనల వెనుక ఎలాంటి నిజాలు ఉన్నాయో.. ఎలాంటి కుట్రలు ఉన్నాయో మనం అంచనా వేయలేం కదా” అని దశరథ్ అంటాడు. దీంతో జ్యోత్స్న మళ్లీ కంగారు పడుతుంది. “నేను తప్పు చేయడం వల్ల డాడీ మాటలు నాకు సింక్ అవుతున్నాయా. లేదా సింక్ అయ్యేలా మాట్లాడుతున్నాడా” అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది.
అప్పుడు నిజాలన్నీ బయటికి వస్తాయి
దాసుకు శత్రువులు ఎవరుంటారు అని పారిజాతం అంటుంది. “నీ కొడుకుకు శత్రువు నా కూతురే పిన్ని. నిజం తెలిస్తే తట్టుకోలేవు” అని మనసులో అనుకుంటాడు దశరథ్. జ్యోత్స్నను చూసి దాసు కళ్లు తెరిచాడని పారిజాతం చెబుతుంది. జ్యోత్స్న గట్టిగా అరిచిందని, దాసు మళ్లీ కళ్లు మూసేశాడని అంటుంది. “ఏం జ్యోత్స్న.. దాసు కళ్లు తెరిస్తే నువ్వెందుకు ఉలిక్కిపడ్డావ్” అని అనుమానంగా ప్రశ్నిస్తాడు దశరథ్. ఉన్నట్టుండి కళ్లు తెరిస్తే భయపడరా ఏంటీ అని ఎదురిస్తుంది జ్యోత్స్న. “ఆ మనిషి ఈరోజు కాకపోతే రేపైనా కళ్లు తెరుస్తాడు జ్యోత్స్న. అప్పుడు నిజాలన్నీ బయటికి వస్తాయి” అని దశరథ్ అంటాడు. అనుకోకుండా సింక్ అవుతోందా.. కావాలనే అంటున్నాడా అని మరోసారి అనుమానిస్తుంది జ్యోత్స్న. నిజాలు ఏంటి అని సుమిత్ర అడిగితే.. మనకు తెలియని నిజాలు అని దశరథ్ అంటాడు. దాసును ఎవరో కొట్టారని పిన్ని అంటోంది.. కిందపడ్డాడని జ్యోత్స్న అంటోందని, దాసను స్పృహలోకి వస్తేనే కదా నిజం తెలిసేదని అంటాడు.
తొందరలోనే దాసు కోలుకుంటాడని, అప్పుడు వెంటనే వాడిని ఇదే అడుగుతానని పారిజాతం అంటుంది. దీంతో అలసిపోయావు కదా.. రెస్ట్ తీసుకో అని పారిజాతాన్ని తీసుకెళుతుంది జ్యోత్స్న. నిజం తెలిసిందా అన్నట్టు దశరథ్ వైపు అనుమానంగా చూస్తూ వెళుతుంది. దాసును ఎవరు కొట్టారో ఏంటో అని సుమిత్ర అనుకుంటుంది. కొట్టింది మన కూతురే సుమిత్రా.. ఈ నిజం ఇప్పుడే బయటపడడం మంచిది కాదు అని దశరథ్ మనసులో అనుకుంటాడు. దాసు స్పృహలోకి వస్తే.. జ్యోత్స్న ఎందుకు చంపాలనుకుందో నిజం బయటికి వస్తుందని, అప్పటి వరకు తాను వేచిచూడాల్సిందే ఆలోచిస్తాడు.
కార్తీక్, దీపకు అనుమానం
మామయ్యకు తగిలిన దెబ్బల గురించి నీకేమైనా అనుమానం ఉందా అని దీపను కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్న ప్రవర్తన మీద అనుమానం ఉందని, కానీ దాసును కొట్టేందుకు ఆమెకు అవసరం ఏంటని మనసులోనే దీప అనుకుంటుంది. బాబాయికి యాక్సిడెంట్ అయిందనుకుంటున్నారా.. ఎవరైనా కొట్టారనుకుంటున్నారా అని కార్తీక్‍ను దీప అడుగుతుంది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదని కార్తీక్ అంటాడు. దెబ్బ గురించి కార్తీక్ అనుమానాలు వ్యక్తం చేస్తాడు. యాక్సిడెంట్ కాదనేలా మాట్లాడతాడు. పోలీసు ఎంక్వైరీ జరుగుతోందని, ఒక్కోసారి చిన్న విషయం కూడా పెద్దగా కనిపిస్తోందని అంటాడు. లోబీపీకి కిందపడి చనిపోయిన వారి విషయాలు కూడా తనకు తెలుసని చెబుతాడు. కాశీ అదృష్టం, మామయ్యకు ఏమీ కాలేదని అంటాడు.
ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నా
ఇంతలో శౌర్య విషయం చెప్పేందుకు డాక్టర్ నుంచి కార్తీక్‍కు కాల్ వస్తుంది. స్పెషలిస్ట్ వచ్చారని, ఆసుపత్రికి రావాలని డాక్టర్ చెబుతాడు. ఎవరని అడిగితే.. ఫ్రెండ్ అని దీపకు అబద్దం చెబుతాడు కార్తీక్. ఫోన్ వచ్చిన ప్రతీసారి కార్తీక్ బాబు కంగారు పడుతున్నాడని, ఏమైనా దాస్తున్నారా అని మరోసారి అనుమానపడుతుంది దీప. “ఆ రూ.5లక్షలు వ్యాపారం కోసమేతే మళ్లీ వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు” అని ఆలోచిస్తుంది. ఆటోలో దీపను ఇంటికి పంపిస్తాడు కార్తీక్. “నీ అనుమానాలన్నీ నిజమే దీప.. కానీ ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నా. ఏదో రోజు తెలియాల్సిందే. ఆ తెలిసే రోజు వరకైనా నువ్వు ప్రశాంతం ఉంటావ్. ఈలోగా శౌర్యకు ఆపరేషన్ అయిపోతే ఏ బాధలు ఉండవు. ఇప్పుడు ఆ స్పెషలిస్ట్ ఏమంటారో” అని కార్తీక్ అనుకుంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 21) ముగుస్తుంది.
సంబంధిత కథనం