Karthika Deepam January 15th Episode: దిక్కుతోచని స్థితిలో కార్తీక్.. గట్టిగా ఫిక్స్ అయిన దాసు.. తలపై బాదిన జ్యోత్స్న
Karthika Deepam 2 January 15th Episode: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో శౌర్య గురించి డాక్టర్ చెప్పిన విషయంతో కార్తీక్ దిక్కుతోచని పరిస్థితుల్లో పడతాడు. నిజం చెప్పేందుకు దాసు గట్టిగా నిర్ణయించుకుంటాడు. జ్యోత్స్న అడ్డుకుంటుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (జనవరి 15) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీప టిఫిన్ బండిని జ్యోత్స్న తగులబెట్టినందుకు ఏమవుతుందోనని పారిజాతం కంగారు పడుతుంది. ఇలా ఎందుకు చేశావని జోత్స్నను ప్రశ్నిస్తుంది. “చెంపదెబ్బతో వదిలేశారు కాబట్టి సరిపోయింది. వాళ్లు ఇంటికి వచ్చి గొడవ చేస్తే” అని అరుస్తుంది. ఈ ఆస్తి అంతా చేజిక్కే వరకు ఓపికగా ఉండమంటే.. అది కూడా చేతకావడం లేదు అని పారు గాబరా పడుతుంది. అసలు వారసురాలు ఇక్కడే ఉందని, అదే తన భయం అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

రాత్రివేళ శివన్నారాయణ ఇంటికి దాసు
దీపే వారసురాలు అనే నిజం చెప్పేందుకు దాసు గట్టిగా నిర్ణయించుకుంటాడు. దీప బండిని జ్యోత్స్న నాశనం చేయించిందని తెలియడంతో కోపంగా ఉంటాడు. దీపనే మీ కూతురు అని దశరథ్‍తో చెప్పేందుకు రాత్రి శివన్నారాయణ ఇంటికి వెళతాడు దాసు. దాసు ఎవరితో నిజం చెబుతాడోననే భయం ఉందని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇంతలోనే దాసు ఇంట్లో అడుగుపెడతాడు. “నిజం చెప్పేందుకు మధ్యాహ్నం నుంచి ఇంటి చుట్టే తిరుగుతున్నా. శివన్నారాయణ చూస్తే లోపలికి రానివ్వరు. పోనీ నిజం చెప్పినా నా మాట నమ్మడు. నేరుగా సుమిత్ర వదినకు గానీ, దశరథ్ అన్నయ్యకు గానీ నిజం చెప్పేస్తాను” అని దాసు అనుకుంటాడు.
అరిచేసిన శివన్నారాయణ
రాత్రివేళ దాసును ఇంట్లో చూస్తాడు శివన్నారాయణ. అగు అక్కడ అని గట్టిగా అరుస్తాడు. దీంతో తాత ఎవరినో అరుస్తున్నాడని జ్యోత్స్న అక్కడికి వెళుతుంది. ఈ టైమ్‍లో ఎందుకొచ్చావ్ దొంగతనానికా అని దాసుపై ఫైర్ అవుతాడు శివన్నారాయణ. ఎందుకొచ్చావ్ దాసును నానా మాటలు అంటాడు. వాడు నా కోసమే వచ్చాయని పారిజాతం అంటుంది. తాను దశరథ్ అన్నయ్య కోసం వచ్చానని దాసు బదులిస్తాడు. దీప గురించి నిజం చెప్పేందుకే దాసు వచ్చాడని జ్యోత్స్న హడలిపోతుంది. ఇంతలో దశరథ్ అక్కడికి వస్తాడు. నీ మాట్లాడడానికి వచ్చాను అని దాసు అంటాడు. అయితే, శివన్నారాయణ అవకాశం ఇవ్వడు. బయటికి వెళ్లిపోవాలని గట్టిగా చెబుతాడు. దీంతో దాసు వెనుదిరుగుతాడు. జ్యోత్స్న వైపు కోసంగా చూస్తాడు. ఈసారి కలిసినప్పుడైనా నిజం అడగాలని సుమిత్ర అనుకుంటుంది.
మళ్లీ పడిపోయిన శౌర్య
కార్తీక్, దీప బల్లపై టిఫిన్స్ అమ్ముకుంటూ ఉంటే శౌర్య ఆ పక్కనే ఆడుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో కళ్లు తిరిగి కిందపడిపోతుందని శౌర్య. దీంతో పరుగెత్తుకుంటూ వస్తాడు కార్తీక్. ఏం జరిగిందోనని కంగారు పడతాడు. దీప కూడా శౌర్యకు ఏమైందని ఏడ్చేస్తుంది. కళ్లు తిరిగి ఉంటాయని కార్తీక్ అంటాడు. ట్యాబ్లెట్స్ వేసినా మళ్లీ పడిపోవడం ఏంటి.. గుండె సమస్య మళ్లీ రివర్స్ అయినట్టు ఉందని కార్తీక్ ఆందోళన చెందుతాడు. ఇంతలో కళ్లు తెరుస్తుంది శౌర్య.
డాక్టర్ మాటతో.. ఆందోళనలో కార్తీక్
శౌర్యను ఆసుపత్రికి తీసుకెళతానంటాడు కార్తీక్. దీప వస్తానంటే వద్దంటాడు. కంగారు పడొద్దని, శౌర్యకు ఏం కాదని దీపకు ధైర్యం చెబుతాడు. శౌర్యకు పరీక్షలు చేస్తాడు డాక్టర్. సూది వేయించుకునేందుకు శౌర్య భయపడితే.. నా కళ్లలోకి చూడాలని కార్తీక్ అంటాడు. పాత డాక్టర్ ఎక్కడ అని శౌర్య ప్రశ్నిస్తుంది. శౌర్యకు ఎలా ఉందోనని దీప కంగారుతో కార్తీక్‍కు ఫోన్ చేస్తుంది. ఓసారి కట్ చేయటంతో ఆందోళన చెందిన దీప మళ్లీ కాల్ చేస్తుంది. జనాలు ఎక్కువగా ఉండటంతో కట్ చేశానని, శౌర్య బాగానే ఉందని కార్తీక్ చెబుతాడు. నిజం దాచేస్తాడు.
ఆ తర్వాత కార్తీక్‍కు అసలు విషయం చెబుతాడు డాక్టర్. శౌర్యకు మందుల ద్వారా ఇది తగ్గదని, సర్జరీ చేయాల్సిందేనని చెబుతాడు. దీంతో కార్తీక్ మరింత కంగారు పడతాడు. సర్జరీ చేయకపోతే పాప గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదని డాక్టర్ చెబుతాడు. పెద్దగా టైమ్ లేదని చెప్పేస్తాడు. వీలైనంత త్వరగా ఆసుపత్రిలో పాపను జాయిన్ చేయాలని చెబుతాడు. దీంతో కార్తీక్‍లో ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది.
సర్జరీకి రూ.50లక్షలు.. దిక్కుతోచని స్థితిలో కార్తీక్
సర్జరీకి ఎంత ఖర్చవుతుందని అడుగుతాడు కార్తీక్. రూ.50లక్షలు అవుతుందని డాక్టర్ చెబుతాడు. దీంతో రూ.50లక్షలా అంటూ దిక్కుతోచని స్థితిలో కార్తీక్ పడతాడు. బాధగా సరే డాక్టర్ అని అంటాడు. ముందుగా రూ.5లక్షల జాయినింగ్ ఫీజ్ కడితే చికిత్స స్టార్ట్ చేస్తామని డాక్టర్ చెబుతాడు. ఏం చేయాలో పాలుపోక బాధపడతారు కార్తీక్. మనం ఇంకా ఇంటికి వెళ్లలేదా అంటూ ఇంతలోనే శౌర్య పిలుస్తుంది. వెళ్లిపోదాం.. డాక్టర్ ఏదో చెబుతుంటే వింటున్నానని కార్తీక్ అంటాడు. సరే డాక్టర్.. ఫోన్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్.
దాసు మరో ప్రయత్నం
ఎలాగైనా నిజం చెప్పేయాలని శివన్నారాయణ ఇంటికి మరోసారి వచ్చేస్తాడు దాసు. ఇంతలో శివన్నారాయణ, సుమిత్ర బయటికి వెళ్లడం చూస్తాడు. వారిద్దరూ గుడికి వెళుతుంటారు. కారులో వారు బయటికి వెళ్లగానే.. దాసు లోపలికి వచ్చేస్తాడు. దాసు వస్తాడేమోనని కంగారు పడుతున్న జ్యోత్స్న ఇది చూస్తుంది. మమ్మీతో దాసును మాట్లాడనివ్వకూడదని అని అనుకుంటుంది. సుమిత్ర బాత్‍రూమ్‍లో ఉండగా.. రూమ్ లాక్ చేసేస్తుంది.
మళ్లీ ప్రాధేయపడిన జ్యోత్స్న
అన్నయ్యకి, వదినకు జరిగినదంతా చెప్పేస్తానని దాసు అనుకుంటాడు. కంగారుగా దాసు దగ్గరికి వస్తుంది జ్యోత్స్న. నాన్న నువ్వు ఎప్పుడొచ్చావ్ అని జ్యోత్స్న అంటే.. డోర్ ఎందుకు లాక్ చేశావని గట్టిగా అరుస్తాడు దాసు. లోపల ఎవరున్నారని అంటాడు. రాత్రి నేను ఎందుకు వచ్చానో నీకు అర్థమైంది కదా.. అందుకే వచ్చానని అరుస్తాడు. దాసును బయటికి తీసుకెళుతుంది జ్యోత్స్న. చెప్పనని మాటిచ్చావ్ కదా అని అంటుంది. కానీ నువ్వు దీప బతుకుదెరువును తగులబెట్టావ్ కదా.. అని దాసు కోపంగా అంటాడు. అబద్ధమని కవర్ చేసేందుకు జ్యోత్స్న ప్రయత్నిస్తే.. మోసం చేసిందని చాలని దాసు అంటాడు. దీపే ఈ ఇంటి అసలైన వారసురాలని, నువ్వు నా కూతురివని తప్పకుండా నిజం చెప్పేస్తానంటాడు. ఈ ఒక్క తప్పుకు క్షమించు నాన్న అని జ్యోత్స్న ప్రాధేయపడుతుంది. ఇక్కడి నుంచి వెళ్లిపో అని కన్నీరు పెట్టుకుంటుంది.
దాసు తలపై కొట్టిన జోత్స్న.. చూసేసిన దశరథ్
నిజం చెబితే తాను చస్తానని దాసును మరోసారి బెదిరిస్తుంది జోత్స్న. అయినా సరే చెబుతానంటాడు దాసు. దీంతో తన అసలు రూపాన్ని బయటికి తీస్తుంది జ్యోత్స్న. డోర్ ఎవరు లాక్ చేశారని సుమిత్ర అనుకుంటుంది. నీ కూతురు చచ్చినా పర్లేదా నీకు అని దాసుతో జ్యోత్స్న అంటుంది. ఎమోషనల్ బ్లాక్‍మెయిల్ చేసి ప్రతీసారి అపుతున్నావని, ఈసారి చెప్పేస్తానని అంటాడు. ఇంకో అవకాశం ఇవ్వాలని జ్యోత్స్న అడిగితే ఇవ్వనని గట్టిగా చెప్పేస్తాడు. జ్యోత్స్నను పక్కకు తోసేసి.. నిజం చెబుతానని ఇంట్లోకి వెళ్లేందుకు దాసు సిద్ధమవుతాడు. ఇంతలో వెనుక నుంచి దాసు తలపై గట్టిగా కర్రతో కొడుతుంది జ్యోత్స్న. అన్నయ్య అని అరుస్తూ అల్లాడిపోతాడు దాసు. ఇది చూసి దాసు అని దశరథ్ అంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 15) ఎపిసోడ్ ముగిసింది. దాసును చూసిన దశరథ్.. కొట్టిన జ్యోత్స్నను కూడా చూశాడో లేదో తదుపరి ఎపిసోడ్‍లో తెలియనుంది.
సంబంధిత కథనం