Karthika Deepam January 1 Episode: జ్యోత్స్నను నిలదీసిన పారిజాతం.. అబద్ధంతో మరింత అనుమానం.. దీపతో కస్టమర్ దురుసుగా..
Karthika Deepam 2 Today Episode January 1, 2025: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. చనిపోతానని జ్యోత్స్న బెదిరించడంతో నిజం చెప్పకుండా మళ్లీ వెనక్కి తగ్గాడు దాసు. ఇదంతా దూరం నుంచి చూసిన పారిజాతం.. జ్యోత్స్నను నిలదీస్తుంది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (జనవరి 1, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీపే అసలైన వారసురాలు అనే నిజం చెబితే తాను చనిపోతానని దాసును జ్యోత్స్న బెదిరిస్తుంది. కాళ్లపై పడి బతిమాలుతున్నట్టు నటిస్తుంది. కానీ మౌనంగానే ఉంటాడు దాసు. “సరే నాన్న నువ్వు నా మాట వినవని అర్థమైంది. మమ్మీ లోపలే ఉంది నువ్వు వెళ్లే లోపు లోపు నేను చచ్చిపోతా” అని వెళ్లేందుకు జ్యోత్స్న సిద్ధమవుతుంది.
దీపకు న్యాయం చేసే పనిలోనే ఉన్నా
జ్యోత్స్న చస్తానని బెదిరించడంతో దాసు మరోసారి నిజం చెప్పకుండా వెనక్కి తగ్గుతాడు. “కన్నకూతురిని చంపుకునేంత దుర్మార్గుడు కాదమ్మా నీ తండ్రి. నువ్వు లోపలికి వెళ్లు. నేను బయటికి వెళతా” అని దాసు అంటాడు. దీప జీవితానికి దేవుడే న్యాయం చేయాలని అనుకుంటాడు. దీపకు నేనే న్యాయం చేస్తా.. అదే పనిలో ఉన్నా అని మనసులో కసిగా అనుకుంటుంది జ్యోత్స్న. దీపను చంపేసి న్యాయం చేస్తాననే అర్థంలో ఇలా అనుకుంటుంది. ఇదంతా దూరం నుంచి పారిజాతం చేస్తుంటుంది. నా దగ్గర మనవరాలు ఏదో దాస్తోంది.. అదేంటో తెలుసుకోవాలని పారిజాతం అనుకుంటుంది.
మారాం చేసిన శౌర్య.. సర్దిచెప్పిన కార్తీక్
నిద్రపోకుండా ఓ చోట దిగులుగా కూర్చొని ఉంటుందని శౌర్య. పడుకోకుండా ఏం చేస్తున్నావని దీప అడుగుతుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు. మన ఇంట్లో మంచి బెడ్ ఉండేదని, ఇక్కడ లేదని, దోమలు కూడా చెవి దగ్గర అరుస్తున్నాయని శౌర్య అంటుంది. తనకు ఇక్కడ నచ్చడం లేదని, మనం ఇంటి మన ఇంటికి వెళ్లిపోదామంటుంది. ఊర్లో ఉన్నప్పుడు కిందే పడుకునే వాళ్లమని శౌర్యతో దీప కోపంగా అంటుంది. దీంతో కార్తీక్ ప్రేమతో శౌర్యను బుజ్జగిస్తాడు. మేడపైకి తీసుకెళ్లి చందమామ, నక్షత్రాలను చూపిస్తాడు. మన ఇంట్లో ఇలా కనిపించేవి కాదని, ఇక్కడ కనిపిస్తున్నాయని అంటాడు. దీంతో ఈ ఇల్లే బాగుందని శౌర్య కూడా ఆనందిస్తుంది. అమ్మకు సారీ చెప్పాలని కార్తీక్ అంటాడు. సారీ అమ్మా.. మళ్లీ ఎప్పుడు అలా అడగని శౌర్య అంటుంది. పడుకునేందుకు వెళుతుంది.
పిల్లలు మనల్ని కాకపోతే ఎవరిని అడుగుతారు.. మన పరిస్థితి బాగుపడే వరకు ఏదో ఒకటి చెప్పి సర్దిచెప్పాలని దీపతో కార్తీక్ అంటాడు. “మీ లాంటి మంచి తండ్రి ఉంటే పిల్లలకు ఏ కష్టం రాదు బాబు.. ఇదంతా నేను, నా కూతురు చేసుకున్న అదృష్టం” అని దీప మనసులో అనుకుంటుంది.
జ్యోత్స్నను నిలదీసిన పారిజాతం
జ్యోత్స్న నిద్రించేందుకు రెడీ అవుతుంటే బెడ్‍రూమ్‍లోకి వెళుతుంది పారిజాతం. టిఫిన్ సెంటర్ జరిగిన దానికి నువ్వు నిద్రపోవేమో అనుకున్నానని అంటుంది. నిద్రపోకుంటే ఏమైనా మారుతుందా అని జ్యోత్స్న ఎదురు ప్రశ్న వేస్తుంది. “ఏం చేస్తుందో మారుతుందో మీ నాన్నను సలహా అడుగుదామా” అని వెటకారంగా పారు అంటుంది. డాడీ (దశరథ్)కు కూడా అన్నీ తెలుసు కదా అని జ్యోత్స్న అంటుంది. “నేను చెప్పింది ఈ డాడీ గురించి కాదు.. మీ నాన్న దాసు గురించి” అని పారిజాతం అనడంతో.. కోపం లేస్తుంది జ్యోత్స్న.
అతడు మా నాన్న కాదు.. నీ కొడుకని నీకు ఎన్నిసార్లు చెప్పాలని జ్యోత్స్న ఆగ్రహిస్తుంది. “పిలుపుకు నాన్న అని ఒప్పుకోవు కానీ.. కాళ్లయితే పట్టుకుంటావేమో” అని పారిజాతం అంటుంది. కాళ్లు పట్టుకోవడం ఏంటని జ్యోత్స్న అంటే.. తాను అంతా చూశానంటుంది. దాసు ఏం చెప్పాడో అర్థం కాలేదు కానీ.. నువ్వైతే వాడిని ప్రాధేయపడుతూ కాళ్లు పట్టుకున్నావని అడుగుతుంది. దాసు మాటలు పారిజాతం వినలేదని, విని ఉంటే దీపే వారసురాలు అని తెలిసి ఉండేదని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. “వాడి మాట అంటే మండిపడే నువ్వు వాడితో ఏం మాట్లాడుతున్నావ్. వాడి కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్” అని పారిజాతం నిలదీస్తుంది. దాసుకు ఫోన్ చేసి అడగనా అని ప్రశ్నిస్తుంది. వాడి కళ్లు ఎందుకు పట్టుకున్నావ్ అని మళ్లీ అడుగుతుంది.
జ్యోత్స్న అబద్ధం
పారిజాతానికి జ్యోత్స్న అబద్ధం చెబుతుంది. “ఏం లేదు గ్రానీ.. నన్ను పట్టుకొని నాన్న అని ఒకసారి పిలవమన్నాడు.. నేను పిలువను అన్నాను. పిలవకపోతే నువ్వే నా కూతురు అని సుమిత్రకు చెబుతానని అన్నాడు. చెప్పొద్దని కాళ్లు పట్టుకున్నా.. అంతే” అని జ్యోత్స్న కవర్ చేస్తుంది. ఏదో దాస్తోంది.. దాసును అడిగినా చెప్పడు అని పారిజాతంలో అనుమానం మరింత పెరుగుతుంది. పారుకు అనుమానం ఎక్కువైందని జ్యోత్స్న అనుకుంటుంది.
బండిపై ప్రేమ
టిఫిన్ బండికి కవర్ కప్పేందుకు దీప నిద్ర లేస్తుంది. ఇది చూసి కార్తీక్ కూడా వెళతాడు. దీప కష్టపడుతుంటే సాయం చేస్తాడు. ఇద్దరూ కలిసి బండికి కవర్ కప్పి.. తాడుతో కడతారు. నిద్రపోకుండా వచ్చి బండికి ఇది కప్పాల్సిన అవసరం ఏంటని దీపను కార్తీక్ ప్రశ్నిస్తాడు. “ఇది బండి కాదు బాబు.. మన బతుకుదెరువు.. మన జీవనాధారం,మనకు తండి పెట్టే అమ్మ” అని దీప అంటుంది. బండిపై తన ప్రేమను చెబుతుంది. సాయం చేసే మనుషులకే కృతజ్ఞత చూపించని ఈరోజుల్లో వస్తువుల పట్ల ఇంత కృతజ్ఞతతో ఉన్నావంటే హ్యాట్సాఫ్ దీప అని కార్తీక్ అంటాడు. ఇది జీవనాధారమే.. నేను అనుకున్న లక్ష్యంవైపు తొలి అడుగులు వేయించిన అమ్మ అని బండి గురించి కార్తీక్ కూడా గొప్పగా అంటాడు. దీప షీట్ కట్టింది కదా.. హాయిగా పడుకో అని బండితో మాట్లాడతాడు. నన్ను ఎగదాళి చేసేందుకు దానితో మాట్లాడుతున్నారా అని దీప అంటుంది. తాను కూడా బండితో ఎమోషనల్‍గా కనెక్ట్ అయ్యాయని, ఇది కూడా ఫ్యామిలీ మెంబర్ అయిందని అంటాడు. నిద్రపోయేందుకు వెళతారు.
ఆఫీస్‍కు వస్తానన్నా పారు.. తాతను పిలిచిన జ్యోత్స్న
జ్యోత్స్న ఆఫీస్‍కు వెళ్లేందుకు కారు డోర్ తీయగా.. ఇప్పటికే అందులో పారిజాతం ఉంటుంది. ఎక్కడికి అని జ్యోత్స్న ప్రశిస్తే.. ఆఫీస్‍కు వస్తానని పారు అంటుంది. నువ్వు ఏ తప్పులు చేయకుండా కాపాడేందుకు అని చెబుతుంది. “దాసుకు సంబంధించిన ఏదో విషయంలో నిజం దాస్తున్నావ్. అదేంటో చెప్పు కారు దిగిరిపోతా” అంటుంది పారు. ఎలా వదిలించుకోవాలని జ్యోత్స్న ఆలోచిస్తుంది. అంతలోనే తాత శివన్నారాయణను పిలుస్తుంది. దీంతో పారిజాతం కంగారు పడుతుంది. గ్రానీ కూడా ఆఫీస్‍కు వస్తానని కారు ఎక్కి కూర్చుందని తాతతో జోత్స్న చెబుతుంది. ఆఫీస్‍కు ఎందుకు అని పారిజాతాన్ని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. కారు దింపేస్తాడు. లోపలికి వెళ్లాలని గట్టిగా చెబుతాడు.
దశరథ్‍కు కూడా డౌట్
నీ కూతురికి పెళ్లయ్యే వరకు వీళ్లిద్దరినీ ఓ కంట కనిపెట్టాలని సుమిత్రతో శివన్నారాయణ చెబుతాడు. పిన్ని (పారిజాతం)ని చూస్తే నీకు ఎప్పుడూ ఏ డౌట్ రాలేదా అని సుమిత్రను దశరథ్ అడుగుతాడు. “అత్తయ్యకు వయసు తగ్గ ఆలోచనలు ఉండవు. జ్యోత్స్న ఈడు పిల్లలతో తిరగాలని అనుకుంటుంది” అని సుమిత్ర అంటుంది. అయితే, తనకు పిన్న ప్రవర్తనపై ముందు నుంచి అనుమానంగానే ఉందని, కన్నతల్లిదండ్రులైన మన కంటే ఎక్కవ కేర్ తీసుకుంటోందని అని అంటాడు. జ్యోత్స్న మైండ్‍ను డైవర్ట్ చేసేది కూడా పిన్నే అని చెబుతాడు. ఆఫీస్‍కు ఎందుకు వెళ్లాలనుకుంటోంది.. దీనిపై వెనుక ఏమైనా కారణం ఉందా అని దశరథ్ అనుంటుంది.
కస్టమర్ దురుసు ప్రవర్తన
టిఫిన్ బండికి చాలా మంది వస్తున్నారని, త్వరలో హోటల్ అయ్యేలా ఉందని కాంచన ఆనందిస్తుంది. ఇంతలోనే ఓ కస్టమర్ వస్తాడు. టిఫిన్స్ ఏమున్నాయని పొగరుగా అరుస్తాడు. దీందో దీప వెళుతుంది. ఇడ్లీ కావాలని అడుగుతాడు. దీప అతనేంటి అలా అడుగుతాడని కార్తీక్ అంటాడు. టిఫిన్ సెంటర్ అన్నాక రకరకాల వారు వస్తారని దీప సర్దిచెబుతుంది. ఇడ్లీ చల్లాగా ఉందని, వేడిగా కావాలని దురుసుగా పడేస్తాడు ఆ కస్టమర్. బజ్జీ వేడిగా ఉందని తీసుకొస్తే.. మరీ వేడిగా ఉందని, ఏం తింటారని కోప్పడతాడు. ఏంటి అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. పూరి పట్టుకురా అని మళ్లీ దురుసుగా అడుగుతాడు. ఏంటి వాడు ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడని కార్తీక్ కోపంగా చూస్తాడు. దీప సహనంగా ఉంటుంది. వాడు బాగా ఓవర్ చేస్తున్నాడు దీప అని కార్తీక్ అంటే.. తినేసి వెళ్లిపోయే వాళ్లు ఎలా ఉంటే ఏంటి అని దీప సహనంగా సమాధానం ఇస్తుంది.
టిఫిన్ బండి వైపు ఓ పాప దీనంగా చూస్తుంటుంది. దీంతో ఫ్రీగా టిఫిన్ ఇస్తానని దీప అంటుంది. టిఫిన్ పెట్టాక పని చేయాలని కొడతారని ఆ పాప భయపడుతుంది. దీంతో ఆ పాప పరిస్థితి చూసి దీప బాధపడుతుంది. ఫ్రీగానే టిఫిన్ పెడతానని, పని చేయించనని అంటుంది. టిఫిన్ ఇంటికి కట్టించాలని ఆ పాప అడుగుతుంది. మా నాన్న బాగా తాగుతాడని, నన్ను.. మా అమ్మను సరిగా చూసుకోడని ఆ పాప చెబుతుంది. వదిలేసి ఎక్కడికో వెళ్లాడని, మా అమ్మ కూడా ఏమీ తినలేదని, పొట్లం కట్టిస్తే ఇద్దరం తింటామని దీనంగా అడుగుతుంది. దీంతో దీప చాలా బాధపడుతుంది. టిఫిన్ పొట్లం కట్టి పాపకు ఇస్తుంది. దీంతో థాంక్యూ అమ్మా అని దీపను ఆ పాప హత్తుకుంటుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 1) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం