Karthika Deepam Today December 6: జ్యోత్స్నకు ప్రశ్నల వర్షం.. కాంచన ఇంటికి శివన్నారాయణ.. ఆ కండీషన్‍తో కార్తీక్ ఆగ్రహం-karthika deepam today episode december 6 shivanarayana comes kanchana house karthik fires on him star maa serieal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam Today December 6: జ్యోత్స్నకు ప్రశ్నల వర్షం.. కాంచన ఇంటికి శివన్నారాయణ.. ఆ కండీషన్‍తో కార్తీక్ ఆగ్రహం

Karthika Deepam Today December 6: జ్యోత్స్నకు ప్రశ్నల వర్షం.. కాంచన ఇంటికి శివన్నారాయణ.. ఆ కండీషన్‍తో కార్తీక్ ఆగ్రహం

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 06, 2024 07:47 AM IST

Karthika Deepam 2 Today Episode December 6: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. యాక్సిడెంట్ గురించి జ్యోత్స్నకు పశ్నలు వేస్తాడు శివన్నారాయణ. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళతాడు. శివన్నారాయణ పెట్టిన ఓ కండీషన్‍తో కార్తీక్ ఆగ్రహిస్తాడు. వాదన జరుగుతుంది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.

Karthika Deepam 2 Today December 6: జ్యోత్స్నకు ప్రశ్నల వర్షం.. కాంచన ఇంటికి శివన్నారాయణ.. ఆ కండీషన్‍తో కార్తీక్ ఆగ్రహం
Karthika Deepam 2 Today December 6: జ్యోత్స్నకు ప్రశ్నల వర్షం.. కాంచన ఇంటికి శివన్నారాయణ.. ఆ కండీషన్‍తో కార్తీక్ ఆగ్రహం

కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 6) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. యాక్సిడెంట్ అయిన జ్యోత్స్న ఎలా ఉందో అనే ఆందోళనతో పారిజాతంతో ఫోన్‍లో మాట్లాడాలనుకుంటుంది కాంచన. కాల్ చేసి కాంచనకు ఇస్తాడు కార్తీక్. కాల్ లిఫ్ట్ చేసి.. నాకెందుకు ఫోన్ చేశావ్ రా అని పారిజాతం అంటే.. ‘పిన్ని నేను” అని కాంచన అంటుంది. “మనవడు అనుకున్నాను.. కూతురివా.. ఏమ్మా కాంచన మాకు ఫోన్ చేశావేంటి” అని పారిజాతం అంటుంది.

yearly horoscope entry point

జ్యోత్స్న ఎవరు..

ఇప్పుడు జోత్స్నకు ఎలా ఉందని అని పారిజాతాన్ని కాంచన అడుగుతుంది. జోత్స్న ఎవరు అని వెటకారంగా అంటుంది పారిజాతం. నా మేనకోడలు.. నా అన్నయ్య కూతురు అని కాంచన అంటే.. ఇంకా వరసలు, మనుషులు గుర్తున్నారన్న మాట అని పారిజాతం అంటుంది. ఇలా వెటకారంగా మాట్లాడే అన్న గౌరవం పొగోట్టుకునేది అని కార్తీక్ అంటాడు. ఆ ఫోన్ పెట్టేయాలని కార్తీక్ వాదిస్తాడు. పెట్టేయండి అంటూ పారిజాతం అంటుంది. సరిగా మాట్లాడడం రాదని అనసూయ అంటే.. దమ్ముంటే ఆ మాట అన్నోళ్లకు ఫోన్ ఇవ్వాలని కోప్పడుతుంది పారిజాతం.

జ్యోత్స్నకు బాగుందని, డిశ్చార్జ్ చేశారని, ఇంట్లోనే ఉందని కాంచనతో పారిజాతం చెబుతుంది. బాగానే ఉంది కదమ్మా అని దీప అంటే.. బ్యాచ్ అంతా అక్కడే ఉన్నట్టున్నారని వెటకరిస్తుంది పారిజాతం. జ్యోత్స్నకు యాక్సిడెంట్ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు దశరథ్, సుమిత్రకు తెలియదంటుంది పారిజాతం. మాట్లాడి అలిసిపోయి ఉంటావ్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు కార్తీక్.

నీలా నేనుండలేను

జ్యోత్స్న బాగుందన్నది ఎంత సంతోషంగా ఉందో, ఈ విషయం సుమిత్రకు చెప్పలేదన్నందుకు అంతే సంతోషంగా ఉందంటుంది దీప. నువ్వు ఇంత మంచిదానివేంటి దీప.. జ్యోత్స్న చేసిన అవమానం మరిపిపోయావా అంటాడు. బంధువే కదా అని కాంచన.. నేను దీప అంత మంచివాడిని కాదని కార్తీక్ అంటాడు. అవమానాన్ని భరించలేనని చెబుతాడు. నువ్వు కూడా మారిలి దీప.. ఎవరైనా ఏదైనా అంటూ ఊరుకోవాల్సిన అవసరం లేదని చెబుతాడు.

జ్యోత్స్నకు శివన్నారాయణ ప్రశ్నలు

డిశ్చార్జ్ అయి వచ్చిన జ్యోత్స్నకు ప్రశ్నల వర్షం కురిపిస్తాడు తాత శివన్నారాయణ. నువ్వు ఇలా ఉండడం నచ్చడం లేదని చెబుతాడు. తనకు కూడా ఇలా ఉండడం ఇష్టం లేదు తాత జోత్స్న అంటే.. నచ్చినట్టు ఉండొచ్చ కదా అని శివన్నారాయణ చెబుతాడు. ఆస్తులన్నీ నీ కోసమే అని, సంతోషంగా ఉండాలని చెబుతాడు. బావ కావాలని తాను అడగడం లేదని జ్యోత్న్స చెబుతాడు.

ఆ తర్వాత యాక్సిడెంట్ గురించి వరుసగా ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు ఆసుపత్రికి ఎందుకు వెళ్లావు? అని ప్రశ్నిస్తాడు. బావ కోసం అంటుంది జ్యోత్స్న. అక్కడ యాక్సిడెంట్ ఎలా అయింది? అని శివన్నారాయణ అడుగుతాడు. కారు బ్రేక్ పడలేదు అని జోత్స్న అబద్ధం చెబుతుంది. బ్రేక్ పడిందే అనుకుందాం.. అసలు కార్తీక్‍తో ఏం మాట్లాడాలనుకున్నావ్? అని శివన్నారాయణ అడిగితే.. ఏమో తాత అని జ్యోత్స్న అంటుంది.

సందడి లేదు.. బాధగా ఉంది

అసలు నీ బాధ ఏంటో చెప్పాలని జ్యోత్న్సను శివన్నారాయణ అడుగుతాడు. దీంతో ఒకప్పుడు అత్త, బావ సహా బంధువులతో ఇళ్లు సందడిగా ఉండేదని, పండుగలా ఉండేదని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవని, ఒంటరి అయిన ఫీలింగ్ కలుగుతోందని బాధపడుతుంది. సందడి, సంతోషం ఇంటికి వదిలి దూరంగా పోయింది తాత.. మళ్లీ తిరిగి తీసుకురాగలవా అంటూ ఎమోషనల్‍గా మాట్లాడుతుంది జోత్స్న. తీసుకురావాలని అడగాలనుకుంది.. కానీ అడగను.. ఎందుకంటే అది మళ్లీ జరగదు అని అంటుంది. నన్ను నేనే మిస్ అయ్యానని అంటుంది. దీంతో ఆలోచనలో పడతాడు శివన్నారాయణ.

కాంచన ఇంటికి శివన్నారాయణ

జ్యోత్స్న అంటే తనకు ఎంత ఇష్టమో అనసూయకు కాంచన చెబుతుంది. ఎమోషనల్ అవుతుంది. అప్పుడు డోర్ బెల్ మోగుతుంది. ఈ టైమ్‍లో ఎవరొచ్చారని కాంచన అంటుంది. దీప తలుపులు తెరిచే సరికి శివన్నారాయణ కనిపిస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. నాన్న నేరుగా ఇంటికే వచ్చారంటే ఏం గొడవ జరిగిందో ఏంటో అని కాంచన అంటుంది. లోపలికి రండి తాతయ్య అని పిలుస్తుంది దీప. లోపలికి రా నాన్న అని కాంచన అంటుంది.

“నా ఇంటికి గడప తొక్కద్దని నేను అన్నాను. కానీ పరిస్థితులు నీ ఇంటికి గుమాన్ని నేను తొక్కేలా చేశాయి. బంధాలకు మనిషి ఎప్పుడు బానిసే. బంధాల కోసం తలదించుకోవడం నేర్చుకోవాలని గుణపాఠం నేర్చుకున్నా. ఇంతదాగా వచ్చాక రాకుండా ఎలా ఉంటాను.. వస్తాను” అని శివన్నారాయణ అంటాడు. దీప సంతోషిస్తుంది. అనసూయ పలకరిస్తే శివన్నారాయణ చిరాకు పడతాడు.

కార్తీక్ వెటకారం

మా నాన్నకు ఫిల్టర్ కాఫీ తీసుకురావాలని దీపకు కాంచన చెబితే.. వద్దు అంటాడు శివన్నారాయణ. కాఫీ తాగినంత మాత్రాన కూతురితో నువ్వు తెంచుకున్న సంబంధం కలిసిపోదులే తాతయ్య అంటూ వెటకారంగా మాట్లాడతాడు. నీలాంటి మర్యాదస్తులను గౌరవించడం మా బాధ్యత అని అంటాడు. మీ లాంటి వీఐపీలు వస్తే మరింత మర్యాద చేయాలని అని అంటాడు. నీ ఇంటికి వచ్చానని చులకగా మాట్లాడుతున్నావా.. మాటలతోనే వాతలు పెడుతున్నావని శివన్నారాయణ అంటే.. ఇవి వాతలు కాదు తాత.. మేం పాటించే నీతులు అని కార్తీక్ సమాధానమిస్తాడు. కూతురు కోసం మనసు మార్చుకొని వచ్చావ్.. నవ్వుతూ మాట్లాడుకుందాం తాత అని కార్తీక్ అంటాడు. వచ్చింది కూతురు కోసమే.. మనసు మార్చుకుంది మనవరాలి కోసం అని శివన్నారాయణ అంటాడు.

ఇంటికి రండి.. దీప సంతోషం

తమ ఇంటికి కొన్ని రోజులు శివన్నారాయణ వారిని అడుగుతాడు. కొడుకులు, కూతుళ్ల విషయంలో నా పట్టుదల, మనవరాలికి వచ్చే సరిగా నీరు గారిపోయిందని అంటాడు. సుమిత్ర, దశరథ ఇంట్లో లేరు.. జ్యోత్స్న యాక్సిడెంట్ విషయం చెబితే బాధపడతారని నేను చెప్పలేదని అంటాడు. వాళ్లు రావడానికి టైమ్ పడుతుంది, జ్యోత్స్న ఇంట్లో ఒంటరిగా బాధపడుతుందని అంటాడు. అందుకే మీ ఇంటికి వచ్చానని చెబుతాడు.

మేనకోడలి కోసం నేను ఏం చేయాలి నాన్న అని కాంచన అడుగుతుంది. కొంచెం ఆలోచించూ.. అడగకూడనిది అడిగితే మాట వెనక్కి తీసుకోవడం కష్టమని కార్తీక్ అంటాడు. అడగడానికి అడ్డపడకండి బాబు అని దీప అంటే.. నా తరఫున ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదని శివన్నారాయణ అంటాడు. “జ్యోత్స్న మీ అందరిపై బెంగ పెట్టుకుంది. అది చెప్పకపోయినా నాకు అర్థమైంది. అందుకే మీరు వచ్చి కొన్ని రోజులు మా ఇంట్లో ఉండండి” అని శివన్నారాయణ అంటాడు. దీంతో రెండు కుటుంబాలు కలిసిపోతున్నాయని దీప సంతోషిస్తుంది.

ఎలా బదులివ్వాలి?

“ఆఫర్ అదిరిపోయింది తాత కొన్నాళ్లు అంటే ఎన్నాళ్లు.. మీకు మళ్లీ కోపాలు గుర్తొచ్చే వరకా.. పంతాలు ఎవరైనా గుర్తు చేసే వరకా” అని కార్తీక్ నిలదీస్తాడు. కాంచన అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. ఆగమ్మా అంటాడు కార్తీక్. “అప్పుడు వాళ్ల గుమ్మంలోకి.. నా తల్లి ఏం చేసిందని వెలేశారని నేను అడిగా. అరుపులు, కేకలు తప్ప ఆరోజు నాకు సమాధానం రాలేదు. ఆ రోజు నేను అడిగిందే.. ఆ రోజు తాత మన ఇంటికి వచ్చి మరీ అడుగుతున్నాడు. ఎలా బదులివ్వాలి. ఆయన లాగానా మనలాగానా” అని కార్తీక్ కోపంగా మాట్లాడతాడు.

సర్దిచెప్పిన దీప

గతం మర్చిపోవాలని, మీ అమ్మ తీసుకునే నిర్ణయానికి కట్టుబడాలని కార్తీక్‍కు దీప సర్దిచెబుతుంది. నా కారణంగా రెండు కుటుంబాలు విడిపోయానని అంటుంది. కలిసేందుకు ఇప్పుడు అవకాశం వచ్చిందని చెబుతుంది. మీ అమ్మ గురించి ఆలోచించాలని అంటుంది. దీంతో మా అన్న నిర్ణయాన్ని గౌరవిస్తానంటాడు కార్తీక్. నువ్వు చెప్పమ్మా మనం ఏం చేయాలో అని శివన్నారాయణను అడిగితే.. పిలవడానికి వచ్చానని అంటాడు. ఎవరైనా పెళ్లయ్యాక భార్య మాట వింటారని అంటారని.. వీడు కళ్ల ముందే చూపించాడని శివన్నారాయణ అంటాడు.

ఆ కండీషన్‍తో కార్తీక్ ఆగ్రహం

శౌర్యను స్కూల్‍ నుంచి తీసుకొచ్చి, భోజనం చేశాక బయలుదేరదాం అని కార్తీక్ అంటాడు. అప్పుడు ట్విస్ట్ ఇస్తాడు శివన్నారాయణ. “మీరు రావడానికి శౌర్యను స్కూల్‍ నుంచి ఎందుకు తీసుకురావడం, సాయంత్రం వాళ్ల అమ్మ తీసుకొస్తుంది. మనం వెళదాం” అని శివన్నారాయణ అంటాడు. ఏంటిది అని కార్తీక్ అడుగుతాడు. నేను రమ్మన్నది అందరినీ కాదు అని శివన్నారాయణ అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. నిన్ను, మీ అమ్మని మాత్రమే రమ్మన్నారని చెబుతాడు.

దీంతో కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అందరూ రావాలంటే.. ఇంటిల్లిపాది రావాలనే కదా అర్థం అని అంటాడు. అందరూ అంటే మీ ఇద్దరు అనే.. మిగతా వాళ్లతో నాకు సంబంధం లేదని శివన్నారాయణ బదులిస్తాడు. “నాకు సంబంధం ఉంది. నేను ఎక్కడికి వెళ్లినా.. నా భార్య, నా కూతురు నాతోనే వస్తారు” అని కార్తీక్ అంటాడు. వాళ్లకు నా ఇంటికి గుమ్మం తొక్కే అర్హత కూడా లేదని శివన్నారాయణ అంటే.. వాళ్లకు లేకపోతే నాకు లేనట్టే అని గట్టిగా చెబుతాడు కార్తీక్.

ఎక్కడికి వెళ్లినా వారితోనే..

నా కోసం అగిపోవద్దని దీప అంటే.. నా భార్య, నా కూతురి గురించి మాట్లాడుతున్నానని కార్తీక్ అంటాడు. “నా స్థానంలో నువ్వు ఉండి.. నీ భర్త, కూతురు వద్దు.. నువ్వు మాత్రమే రా అంటే నువ్వు వెళతావా” అని ప్రశ్నిస్తాడు. దీంతో వెళ్లను కార్తీక్ బాబు అని దీప అంటుంది. దీంతో నేనూ ఈ పెద్ద మనిషికి అదే చెబుతున్నానని అంటాడు. కాంచన ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తే.. మీ నాన్న చెప్పింది నచ్చిందా అని అడుగుతాడు. దీపను మాటలు అనడంతో.. కార్తీక్ మరింత కోప్పడతాడు. ఇష్టంతోనే దీప మెడలో తాళి కట్టానని శివన్నారాయణతో అంటాడు. దీప నా భార్య, శౌర్య నా కూతురు అని తెగేసి చెబుతాడు. ఎక్కడికి వెళ్లినా నా భార్య, కూతురితోనే కలిసి వస్తానని, వదిలేసి రానని కార్తీక్ అంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 6) ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner