Karthika Deepam December 31 Episode: జ్యోత్స్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దీప.. మళ్లీ దాసు కాళ్ల మీద పడ్డ జో-karthika deepam today episode december 31 deepa strong counter to jyothsna dasu trying to reveal truth star maa tv seria ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam December 31 Episode: జ్యోత్స్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దీప.. మళ్లీ దాసు కాళ్ల మీద పడ్డ జో

Karthika Deepam December 31 Episode: జ్యోత్స్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దీప.. మళ్లీ దాసు కాళ్ల మీద పడ్డ జో

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 31, 2024 07:39 AM IST

Karthika Deepam 2 Today Episode December 31: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. అవమానించేందుకు ప్రయత్నించిన జ్యోత్స్నకు దీప దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సుమిత్ర కూడా జోపై మళ్లీ ఆగ్రహిస్తుంది. నిజం చెప్పేస్తానంటూ దాసు కూడా సిద్ధమవుతాడు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.

Karthika Deepam December 31 Episode: జ్యోత్స్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దీప.. మళ్లీ దాసు కాళ్ల మీద పడ్డ జో
Karthika Deepam December 31 Episode: జ్యోత్స్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దీప.. మళ్లీ దాసు కాళ్ల మీద పడ్డ జో

కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 31, 2024) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీప, కార్తీక్ పెట్టిన టిఫిన్ సెంటర్‌లో తింటారు జ్యోత్స్న, పారిజాతం. ఏమైనా చేస్తావేమోనని భయపడ్డానని పారు అంటే.. బావ సంతోషంగా ఉండడంతో నేనేం మాట్లాడలేనని జ్యోత్స్న అంటుంది. అక్కడి నుంచి వారిద్దరూ వెళ్లిపోయేందుకు సిద్ధమవుతారు. అయితే, వెళ్లిపోతున్న వారిని కాశీ వెనక్కి పిలుస్తాడు. ఇక్కడ టిఫిన్ ఫ్రీ కాదని, తింటే డబ్బు ఇవ్వాల్సిందేనంటాడు. ఫ్రీగా ఎవరికీ అవసరం లేదని కారులో డబ్బు తెచ్చేందుకు జ్యోత్స్న వెళుతుంది.

yearly horoscope entry point

జ్యోత్స్నకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన దీప

దీప చేతిలో రెండు డబ్బుల కట్టలను పొగరుగా పెడుతుంది జ్యోత్స్న. “ఇవి నా డబ్బులే ఎవరో ఇచ్చినవి కాదు. ఇది నా స్థాయి. ఉంచు” అని అంటుంది. దీంతో దీప కౌంటర్ ఇస్తుంది. “నేను రోజూ ఇద్దరికి టిఫిన్ ఫ్రీగా పెట్టాలని నియమం పెట్టుకున్నా. అందుకే మీ దగ్గర డబ్బు తీసుకోను” అని దీప పంచ్ వేస్తుంది. డబ్బును చూపిస్తూ.. “ఇది నీ స్థాయి అన్నావ్ కదా.. ఇది నా స్థాయి కాదు. ఇది నీ దగ్గరే ఉంచుకో” అని వెనక్కి ఇచ్చేస్తుంది దీప. ఇచ్చిన డబ్బు ఇలాగే తిరిగి ఇవ్వకూడదంటూ.. జ్యోత్స్నకు 11 రూపాయలు ఎక్కువగా ఇస్తుంది దీప. లెక్క సరిపోయింది ఇక వెళ్లు అంటుంది. అవమానించేందుకు ప్రయత్నించిన జోత్స్నకు గట్టి బుద్ధి చెప్పింది దీప. దీంతో జో కోపంగా వెళ్లిపోతుంది.

చూశావా ఎంత అవమానం చేసిందో అని పారిజాతం అంటే.. దీన్ని ఊరికే వదిలి పెట్టను గ్రానీ అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్నకు భలే బుద్ధి చెప్పావని కాశీ అంటాడు. తగ్గితే దీప ఎందుకు అవుతుందని కార్తీక్ కూడా సంతోషిస్తాడు. జ్యోత్స్న ఎందుకు ఇలా తయారవుతోందని కాంచన మనసులో అనుకుంటుంది.

శివన్నారాయణకు చెప్పిన జ్యోత్స్న

కార్తీక్ టిఫిన్ సెంటర్ పెట్టాడంటూ తాత శివన్నారాయాణకు ఫొటోలు చూపిస్తుంది జ్యోత్స్న. లండన్‍లో చదువుకున్న బావ దీపతో కలిసి టిఫిన్ సెంటర్ పెట్టాడని అంటుంది. టిఫిన్ సెంటర్ వద్ద కార్తీక్ ఉన్న ఫొటోలను శివన్నారాయణ చూస్తాడు. లుంగీ కట్టుకొని పని వాడిలా పని చేసుకుంటున్నాడని జ్యోత్స్న అంటుంది. దీంతో దశరథ్‍ను శివన్నారాయణ పిలుస్తాడు. ఇది నీ మేనల్లుడి టాలెంట్ అని ఫొటోను చూపిస్తాడు. మన సపోర్ట్ లేకపోతే ఇదీ వాడి బతుకు అని అంటాడు. దీపతో ఉంటే అలాంటి ఆలోచనలే వస్తాయని పారిజాతం అంటుంది. కోరి శని దేవతను తల మీద పెట్టుకున్నాడని, జీవితం ఇలా కాకపోతే ఎలా ఉంటుందని శివన్నారాయణ అంటాడు.

పరువు తీయడానికే..

“బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అందుకుంటానని కార్తీక్ నాతోనే సవాల్ చేశాడు.. ఇక అందుకున్నట్టే. పైగా నీ చెల్లి కూడా అక్కడే ఉంది. కూతురు, మనవడు ఎందుకు ఉన్నారు అంటే.. పరువు తీయడానికే అన్నట్టు ఉంది” అని దశరథ్‍తో శివన్నారాయణ అంటాడు. మీ మనవడు టిఫిన్ బండి పెట్టాడని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలని బాధపడతాడు.

మీరెందుకు వెళ్లారు: సుమిత్ర ఆగ్రహం

శివన్నారాయణ వెళ్లిపోయాక జ్యోత్స్నపై సుమిత్ర ఆగ్రహిస్తుంది. అసలు అక్కడికి ఎందుకు వెళ్లారంటుంది. దీప అడుక్కుతిన్నా తనకు పర్వాలేదని, ఆమెతో పాటు బావ ఎందుకు కష్టపడాలని జ్యోత్స్న అంటుంది. బావను వెనక్కి తీసుకురావాలని దశరథ్‍ను అడుగుతుంది. కార్తీక్ ఇలా చేయడం తనకు కూడా నచ్చలేదని దశరథ్ కూడా అంటాడు.

మామయ్య కూడా ఇలానే మొదలెట్టాడు

భార్య మాట వింటే ఇలానే ఉంటుందని పారిజాతం అంటుంది. దీంతో సుమిత్ర గట్టిగానే బదులిస్తుంది. “కార్తీక్, దీప ఓడిపోయే రకాలు కాదు. గుర్తు చేస్తే బాధపడతారని వదిలేశాను కానీ.. మామయ్య (శివన్నారాయణ) జీవితం కూడా ఇలాగే మొదలైందట. టిఫిన్ సెంటర్ దగ్గర మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాడు. కార్తీక్ కూడా తాత బాటలోనే నడుస్తున్నాడు. గెలుస్తాడు. వాడి పక్కన భూదేవి లాంటి భార్య ఉంది. తనే గెలుపిస్తుంది. మీరేం టెన్షన్ పడకండి” అని సుమిత్ర అంటుంది. వాళ్లను మనం గెలవనివ్వకూడదు గ్రానీ అని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. కార్తీక్ గెలువలేడని, ఈ మాట రాసిపెట్టుకోవాలని పారు చెబుతుంది.

బండి వద్దకు రావద్దంటూ ఏడ్చేసిన దీప

పెట్టుబడి పెట్టిన ఖర్చులు పోయి రూ.3,800 మిగిలాయని దీప చెబుతుంది. మొదటి రోజే ఇంత సంపాదించావంటే మన ప్లాన్ సూపర్ హిట్ అని కార్తీక్ అంటాడు. ఇక టిఫిన్ బండి వద్దకు రావొద్దని కార్తీక్‍కు దీప చెబుతుంది. ఇంత చదువుకొని, విలాసాల్లో బతికిన మీరు ఇలా కష్టపడడం బాధగా ఉందంటూ ఏడ్చేస్తుంది. తాను వస్తానని కార్తీక్ అంటే.. వద్దు అని గట్టిగా చెబుతుంది దీప. తాను పేదరికంలో పుట్టానని, తమ బతుకులకు ఇది అలవాటేనంటుంది. టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చి కష్టపడొద్దని తెగేసి చెబుతుంది. ఐశ్వర్యంలో పుట్టి.. దర్జాగా ఖరీదైన దుస్తులు వేసుకొని ఆఫీస్‍కు వెళ్లేవారు అదీ మీ స్థాయి అని అంటుంది. స్టార్ హోటల్ స్థాయి నుంచి రోడ్డు మీదకు తెచ్చానని జ్యోత్స్న అన్న మాట నిజమేనని దీప ఏడ్చేస్తుంది. ఆ మాటలతో తనను దవడ పగలగొట్టినట్టుగా అనిపించిందని దీప అంటుంది. ఇంటి ఖర్చుల కోసం తాను టిఫిన్ సెంటర్ పెట్టారనని, అది తప్ప తనకు ఏదీ రాదని దీప అంటుంది. తాతతో సవాల్ చేశారు.. జరిగింది తెలిస్తే వాళ్లు నవ్వుకుంటారని అంటుంది.

కార్తీక్ భరోసా.. కౌగిలించుకున్నట్టు ఊహించుకున్న దీప

“భార్య కష్టపడకుండా చూసుకోవడం భర్త లక్షణం. ఒకవేళ భార్య కష్టపడాల్సి వస్తే సాయంగా ఉండడం భార్త బాధ్యత” అని కార్తీక్ అంటాడు. దీంతో తన మాజీ భర్త నరసింహం తనను పెట్టిన కష్టాలను దీప గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ ఎంత గొప్పవాడు అని అనుకుంటుంది. మరోవైపు తాను తోడుగా ఉంటానంటూ కార్తీక్ మాట్లాడుతుంటాడు.

“ఎవరు ఏమనుకున్నా.. నీకు నచ్చినా నచ్చకపోయినా సరే. నువ్వు వేసే ప్రతీ అడుగులో సగం నేనుంటాను. నీ చేయి పట్టుకొని బయటికి వచ్చాను. చేయి పట్టుకొనే నడుస్తా. చచ్చినా చేతిని వదలను” అని అంటాడు. దీంతో కార్తీక్‍ను కౌగిలించుకొని.. “భర్త అంటే ఇలా కదా ఉండాల్సింది.. ఏ ఆడదైనా కోరుకునేది మీలాంటి తోడునే కదా.. నా జీవితానికి ఇది చాలు” అని ఏడ్చేసినట్టు దీప ఊహించుకుంటుంది. ఊహల్లో ఉంటుంది. దీంతో దీప అంటూ కార్తీక్ పిలుస్తాడు. సమాధానం చెప్పట్లేదు అని కార్తీక్ అంటే.. మీ మంచితనానికి నా మనసు నీ కౌగిట్లో ఒదిగిపోయింది కార్తీక్ బాబు” అని దీప మనసులో అనుకుంటుంది. డబ్బు పెట్టి ఫోన్ తీసుకోవాలని శౌర్య చెబితే.. అమ్మ ఫోన్ వాడతాలే అని కార్తీక్ అంటాడు. అంతా ఒకటే అంటాడు. కార్తీక్ బిజినెస్ పెట్టుకునేందుకు భగంతులు ఏదో రూపంలో దారి చూపిస్తే బాగుంటుందని దీప అనుకుంటుంది.

భయం పుట్టేలా చేసి చంపుతా

దీప ఇచ్చిన పది రూపాయల నోటు చూస్తూ.. అవమానం జరిగిందని తలుచుకుంటూ రగిపోతుంది జ్యోత్స్న. హేళన చేద్దామనుకుంటే.. అహం మీద దెబ్బకొట్టావని అనుకుంటూ ఉంటుంది. “గుర్తుంది దీప.. నువ్వు నన్ను కొట్టిన దెబ్బలు, చేసి అవమానాలు.. అన్నీ గుర్తున్నాయి. నాకూ ఓ రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు చాలా గట్టిగా బాధపడతావు. బతకాలంటేనే భయం పుట్టేలా చేసి చంపుతా. దీన్ని ఎవరూ ఆపలేరు” అని జ్యోత్స్న అనుకుంటుంది.

నిజం చెప్పేందుకు వచ్చిన దాసు.. బతిమాలిన జ్యోత్స్న

దీపే అసలైన వారసురాలి అని చెప్పేందుకు దాసు మళ్లీ సిద్ధమవుతాడు. శివన్నారాయణ ఇంటికి వస్తాడు. దాసును జ్యోత్స్న ముందు చూసి బయటే ఆపేస్తుంది. దీప కష్టపడుతుంటే చూడలేకున్నానని.. మీ అసలైన కూతురు దీపే అని తన వదిన సుమిత్రకు చెప్పేస్తానని అంటాడు. “ఏంటి నాన్న మళ్లీ నీకు ఏమైంది” అని దాసును పక్కకు తీసుకెళుతుంది జ్యోత్స్న. ఏం కావాలని అడుగుతుంది. డబ్బు కావాలా అంటూ బతిమాలుతుంది.

కాళ్ల మీద పడిన జ్యోత్స్న.. చూసేసిన పారు

నిజం ఎవరి చెప్పనని అన్నావ్ కదా అని దాసుతో జ్యోత్స్న అంటుంది. టిఫిన్ సెంటర్ వద్ద దీపను నువ్వు మాటలు అనడం చూసిన తర్వాత నేను ఏదో పాపం చేస్తున్నట్టు బాధేసిందని దాసు అంటాడు. దీపను ఈ ఇంటి వారసురాలిగా చూడాలని ఉందని చెబుతాడు. ఇన్ని కోట్లకు వారసురాలు.. కూటి కోసం ఎందుకు కష్టపడాలని అంటాడు.

వాళ్లకు డబ్బు ఎంతకావాలో అడుగు.. నేను ఇస్తానని జ్యోత్స్న అడుగుతుంది. దీపను, కార్తీక్‍ను డబ్బుతో కొనలేమని దాసు అంటాడు. నిజం చెప్పకపోతే మనశ్శాంతిగా ఉండలేనని అంటాడు చివరికి దాసు కాళ్లపై జ్యోత్స్న పడుతుంది. పారిజాతం ఇది చూస్తుంది. ఇది నిజమేనా అనుకుంటుంది. నిజం చెబితే తాను చచ్చిపోతానని జ్యోత్స్న బెదిరిస్తుంది. సుమిత్ర కూతురిగానే బతికాను.. అలాగే చచ్చిపోతానంటుంది. ఏం మాట్లాడుకుంటున్నారని, వీళ్లద్దరి మధ్య ఏం జరిగిందని పారిజాతం టెన్షన్ పడుతుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 31) ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner

సంబంధిత కథనం