Karthika Deepam December 30 Episode: టిఫిన్ సెంటర్ మొదలెట్టిన దీప.. మాస్ గెటప్‍లో కార్తీక్.. అక్కసుతో జ్యోత్స్న మాటలు
Karthika Deepam Today Episode December 30: కార్తీక దీపం 2 సీరియల్ నేటి ఎపిసోడ్‍లో.. టిఫిన్ సెంటర్ మొదలెట్టేసింది దీప. లుంగీ కట్టుకొని మాస్ ఎంట్రీ ఇచ్చాడు కార్తీక్. దీపపై మళ్లీ నోరు పారేసుకున్న జ్యోత్స్నపై కౌంటర్లు వేశాడు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 30) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. తన ప్లాన్‍కు తగ్గట్టుగా టిఫిన్ సెంటర్ మొదలుపెట్టేసింది వంటలక్క దీప. టిఫిన్ సెంటర్‌కు పూజ చేస్తుంది. కాంచన, దాసు, కాశీ, స్వప్న, శౌర్య అక్కడే ఉండగా.. కార్తీక్ మాత్రం కనిపించడు. కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తూ ఉంటుంది దీప.
టిఫిన్ సెంటర్‌కు కార్తీక్ పేరు
తాను పెట్టిన టిఫిన్ సెంటర్‌కు భర్త కార్తీక్ పేరు దీప పెడుతుంది. దీప పేరుపై రెస్టారెంట్ పెట్టాలని కార్తీక్ అనుకుంటే.. ఇప్పుడు అతడిపై పేరుతో దీప టిఫిన్ సెంటర్ మొదలుపెట్టింది. “చూశావా దిల్లూ.. మీ అన్నయ్య అంటే మా అక్కకు ఎంతో ప్రేమో. టిఫిన్ సెంటర్ పేరు చూసిన ప్రతీ ఒక్కరూ ఈ పేరు అనాల్సిందే” అని స్వప్నతో కాశీ అంటాడు. ఈ టిఫిన్ సెంటర్.. స్టార్ రెస్టారెంట్ రేంజ్‍కు వెళ్లాలని అంటాడు. అందరి కోరిక ఇదేనని కాంచన అంటుంది. అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతారు.
లుంగీ కట్టుకొని కార్తీక్ మాస్ ఎంట్రీ
కార్తీక్ అంగీకరించకుండా టిఫిన్ సెంటర్ పెట్టినందుకు దీప కాస్త డల్‍గా కనిపిస్తుంది. దీంతో ఏమైందని దాసు అడుగుతాడు. బావ కూడా వచ్చి ఉంటే బాగుండేదని కాశీ అంటాడు. పిలుచుకురానా అని స్వప్న అంటుంది. వచ్చే వాడైతే పిలువకుండానే వచ్చేవాడని కాంచన చెబుతుంది. ఇంతలోనే కార్తీక్ సూపర్ ఎంట్రీ ఇస్తాడు. గళ్ల చొక్కా, లుంగీ కట్టుకొని.. భుడంపై వాటర్ క్యాన్‍తో మాస్ గెటప్‍లో ఎంట్రీ ఇస్తాడు. అదిగో నాన్న అని శౌర్య.. కార్తీక్‍ను ఆ గెటప్‍లో చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అన్నయ్యేనా అని స్వప్న అంటే.. అవును నాన్న అని శౌర్య అంటుంది.
నేను అనుకున్నా.. తాను పెట్టింది
ఎలా వచ్చారేంటి కార్తీక్ బాబు అని దీప అడుగుతుంది. బావ సూపర్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడని కాశీ విజిల్ వేస్తాడు. కార్తీక్ టిఫిన్ సెంటర్ అని అమ్మ నీ పేరే పెట్టింది నాన్న అని శౌర్య చెబుతుంది. ఎలా ఉందన్నయ్యా అని స్వప్న అడుగుతుంది. “తన పేరు మీద నేను పెట్టాలనుకున్నాను.. నా పేరు మీద తన పెట్టింది” అని కార్తీక్ అంటాడు. దీపకు థ్యాంక్స్ చెబుతాడు. భవిష్యత్తుకు ఇది మెట్టుగా అనుకుంటానని చెబుతాడు.
ఫీల్ అయిన దీప.. సర్దిచెప్పిన కార్తీక్
వాటర్ క్యాన్ మీరు మోసుకురావడం ఏంటి అని దీప ఫీల్ అవుతుంది. “ఈ గెటప్ నచ్చలేదా.. రావాలనిపించింది. చూస్తే దండం మీద ఆరేసిన గళ్లు లుంగీ. నువ్వు నా కోసం కొన్న గళ్ల చొక్కా కనిపించాయి. అవి వేసుకొని వాటర్ క్యాన్ తీసుకొచ్చేశా” అని కార్తీక్ చెబుతాడు. వచ్చినందుకు థ్యాంక్స్ అని చెబుతుంది దీప. టిఫిన్ సెంటర్‌కు వచ్చిన చీఫ్ గెస్టుకు చెప్పినట్టు థ్యాంక్స్ చెబుతావేంటి అని కార్తీక్ అంటాడు. పూజ చేయండని దీప అంటే.. నువ్వు చేస్తే నేను చేసినట్టే అన్నట్టు కార్తీక్ చెబుతాడు.
ఇద్దరూ కలిసి టిఫిన్స్ తయారీ
కార్తీక్, దీప ఇద్దరూ కలిసి టిఫిన్స్ తయారు చేశారు. ఈ క్రమంలో కార్తీక్ చేయి కాస్త కాలుతుంది. దీంతో ఈ పనులన్నీ మీకెందుకు.. కూర్చొండి అంటుంది దీప. లుంగీ కట్టుకొచ్చింది కూర్చునేందుకా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. మన టిఫిన్ సెంటర్‌లో మనమే పని చేసుకుంటామని, ఇందులో ఎలాంటి నామోషి లేదని అంటాడు.
తాత కూడా టిఫిన్ సెంటర్‌తోనే..
తల్లి కాంచనకు ముందుగా టిఫిన్ ఇస్తాడు కార్తీక్. తమ ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని అడుగుతాడు. మీ తాత కూడా జీవితాన్ని ఇలా చిన్న టిఫిన్ సెంటర్‌తోనే మొదలుపెట్టాడని కాంచన అంటుంది. దీంతో నాతో అంటే అన్నావు కానీ.. అందరూ ఉన్నప్పుటు మీ నాన్న ఉన్నప్పుడు అంటే ఆయన పెద్దరికానికి చిన్నతనంగా ఫీల్ అవుతాడని కార్తీక్ వెటకారంగా అంటాడు. పెద్దాయనను పట్టుకొని అలా అంటారేంటి కార్తీక్ బాబు అని దీప అంటుంది.
టిఫిన్ అదిరిపోయిందంటూ..
దాసు, కాశీ, స్వప్న, శౌర్యకు కూడా టిఫిన్ పెడతారు దీప, కార్తీక్. టిఫిన్స్ సూపర్ అని అందరూ అంటారు. రుచి చూడాలని కార్తీక్‍కు దీప చెబుతుంది. నీ చేతి వంటకు ఎవరైనా పేరు పెట్టగలరా అని కార్తీక్ అంటాడు. పూరి తిని కర్రీ వేరే లెవెల్‍లో ఉందని కార్తీక్ అంటాడు. దీప పని చేసే విషయం బాధగా ఉందని మనసులో అనుకుంటాడు దీప. ఫొటోలు తీస్తాడు కాశీ. ఇంతలోనే టిఫిన్ సెంటర్‌కు తొలి కస్టమర్ వస్తాడు.
మనల్నే దెబ్బకొట్టారు
ఏమైనా ఆలోచించావా అని పారిజాతాన్ని జ్యోత్స్న అడుగుతుంది. టైమ్ ఇవ్వకుండా దీపను దెబ్బ మీద దెబ్బ కొట్టాలని జ్యోత్స్న అంటుంది. టిఫిన్ సెంటర్ ఫొటోలను పారిజాతానికి కాశీ పంపుతాడు. వాళ్లే మనల్ని దెబ్బ కొట్టారని పారిజాతం అంటుంది. దీప, మీ బావ కలిసి టిఫిన్ సెంటర్ పెట్టారంటుంది. మీ బావను చూశావా.. లుంగీ కట్టుకొని ఎలా రెడీ అయ్యాడో అని చెబుతుంది. టిఫిన్ సెంటర్‌కు వెళదాం పదా అని జ్యోత్న్స అంటుంది. గొడవలు వద్దే అని పారు అంటే.. ఆకలేస్తోంది దీప హోటల్‍లో టిఫిన్ చేద్దాం పదా అని తీసుకెళుతుంది జ్యోత్స్న.
టిఫిన్ బాగుందని, బంగాళదుంప కూర అదిరిపోయిందని టిఫిన్ సెంటర్‌కు వచ్చిన తొలి కస్టమర్ అంటాడు. దీంతో బోణి అదిరిపోయిందని, డబ్బులతో పాటు ఫైవ్ స్టార్ రేటింగ్ కామెంట్స్ వచ్చాయని కార్తీక్ అంటాడు. తాను చేస్తానని దీప అంటే.. అన్ని పనులు ఎలా చేస్తావని ఇద్దరం చేద్దామని కార్తీక్ అంటాడు. ఇద్దరూ కలిసి పని చేసుకోవడం ఆనందంగా ఉన్నా.. నిన్ను ఇలా చూడడం బాధగా ఉందని మనసులో అనకుంటుంది కాంచన. ఇది మీ స్థాయి కాదు.. నా స్థాయి అని దీప కూడా కార్తీక్ గురించి అనుకుంటుంది.
ఇలా చూస్తాననుకోలేదు
టిఫిన్ సెంటర్ వద్దకు జ్యోత్స్న, పారిజాతం వస్తారు. వీళ్లకు ఎలా తెలుసని దీప అనుకుంటుంది. అటు చూడండి అంటూ వారివైపు చూపిస్తుంది. వాళ్లను చూసి ఎందుకు భయపపడుతున్నావని కార్తీక్ అంటాడు. తానే ఫొటో పంపానని, కానీ వస్తారనుకోలేదని కాశీ అంటాడు. మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని దాసుతో కార్తీక్ అంటాడు. టైటిల్ అదిరిపోయిందని జ్యోత్స్న. కార్తీక్ గెటప్ గురించి మాటలు అంటుంది. ఇలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదని కార్తీక్‍తో పారిజాతం అంటుంది. అనుకోనిది జరగడమే జీవితం అంటూ కార్తీక్ అంటాడు.
సీఈవో నుంచి ఇలా దిగజార్చావ్
సవాల్ చేసి వచ్చి ఇలా చీఫ్‍గా టిఫిన్ సెంటర్ పెడతావని అనుకోలేదని కార్తీక్‍తో జ్యోత్స్న అంటుంది. పక్కన ఉన్న మనిషి అలాంది మరి అని దీపను ఉద్దేశించి కామెంట్ చేస్తుంది పారిజాతం. మరిన్ని మాటలు అంటుంది. కాంచన అడ్డుకుంటే.. ఇదంతా చూస్తూ ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావని జ్యోత్స్న అంటుంది. “సీఈవో స్థాయి నుంచి రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ పెట్టుకునే స్థాయికి దిగజారిపోయాడు బావ. దీని అంతటికి కారణం దీపను పెళ్లి చేసుకోవడం. దీపే కావాలని అందరినీ వదులుకొని వచ్చాడు” జ్యోత్స్న అంటుంది.
మా చుట్టు పక్కలకు రావొద్దు
“నిన్ను ఇంటికి రావొద్దంటే.. ఇక్కడికి వచ్చ గొడవ చేయాలని కాదు. మా చుట్టు పక్కలకు కూడా రావొద్దని” అని కార్తీక్ అంటాడు. టిఫిన్ సెంటర్ పెట్టింది కస్టమర్లు రావాలనే కదా అని పారిజాతం అంటుంది. శుభమా అని వ్యాపారం మొదలుపెట్టారు.. అల్లరి చేయకండని దాసు అంటాడు. మేం కూడా కస్టమర్లే టిఫిన్ పెట్టండని పారిజాతం అంటుంది.
సర్వర్‌ను చేశావ్
మంట అవతలి వాళ్లకు పెడుతుంటే కారం ఎందుకు పడుతుందులే అని పారిజాతానికి కౌంటర్లు వేస్తాడు కార్తీక్. పారిజాతం, జ్యోత్స్నకు టిఫిన్ తెచ్చిస్తుంది దీప. నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చడం, ఇందుకేనా అన్ని వదిలేశావ్ అంటుంది జ్యోత్స్న. మా బావను ఇలా జీవితంలో చూస్తాననుకోలేదంటూ దీపతో చెబుతుంది. రెస్టారెంట్ పార్ట్‌నర్‌గా ఉన్న వాడిని టిఫిన్ బండికి సర్వర్ చేశావని అక్కసుతో జ్యోత్స్న మాట్లాడుతుంది. ఏం సాధించావ్ దీప.. అందరినీ బాధపెట్టడం తప్పితే అంటూ మాటలు అంటుంది. మా బావ సర్వీస్ చేయించుకునే హోదా నుంచి.. సర్వీస్ చేసే స్థితికి తీసుకొచ్చావని దీపను అంటుంది. నీ స్వార్థం కోసమే ఇలా చేశావని నోరు పారేసుకుంటుంది.
ఇక్కడ కస్టమర్లు వెయిటింగ్ మీరు బయలుదేరండి అని కార్తీక్ అంటాడు. ఫొటోలు తీసుకుంటానని పారు అంటే.. రకరకాల పోజులు ఇస్తాడు కార్తీక్. మరోవైపు జ్యోత్స్న రగిరిపోతుంటుంది. ఏదో చేస్తావని భయపడ్డానే అని పారిజాతం అంటుంది. “ఒక్కసారి బావ కళ్లలో ఆనందాన్ని చూడు. ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాడు. అది చూసిన తర్వాత నేనేం మాట్లాడాలి” అని జ్యోత్స్న అంటుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 30) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం