కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 28, 2025) 343వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. నిద్రపోయేటప్పుడు మంచంపై పక్కన శౌర్య లేదని కార్తీక్ గమనిస్తాడు. రౌడీ ఏది.. నిద్రపట్టడం లేదని వాళ్ల నానమ్మ దగ్గరికి వెళ్లి పడుకుందేమో అనుకుంటాడు. ఇంతలో అక్కడే పెన్ను, పేపర్ కనిపిస్తుంది. రౌడీ.. రౌడీ అంటూ శౌర్యను కార్తీక్ పిలుస్తాడు. ఆ తర్వాత శౌర్య మీ దగ్గరికి వచ్చిందా అని కాంచనను కార్తీక్ అడుగుతాడు. రాలేదని అనసూయ చెబుతుంది. శౌర్యను చూసేందుకు బయటికి వెళతాడు కార్తీక్. కాంచన కంగారు పడుతుంది.
శౌర్య కోసం ఇంటి బయట వెతుకుతాడు కార్తీక్. శౌర్య చెప్పులు కూడా ఉండవు. దీంతో టెన్షన్ పడతాడు. గేట్ ఓపెన్ చేసి ఉందని, వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లి ఉంటుందని సైకిల్ తీసుకొని శౌర్యను వెతికేందుకు కార్తీక్ వెళతాడు. లెటర్ పట్టుకొని రోడ్డుపై పరుగెత్తుకొని వెళుతున్న శౌర్యను కార్తీక్ చూస్తాడు. రౌడీ ఆగు అని కేక వేస్తాడు. దీంతో శౌర్య ఆగుతుంది.
సైకిల్ దిగి.. బుద్ధి ఉందా నీకు అని శౌర్యపై కోప్పడతాడు కార్తీక్. కొట్టేందుకు చేయి ఎత్తుతాడు. అర్ధరాత్రి ఒంటి గంట టైమ్‌లో మాకు చెప్పకుండా ఎక్కడికి వెళుతున్నావంటూ కోప్పడతాడు. అర్ధరాత్రి బయటికి ఎందుకు వెళ్లాలని ఇంటికి వచ్చిన శౌర్యను అనసూయ అడుగుతుంది. పోలీస్ స్టేషన్‌కు అని శౌర్య బదులిస్తుంది. ఎందుకు అని కార్తీక్ అడుగుతాడు. పోలీసులకు లెటర్ ఇచ్చి అమ్మ (దీప)కు ఇవ్వాలని చెప్పేందుకు వెళుతున్నానని శౌర్య ఏడుస్తూ అంటుంది.
అమ్మను తీసుకొస్తానని చెప్పాను కదా అని కార్తీక్ అంటాడు. అమ్మ రాదు.. అమ్మ రానంత దూరంలో ఉంది.. అమ్మ ఎప్పటికీ రాదు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది శౌర్య. నీకు ఎవరు చెప్పారని కార్తీక్ అడుగుతాడు. జ్యో అని శౌర్య అంటుంది. జ్యోతను నువ్వు మాట్లాడడం విన్నా నాన్న అని చెబుతుంది. “నేను జ్యోతో మాట్లాడా. తను ఎక్కడ ఉండో చెప్పను. కానీ మీ అమ్మ ఎప్పటికీ రాదని చెప్పింది” అని శౌర్య చెబుతుంది. దీంతో జ్యోత్స్న ఏదో ఒక పెంట పెడుతుందని కార్తీక్ చిరాకు పడతాడు.
శౌర్యను బాధపెట్టేందుకు జ్యోత్స్న ఇలా చేస్తోందని, తిట్టకూడదను కానీ చారా చెత్తగా తయారు అవుతోందని కాంచనతో కార్తీక్ అంటాడు. అమ్మ దగ్గరికి తీసుకెళ్తావా అని కార్తీక్‌ను శౌర్య అడుగుతుంది. జ్యో అబద్ధం చెబుతుందని కార్తీక్ అంటాడు. లేదు నువ్వే అబద్ధం చెబుతున్నావ్, జ్యో ఎప్పుడూ నిజమే చెబుతుందని శౌర్య అంటుంది. దీంతో కార్తీక్ బాధపడతాడు. చెప్పనంటూనే చేయాల్సిందంతా చేసిందని కోప్పడతాడు. ఇప్పుడు జ్యోత్స్నను ఏం చేయాలో చెప్పు అని కాంచనను కార్తీక్ అడుగుతాడు.
అమ్మకు ఏం కాదు.. నీ దగ్గరికి తీసుకొస్తానని ప్రామిస్ చేశా కదా అని శౌర్యతో అంటాడు కార్తీక్. నా కంటే జ్యోనే ఎక్కువా అని అడుగుతాడు. కాదు అంటుంది శౌర్య. మరి నాన్న మాట వినాలి కదా అని కార్తీక్ అంటాడు. అమ్మను ఒక్కసారి చూడాలని ఉంది అని దీనంగా అడుగుతుంది శౌర్య. దీంతో శౌర్యను దగ్గరికి తీసుకుంటాడు కార్తీక్. అమ్మను నీకు చూపిస్తా.. ఇంకొక్క రోజు వెయిట్ చేయ్.. అమ్మను తీసుకొస్తా అని అంటాడు. శౌర్యకు చేసిన ప్రామిస్‌ను నాన్న తప్పడు అని చెబుతాడు. ఈ లెటర్ అమ్మకు ఇవ్వు అని శౌర్య చెబుతుంది. ఇది కూడా ఇచ్చానని అబద్ధం చెప్పకు అని అంటుంది. దీంతో కార్తీక్ బాధపడతాడు.
శౌర్య మనసులో నుంచి జ్యోత్స్న తనను దూరం చేస్తోందని కాంచనతో కార్తీక్ అంటాడు. నాన్న అంటే అబద్దాలు చెప్పేవాడిగా నిలబెట్టింది, తనపై ఉన్న నమ్మకాన్ని తండ్రిపై లేకుండాలా చేసిందని ఫీల్ అవుతాడు. చెప్పకూడని మాటలు చెప్పి అర్ధరాత్రి తల్లికోసం వెతికేలా నా కూతురిని చేసిందని కోప్పడతాడు. శౌర్య రాసిన లెటర్ చూసి ఎమోషనల్ అవుతాడు కార్తీక్. అమ్మ కోసం శౌర్య ఎంత బాధగా రాసుకుందో చూడండి అని అంటాడు. జ్యోత్స్నపై తనకు చాలా కోపం వస్తోందని చెబుతాడు.
జ్యోత్స్నకు ఇంకా శత్రువులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవాలని కార్తీక్ అంటాడు. ఆ గౌతమ్ గాడు ఉన్నాడు కదా బాబు అని అనసూయ చెబుతుంది. ఎంగేజ్మెంట్తోనే వాడు పోయాడు కదా అని కార్తీక్ అంటాడు. దీపకు వార్నింగ్ ఇచ్చేందుకు ఇంటికి వచ్చాడు అని అనసూయ చెబుతుంది. ఇంటికి వచ్చి దీపకు గౌతమ్ వార్నింగ్ ఇచ్చాడా.. ఎప్పుడు అని కార్తీక్ షాక్ అవుతాడు. నిశ్చితార్థం ఆగిపోయిన తర్వాత అని కాంచన అంటుంది. నాకెందుకు చెప్పలేదని కార్తీక్ ప్రశ్నిస్తాడు. దీపకు వార్నింగ్ ఇస్తే నాకెందుకు చెప్పలేదని అంటాడు.
దీపను గౌతమ్ బెదిరించిన మాటలను కార్తీక్‌కు అనసూయ చెబుతుంది. తాను గన్ కాల్చలేదని దీప చెప్పిన మాటలను కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. దీంతో గౌతమ్‌పై కార్తీక్‌కు అనుమానం వస్తుంది. దీప చేతిలో గన్ పేలకుండానే మామయ్యకు బులెట్ ఎలా తగిలిందో ఇప్పుడు అర్థమైందని అంటాడు. రేయ్ గౌతమ్.. దొరికావ్ రా అని అనుకుంటాడు.
గౌతమ్ దగ్గరికి కార్తీక్ వెళతాడు. గౌతమ్ చెంపపై కొడతాడు. ఎందుకు కొడుతున్నావని గౌతమ్ అడుగుతాడు. మళ్లీ కార్తీక్ కొడతాడు. గౌతమ్ కాలర్ పట్టుకుంటాడు. నువ్వు అసలు మగాడివేనా అని కార్తీక్ కోప్పడతాడు. మీసాలు, గడ్డాలు కనిపించడం లేదా అని గౌతమ్ అంటాడు. మీసాలు, గడ్డాలు కదా.. మగాడిగా బతకాలి అని కార్తీక్ అంటాడు. నేను లేని టైమ్‌లో నా ఇంటికి వచ్చి ఆడవాళ్లకు వార్నింగ్ ఇచ్చావంటే.. నువ్వు షర్ట్, పాయింట్ వేసుకున్నా చీర, జాకెట్ కట్టుకున్నట్టేరా అని ఫైర్ అవుతాడు కార్తీక్. అది ఎప్పుడో జరిగిపోయింది కదా అని గౌతమ్ అంటాడు.
నా భార్యకు శత్రువులు ఇంక ఎవరైనా ఉన్నారా అని మాట్లాడుకుంటుంటే.. అనసూయ నీ పేరు చెప్పడంతో వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందని గౌతమ్‌తో కార్తీక్ చెబుతాడు. “నా భార్య చేతిలో గన్ పేలకుండానే మామయ్యకు బుల్లెట్ తగిలింది. ఎలా తగిలింది. ఎవరు కాల్చారు.. చేతిలో గన్ ఉంది కదా అని నా భార్యపై హత్యాయత్నం కేసు పెట్టారు. రిమాండ్‌లో పెట్టారు” అని కార్తీక్ అంటాడు. అయితే అని గౌతమ్ అడుగుతాడు. షూట్ చేసింది నువ్వు అని గౌతమ్‌ను అంటాడు కార్తీక్.
కాబోయే మామను నేనుందుకు చంపుతానని గౌతమ్ అంటాడు. దీపను చంపాలనుకుంటే మిస్ అయి ఆ బుల్లెట్ మామయ్యకు తగిలి ఉండొచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నువ్వు నిజం ఒప్పుకోక పోతే కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళతానని చెబుతాడు. దశరథ్ను దీప షూట్ చేసిన రోజు నేను హైదరాబాద్‌లోనే లేనని గౌతమ్ అంటాడు. అది నిరూపించుకునేందుకు వంద సాక్ష్యాలు ఉన్నాయని, నేను కాల్చాననేందుకు ఒక్క సాక్ష్యమైనా ఉందా అని అడుగుతాడు.
కొట్టినందుకు నీపై కూడా కేసు పెడతానని కార్తీక్‌ను గౌతమ్ బెదిరిస్తాడు. పెట్టు.. నువ్వు, జ్యోత్స్న ఆడుతున్న నాటకాన్ని బయటపెడతాడని చెబుతాడు. నీ భార్య బయటికి రావడం అసాధ్యం అని గౌతమ్ అంటాడు. ఏ తప్పు చేయని భార్య బయటికి రాదని ఇంత గట్టిగా ఎలా మాట్లాడుతున్నావ్ అని కార్తీక్ అడుగుతాడు. ఫైరింగ్ జరిగినప్పుడు నీ భార్య చేతిలోనే గన్ ఉందని గౌతమ్ అంటాడు. కానీ బుల్లెట్ వేరే గన్‌లో నుంచి వచ్చిందని కార్తీక్ చెబుతాడు. దీప ఏది చెబితే నువ్వు అదే నమ్ముతావని గౌతమ్ అంటాడు. నాకు, నీ మరదలికి పెళ్లి జరగకూడదని చాలా ట్రై చేసింది, కానీ ఫెయిల్ అయి లైఫ్‌ను రిస్కులో పెట్టుకుంది, గౌతమ్‌తో పెట్టుకుంటే అలాగే అవుతుందని అంటాడు. నువ్వు, జ్యోత్స్న కలిసి దీపను చంపాలనుకుంటున్నారా అని కార్తీక్ అడుగుతాడు.
ఇక ఆపు, నీ భార్యను శిక్ష నుంచి తప్పించేందుకు నేరం వేరే వాళ్లపై వేయొద్దు అని గౌతమ్ అంటాడు. సాక్ష్యం లేకుండా నన్ను ఏమీ చేయలేవని చెబుతాడు. మీ మరదలితో నా పెళ్లి ఎవరూ ఆపలేరు.. చేతనైతే నా భార్యను సేవ్ చేసుకొని అని చెబుతాడు. నువ్వు ఈ కేసు నుంచి నీ భార్యను తీసుకొచ్చి మగాడివని ప్రూవ్ చేసుకో అని కార్తీక్‌తో చెప్పి గౌతమ్ వెళ్లిపోతాడు. “వీడు ఇంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడంటే మామయ్యకు బుల్లెట్ తగిలేందుకు.. వీడికి సంబంధం లేదు. మరి ఆ మనిషి ఎవరై ఉంటారు. పట్టుకోవాలి. దీపను కాపాడాలి. ఈ జ్యోత్స్ననే ఏదో చేసింది” అని కార్తీక్ ఆలోచిస్తాడు.
జైలులో దీపను కలుస్తుంది అనసూయ. శౌర్య ఎలా ఉందని దీప అడిగితే.. లెటర్ ఇస్తుంది అనసూయ. “ఎప్పుడు వస్తావ్.. వస్తావని మాట ఇచ్చావ్.. నిన్ను తీసుకొస్తానిని నాన్న మాట ఇచ్చాడు నిన్ను చూపించమంటే చూపిండం లేదు, నీ దగ్గరికి వస్తానంటూ చూపించడం లేదు, నిన్ను పోలీసులు తీసుకెళ్లడం నేను చూశా. ఎప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్. నాన్నను అడిగితే ఏదేదో చెబుతున్నావ్. జ్యోను అడిగితే ఇక మీ అమ్మ రాదు అంటుంది. ఇక నువ్వు రావా అమ్మా. నీకు శౌర్య పాప వద్దా. నాకు అమ్మ కావాలి” అని అని శౌర్య రాసి ఉంటుంది. ఎక్కడ ఉన్నా త్వరగా రా.. ఎదురుచూస్తున్నా అని రాసి ఉంటుంది. ఈ లెటర్ చదువుతూ ఏడేస్తుంది దీప. శౌర్య అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.
నీకు పదేళ్లయినా శిక్ష పడుతుందని, నా కొడుకు, నీ కూతురు పరిస్థితి ఏంటి అని శ్రీధర్ అన్న మాటలను దీప గుర్తు చేసుకుంటుంది. బాధపడుతుంది. ఊరుకో దీప అని అనసూయ ఓదారుస్తుంది. ఇది బాధపడే టైమ్ కాదు.. నిర్ణయం తీసుకునే టైమ్ అని దీప చెబుతుంది. నేనంటే నా కూతురికి ఎంత ప్రేమో.. నేను లేకపోతే ఉండలేదని కూడా తెలుసని అంటుంది. దేవుడు నా కూతురికి మంచి నాన్నను ఇచ్చాడని, ఇచ్చేటప్పుడు ఎందుకో అర్థం కాలేదని, ఇప్పుడు అర్థమైందని దీప అంటుంది.
ఏం అర్థమైందని అనసూయ అడుగుతుంది. శౌర్యకు ఇంతకు ముందు నాన్న లేడు.. ఇక అమ్మ ఉండదు అని దీప అంటుంది. దీంతో దీప అని గట్టిగా అరుస్తుంది అనసూయ. అటు వైపు ఉన్నందుకు సరిపోయింది.. లేకపోతే అమ్మ ఉండదు అన్నందుకు చెంప పగిలేదని కోప్పడుతుంది. ఎన్ని చెంప దెబ్బలు కొట్టినా.. నాకు ఓ సాయం కావాలని దీప అడుగుతుంది. నువ్వు జీవితాంతం నా కూతురితోనే ఉండాలని అంటుంది. కాంచనకు అక్కగానే ఉండాలి, కార్తీక్ బాబు, శౌర్య, కాంచన, నువ్వు కలిసే ఉండాలని దీప అడుగుతుంది. నువ్వు కూడా కలిసే ఉంటావని కన్నీళ్లతో అనసూయ అంటుంది.
మళ్లీ మనం కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంటుందో లేదో అని దీప అంటుంది. “నువ్వు ఇలా మాట్లాడుతుంటే భయంగా ఉందే” అని అనసూయ చెబుతుంది. “ఏదైనా అవుతుందో లేదో తెలియనప్పుడే భయంగా ఉంటుంది. ఏమవుతుందో తెెలిసినప్పుడు భయం ఎందుకు. జాగ్రత్త ఉంటుంది. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో అత్తయ్య” అని దీప అంటుంది. ఏంటే ఈ అప్పగింతలు అని అనసూయ బాధపడుతుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 28) ఎపిసోడ్ ముగిసింది. మరి దీప ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
సంబంధిత కథనం