కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 14) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. బుల్లెట్ గాయమైన దశరథ్‍కు ఆసుపత్రిలో ఆపరేషన్ జరుగుతుంటుంది. శివన్నారాయణ, సుమిత్ర, జ్యోత్స్న, పారిజాతం ఏడుస్తూ ఉంటారు. నర్స్ బయటికి రావటంతో మా వాడికి ఎలా ఉందమ్మా అని శివన్నారాయణ అడుగుతాడు. “ఆపరేషన్ జరుగుతోంది. కండీషన్ చాలా సీరియస్‍గా ఉంది” అని నర్స్ చెబుతుంది. దీంతో శివన్నారాయణ, సుమిత్ర మరింత కంగారు పడతారు. కన్నీళ్లు పెట్టుకుంటారు. డాడీకి ఏమవదు.. మమ్మీ అని సుమిత్రను ఓదారుస్తుంది జ్యోత్స్న.
మామయ్య దశరథ్‍కు ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆసుపత్రికి వస్తాడు కార్తీక్. మావయ్యకు ఎలా ఉందని తాత శివన్నారాయణను అడుగుతాడు. ముందు నువ్వు బయటికి వెళ్లు అంటూ శివన్నారాయణ ఫైర్ అవుతాడు. ఎలా ఉందని కార్తీక్ మళ్లీ అడిగితే.. పోరా బయటికి అంటూ తోసేస్తాడు. కొట్టినా పర్లేదు మామయ్యకు ఎలా ఉందో చెప్పాలని కార్తీక్ అడుగుతాడు. నువ్వు ఇలా వినవు అంటూ శివన్నారాయణ కోప్పడుతుంటే.. ఆగండి అని సుమిత్ర చెబుతుంది.
మామయ్యకు ఎలా ఉంది అత్తా అని సుమిత్రను కార్తీక్ అడుగుతాడు. “మా ఆయనకు ఏమైనా జరిగితే దీపకు అన్యాయం జరుగుతుందని భయపడుతున్నావా” అని కన్నీళ్లతో సుమిత్ర అంటుంది. దీప ఎలాంటిదో నీకు బాగా తెలుసని కార్తీక్ చెబుతాడు. సుమిత్ర మాత్రం బాధలో చాలా మాటలు అంటుంది.
“నాకు అన్యాయం చేసింది దీప కాదు నువ్వే.. నా భర్త చావు బతుకుల మధ్య ఉండడానికి కారణం దీప కాదు నువ్వు” అని సుమిత్ర బాధగా ఉంటుంది. డాడీని షూట్ చేసింది దీప అయితే.. బావ ఏం చేశాడని జ్యోత్స్న అంటుంది. అంతా చేసింది మీ బావేనని సుమిత్ర అరుస్తుంది. ఈరోజు కుటుంబం ఇలా బాధపడేందుకు కారణం మీ బావే అని జ్యోత్స్నతో అంటుంది. నేనా అని కార్తీక్ అడిగితే.. అవును రా నువ్వే అని చెబుతుంది. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే భయంతో గుండె ఆగిపోయేలా ఉందని సుమిత్ర ఏడుస్తుంది.
నేనేం చేశా అత్త అని కార్తీక్ అడుగుతాడు. దీప మెడలో తాళి కట్టావ్ రా అని సుమిత్ర అంటుంది. దీపను పెళ్లి చేసుకోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని నిందిస్తుంది. దీప మెడలో తాళి కట్టకపోయి ఉండే మా జీవితాల్లో ఆమె ఉండేది కాదని చెబుతుంది. దీప మెడలో తాళి కట్టి రెండు కుటుంబాలను ఎప్పుడూ కలవని శత్రువులను చేశావని సుమిత్ర అంటుంది. ఆ మాటకు కార్తీక్ తల్లిడిల్లిపోతాడు. జ్యోత్స్నను పెళ్లి చేసుకొని ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవని అంటుంది.
ఇంటి ఆడపడుచు కాంచనను కలుపుకుపోవాలని తాము చాలా మెట్లు దిగొచ్చామని కాంచన అంటుంది. కానీ దీప మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తోందని ఆగ్రహిస్తుంది. నువ్వు సమర్థిస్తున్నావని కార్తీక్‍పై ఫైర్ అవుతుంది. దీప మీ ఇంటికి రావడం నాకు తెలియదని కార్తీక్ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు.
తెలియదు రా.. నీకు ఏం తెలియదు అంటూ శివన్నారాయణ అందుకుంటాడు. నిశ్చితార్థం ఆపినప్పుడు, గౌతమ్ కడుపు చేశాడని ఎవరో అమ్మాయిని తీసుకొని రావడం ఇవన్నీ పట్టించుకున్నావా అని అడుగుతాడు. నిజంగానే తెలియదు తాతా.. అని కార్తీక్ చెబుతాడు. దీప స్వయంగా నీ మేనమామనే కాల్చింది రా అని బాధపడతాడు శివన్నారాయణ.
ఆ బుల్లెట్ దశరథ్‍కు తలగలకపోయి ఉంటే జ్యోత్స్నకు తగిలేదని శివన్నారాయణ అంటాడు. అంటే దీప ఉద్దేశం నా మనవరాలిని చంపాలనే కాదా అని అడుగుతాడు. కాదు అనేలా కార్తీక్ బాధగా తలఊపుతాడు. నీకేం చెప్పకుండానే ఇవన్నీ నీ భార్య చేస్తుంటే చేతకాని వాడిలా ఉన్నావా అని శివన్నారాయణ అంటాడు.
అవును నేను చేతకాని వాడినే తాత అని కార్తీక్ అరుస్తాడు. అందుకే ఎవరి తిట్టినా.. కొట్టినా భరించానని, నిన్ను వదులుకోలేకపోయానని.. అదే నా చేతకాని తనం అని కార్తీక్ అంటాడు. అవమానాలు పడ్డానని, బంధాల కోసం మనుషులను కాపాడుకోవడంలో నా చేతకానితనం ఉందని చెబుతాడు. కత్తుల్లాంటి మాటలతో చీలుస్తారని తెలిసినా ఇప్పుడు కూడా మామయ్య కోసమే వచ్చానని కన్నీళ్లతో అంటాడు కార్తీక్. నువ్వు వచ్చింది.. నీ మేనమామకు ఏమైనా అయితే దీపకు ఏమవుతుందా అనే వచ్చావని పారిజాతం వెటకారంగా మాట్లాడుతుంది.
ఇప్పుడైనా దీపను వదిలిపెడతానని అనుకుంటున్నావా అని శివన్నారాయణ ఆగ్రహంగా అంటాడు. “వీడి పెళ్లాం మళ్లీ జీవితంలో బయటికి రాలేదు” అని చెబుతాడు. దీప ఎన్ని తప్పులు, పాపాలు చేసినా ఈ దరిద్రులతో మనకెందుకు అని ఛీ కొట్టి వదిలేశానని చెబుతాడు. దీప మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని పసిగట్టి ఉంటే.. చేయాల్సిన శాస్తి ఏనాడో చేసి ఉండేవాడనని అరుస్తాడు.
“రేయ్ కార్తీక్. దశరథ్ నా ఒక్కగానొక్క కొడుకు మాత్రమే కాదు. నా యావదాస్తికి, నా పరపతికి, నా పరువుకు, నా పంచప్రాణాలకు వాడే వారసుడు. వాడికి ఏమీ కాకపోతే నీ భార్య కనీసం జైలులో అయినా ఉంటుంది. ఏదైనా అయిందో ప్రాణానికి ప్రాణం లెక్కగట్టాల్సిందే” అని గట్టి వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. ఈ మాట వెళ్లి మీ ఆవిడకు చెప్పు అని కార్తీక్ చెబుతాడు. దశరథ్‍కు ఏమైనా జరిగితే దీపను ప్రాణాలతో వదలననేలా హెచ్చరిస్తాడు శివన్నారాయణ.
తాను గొడవ పడేందుకు రాలేదని, మామయ్యను చూసేందుకు వచ్చానని బాధగా అంటాడు కార్తీక్. అవసరం లేదు అని అరుస్తాడు శివన్నారాయణ. నా భర్తను ఎవరూ చూడాల్సిన అవసరం లేదని సుమిత్ర అంటుంది. లోపల ఆపరేషన్ జరుగుతోంది, కండీషన్ సీరియస్‍గా ఉందంట అని చెబుతుంది. ఏం జరుగుతుందో ఇంకా డాక్టర్లు చెప్పలేదని అంటుంది. నీ భార్య ఎవరో ఒకరి చావు చూసే వరకు ప్రశాంతంగా నిద్రపోదని ఏడుస్తుంది సుమిత్ర.
నీకు దండం పెడతా రా వెళ్లిపో అని కార్తీక్‍పై గట్టిగా అరుస్తుంది కాంచన. మీరు కావాలనుకొని ఆశ పడ్డానని, ఆ పాపానికి పెద్ద బహుమతే ఇచ్చార్రా.. వెళ్లు అని అంటుంది. కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. కళ్ల ముందు పెళ్లాం ఉంటే ఎవరూ కనపడరు కదా అని పారిజాతం అంటుంది. వెళ్లిపో బావ అని జ్యోత్స్న కూడా చెబుతుంది. “తప్పు చేసిన మనిషి తరఫున నువ్వెందుకు మాట పడతావ్, దీప ఏం చేసిందో నీకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. నీ చేతికి అంటుకున్న రక్తపు మరకలే దీప చేసిన పాపానికి సాక్ష్యం” అని జ్యోత్స్న అంటుంది. దీంతో దశరథ్ రక్తం అంటిన తన చేతులను కార్తీక్ చూసుకుంటాడు.
ఇప్పుడు నీ ఓదార్పు ధైర్యం చెప్పలేదని జ్యోత్స్న అంటుంది. డాడీకి ఏం కాదని డాక్టర్ చెప్పేవరకు తాము మామూలు మనుషుం కాలేమని చెబుతుంది. ప్లీజ్ బావా వెళ్లిపో అని అడుగుతుంది. మీ అమ్మ, మీ చెల్లి, మీ బావమరిది, ఆ అనసూయ.. కట్టగట్టుకొని వస్తారేమో.. ఎవ్వరూ ఇక్కడికి రావడానికి వీల్లేదని శివన్నారాయణ అంటాడు. వస్తే ఎలాంటి మర్యాద చేయాలో నాకు తెలుసు అని హెచ్చరిస్తాడు.
అలాగే నువ్వు కూడా ఇక రావొద్దు.. ఇక పోరా అని శివన్నారాయణ అరుస్తాడు. దీంతో బాధగా అక్కడి నుంచి వెళతాడు కార్తీక్. శివన్నారాయణ, సుమిత్ర మాటలను గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ మెట్లు దిగుతాడు. బాధగా వెళుతుంటాడు. సుమిత్ర కూడా బోరున విలపిస్తుంటుంది.
అమ్మానాన్న ఇంకా రావడం లేదు అని కాంచనతో అంటుంది శౌర్య. ఇంతలో కార్తీక్ వస్తాడు. నానమ్మ కిందపడి పోయిందని కార్తీక్‍తో శౌర్య అంటుంది. ఏమైందని కార్తీక్ అంటే.. లోబీపీ వచ్చినట్టుందని కాంచన చెబుతుంది. ఇంతకీ దీప ఏదిరా అని అడుగుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలని ఆలోచనలో పడతాడు కార్తీక్. రౌడీ నీకు హోం వర్క్ ఏమీ ఇవ్వలేదా అని శౌర్యను కార్తీక్ అడుగుతాడు. రెస్టారెంట్‍లో దీప ఉందని.. లేదని కార్తీక్ తడబడతాడు.
దీప స్టేషన్‍లో ఉందని కార్తీక్ చెబుతాడు. స్టేషన్‍లో ఉండడమేంటని కాంచన అడుగుతుంది. పని మీద వేరే ఊరికి వెళ్లేందుకు బస్ స్టేషన్‍కు వెళ్లిందని అబద్దం చెబుతాడు కార్తీక్. నాతో చెప్పకుండా ఎలా వెళుతుందని శౌర్య ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. హోం వర్క్ చేసుకోకుండా ఇన్ని ప్రశ్నలు అవసరమా.. లోపలికి వెళ్లి చదువుకో అంటూ చిరాకుగా అరుస్తాడు కార్తీక్. శౌర్య లోపలికి వెళుతుంది.
దీప మీ తాత ఇంటికి వెళ్లలేదా అని కాంచన అడుగుతుంది. కార్తీక్ మాత్రం మౌనంగా ఉంటాడు. ఒరేయ్ కార్తీక్ మాట్లాడవేంట్రా అని కాంచన అంటుంది. దీంతో ఏడుస్తూ అక్కడిక్కడే మోకాళ్లపై కుప్పకూలుతాడు కార్తీక్. దీపకు ఏం కాలేదు కదా అని కంగారుగా అడుగుతుంది కాంచన. దీప గన్ పట్టుకున్నప్పుడు దశరథ్‍కు బుల్లెట్ తగలడం, తాను గన్ పేల్చలేదని దీప చెప్పిన విషయాలను కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. సుమిత్ర, శివన్నారాయణ అన్న మాటను గుర్తు చేసుకొని బాధపడతాడు.
మిమ్మల్ని ఇలా చూస్తుంటే భయంగా ఉంది కార్తీక్ బాబు.. దీపకు ఏమైందో చెప్పాలని అనసూయ అడుగుతుంది. అమ్మా ఇది నువ్వు విని తట్టుకోలేవని నాకు తెలుసు, కానీ చెప్పాలి అని కాంచనతో కార్తీక్ చెబుతాడు. ఏమైంది చెప్పు అని కాంచన అంటుంది. చెప్పడానికే భయంగా ఉందని కార్తీక్ అంటే.. చెప్పు అని కాంచన అంటుంది. “దీప బస్ స్టేషన్‍లో లేదు.. పోలీస్ స్టేషన్‍లో ఉంది” అని కార్తీక్ నిజం చెబుతాడు. “ఏం జరిగిందో అర్థం కావడం లేదు. జ్యోత్స్నకు దీపకు గొడవైంది. జ్యోత్స్న తాత రివాల్వర్ తెచ్చింది. మాటలతో దీపను రెచ్చగొట్టింది. దీప ఆ కోపంతో రివాల్వర్ తీసుకుందట. గన్ ఫైర్ అయింది. బుల్లెట్ మామయ్యకు తగిలింది” అని కార్తీక్ చెబుతాడు. దీంతో కాంచన, అనసూయ షాక్ అవుతారు. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 14) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం