కార్తీక దీపం 2 నేటి (మార్చి 20) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న నిశ్చితార్థానికి కార్తీక్ రెస్టారెంట్‍కు క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తుంది పారిజాతం. పేరు, ఫోన్ నంబర్ రాసి మేనేజర్‌కు ఇస్తుంది. ఆర్డర్ క్యాన్సిల్ చేయడాలు లాంటివి ఉండవు కదా అని పారు అడుగుతుంది. మా తరఫు నుంచి క్యాన్సల్ చేస్తే డబుల్ పేమెంట్ తిరిగిస్తామని, ఇది కార్తీక్ పెట్టిన రూల్ అని మేనేజర్ చెబుతాడు. అక్కడి నుంచి పారు వెళుతుంది.
ఇంతలోనే కార్తీక్, దీప సైకిల్‍పై రెస్టారెంట్‍కు వస్తుంటారు. వారిని చూసి జ్యోత్స్న కంగారు పడుతుంది. ఇంకా పారిజాతం రాలేదేంటని టెన్షన్ పడుతుంది. ఇంతలోనే పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. కారు ఎక్కుతుంది. కార్తీక్ కంట పడకుండా తప్పించుకుంటుంది. వెంటనే కారెక్కాలని పారుతో అంటుంది జ్యోత్స్న. ఆర్డర్ కన్ఫర్మ్ అయింది కదా అని జ్యోత్స్న.. అంటే నీ పనులు అర్థం కాలడం లేదంటుంది పారిజాతం.
పెద్ద ఆర్డర్ వచ్చిందని రెస్టారెంట్‍లోకి వచ్చిన కార్తీక్, దీపతో మేనేజర్ అంటాడు. ఎవరు ఇచ్చారని కార్తీక్ అడుగుతాడు. అత్యధిక ధర మీల్స్ ఆర్డర్ ఇచ్చారని, రూ.3లక్షలు తీసుకోండని మేనేజర్ అంటాడు. ఏం పేరు అని కార్తీక్ అడిగితే.. పారిజాతం రాసిన చీటి ఇస్తాడు మేనేజర్. తన తాత శివన్నారాయణ పేరు చూస్తాడు కార్తీక్. ఎవరని దీప అడిగితే.. శివన్నారాయణ అని ఉందని అంటాడు.
తాతయ్య వచ్చారా అని దీప అంటే.. అది కలలో కూడా జరగదని కార్తీక్ అంటాడు. వచ్చిందెవరని మేనేజర్‌ను కార్తీక్ అడిగితే.. పెద్దావిడ అని బదులిస్తాడు. పారిజాతం ఫొటోను చూపిస్తే.. ఆమెనే ఆర్డర్ ఇచ్చారని మేనేజర్ చెబుతాడు. నేను వచ్చే వరకు ఆగకుండా ఆర్డర్ ఎందుకు కన్ఫర్మ్ చేశావని కార్తీక్ అంటాడు.
వాళ్లు మనకెందుకు ఆర్డర్ ఇచ్చారు కార్తీక్ బాబు అని దీప అంటుంది. అవమానించడానికి అని కార్తీక్ బదులిస్తాడు. ఎవరు అని దీప అడిగితే.. జ్యోత్స్న అయి ఉండొచ్చు.. తాత అయిండొచ్చని చెబుతాడు. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే డబుల్ అమౌంట్ ఇవ్వాలని, ఆర్డర్ ఇచ్చారు కదా మెనూ ఏం కావాలో అడుగుదాం పదా అని కార్తీక్ అంటాడు. స్వయంగా ఇంటికి వెళ్లి మెనూ రాసుకొద్దాం పదా అని చెబుతాడు. గొడవ అవుతుందని దీప భయపడుతుంది. ఇరు కుటుంబాల మధ్య గొడవ పెట్టేందుకు జ్యోత్స్ననే పారిజాతంతో ఈ పని చేయించి ఉంటుందని అనుమానిస్తుంది.
ఇక్కడికి వెళ్లావని జ్యోత్స్నను సుమిత్ర అడిగితే.. చిన్న పని ఉండి వెళ్లామని పారిజాతం బదులిస్తుంది. జ్యోత్స్న నిశ్చితార్థం కోసం చీర సెలెక్ట్ చేస్తుంటుంది సుమిత్ర.
తాత శివన్నారాయణ ఇంటికి దీపతో కలిసి వెళతాడు కార్తీక్. కాలింగ్ బెల్ కొడితే పారిజాతం వెళుతుంది. కార్తీక్, దీపను చూసి షాక్ అవుతుంది. ఎవరొచ్చారని సుమిత్ర అరిస్తే.. ఇంకెవరు నీ మేనల్లుడు, నీ మేనల్లుడి పెళ్లాం అని పారిజాతం బదులిస్తుంది. దీప, కార్తీక్ ఇప్పుడెందుకు వచ్చారని దశరథ్ అంటే.. నువ్వు వస్తావ్ బావ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
కార్తీక్ అని సుమిత్ర పలుకరిస్తుంది. దీపను కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. లోపలి రా అనిపిస్తుంది. సారీ మేడమ్.. ఇది శివరేఖ మేం దాటలేమని కార్తీక్ అంటాడు. మేడం ఏంటి అని సుమిత్ర అడుగుతుంది. నేను కార్తీక్‍గా రాలేదు మేడం అని కార్తీక్ అంటే.. దీప భర్తగా వచ్చావా అని దశరథ్ ప్రశ్నిస్తాడు. మెనూ చెప్పే రాసుకుంటానని కార్తీక్ అంటాడు. మామ దశరథ్‍ను కూడా సార్ అనిపిస్తాడు.
నువ్వు మెనూ రాసుకోవడం ఏంటి సుమిత్ర అంటుంది. క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చారు కదా అని కార్తీక్ అడుగుతాడు. ఈ ఇంట్లో జరగబోయే నిశ్చితార్థానికి భోజనాలకు మా రెస్టారెంట్‍లోనే ఆర్డర్ చేశారండని దీప చెబుతుంది. ఎవరు చేశారని సుమిత్ర అంటుంది. ఇంకెవరు.. ఈ పారిజాతం అని కార్తీక్ చెబుతాడు. ఆర్డర్ ఇచ్చింది తానేనని.. కానీ జ్యోత్స్న ఇమ్మంటనే ఇచ్చానని పారిజాతం అంటుంది. నువ్వెందుకు ఇచ్చావని దశరథ్ అడుగుతాడు.
నిశ్చితార్థానికి అత్త ఫ్యామిలీతో సహా ఎంగేజ్‍మెంట్‍కు రావాలని మీరే కోరుకున్నారు కదా అని జ్యోత్స్న బదులిస్తుంది. “నోరు మూయ్. ఇదేనా మా బాధను అర్థం చేసుకుంది. వదినను రావాలనుకుంది ఈ ఇంటి ఆడపడుచుగా. ఈ ఇంట్లో శుభకార్యంలో భోజనాలు వడ్డించే మనిషిగా కాదు” అని సుమిత్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బుద్ధిలేని పని చేశాను అంటావ్ అని దశరథ్ కూడా జ్యోత్స్నపై కోప్పడతాడు. ఏం పిన్ని నువ్వైనా తప్పని చెప్పాలి కదా అని పారును అడుగుతాడు. తప్పేముంది సార్ అని కార్తీక్ అంటాడు.
తమను సార్, మేడమ్ అని కార్తీక్ అంటుంటే దశరథ్ బాధపడతాడు. “దూరమైపోండ్రా.. అత్త అని పిలువాల్సిన చోట మేడమ్ అని. మామ అనాల్సిన చోట సార్ అని.. మనుషులను నువ్వు, మీ అమ్మ దూరం చేసేయండి” అని దశరథ్ బాధగా అరుస్తాడు. ఎవరిని ఎవరు దూరం చేస్తున్నారో మీకు తెలియదా అని కార్తీక్ అంటాడు.
ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే ఆరోజే గట్టిగా ఆపాల్సిందని దశరథ్ అంటాడు. ఆరోజు తండ్రికి, చెల్లికి మధ్య మూగవాడిలా నిలడిపోయానని చెబుతాడు. నిలబడి చూస్తే పరిస్థితులు అలాగే ఉంటాయి మామయ్య.. ఓ అడుగు ముందుకేస్తేనే మారతాయని కార్తీక్ అంటాడు. మీరే వేశారు కదా బయటికి అడుగు అని దశరథ్ అంటాడు. నువ్వు వేసిన అడుగు మా అన్నాచెల్లెళ్ల మధ్య, మా తండ్రీకూతుళ్ల మధ్య, మా తండ్రీకొడుకుల మధ్య పడిందని ఎమోషనల్‍గా అంటాడు. తనకు చెల్లి సుమిత్ర దూరమవుతోందని దశరథ్ బాధపడతాడు. దూరం తగ్గిద్దామని ప్రయత్నిస్తున్నా సాధ్యం కాలేదని అంటాడు.
నా కూతురు నిశ్చితార్థంలో నా చెల్లి ఉండాలని తాను ఎంతో ఆశిస్తున్నానని దశరథ్ అంటాడు. నీ తండ్రి మాటలను కాదని ఇంట్లోకి తీసుకెళ్లగలవా అని కార్తీక్ అడుగుతాడు. నీకే అంత పంతం ఉంటే.. నా తండ్రికి ఎంత ఉండాలని దశరథ్ అంటాడు. ప్రేమల కంటే పంతాలు గొప్పవైనవని అనుకున్నప్పుడు.. కావాల్సినవి వదులుకోవడానికి సిద్ధమవ్వాలి మామయ్య అని కార్తీక్ అంటాడు
ఒకవేళ తాత చెబితే ఆ మాట విని అత్తను వదిలేస్తావా అని కార్తీక్ అడుగుతాడు. వదలను అని దశరథ్ అంటాడు. నేను కూడా అదే పని చేశానని కార్తీక్ అంటాడు. నా భార్య ఎవరికో నచ్చలేదని, నా భార్య పేరుపై రెస్టారెంట్ పెట్టడం ఎవరికో నచ్చలేదని నేను ఎందుకు వదలానని చెబుతాడు. తెగే వరకు లాగితే ఏ బంధం కూడా నిలబడదని అంటాడు.
ఇంట్లో శుభకార్యానికి ఊరంతా పిలిచారని, కానీ ఈ ఇంటి ఆడపడుచును పిలిచారా అని దశరథ్‍ను కార్తీక్ అడుగుతాడు. ఆ అమ్మకు ఫోన్ చేసి నిశ్చితార్థం అని చెప్పారే కానీ.. రావాలంటూ పిలిచారా అని అడుగుతాడు. పిలవనందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలియదు.. పిలుపు రానందుకు నా తల్లి ఎంత బాధపడుతుందో నాకు తెలుసునని కార్తీక్ చెబుతాడు. రామాయణంలో రామలక్ష్మణుల గురించి కార్తీక్ గుర్తుచేస్తాడు. మా అమ్మ పోతే నీకు ఇంకో చెల్లి దక్కుతుందా అని దశరథ్‍ను అడుగుతాడు. తనకు చెల్లి అంటే ప్రాణమని, కానీ జన్మనిచ్చిన తండ్రి ఏమవుతాడురా అని దశరథ్ అడుగుతాడు.
చెల్లి కోసం గడప దాటితే తన తండ్రి బాధపడతాడని దశరథ్ అంటాడు. తన కన్నీళ్లు ఈ ఇంట్లో అద్దానికి తప్ప ఎవరికీ తెలుసంటూ ఎమోషనల్‍గా మాట్లాడతాడు. తెగించడానికి నిమిషం చాలు.. కానీ భరించడానికి జీవితం సరిపోదని అంటాడు. కన్నీళ్లు, బాధ కనిపించకుండా చాలా మోస్తున్నానని చెబుతాడు. మిమల్ని బాధపెట్టి ఉంటే సారీ.. కానీ నేను మెనూ రాసుకునేందుకు వచ్చానని కార్తీక్ అంటాడు.
ఈ మనిషిని ఎందుకు తీసుకొచ్చావని దీపను చూసి కార్తీక్‍ను సుమిత్ర అడుగుతుంది. తను నా భార్య అని కార్తీక్ అంటాడు. కొన్ని నాకు సమాధానాలు చెప్పుకోవాల్సినవి ఉన్నాయని సుమిత్ర అంటుంది. ఆధారాలతో వస్తానని అన్నావ్ కదా.. ఎక్కడ ఆధారాలు అని ప్రశ్నిస్తుంది. ఆ విషయం వదిలేయాలని దీప చెబుతుంది. అంటే జ్యోత్స్నను అపార్థం చేసుకున్నావని అన్నట్టే కదా అని సుమిత్ర అంటుంది. ఆధారాలు దొరకలేదనన్న మాట, నా కూతురు నిర్దోషి అని నాకు తెలుసు దీప అని చెబుతుంది. నేను చెప్పిన మాటతోనే వీరు ఆ విషయాన్ని వదిలేశారని దశరథ్ మనసులో అనుకుంటాడు.
నేను కూడా ఇక్కడితే ఈ విషయాన్ని వదిలేస్తానని, కార్తీక్, దీప లోపలికి రండని సుమిత్ర పిలుస్తుంది. సారీ మేడమ్, మేం సత్యరాజ్ రెస్టారెంట్ తరఫున వచ్చామని కార్తీక్ అంటాడు. చెబుతుంటే అర్థం కావడం లేదా అని సుమిత్ర అరుస్తుంది. పెద్దాయనను పిలవాలని కార్తీక్ అంటే.. ఇంట్లో లేరని పారిజాతం అంటుంది. అదీ సంగతి, ఇంత సేపైనా సింహం కనిపించడం లేదేంటా అని చూస్తున్నానని కార్తీక్ చెబుతాడు.
ఇంతలో శివన్నారాయణ అక్కడికి వస్తాడు. తాత వచ్చాడు అని భయపడుతుంది జ్యోత్స్న, పారిజాతం కంగారు పడుతుంది. ఈ విషయం తెలిస్తే ఎవరినీ క్షమించడని సుమిత్ర అంటే.. తెలియకుండా ఎలా ఉంటుందని కార్తీక్ అంటాడు. వీళ్లను ఎవరు పిలిచారని శివన్నారాయణ అడుగుతాడు. దీప ఆధారాలు తీసుకొచ్చారా అని అంటాడు. కోపం మునిగిందని భయపడుతుంది పారు.
మేం వచ్చింది మీరు అనుకునే దానికి కాదు సార్.. మీ మనవరాలి ఎంగేజ్‍మెంట్‍కు క్యాటరింగ్ మా రెస్టారెంట్‍కే ఇచ్చారని కార్తీక్ చెబుతాడు. దీంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. మెనూలో ఏ స్పెషల్స్ కావాలో చెబితే రాసుకుంటామని కార్తీక్ చెబుతాడు. మీకు క్యాటరింగ్ ఎవరు ఇచ్చారని శివన్నారాయణ అడిగితే.. కాబోయే పెళ్లి కూతురు అని సమాధానమిస్తాడు కార్తీక్. దీంతో జ్యోత్స్న వైపు శివన్నారాయణ చూస్తాడు. నేనే ఇచ్చా తాత అని జ్యోత్స్న చెబుతుంది. మెనూ చెబితే మేం వెళతామని కార్తీక్ అడుగుతాడు. అన్నీ ఫోన్‍లో చెబుతామని శివన్నారాయణ అంటాడు. నువ్వు లోపలికి రా అని జ్యోత్స్న పిలుస్తాడు. పెంట చేశావ్ కదా అని పారిజాతం అంటే.. మీరేం చేశారో అని వెటరిస్తాడు కార్తీక్.
వెళ్లి వస్తాం మేడమ్.. మెనూ ఫోన్‍లో పంపండని సుమిత్రతో కార్తీక్ అంటాడు. వచ్చిన పని అయిపోయింది పదా అని కార్తీక్ చెబుతాడు. సైకిల్‍పై వెళ్లేందుకు కార్తీక్, దీప సిద్ధమవుతారు. సుమిత్ర వారిని బాధగా చూస్తుంటుంది. ఇక్కడికి వచ్చి ఏం సాధించామని, ఫోన్‍లో అడిగితే సరిపోయేది కదా అని కార్తీక్‍తో దీప అంటుంది. అలా అయితే అందరికీ తెలియదు కదా అని కార్తీక్ అంటాడు. ఈ ప్లాన్ తాతదేమో అనుకున్నా.. రావడం వల్ల కాదని అర్థమైంది.
జ్యోత్స్నను తిడతారు కదా అని దీప అంటే.. కొడితే నీకు ఏమైనా ప్రాబ్లమా అంటాడు కార్తీక్. తప్పు చేస్తే నేనే కొడతా అని దీప అంటుంది. ఈపాటికి ఇంట్లో అదే జరుగుతుంటుందని కార్తీక్ అంటాడు. శౌర్య విషయంలో జరిగిన పెద్ద తప్పును ధశరథ్ వల్ల క్షమించగలిగా.. ఇప్పుడు మళ్లీ గొడవ ఎందుకు బాబు అని దీప అంటుంది. దీప.. మనం ఎవరి జోలికి వెళ్లొద్దు.. ఎవరైనా మన జోలికి వస్తే వదలొద్దు అని కార్తీక్ అంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (మార్చి 20) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం