Karthika Deepam Serial February 17: శౌర్యపై ఒట్టు వేయించిన దీప.. కోప్పడిన కార్తీక్.. జ్యోత్స్నకు తాత ప్రశంస.. దశరథ్ డౌట్-karthika deepam serial today episode february 17th deepa restricted karthik jyothsna in tension star maa channel hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam Serial February 17: శౌర్యపై ఒట్టు వేయించిన దీప.. కోప్పడిన కార్తీక్.. జ్యోత్స్నకు తాత ప్రశంస.. దశరథ్ డౌట్

Karthika Deepam Serial February 17: శౌర్యపై ఒట్టు వేయించిన దీప.. కోప్పడిన కార్తీక్.. జ్యోత్స్నకు తాత ప్రశంస.. దశరథ్ డౌట్

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 17, 2025 07:22 AM IST

Karthika Deepam Serial Today Episode February 17: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో కొత్త టిఫిన్ బండిని దీప కొంటుంది. అయితే, శౌర్యపై ఒట్టు వేయించి మరీ కార్తీక్ దగ్గర ఓ మాట తీసుకుంటుంది. దాసు కోసం హోమం చేయాలని పారిజాతం అనుకుంటే అడ్డుపడేందుకు జోత్స్న ప్రయత్నిస్తుంది. పూర్తిగా ఏం జరిగిందంటే...

Karthika Deepam Serial February 17: శౌర్యపై ఒట్టు వేయించిన దీప.. కోప్పడిన కార్తీక్.. జ్యోత్స్నకు తాత ప్రశంస.. దశరథ్ డౌట్
Karthika Deepam Serial February 17: శౌర్యపై ఒట్టు వేయించిన దీప.. కోప్పడిన కార్తీక్.. జ్యోత్స్నకు తాత ప్రశంస.. దశరథ్ డౌట్

కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 17) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. తప్పుడు లెక్కలు రాసి బిజినెస్‍లో నష్టాలను లాభాలుగా చూపించాలని అకౌంటెట్‍తో ఫోన్‍లో మాట్లాడుతుంది జ్యోత్స్న. నిజం ఎవరికీ తెలియకూడదని అంటుంది. వెనుక నుంచి ఆ మాట విన్న దశరథ్ ఎన్ని నిజాలని దాస్తావ్ జ్యోత్స్న అని అంటాడు. తప్పును దాచాలని అనుకుంటే.. అది చాలా తప్పులను చేయిస్తుందని చెబుతాడు. “డాడీ మాట్లాడుతుంది ఫోన్ కాల్ వినా.. లేకపోతే దాసు గురించా” అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అడుగుతుంది.

నా మాటలు నీకు అర్థం కావడం లేదా

కొన్ని రోజుల నుంచి నేనోదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారని జ్యోత్స్న అంటుంది. నా మాటలు నీకు అర్థం కావడం లేదా జ్యోత్స్న అని దశరథ్ అడుగుతాడు. లేదంటూ జ్యోత్స్న అంటుంది. దేని గురించి అబద్ధం చెప్పానని అడుగుతుంది. దేని గురించి నిజం చెప్పలేకపోతున్నావో.. దాని గురించే అబద్ధం చెబుతున్నావని దశరథ్ అంటాడు. ఇవ్వాల్సిన వాళ్లే క్లారిటీ ఇస్తారంటూ పరోక్షంగా దాసు గురించి అన్నట్టుగా మాట్లాడతాడు. వాళ్లెవరు అని జ్యోత్స్న అంటుంది. నీకు నాకు తెలిసి వాళ్లే అని దశరథ్ అంటాడు.

భగవంతుడు కూడా కాపాడలేడు

ఈ గేమ్ ఇక్కడితో ఆపేద్దామని, ఏం అడాలనుకుంటున్నారో నేరుగా అడగాలని జోత్స్న అంటుంది. “స్ట్రైట్‍గా అడగాలంటే దాసు నిజం చెప్పాలి. అంత వరకు నేనేం మాట్లాడలేను” అని మనసులో అనుకుంటాడు దశరథ్. నువ్వు ఏ తప్పు చేయడం లేదా అని జ్యోత్స్నను అడుగుతాడు. తప్పు చేయడం లేదని జ్యోత్స్న అంటుంది. ఆడిట్ విషయంలో తప్పు జరుగుతోందని దశరథ్ అనడటంతో జ్యోత్స్న కాస్త ఊరట కలిగినట్టు అవుతుంది. తప్పు ఉంటే సరి చేసుకోవాలని, బాధ్యతలను, నమ్మకాన్ని కాపాడుకోవాలని దశరథ్ సూచిస్తాడు. తప్పులు సరిదిద్దుకోకపోతే భగవంతుడు కూడా కాపాడలేడని హెచ్చరిస్తాడు. దాసు విషయంలో డాడీకి నా మీద ఏదో అనుమానం వచ్చిందని జ్యోత్స్న అనుకుంటుంది. “నా జీవితాన్ని దూరం చేసేందుకు ప్రయత్నించే ఎవరినైనా వదిలిపెట్టను” అని జ్యోత్స్న ఆలోచిస్తుంది.

కొత్త టిఫిన్ బండి

టిఫిన్లు అమ్మేందుకు దీప కొత్త బండి కొంటుంది. దాన్ని శుభ్రం చేస్తుంటుంది. దీప ఈ బండి ఎవరిదని కార్తీక్ అడిగితే.. మనదే అని దీప బదులిస్తుంది. మనమే కొన్నామని సంతోషంగా చెబుతుంది కాంచన. తెలసినవాళ్లను అడిగితే తక్కువ రేటులో బండి ఇప్పించారని దీప అంటుంది. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదంటూ.. ముగ్గురం ఓ మాట అనుకొని తీసుకున్నామని చెబుతుంది.

మీకు సంబంధం లేదు

తనకు చెప్పకుండా టిఫిన్ బండి తీసుకున్నారా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. “ఈ టిఫిన్ సెంటర్‌కు మీకు ఏ సంబంధం లేదు” అని దీప అంటుంది. అంటే ఏంటి అని కార్తీక్ అడుగుతాడు. ఈ ఇడ్లీ బండిని తానే నడుపుతానని, మీకు ఏ సంబంధం లేదని చెబుతుంది. దీపకు సాయంగా ఉంటానని కాంచన, అనసూయ చెబుతారు.

శౌర్యపై ఒట్టు.. కోపంలో కార్తీక్

అమ్మకు సాయంగా నేను కూడా ఉంటానంటూ శౌర్య అక్కడికి వస్తుంది. మీ నలుగురు ఒక్కటై పోయారా.. నన్నెందుకు దూరం పెడుతున్నారని కార్తీక్ అడుగుతాడు. క్యాటరింగ్‍లో జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు దీప అని కార్తీక్ అంటాడు. “మీరు ఈ బండి వద్దకు రావొద్దు కార్తీక్ బాబు. వస్తే శౌర్య మీద ఒట్టే” అని శౌర్య తలపై చేయి పెట్టించి ప్రమాణం చేయిస్తుంది దీప. దీంతో.. రానురాను నీ ప్రవర్తనకు అర్థం లేకుండా పోతుందని కోపంతో అక్కడి నుంచి ఇంట్లోకు వెళతాడు కార్తీక్. విషయం అర్థమయ్యయేలా చెప్పాల్సింది కదా అని దీపతో కాంచన అంటుంది.

మీరు గెలువడానికే..

కార్తీక్‍కు సముదాయించేందుకు దీప వెళుతుంది. నాతో శౌర్యపై ఎందుకు ఒట్టు వేయించావని కార్తీక్ కోపంగా అంటాడు. వద్దన్నా క్యాటరింగ్ అంగీకరించానని, జ్యోత్స్న, పారు, మా నాన్న అమానించారని ఇలా చేశావా అంటాడు. అది తట్టుకోలేక ఇలా ఒట్టు వేయించావా అని ప్రశ్నిస్తాడు. నన్ను ఎందుకు దూరం పెడుతున్నావని అడుగుతాడు. మీరు గెలవడానికి ఇలా అని దీప అంటుంది. ఇడ్లీ బండి నడిపే స్థాయి దీపది అని.. కార్తీక్ బాబుది కాదు అని చెబుతుంది. మీరు మీ తాత, నాన్న దగ్గర సవాల్ చేశారు.. ఇడ్లీ బండి దగ్గరే మీరు అగిపోతే గెలవగలరా అని దీప ప్రశ్నిస్తుంది.

ఎలా గెలవాలో ఆలోచించండి

మా గురించి, ఇడ్లీ బండి గురించి ఆలోచించడం మానేసి, మీ గురించి ఆలోచించండని దీప చెబుతుంది. రెస్టారెంట్ పెట్టడం గురించి ఆలోచించాలని అంటుంది. నాకు తెలియదా అని కార్తీక్ అడుగుతాడు. “మీకు తెలుసు కార్తీక్ బాబు.. కానీ మీ విలువైన సమయం బండి దగ్గరే గడిచిపోవడం నాకు ఇష్టం లేదు. ఇక నుంచి టిఫిన్ సెంటర్‌ను మేం నడుపుతాం. ఎలా గెలువాలో మీరు ఆలోచించండి” అని దీప చెబుతుంది. నా పని చేసుకుంటూ సాయంగా ఉంటానని కార్తీక్ అంటాడు. వద్దు కార్తీక్ బాబు అని దీప తెగేసి చెబుతుంది. మీరు టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేందుకు వీల్లేదని అంటుంది. మీరు కోపగించుకున్నా.. మీకు మంచి ఎదగడం, గెలవడం కావాలని చెబుతుంది.

నన్ను దాటి పెరుగెత్తండి

గెలవాలంటే నా దగ్గరే అగిపోవద్దు.. నన్ను దాటి పెరుగెత్తండి అని కార్తీక్‍తో దీప చెబుతుంది. మీ వాళ్లను మిమ్మల్ని అంటున్న మాటలతో నలిగిపోతున్నానని చెబుతుంది. అవకాశాలు రావాలని కదా అని కార్తీక్ అంటాడు. అందుకే మీరు ఆ పని మీదే ఉండాలని, బాగా తిరగాలని, రాత్రిపగలు అవకాశాలు గురించే ఆలోచించాలని అంటుంది. అప్పటి వరకు బండిని, ఇంటిని, మిమ్మల్ని నేను చూసుకుంటాని చెబుతుంది. నేను మీకు సాయంగా ఉంటానని చెబుతుంది. మీకు అవసరమైన రోజున ఇడ్లీ బండిని వదిలేస్తాను కానీ.. బండి వద్దకు మిమ్మల్ని రానివ్వనని దీప క్లారిటీగా చెప్పేస్తుంది. దీంతో కార్తీక్ కూడా అర్థం చేసుకుంటాడు.

నా బాధ మీరు అర్థమైంది.. నాకు అంతే చాలు కార్తీక్ బాబు అని దీప అంటుంది. మీ గెలుపు మీ నాన్న, తాతే కాదు నేను కూడా చాలని, మా కార్తీక్ బాబుకు పూర్వవైభవం రావాలని చెబుతుంది. గెలిచేందుకు ఏం చేయాలో ఆలోచించాలని అంటుంది. నీ అభిమానం, నీ ప్రేమ అర్థమవుతున్నాయి దీప.. ఒక్క అవకాశం వస్తే నిరూపిస్తానని కార్తీక్ అనుకుంటాడు.

దాసు కోసం హోమం.. అడ్డుపడేందుకు జ్యోత్స్న ప్రయత్నం

ఫోన్‍లో తాను కార్తీక్‍తో కలిసి ఉన్న ఫొటోను జ్యోత్స్న చూస్తుంటుంది. ఇంతలో పూజారి వస్తాడు. ఎందుకొచ్చారని అడుగుతుంది. ఇంతలో పారిజాతం వస్తుంది. హోమం కోసం ముహూర్తం అని చెబుతుంది. దాసు కోలుకునేందుకు హోమం అని అంటుంది. తన కొడుకు దాసును ఎవరో కొట్టించారని పూజారితో పారు చెబుతుంది. ఆ పని చేసిన జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. దాసు కోలుకోవాలని హోమం చేయాలని, ఎప్పుడు చేయాలని పారిజాతం అడుగుతుంది.

హోమం అవసరం లేదని, వెళ్లండి అని అడ్డుకునేందుకు జ్యోత్స్న ప్రయత్నిస్తుంది. దాసు కోలుకుంటే తన పని అయిపోతుందని అనుకుంటుంది. నా కొడుకు కోసం హోమం చేస్తే.. నువ్వు వద్దంటావేంటే అని పారిజాతం ప్రశ్నిస్తుంది. వాడు మీ నాన్నే అని, జీవిశ్చవంలో మంచంలో పడి ఉండమంటావా అని మెల్లగా అడుగుతుంది పారిజాతం. ఉండనీ ఏ నష్టం లేదంటుంది జ్యోత్స్న.

దశరథ్ మాటతో హోమానికి సిద్ధం

హోమం చేస్తే నీ కొడుకుకు నయం అవుతుందా అని గట్టిగా అంటుంది జ్యోత్స్న. ఏం.. కాకుడదని నువ్వు అనుకుంటున్నావా అని దశరథ్ ఎంట్రీ ఇస్తాడు. దాసుకు అలా జరిగినందుకు జ్యోత్స్న కూడా బాధపడుతోందని పారిజాతం అంటుంది. నిజమేనా అని దశరథ్ అడిగితే.. బాబాయి కోలుకోవాలని తాను కూడా అనుకుంటున్నానని జ్యోత్స్న అంటుంది. విన్నావు కదా పిన్ని.. ఆలస్యం చేయకుండా దాసు పేరు మీద హోమం చేయించి అని దశరథ్ అంటాడు. దాసు కోలుకోవాలని హోమం చేసేందుకు ముహూర్తం పెట్టాలని చెబుతాడు. మంచి ముహూర్తం చేసి చెబుతానని పాజారి వెళతాడు. దాసుకు ఏమీ కాదని దశరథ్ అంటాడు. ఇదంతా వింటూ జ్యోత్స్న రగులుతుంది. దాసును నేనే కొట్టానని డాడీకి ఏమైనా అనుమానం వచ్చిందా అని మనసులో అనుకుంటుంది. దాసు కోలుకుంటే.. మళ్లీ చస్తాడు అని అనుకుంటుంది.

జ్యోత్స్నపై తాత ప్రశంసలు.. దశరథ్ డౌట్

తన నమ్మకాన్ని నిలబెట్టావని, వెరీ గుడ్ అంటూ జోత్స్సను తాత శివన్నారాయణ ప్రశంసిస్తాడు. రెస్టారెంట్ ప్రాఫిట్స్ గురించి ఆడిటర్ కాల్ చేశాడని, చాలా హ్యాపీగా అనిపించిందని అంటాడు. అనుమానంగానే దశరథ్ చూస్తాడు. నేను చీట్ చేస్తున్నానని డాడీ కనిపెట్టారా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ప్రాఫిట్ రావడం ఏంటి.. పోయిన సారి అకౌంట్స్ చూసినప్పుడు మైనస్‍లో ఉందే.. జ్యోత్స్న లెక్కలు మార్చేసిందా అని దశరథ్ డౌట్ పడతాడు. కార్తీక్ కంటే నా మనవరాలు వెయ్యి రెట్లు బెస్ట్ అని, నాకు బాగా తెలుసు అని పారిజాతం అంటుంది. కార్తీక్ పేరు వినగానే కోప్పడతాడు శివన్నారాయణ. కార్తీక్ పేరును గుర్తు చేసినందుకు పారుపై సుమిత్ర కోప్పడుతుంది. లేదు జ్యోత్స్న తప్పు చేసింది.. లెక్కలు మార్చేసింది దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్నకు బుద్ధి చెప్పాలంటే.. దాసు కోలుకోవాలని అనుకుంటాడు.

కార్తీక్, దీప జంటగా దీపాపాధన

తెల్లవారక ముందు లేచి తులసి కోట వద్ద పూజలు చేస్తుంటుంది దీప. చేతిలో దీపం పట్టుకొని తిప్పుతుంటుంది. ఆ బ్రహ్మ నా కోరక తీర్చాలని అంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. తెల్లవారకుండానే దీపారాధన చేస్తున్నావని అడుగుతాడు. బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేసి, దేవుడిని కోరుకుంటే నెరవేరుతుందని నా నమ్మకం అని దీప అంటుంది. దీపతో కలిసి దీపారాధన చేస్తాడు కార్తీక్. నీ చేయి పట్టుకొనే దీపారాధన చేస్తున్నానని, నీ నిస్వార్థ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాని చెబుతాడు. కార్తీక్ దీప ఇద్దరూ కలిసి దీపారాధన చేస్తారు. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 17) ఎపిసోడ్ ముగిసింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం