Karthika Deepam Serial February 15: దీప వంటపై పొగడ్తలు.. కార్తీక్ పంచ్‍లు, రగిలిన జ్యోత్స్న.. నిలదీసిన దశరథ్
Karthika Deepam 2 Today Episode February 15: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. క్యాటరింగ్ చేసిన దీప వంటకు ప్రశంసలు వస్తాయి. కార్తీక్ మాటలతో జ్యోత్స్న మరింత రగులుతుంది. పారిజాతం వద్ద దాసు గురించి నోరు జారుతుంది జ్యోత్స్న. పూర్తిగా ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 15) ఎపిసోడ్‍లో.. కార్తీక్, దీప క్యాటరింగ్ చేస్తున్న ఫంక్షన్‍కే వస్తారు శ్రీధర్, జ్యోత్స్న, పారిజాతం. నీ కొడుకు ఎక్కడున్నాడని, లండన్‍కు వెళ్లాడా అని ఫంక్షన్ నిర్వహిస్తున్న గంగాధర్ అడిగితే.. కార్తీక్ గురించి గొప్పలు చెబుతాడు శ్రీధర్. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. శ్రీధర్ ఏం చెబుతాడా అని జ్యోత్స్న, పారిజాతం చేస్తుంటారు. మౌనంగా ఉన్నావ్ నీ కొడుకు పేరు ఏంట్రా అని స్నేహితుడు శ్రీధర్‌ను గంగాధర్ అడుగుతాడు. కార్తీక్ అని జ్యోత్స్న సమాధానమిస్తుంది. ఇంతలో ఎక్కడికి వెళ్లారనుకుంటూ.. కార్తీక్ బాబు అని దీప పిలుస్తుంది.
ఈ క్యాటరింగ్ అబ్బాయే.. వీళ్ల అబ్బాయి
ఈ క్యాటరింగ్ అబ్బాయి పేరు కూడా నీ కొడుకు పేరే అని గంగాధర్ అంటాడు. “మీరు ఇంకో విచిత్రం కూడా చూడాలి. ఈ క్యాటరింగ్ అబ్బాయే.. వీళ్ల అబ్బాయి” అని పారిజాతం అంటుంది. దీంతో గంగాధర్ షాక్ అవుతాడు. ఇంతలో దీప కూడా వారి దగ్గరికి వస్తుంది. ఏంట్రా ఇది ఈ క్యాటరింగ్ అబ్బాయే మీ అబ్బాయా అని శ్రీధర్‌ను గంగాధర్ ప్రశ్నిస్తాడు. అవును నా పరువు తీయడానికి వీడు నా కొడుకే అని శ్రీధర్ బదులిస్తాడు. శివన్నారాయణ మనవడివని తనకు ఎందుకు చెప్పలేదని కార్తీక్‍ను గంగాధర్ ప్రశ్నిస్తాడు. తాను పని కోసం వచ్చానని, పరిచయాల కోసం కాదని కార్తీక్ అంటాడు. తాను వంటలు ఇచ్చేందుకు వచ్చానని, నేను ఎవరైతే ఏముంది అని చెబుతాడు. మీరు ఇక్కడే ఉంటారని తెలిస్తే.. నేను వచ్చే వాడనే కాదని శ్రీధర్ అంటాడు. ఎవరి పని వారు చేసుకుంటే మంచిదని కార్తీక్ అంటాడు.
సూర్యుడికి కూడా గ్రహణం
మీ తాతగారు కోటీశ్వరుడు నీకేం కర్మ అని కార్తీక్‍తో గంగాధర్ అంటాడు. దీప వల్లే కార్తీక్‍కు ఈ పరిస్థితి వచ్చిందనేలా అంటూ నానామాటలు అంటుంది జ్యోత్స్న. గ్రహణం పడితే సూర్యుడు కూడా గ్రహణం పడుతుందనేలా కామెంట్లు చేస్తుంది. వంట మనిషి దీపనే కార్తీక్ పెళ్లి చేసుకున్నాడని గంగాధర్‌తో చెబుతుంది. తన బావ భార్యనే అనుసరిస్తున్నాడని అంటుంది. దీపతో కలిసి క్యాటరింగ్ చేస్తున్నాడని హేళనగా మాట్లాడుతుంది.
కార్తీక్ పంచ్‍లు
గొప్పగొప్ప వ్యాపారవేత్తలు.. వారి వ్యాపారాలను ముందు రేకుల షెడ్డులోనే మొదలుపెట్టారని కార్తీక్ అంటాడు. “క్యాటరింగ్ అంటే మా వంటలను అందరికీ పరిచయడం చేసేందుకు గొప్ప అవకాశంగా అనుకుంటున్నా. ఇది వాన చినుకే. చినుకులన్నీ కలిపితే సముద్రం అవుతుంది. గుర్తు పెట్టుకో” అని జ్యోత్స్నకు పంచ్‍లు వేస్తాడు కార్తీక్. అంత వరకు మా పరువు తీస్తుంటారా అని శ్రీధర్ అంటే.. క్షమించండి.. మీరు వస్తారని తెలిస్తే ఇక్కడికి వచ్చే వారం కాదని దీప అంటుంది.
ఏ భార్య.. చిన్నదా, పెద్దదా
ఈ విషయాలన్నీ నీ భార్యకు తెలుసా అని శ్రీధర్‌ను గంగాధర్ అడుగుతాడు. ఏ భార్య.. చిన్నదా, పెద్దదా అని పారిజాతం వెటకారంగా ఉంటుంది. అదేంటి అని గంగాధర్ ఆశ్చర్యపోతాడు. నువ్వేం ఫ్రెండ్‍వి అని పారిజాతం అంటుంది. దీప వల్లే ఇంట్లో నుంచి వెళ్లిపోయావని మాటలు అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అని అరుస్తాడు కార్తీక్. ఆ పెద్ద మనిషిని రెండు పెళ్లిళ్లు చేసుకోవడం కూడా దీప తప్పా అని తండ్రి శ్రీధర్‌ను కార్తీక్ అంటాడు. దీప మెడలో తాళి కట్టడం వల్ల అన్నీ వదిలేసి మెడలో టవల్ వేసుకొని ఒక పనివాడిలా తయారయ్యావని జ్యోత్స్న మాటలు అంటుంది. దీపే ఇలా తయారు చేసిందని చెబుతుంది. ఇక నువ్వు మాట్లాడవద్దని కార్తీక్ గద్దిస్తాడు. నీకు మాట్లాడే అర్హత లేదని శ్రీధర్‌ను కార్తీక్ అంటాడు. ఎక్కడపడితే అక్కడ.. ఏది పడితే అది మాట్లాడతారని.. ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా లేదని శ్రీధర్‌పై కార్తీక్ ఫైర్ అవుతాడు.
దీప నా భార్య.. క్యాటరింగ్ కావాలంటే చెప్పండి
దీప వల్లనే ఇదంతా అని జ్యోత్స్న అంటుంది. అనవసరంగా గొడవ చేయవద్దని దీప అంటుంది. నువ్వెవరివే మాకు చెప్పడానికి.. మమ్మల్ని అనడానికి అని పారిజాతం అంటుంది. “నువ్వెవరు.. నువ్వెవరు అనకు.. దీప నా భార్య.. మాది వంటల బిజినెస్. క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాం. మీ ఎవరికైనా కావాలంటే చెప్పండి. బయటికంటే ఒక రూపాయి తక్కువకే రుచికరమైన భోజనం పెడతాం. త్వరలోనే ఆన్‍లైన్ సేవలు కూడా మెదలుపెడతాం” అని కార్తీక్ అంటాడు.
పారిజాతం పొగరు.. దీపకు ఫైవ్‍స్టార్ రేటింగ్
దీప చేసిన వంటలు ఎవడు తింటాడని, దీపది ఇడ్లీ బండి రేంజ్ అని, రెస్టారెంట్ రేంజ్ కాదని పొగరుగా మాట్లాడుతుంది పారిజాతం. ఇంతలో వంటలన్నీ సూపర్‌గా ఉన్నాయమ్మా అంటూ అక్కడికి వస్తుంది గంగాధర్ భార్య. దీంతో దీప, కార్తీక్ సంతోషిస్తారు. “మన చుట్టాలంతా క్యాటరింగ్ ఏ స్టార్ రెస్టారెంట్‍కో ఇచ్చారని, అందుకే వంటలు ఇంత టేస్టీగా ఉన్నాయయని అంటున్నారండి” అని ఆమె అంటుంది. బాగోదని ఆగానని, లేకపోతే విజిల్ కొట్టి మరీ.. దీప వంటలకు ఫైవ్‍స్టార్ రేటింగ్ ఇచ్చారని చెప్పేవాడనని కార్తీక్ అంటాడు. కోటీశ్వరుడి కొడుకు కష్టపడి కూడా బయటికి రావొచ్చని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న, పారిజాతం లోలోపల రగిలిపోతుంటారు.
ఆ అమౌంట్ ఇస్తే తాము బయలుదేరతామని గంగాధర్‌తో కార్తీక్ అంటాడు. మీ సిన్సియారిటీ నచ్చిందని, ఆల్‍ది బెస్ట్ చెబుతాడు గంగాధర్. సాయంగా ఉన్నందుకు రెండు వేలు అదనంగా ఇవ్వాలని గంగాధర్ భార్య అంటే.. వద్దంటుంది దీప. అవకాశం ఇచ్చారని, అది చాలని చెబుతుంది. మీ జోడి బాగుందని గంగాధర్ అంటాడు. ఎవరికైనా కావాలంటే తన ఫోన్ నంబర్ ఇవ్వాలని, ఎంత పెద్ద క్యాటరింగైనా చేస్తానని కార్తీక్ అంటాడు. జనాలను తినకుండా టిఫిన్ తినాలని శ్రీధర్‌తో కార్తీక్ చెప్పి వెళ్లిపోతాడు. తినకుండానే శ్రీధర్, జ్యోత్స్న, పారిజాతం వెళ్లిపోతారు.
దీపతో ఉంటే బావకు ఎక్కడా గౌరవం దక్కదని తెలియాలి గ్రానీ.. కానీ ప్రతీసారి ఫెయిల్ అవుతున్నాం అని జ్యోత్స్న అంటుంది. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్, మనకు దొరకకుండా ఎక్కిడికి పోతారని పారిజాతం అంటుంది.
దాసు కోలుకుంటున్నాడు
కోమాలో ఉన్న దాసును చెక్ చేసేందుకు డాక్టర్ వస్తాడు. తన తండ్రి దాసు అప్పుడప్పుడు స్పృహలోకి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని, ఏదైనా సౌండ్ వస్తే ప్రవర్తన మారిపోతోందని అంటాడు. మీరు చెప్పిన దాని బట్టి చూస్తే మీ నాన్న కోలుకుంటున్నా.. ఆ ట్యాబ్లెట్లనే కొనసాగించాలని డాక్టర్ చెబుతాడు. ఒత్తిడి చేయవద్దని అంటాడు. అప్పుడప్పుడు కాగితాలపై మామయ్య రాస్తున్నారని స్వప్న చెబుతుంది. ఒక పదానికి.. మరో పదానికి సంబంధం లేకుండా ఉందంటుంది. వారసురాలు.. ఎవకి కొట్టారో అని ఏదో రాశారని కాశీ అంటాడు. మీరు ఆందోళన చెందవద్దు.. ఆయయ కోలుకుంటున్నారు అని డాక్టర్ చెబుతాడు. దీంతో కాశీ, స్వప్న సంతోషిస్తారు.
నోరు జారిన జ్యోత్స్న
దీప నా భార్య అని కార్తీక్ అన్న మాటను గుర్తుతెచ్చుకొని రగిపోతుంటుంది జ్యోత్స్న. ఇక దీప కూడా కార్తీక్‍ను వదిలిపెట్టదని అర్థమైందని, కూతురి ప్రాణాలకు మంగళసూత్రానికి వెల కట్టినా వినలేదు దా అని పారిజాతం చెబుతుంది. కార్తీక్ లాంటి వాడిని ఏ ఆడదైనా ఎందుకు వదులుకుంటుంది చెప్పు అని అడుగుతుంది. దీపను ఏం చేయలేవు కానీ.. పెళ్లి సంబంధం చూస్తా.. చేసుకో అని పారిజాతం అంటుంది. దీంతో గ్రానీ అంటూ జ్యోత్స్న కోప్పడుతుంది.
కార్తీక్, దీప విడిపోరని, ఇంతలో నీ కర్మ కాలి.. నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని మీ అమ్మానాన్నలకు తెలిసిందనుకో అని పారిజాతం అంటుంది. ఎలా తెలుస్తుందని జ్యోత్స్న చెబుతుంది. దాసు గాడు చెబితే అని పారిజాతం అంటుంది. అందుకే కదా నీ కొడుకుకు ఈ పరిస్థితి పట్టిందని నోరు జారుతుంది జ్యోత్స్న. అయ్యో ఏంటి ఇలా అనేశానని మనసులో అనుకుంటుంది. అంటే దాసును నువ్వే కొట్టావా అని పారు ప్రశ్నిస్తుంది. తండ్రి దాసు మీద నాకు ప్రేమ లేకపోయినా.. ఎంతో కొంత ఉందని, తాను కొట్టలేదని జ్యోత్స్న అబద్ధం చెబుతుంది. దాసును చూసేందుకు వచ్చాను కదా.. ప్రేమ ఉన్నట్టే కదా అని చెబుతుంది. దీంతో పారిజాతం ఆ మాటలను నమ్మేస్తుంది. తన కొడుకు దాసు చాలా అమాయకుడే అని అంటుంది.
“ఆ అమాయకుడే నా ప్రాణాలు తీసేలా ఉన్నాడు. అసలైన వారసురాలు దీపే అని తెలిసే లోపు.. దాసు చావాలి. ఆ తర్వాత దీప చావాలి” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
కొందరు తిట్టారు.. అవమానించారు
కార్తీక్, దీప ఇంకా రాలేదని, వంట గురించి వారు ఏమన్నారో అని కాంచన అనుకుంటుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు. వంటలు చాలా బాగున్నాయని చెప్పారని అంటాడు. కొందరు మాత్రం తిట్లు తిట్టి, అవమానించారని చెబుతాడు. ఎవరని కాంచన అడిగితే.. మన వాళ్లను అనేందుకు కూడా సిగ్గుగా ఉందని కార్తీక్ అంటాడు. ఎవరని కాంచన అడిగితే.. శ్రీధర్, జ్యోత్స్న, పారిజాతం అని దీప చెబుతుంది. వాళ్లు అక్కడికి ఎందుకొచ్చారని కాంచన అంటుంది. నోటి వచ్చినట్టు మాట్లాడారని, ముగ్గురు అలాగే ఉన్నారని కార్తీక్ అంటాడు. వయసు మాత్రం పెరిగింది.. పశువుల్లాగా అని ఫైర్ అవుతాడు.
అవమానించే వాళ్లకు చెంపదెబ్బ
ఎదిగేటప్పుడు అవమానాలు సహజమే అని దీప అంటుంది. అందరిలో తిట్టడం ఆనందంగా ఉందా అని కార్తీక్ అంటే.. నా బాధ మీ గురించే అని దీప అంటుంది. నేను రాకపోతే నిన్ను అవమానించే వారని కార్తీక్ అంటాడు. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను అని చెబుతాడు. మీరు ఆలోచించాల్సింది అన్న మాటల గురించి కాదు.. చేసిన సవాల్ గురించి అని దీప చెబుతుంది. మీ గెలుపే అవమానించే వాళ్లకు చెప్పు దెబ్బ అని దీప అంటుంది. అదే సరైదని, నువ్వు గెలవాలని కాంచన చెబుతుంది. నువ్వు గెలిస్తే మా గౌరవాలు నిలబడతాయి, నిందించిన వారి నోళ్లు మూతపడతాయని అంటుంది.
ఆయనకు నచ్చకపోయినా..
"నా కోరిక అదే అని, నన్ను పెళ్లి చేసుకొని కష్టాలు పడుతున్నారు. కార్తీక్ బాబును గెలిపించడం నా బాధ్యత. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కార్తీక్ బాబును గెలిపించాలి. కార్తీక్ బాబును గెలిపించాలంటే ఆయనకు నచ్చకపోయినా ఓ నిర్ణయం తీసుకోవాలి. చేస్తాను” అని మనసులో అనుకుంటుంది దీప. ఏం చేయాలనుకుంటుందో మాత్రం బయటికి చెప్పదు.
దశరథ్‍కు డాక్టర్ ఫోన్.. వారసురాలు ఏంటి
దాసు కోలుకుంటున్నాడని దశరథ్‍కు కాల్ చేసి చెబుతాడు డాక్టర్. దీంతో దశరథ్ సంతోషిస్తాడు. నా తమ్ముడు ఎప్పుడు పూర్తిగా కోలుకుంటాడా అని వేచిచూస్తున్నానని చెబుతాడు. దాసు స్పృహలోకి వచ్చినప్పుడు రాసిన స్లిప్‍లను ఫోన్‍లో పంపుతాడు పంపుతాడు. నిజం చెప్పాలి.. కొట్టింది కూతురు.. వారసురాలు అని ఆ చీటీల్లో ఉన్నది చూస్తాడు దశరథ్. “నా కూతురు నిన్ను కొట్టిందని చెప్పాలనుకుంటున్నావా దాసు. ఈ నిజం నాకు తెలుసురా. కానీ నిన్ను ఎందుకు కొట్టిందో తెలియదు. అదే తెలుసుకోవాలని అనుకుంటుంది” అని శ్రీధర్ అనుకుంటాడు. వారసురాలు అని రాశాడేంటి అని ఆలోచిస్తాడు. ఈ మాటకు దాసు చెప్పాలనుకుంటున్న నిజానికి ఏంటి సంబంధం, చూస్తుంటే ఇదేదో పెద్ద సమస్యలాగే ఉందే అని అనుకుంటాడు. నిజం తెలియాలంటే దాసు త్వరగా కోలుకువాలని, వారసురాలు అని ఎవరిని ఉద్దేశించి రాసి ఉంటాడని దశరథ్ ఆలోచిస్తాడు.
నష్టాలను లాభాలుగా చూపించు
రెండు రోజుల్లో ఆడిట్ ఉందని, బిజినెస్‍లోని నష్టాలను లాభాలుగా చూపిస్తే దొంగ లెక్కలు దొరికిపోతాయోమోనని జ్యోత్స్నకు ఫోన్ చేసి చెబుతాడు అకౌంటెంట్. బిజినెస్ నష్టాల్లో ఉందని నీకు, నాకు తెలుసునని, కానీ ఆడిట్‍లో లాభాలు చూపించాలని జ్యోత్స్న అంటుంది. సమస్య వస్తే తాను చూసుకుంటానని చెబుతుంది. తాను సీఈవో, చైర్మన్ మనవరాలినని, చేప్పింది చేయకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తాననేలా జ్యోత్స్న బెదిరిస్తుంది.
ఎన్ని నిజాలు దాస్తావ్
“కుదరదు అన్న మాట జ్యోకు వినపడకూడదు. ఏదో ఒకటి చెయ్. లాస్ కనపడకూడదు. ఈ నిజం ఎవరికీ తెలియకూడదు” అని జ్యోత్స్న చెబుతుంది. ఎన్ని నిజాలని దాస్తావ్ జ్యోత్స్న అని దశరథ్ నిలదీస్తాడు. తండ్రి సడెన్‍గా రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. “ఒక తప్పును దాచాలని అనుకునే క్రమంలో.. ఆ తప్పు నీతో అనేక తప్పులను చేయిస్తుంది” అని దశరథ్ అంటాడు. దీంతో ‘కార్తీక దీపం 2 - ఇది నవ వసంతం’ నేటి (ఫిబ్రవరి 15) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం