Karthika Deepam January 25 Episode: కార్తీక్‍ను టెన్షన్ పెట్టిన శౌర్య.. కన్నీటితో తండ్రిని ప్రాధేయపడిన కాంచన.. కానీ!-karthika deepam serial january 25 today episode karthik in tension kanchana requests shivanarayana star maa tv serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam January 25 Episode: కార్తీక్‍ను టెన్షన్ పెట్టిన శౌర్య.. కన్నీటితో తండ్రిని ప్రాధేయపడిన కాంచన.. కానీ!

Karthika Deepam January 25 Episode: కార్తీక్‍ను టెన్షన్ పెట్టిన శౌర్య.. కన్నీటితో తండ్రిని ప్రాధేయపడిన కాంచన.. కానీ!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 25, 2025 07:26 AM IST

Karthika Deepam 2 Serial January 25 Episode: కార్తీక దీపం 2 సీరియల్‍లో నేడు.. శౌర్య కాసేపు కనిపించకపోవటంతో కార్తీక్ కంగారు పడతాడు. సాయం కోసం తండ్రి శివన్నారాయణ ఇంటికి వెళుతుంది కాంచన. శివన్నారాయణ, జ్యోత్స్న నానా మాటలు అంటారు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam 2 January 25 Episode: కార్తీక్‍ను టెన్షన్ పెట్టిన శౌర్య.. కన్నీటితో తండ్రిని ప్రాధేయపడిన కాంచన.. కానీ!
Karthika Deepam 2 January 25 Episode: కార్తీక్‍ను టెన్షన్ పెట్టిన శౌర్య.. కన్నీటితో తండ్రిని ప్రాధేయపడిన కాంచన.. కానీ!

కార్తీక దీపం 2 నేటి (జనవరి 25) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. ఆసుపత్రిలో బెడ్‍పై శౌర్య కనిపించదు. వాళ్ల నాన్న వస్తే ఏమంటారో అని నర్సులు భయపడుతుంటారు. ఇంతలోనే కార్తీక్ వస్తాడు. నా కూతురికి ఏమైంది అడుగుతాడు. పాప కనిపించడం లేదని నర్సులు చెబితే.. కనిపించడం లేదంటే ఏంటి అర్థం, జాగ్రత్తగా చూసుకుంటారనే కదా అని కార్తీక్ ఆగ్రహిస్తాడు.

ఎవరినీ వదిలిపెట్టను.. టెన్షన్‍లో కార్తీక్

“నా కూతురికి ఏమైనా జరగాలి.. ఎవరినీ వదిలిపెట్టను. అందరిపై పోలీస్ కేసు పెడతాను” అని కార్తీక్ అరుస్తాడు. ఇంతలో డాక్టర్ వస్తాడు. పాప ఇక్కడే ఉంటుందని, వెతుకుదామని చెబుతాడు. రేపు ఆపరేషన్ పెట్టుకొని పాప కనిపించకపోతే తనకు ఎలా ఉంటుందని కార్తీక్ కంగారుగా డాక్టర్‌తో అంటాడు. ఆసుపత్రిలో వెతుకుతుంటారు.

భయమేసింది.. ఫెయిల్ అయితే

ఆసుపత్రిలో ఓ చోట వినాయకుడి విగ్రహానికి దండం పెట్టుకుంటూ ఉంటుంది శౌర్య. కార్తీక్ చూస్తాడు. శౌర్యను కన్నీటితో కౌగిలించుకుంటాడు. ఎవరికీ చెప్పకుండా ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తాడు. పక్కన ఎవరూ లేకపోయే సరికి భయమేసిందని, అందుకే దేవుడి దగ్గరికి వచ్చానని చెబుతుంది. “రేపు పెద్ద పరీక్ష అంట. నువ్వేం భయపడకు అని డాక్టర్ అన్నారు. స్కూల్‍లో పరీక్షలు అయితే దేవుడికి దండం పెట్టుకోవాలని అమ్మ చెప్పేది. రేపు పెద్ద పరీక్ష కదా. దాంట్లో ఫెయిల్ అయితే” అని శౌర్య అంటుంది. ఫెయిల్ అవుతానేమోనని భయంగా ఉందని, పాస్ చేయాలని దేవుడిని కోరుకుంటున్నానని అంటుంది. ఈ నాన్న ఫెయిల్ కానివ్వడని, అందరం కలిసే ఉందామని చెబుతాడు. అమ్మను చూడాలని ఉందని శౌర్య అడిగితే.. చివరి పరీక్ష అయిపోయాక అమ్మను సర్‌ప్రైజ్ చేద్దామని చెప్పాను కదా అని కార్తీక్ సర్దిచెబుతాడు.

డబ్బు కట్టకపోతే ఆపరేషన్ కష్టమని డాక్టర్ అంటారని తనలో తానే బాధపడతాడు కార్తీక్. ఎవరిని సాయం అడగాలో అర్థం కావడం లేదని కన్నీరు పెట్టుకుంటాడు. చిన్న ఆశ ఇవ్వు స్వామి.. నా కూతురిని కాపాడుకునేందుకు దారి చూపించుకు అని దేవుడికి దండం పెడతాడు.

దాసు ఎప్పటికీ కళ్లు తెరవకూడదు

దాసును మరోసారి చంపేందుకు ప్రయత్నించిన సమయంలో అతడు కళ్లు తెరిచిన విషయాన్ని జోత్స్న గుర్తుచేసుకుంటుంది. సీరియస్‍గా ఆలోచిస్తూ కాఫీ తాగుతుంటుంది. ఇంతలో దశరథ్ వెనుక నుంచి చూస్తాడు. దాసు పూర్తిగా స్పృహలోకి వస్తే నా పరిస్థితి ఏంటి మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. దాసు పూర్తిగా కళ్లు తెరిస్తే నిజం బయటపడుతుంది కాబట్టి చంపే ప్రయత్నం చేస్తుందా అని దశరథ్ అనుకుంటాడు. దాసు కోలుకుంటే బాగుంటుందని అనుకుంటాడు. దాసు ఎప్పటికీ కళ్లు తెరవకూడదని జ్యోత్స్న ఆలోచస్తుంది.

తండ్రి ఇంటికి కాంచన

ఇంతలో.. తండ్రి శివన్నారాయణ ఇంటికి కాంచన వస్తుంది. కాంచను చూసి అత్త అని జ్యోత్స్న సంతోషంగా అంటుంది. కాంచన అంటూ చెల్లిని ఆప్యాయంగా పలుకరిస్తాడు దశరథ్. సుమిత్రను పిలుస్తాడు. ఏంటి వదినా ఇది.. నిన్ను ఇలా చూడాల్సి రావడం ఏంటి అని సుమిత్ర బాధపడుతుంది. ఇంటి ఆడపడుచు లక్ష్మి కళ కోల్పోయి ఇలా పేదరికంలో బతకడం పుట్టింటికి కూడా అరిష్టమే వదినా అని కన్నీరు పెడుతుంది. తాము కావాలనే అన్నీ వదులుకున్నామని, అందుకే బాధలేదని, మీరే తప్పూ చేయలేదని కాంచన అంటుంది.

శివన్నారాయణ వెటకారం

తాను సాయం కోసం వచ్చానని, నాన్న ఎక్కడ అని కాంచన అడుగుతుంది. ఇంతలో శివన్నారాయణ ఎంట్రీ ఇస్తాడు. “ఏం దశరథ మన ఇంటికి ఎవరో అనుకోను అతిథి వచ్చినట్టున్నారు. ఎవరమ్మా నువ్వు. నిన్ను ఎక్కడో చూసినట్టు ఉందే” అని వెటకారంగా అంటాడు శివన్నారాయణ. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో నాన్న అంటూ దశరథ్ కల్పించుకుంటే.. నువ్వు ఆగరా అని శివన్నారాయణ అరుస్తాడు. నాన్న అని కాంచన అంటే.. ఎవరు నీకు నాన్న అని అంటాడు. అవసరం కోసమే వచ్చి ఉంటారని నానా మాటలు అంటాడు. బయటికి వెళ్లినప్పటి విషయాలను గుర్తు చేసుకుంటాడు.

మెడలోని తాళి కూడా రేటు కట్టావ్

“వెళ్లే ముందు ఓసారి ఆలోచించుకోమంటే.. నా కొడుకు ఇష్టమే నా ఇష్టమన్నావ్ కదా.. మెడలో తాళికి కూడా రేటు కట్టావ్. ఆ మాట నీ నోట్లో నుంచి వస్తుంటే కొలిమిలో ఉంచిన కత్తిని గుండెలో గుచ్చినట్టు అనిపించింది. నీ కొడుకుకు బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది” అని శివన్నారాయణ అంటాడు. బయటికి వెళ్లారు కదా.. ఇప్పుడు ఈ నాన్న ఎందుకు గుర్తొచ్చాడని సూటిపోటి మాటలు అంటాడు.

సాయం అడిగితే నవ్విన శివన్నారాయణ

సాయం కావాలని నాన్న అని కాంచన ప్రాధేయపడుతుంది. అయితే, వెటకారంగా గట్టిగా నవ్వుతాడు శివన్నారాయణ. మామయ్య వదిన సాయం కోసం వచ్చానని అంటే నవ్వుతారేంటి అని సుమిత్ర అడ్డుపడుతుంది. కార్తీక్ చేసిన సవాల్ గుర్తొస్తోందని శివన్నారాయణ అంటాడు. తిరిగి సాయం కోసం గుమ్మం తొక్కుతారని చెప్పానా అని జ్యోత్స్న అంటుంది. ఓడిపోయానని ఒప్పుకుంటానని కాంచన అంటుంది. ముఖం చూపించలేక కార్తీక్ రాలేదా అని శివన్నారాయణ చెబుతాడు.

ఏం సాయం కావాలి అత్త అని కాంచనను జ్యోత్స్న అడుగుతుంది. రూ.45లక్షలు కావాలని నాన్న శివన్నారాయణకు కాంచన చెబుతుంది. కొడుకును నాపై గెలిపించేందుకు నన్ను పెట్టుబడి డబ్బులు అడుగుతున్నావా అని శివన్నారాయణ అంటాడు. తాను డబ్బు అడుగుతున్నది పెట్టుబడి కోసం కాదని కాంచన అంటుంది. అనసూయను ఉద్దేశిస్తూ అడ్డమైన వారు అని జ్యోత్స్న అంటే.. సుమిత్ర కోప్పడుతుంది.

నా మనవరాలి ఆపరేషన్ కోసం..

డబ్బు తన మనవరాలు శౌర్య కోసం అని కాంచన చెబుతుంది. శౌర్యకు ఏమైందని దశరథ్ అంటాడు. శౌర్యకు ఆరోగ్యం బాగోలేదని, గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చిందని, ఆపరేషన్ చేయకపోతే బతకదని ఏడుస్తూ చెబుతుంది కాంచన. వీలైనంత త్వరగా డబ్బు రెడీ చేసుకోవాలని డాక్టర్ చెప్పారంట.. కార్తీక్ డబ్బు కోసం తిరుగుతున్నా రూ.45లక్షలు అంటే ఎవరు ఇస్తారని అంటుంది. వాడి బాధ చూసి, పాపను కాపాడుకునేందుకు మిమ్మల్ని బతిమిలాడుకునేందుకు వచ్చానను నాన్న కాంచన చెబుతుంది. ఏంటి చంటిదానికి అంత సీరియస్‍గా ఉందా అని శివన్నారాయణ కంగారుగా అంటాడు.

అడ్డుపడిన జ్యోత్స్న

శివన్నారాయణ కరుగుతున్నాడని అనిపించగానే.. జ్యోత్స్న అడ్డుపడుతుంది. దీప కోసం అత్త అబద్ధం ఆడుతోందని చెబుతోంది. మనవాళ్లనే మనకు దీప శత్రువులను చేసిందని పాత విషయాలను గుర్తు చేస్తుంది. దీంతో శివన్నారాయణ మళ్లీ కోపంగా మారతాడు. శౌర్య పరిస్థితి నిజమే అయితే.. డబ్బు కోసం దీపనే రావాలి కదా అని జ్యోత్స్న మెలిక పెడుతుంది.

జ్యోత్స్న సూటిపోటి మాటలు

దీపనే బిడ్డ కోసం ఏడూస్తూ దీప ప్రాధేపడితే ఇది నిజం అనుకోవాలి అని జ్యోత్స్న అంటుంది. కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని సుమిత్ర అంటుంది. అబద్ధాలు చెప్పి బతికే దీప లాంటి వారే మీకు నచ్చుతారంటూ నానా మాటలు అంటుంది జ్యోత్స్న. డబ్బు కోసం పిల్లలను అడ్డుపెట్టుకుంటామని అని అనసూయ అంటే.. పెట్టుకుంటారు.. ఎవరి జీవితాలైనా నాశనం చేస్తారని జ్యోత్స్న అరుస్తుంది.

జ్యోత్స్నపై చేయి ఎత్తిన దశరథ్

దశరథ్ అరిస్తే.. జ్యోత్స్నకు వత్తాసు పలుకుతుంది పారిజాతం. కాస్త కూడా జాలిలేకుండా ఎలా మాట్లాడుతున్నారు అత్తయ్య అని సుమిత్ర అంటుంది. “జాలి అని ఎన్నిసార్లు అంటారు.. అత్త వచ్చింది మన కోసం కాదు. పనికి మాలిన దీప కోసం” అని జ్యోత్స్న అంటుంది. దీంతో నిన్ను అంటూ కోపంగా జోత్య్స్నను కొట్టేందుకు చేయి ఎత్తుతాడు దశరథ్. శివన్నారాయణ అరుస్తాడు. దీంతో ఆగిపోతాడు. కూతురిపై చేయి ఎత్తుతావా.. దించరా అని అంటాడు. పిల్లలు మాటల స్థాయిలోనే తప్పు చేసినప్పుడు దండిచకపోతే.. అవి చేతల వరకు వెళతాయి” అని దశరథ్ అంటాడు. దీంతో దాసు గురించే అంటున్నాడా, మళ్లీ అర్థం కాకుండా మాట్లాడుతున్నాడని జోత్స్న అనుకుంటుంది.

నాకు అనుమానంగానే ఉంది

జ్యోత్స్న అంటుంటే మీ చెల్లి మాటల మీద నాకూ అనుమానంగానే ఉంది అని శివన్నారాయణ అంటాడు. దీప ఆడిస్తున్న నాటకం అయి ఉండొచ్చు కదా అని మాట్లాడతాడు. ముమ్మాటికీ నాటకమే అని పారిజాతం అంటుంది. పిల్ల ప్రాణం కోసం మీ ఇంటికి వచ్చిన మీ ఇంటి బిడ్డను ఇలా అవమానించడం తప్పని అనసూయ అంటుంది. ఇంటి దగ్గర ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేసినట్టున్నారని పారిజాతం వెటకరిస్తుంది. సాయం కోసం వచ్చామని చులకనగా మాట్లాడకండి.. నా మనవరాలు ఆపదలో ఉంది చేతులు చాచి సాయం అడుగుతున్నానని కన్నీళ్లతో ప్రాధేయపడుతుంది కాంచన.

అసహ్యంగా ఉందన్న శివన్నారాయణ.. కార్తీక్ ఎంట్రీ

ఎవరు నీ మనవరాలు అని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. శౌర్య అని కాంచన అంటుంది. ఎలా అయింది నీ మనవరాలు అని అంటాడు. నా కోడలి కూతురు నా మనవరాలే కదా అని కాంచన అంటే.. నీ కొడుకుకు పుట్టలేదు కదా అని హేళన చేస్తాడు శివన్నారాయణ. నీ కొడుకుకు పుట్టని పిల్లను మనవరాలు అని నువ్వు గొప్పగా చెప్పుకోవచ్చేమో కానీ.. వినడానికి నాకు మాత్రం అసహ్యయంగా ఉంది అని శివన్నారాయణ అంటాడు. ఇంతలో కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. “వినడానికి అంత అసహ్యంగా ఉండే రెండు చెవులు మూసుకోండి శివన్నారాయణ గారు” అని గట్టిగా అంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 25) ఎపిసోడ్ ముగుస్తుంది. తాతామనవళ్ల మధ్య మాటల యుద్ధం ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్‍లో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం