Telugu Serial: జీ తెలుగు సీరియ‌ల్‌లో కార్తీక దీపం విల‌న్‌? - స‌ర్‌ప్రైజింగ్ రోల్‌లో బిగ్‌బాస్ బ్యూటీ!-karthika deepam fame shobha shetty to play guest role in zee telugu serial gundamma katha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Serial: జీ తెలుగు సీరియ‌ల్‌లో కార్తీక దీపం విల‌న్‌? - స‌ర్‌ప్రైజింగ్ రోల్‌లో బిగ్‌బాస్ బ్యూటీ!

Telugu Serial: జీ తెలుగు సీరియ‌ల్‌లో కార్తీక దీపం విల‌న్‌? - స‌ర్‌ప్రైజింగ్ రోల్‌లో బిగ్‌బాస్ బ్యూటీ!

Nelki Naresh HT Telugu

Telugu Serial: జీ తెలుగు సీరియ‌ల్ గుండ‌మ్మ క‌థ‌లో కార్తీక దీపం మోనిత గెస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. మంగ‌ళ‌వారం నాటి ఎపిసోడ్‌లో శోభాశెట్టి త‌ళుక్కున మెర‌వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. గుండ‌మ్మ క‌థ‌లో శోభాశెట్టి క్యారెక్ట‌ర్ ఏమిట‌న్న‌ది మాత్రం రివీల్ కాలేదు.

తెలుగు సీరియ‌ల్

Telugu Serial: గెస్ట్ రోల్స్ ట్రెండ్ సినిమాల్లోనే కాదు సీరియ‌ల్స్‌లో పాపుల‌ర్‌గా మారింది. ఓ టీవీ సీరియ‌ల్ యాక్ట‌ర్స్ మ‌రో టీవీ సీరియ‌ల్‌లో అతిథి పాత్ర‌ల్లో త‌ళుక్కున మెరుస్తూ అభిమానుల‌ను అప్పుడ‌ప్పుడు స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న గుండ‌మ్మ క‌థ సీరియ‌ల్‌లో కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి గెస్ట్ రోల్‌లో న‌టిస్తోంది.

ఓ ఫ్యాష‌న్ షోలో మోడ‌ల్‌గా శోభా శెట్టి పాత్ర క‌నిపించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక్క ఎపిసోడ్‌కే ప‌రిమితం అవుతుందా? ఆమె క్యారెక్ట‌ర్ లెంగ్త్ పెంచుతారా అన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు. మంగ‌ళ‌వారం నాటి ఎపిసోడ్‌తో శోభాశెట్టి క్యారెక్ట‌ర్‌పై ఫుల్ క్లారిటీ రానుంది.

లాంగెస్ట్ ర‌న్నింగ్ సీరియ‌ల్‌...

ప్ర‌స్తుతం తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న లాంగెస్ట్ ర‌న్నింగ్ టీవీ సీరియ‌ల్‌గా గుండ‌మ్మ క‌థ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇటీవ‌లే 2000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న‌ది. తెలుగులో ఈ ఘ‌న‌త సాధించిన ఆరో సీరియ‌ల్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. మంగ‌ళ‌వారం నాడు 2044వ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.

గుండ‌మ్మ క థ కంటే ముందు…

గుండ‌మ్మ క‌థ కంటే ముందు తెలుగులో కేవ‌లం ఐదు సీరియ‌ల్స్ మాత్ర‌మే 2000 ఎపిసోడ్స్‌పైగా టెలికాస్ట్ అయ్యాయి. ఈటీవీలో టెలికాస్ట్ అయిన అభిషేకం, ఆడ‌దే ఆధారం, మ‌న‌సు మ‌మ‌త, అత్తారింటికి దారేది తో పాటు స్టార్ మాలో టెలికాస్ట్ అయిన కుంకుమ పువ్వు సీరియ‌ల్ 2000 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నాయి.

ఏడేళ్లుగా...

2018 ఏప్రిల్‌లో గుండ‌మ్మ క‌థ సీరియ‌ల్ ప్రారంభ‌మైంది. ఏడేళ్లుగా నిరాటంకంగా టెలికాస్ట్ అవుతోంది. గుండ‌మ్మ క‌థ సీరియ‌ల్‌లో పూజా మూర్తి, సుష్మా కిర‌ణ్, హ‌నీ హ‌ర్ష‌లా, శ్రీదేవి, దేవిశ్రీ, మున్నా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.ప్ర‌స్తుతం ఈ సీరియ‌ల్ జీ తెలుగులో మ‌ధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల‌కు టెలికాస్ట్ అవుతోంది. జ‌న‌రేష‌న్స్ మారుస్తూ ఈ సీరియ‌ల్‌ను మేక‌ర్స్ సాగ‌దీస్తున్నారు. ఇటీవ‌లే గుండ‌మ్మ క‌థ థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ మొద‌లైంది.థ‌ర్డ్ జ‌న‌రేష‌న్‌లో పూజా మూర్తి, వేలు క్ష‌త్రియ, వైష్ణ‌వి, హేమ‌ల‌త క‌నిపించ‌బోతున్నారు.

క‌న్న‌డ బిగ్‌బాస్‌లో...

కార్తీక దీపం సీరియ‌ల్ ఫేమ్ శోభాశెట్టి ఇటీవ‌లే క‌న్న‌డ బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అనివార్య‌ కార‌ణాల వ‌ల్ల రెండు వారాల్లోనే బిగ్‌బాస్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది.ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే సెల్ఫ్ ఎలిమినేట్ కావాల్సివ‌చ్చిందంటూ శోభాశెట్టి పోస్ట్ పెట్టింది.

కార్తీక దీపంలో విల‌న్‌గా...

కార్తీక దీపం సీరియ‌ల్‌లో మోనిత‌గా నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో శోభా శెట్టి క‌నిపించింది. ఈ సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబుల‌తో పాటు మోనిత పాత్ర కూడా పాపుల‌ర్ అయ్యింది. కార్తీక దీపం 2లో శోభా శెట్టి న‌టించాల్సింది. జ్యోత్స్న పాత్ర కోసం తొలుత శోభాశెట్టినే తీసుకోవాల‌ని మేక‌ర్స్ అనుకున్నారు. క‌న్న‌డ బిగ్‌బాస్ కార‌ణంగానే ఆమె ఈ సీరియ‌ల్ చేయ‌లేక‌పోయిన‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది.

క‌న్న‌డ బిగ్‌బాస్ కంటే ముందు తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 7లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన శోభాశెట్టి ఫైన‌ల్ చేరుకున్న‌ది. 98వ రోజు ఎలిమినేట్ అయ్యింది.తెలుగులో కార్తీక దీపంతో పాటు అష్టాచ‌మ్మా సీరియ‌ల్‌లో న‌టిచింది శోభా శెట్టి.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం