కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: చిచ్చుపెట్టిన జ్యోత్స్న-భార్య చంపేసిందన్న దశరథ-బాధతో ఇంట్లోనుంచి వెళ్లిపోయిన సుమిత్ర-karthika deepam 2 today episode october 14th 2025 jyotsna dasharat feels sad sumitra out of house star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: చిచ్చుపెట్టిన జ్యోత్స్న-భార్య చంపేసిందన్న దశరథ-బాధతో ఇంట్లోనుంచి వెళ్లిపోయిన సుమిత్ర

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: చిచ్చుపెట్టిన జ్యోత్స్న-భార్య చంపేసిందన్న దశరథ-బాధతో ఇంట్లోనుంచి వెళ్లిపోయిన సుమిత్ర

కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 14 ఎపిసోడ్ లో సుమిత్ర, దశరథను విడగొట్టేలా జ్యోత్స్న చిచ్చు పెడుతుంది. దశరథ ఫుల్ ఎమోషనల్ అవుతాడు. నా భార్య చంపేసిందంటూ మాట్లాడతాడు. బాధతో సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 14వ తేదీ ఎపిసోడ్ లో దీప అనే అనాథకు మీరు అమ్మానాన్నగా మారి పెళ్లి చేశారు. ఆ పెళ్లిలో అమ్మ ఓ తప్పు చేసింది. అత్తకు సారీ చెప్పింది. కానీ ఇంకా ఎన్నాళ్లు దూరంగా ఉంటారు. మా మమ్మీ తరపున ఈ ఇంట్లో నిలబడేది నేను తప్ప ఎవరూ లేరు. నువ్వు మా మమ్మీకి అలాంటి పరిస్థితి తీసుకొచ్చావు డాడీ. మమ్మీకి నువ్వుంటే ఎంత ప్రేమో నేనంటే కూడా అంతే ప్రేమ. నీ విషయంలో నన్ను కొట్టి నా మీద కంటే నీ మీదే ప్రేమ ఎక్కువని ప్రూవ్ చేసిందని జ్యోత్స్న అంటుంది.

నీకేంటి బావ?

మమ్మీ ప్రేమ దీపకు నీ మీద ఉన్న నమ్మకం ముందు ఓడిపోయింది డాడీ అని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని కార్తీక్ అంటాడు. మమ్మీ, డాడీని కలపడానికి ట్రై చేస్తుంటే మధ్యలో నీకేంటి బావ అని అడుగుతుంది జ్యోత్స్న. నువ్వు కలుపుతున్నట్లు లేదంటాడు కార్తీక్. మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నాయో మర్చిపోయి మమ్మీతో మాట్లాడాలని జ్యోత్స్న అంటుంది. నాతో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు అంతేకానీ ఎవరి తరపునో మాట్లాడకు అని దశరథ అంటాడు.

దశరథ ఫైర్

ఎన్నాళ్లు దూరంగా ఉంటారు కలిసిపోతే చూడాలని ఉందని శివన్నారాయణ కూడా అంటాడు. పేషెంట్, డాక్టర్ స్టోరీ చెప్తాడు దశరథ. పేషెంట్ కు ఉన్న ప్రమాదం ఏంటో డాక్టర్ కు తెలుసు. మానవ సంబంధాలు కూడా అంతే నాన్న. కోలుకోవడానికి టైమ్ పడుతుందని దశరథ చెప్తాడు. ఇక్కడ ప్రమాదం చేసింది దీప అయితే గాయపడింది మమ్మీ. ఎవరిని శిక్షించాలని అడుగుతుంది జ్యోత్స్న. ఎవరిని శిక్షించాల్సిన అవసరం లేదు. మీ మమ్మీ ఏమైనా చిన్న పిల్లా? తప్పు సరిదిద్దుకోవాలని ఆమెకు తెలియదా? అని దశరథ అంటాడు.

కార్తీక్ నా మనవడు

మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో మీ ఇన్వాల్వ్ మెంట్ ఏంటీ అని కార్తీక్ ను జ్యో అడిగితే, వాడు కూడా ఈ ఫ్యామిలీనే అని దశరథ అంటాడు. జ్యో మరింత రెచ్చిపోయి మీ ప్రవర్తన చూస్తుంటే మమ్మీ ఇంట్లో ఉండటం ఇష్టం లేనట్లు కనిపిస్తుందని అంటుంది. ఆపాలని కార్తీక్ చూస్తాడు. కానీ జ్యో, పారిజాతం కలిసి కార్తీక్ ను అడ్డుకుంటారు. కార్తీక్ ఎందుకు ఇన్ని మాటలు పడటం వెళ్లిపో అని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ నాకు మనవడు, నువ్వు మాటలు అనాల్సిన అవసరం లేదని జ్యోత్స్నపై ఫైర్ అవుతాడు శివన్నారాయణ.

చంపేసింది

భర్త గౌరవాన్ని నిలబెట్టాల్సింది భార్యే. ఇంటి గౌరవాన్ని నిలబెట్టాల్సింది కూడా భార్యే. కానీ ఆ పని మీ అమ్మ చేసిందా? ఈ మాట నువ్వు మీ అమ్మను అడిగావా? నన్ను మాత్రం తప్పు పడతావు. మీ అమ్మ ఎప్పుడు తప్పు చేసిందని తెలిసిందో అప్పుడే నా మనసు చచ్చిపోయింది. అతికించే ప్రయత్నం చేశా కానీ ఈ నట్టింట్లో మరోసారి చంపేసింది. ఈ మనిషికి భర్తగా బతికి ఉండటం కంటే బుల్లెట్ తగిలిన రోజే చచ్చిపోతే బాగుండనిపించిందని ఎమోషనల్ అవుతాడు దశరథ.

కలపడం తెలియదు

ఇక చాలు ఆపు అని దశరథకు వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. దశరథ, సుమిత్ర వెళ్లిపోతారు. జ్యోత్స్నను చెప్పుతో కొట్టిన పర్లేదని అనుకుంటూ కార్తీక్ వెళ్లిపోతాడు. మరోవైపు కార్తీక్ రాగానే దీప ప్రశ్నలు కురిపిస్తుంది. జ్యోత్స్న రెచ్చగొట్టేలా మాట్లాడిన మాటలను దీపకు చెప్తాడు కార్తీక్. జ్యోత్స్నను ఆపాలని ట్రై చేశానంటాడు కార్తీక్. అత్తయ్య, మామయ్యను కలిపితే సీఈఓగా ఉండేందుకు సాయం చేస్తానని చెప్పా, కానీ ఆ మనిషికి విడదీయడం తప్పా కలపడం తెలియదు కదా అని కార్తీక్ చెప్తాడు.

తాతకు కోపం

నేను మాట్లాడితే గొడవ పెరుగుతుందని సైలెంట్ గా వచ్చేశానని కార్తీక్ అంటాడు. మా అమ్మ జరిగింది తలుచుకుని ఏడుస్తూ ఉంటుందని దీప అంటుంది. ఇట మంచంపై కూర్చుని దశరథ మాటలు తలుచుకుంటూ సుమిత్ర బాధపడుతుంది. నువ్వు చాలా తప్పు చేస్తున్నావే అని జ్యోత్స్నతో పారు అంటుంది. దీని వల్ల మనకు జరిగే నష్టం లేదు. డాడీ మీద తాతకు కోసం ఉంది. మమ్మీ సానుభూతిని వాడి తాత ప్రేమను సంపాదించగలిగితే బావ సపోర్ట్ లేకుండానే సీఈఓ పోస్టులో ఉంటానని జ్యో అంటుంది.

ఓదార్చితే బాధ పోతుంది. మళ్లీ గొడవ పెట్టాలి. ఇది నా మంచికే. బోర్డు మీటింగ్ కంప్లీట్ అయేంత వరకూ మమ్మీ ఇలాగే ఉండాలి. ఆవిడ ఎంత బాధపడితే అంత మంచిందని జ్యో అంటుంది. నేను అంత పాపం చేశానా? భార్యగా ఉండే అర్హత లేనట్లే. కోడలిగా ఉండే అర్హత కూడా లేనట్లే. నాకు విలువ ఏం ఉంది. మీకు నచ్చని నేను మీ జీవితంలోనే ఉండను అని సుమిత్ర అనుకుని బయటకు వెళ్తుంది. అది జ్యోత్స్న చూస్తుంది. ఏం తెలియనట్లే ఉంటానని అనుకుంటుంది.

ఊరి నుంచి అంబుజవల్లి ఫొటోను తీసుకొస్తుంది అనసూయ. మా అమ్మ. నాకు దీప అని పేరు పెట్టి, నన్ను మా నాన్న చేతుల్లో పెట్టి వెళ్లిపోయిందంటా అని దీప చెప్పి కుబేర ఫొటో పక్కన అంబుజవల్లి ఫొటో పెడుతుంది. దీంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం