Karthika Deepam 2 Today March 24: శ్రీధర్‌పై శివన్నారాయణ ఫైర్.. కార్తీక్ పంచ్‍లు.. దీపపై కాంచనకు ద్వేషం కలిగేలా జ్యో మాట-karthika deepam 2 today episode march 24 karthik punches to sridhar jyothna comments on deepa star maa serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Today March 24: శ్రీధర్‌పై శివన్నారాయణ ఫైర్.. కార్తీక్ పంచ్‍లు.. దీపపై కాంచనకు ద్వేషం కలిగేలా జ్యో మాట

Karthika Deepam 2 Today March 24: శ్రీధర్‌పై శివన్నారాయణ ఫైర్.. కార్తీక్ పంచ్‍లు.. దీపపై కాంచనకు ద్వేషం కలిగేలా జ్యో మాట

Karthika Deepam 2 Today Episode March 24: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జ్యోత్స్న నిశ్చితార్థానికి అంతా సిద్ధమవుతూ ఉంటుంది. పిలుపు లేకుండా వచ్చిన శ్రీధర్‌కు అవమానం ఎదురవుతుంది. కాంచన, కార్తీక్, దీప కూడా వస్తారు. దీపపై ద్వేషం పెరిగేలా కాంచనతో మాటలు అంటుంది జ్యోత్స్న. పూర్తిగా ఏం జరిగిందంటే..

Karthika Deepam 2 Today March 24: శ్రీధర్‌పై శివన్నారాయణ ఫైర్.. కార్తీక్ పంచ్‍లు.. దీపపై కాంచనకు ద్వేషం కలిగేలా జ్యో

కార్తీక దీపం 2 నేటి (మార్చి 24) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న నిశ్చితార్థానికి శివన్నారాయణ ఇల్లు ముస్తాబై ఉంటుంది. పారిజాతం హడావుడి చేస్తుంటుంది. ఈ క్రమంలో ఫోన్ మాట్లాడుతున్న శివన్నారాయణకు డాష్ ఇస్తుంది. దీంతో ఆయన కోప్పడతాడు. దశరథ అని శివన్నారాయణ పిలుస్తాడు. ఏర్పాట్లకు ఏ ఇబ్బంది లేదని దశరథ్ చెబుతాడు. నువ్వుండగా ఇబ్బంది ఏముండదని, అబ్బాయి వాళ్లను ఆహ్వానించేందుకు బయటకు పోదాం పదా అని శివన్నారాయణ అంటాడు. ఈ చీరలో చూసి సుమిత్రకు నన్ను అక్క అనుకుంటారేమోనని పారిజాతం మురిసిపోతుంది.

దాసు ఆ విషయం చెబితే మేలు

నిశ్చితార్థానికి వచ్చిన వారిని శివన్నారాయణ, దశరథ్, పారిజాతం ఆహ్వానిస్తుంటారు. నిశ్చితార్థం, పెళ్లితో పాటు జ్యోత్స్న అత్తారింట్లో అడుగుపెట్టే వరకు జాగ్రత్తగా ఉండాలని దశరథ్‍తో శివన్నారాయణ అంటాడు. “నా భయం కూడాఅదే నాన్న. ఓ తండ్రిగా నా కూతురిని సరిదిద్దాలనుకుంటున్నా. కానీ దాసును చంపేందుకు కారణమైతే ఇంత వరకు తెలియలేదు. కనీసం జ్యోత్స్న పెళ్లిలో అయినా దాసు ఆ విషయం చెబితే మేలు” అని మనసులో అనుకుంటాడు దశరథ్.

శ్రీధర్ ఎంట్రీ.. శివన్నారాయణ ఆగ్రహం

ఓ కారు రాగా మీ అల్లుడు వచ్చాడని దశరథ్‍తో శివన్నారాయణ అంటాడు. అయితే, ఆ కారులో నుంచి శ్రీధర్ దిగడంతో అందరూ షాక్ అవుతారు. వచ్చింది దశరథ్ అల్లుడు కాదంటూ.. మీ అల్లుడు అని శివన్నారాయణతో పారిజాతం అంటుంది. లోపల ఉండమని చెప్పాను కదా అని శివన్నారాయణ అంటే భార్య సమేతంగా ఆహ్వానం పలకడం మర్యాద అని పారు చెబుతుంది. “ఇలాంటి దరిద్రుడినా మర్యాదగా పిలిచేది” అని శివన్నారాయణ కోప్పడతాడు అందరినీ పలుకరిస్తాడు శ్రీధర్.

నువ్వెందుకు వచ్చావ్.. శ్రీధర్‌కు అవమానం

నా మనవరాలి నిశ్చితార్థానికి ఆహ్వానం లేకుండా ఎందుకు వచ్చావని శ్రీధర్‌ను శివన్నారాయణ కోపంగా అడుగుతాడు. అవమానించేలా మాట్లాడతాడు. శ్రీధర్ ఎప్పటిలాగే మాటలను పట్టించుకోకుండా తమ స్టైల్‍లో వాగేస్తాడు. ఒకరు పిలిచారనా వడగాలులు వస్తాయా అంటూ మాట్లాడతాడు. పిలిస్తే వచ్చేది బంధువు.. పిలవకుండా వచ్చేది ఆత్మీయులు అని డైలాగ్‍లు విసురుతాడు. పరువు తీసేందుకు తప్ప ఎందుకూ పనికి రావని శివన్నారాయణ కోప్పడితే.. కాళ్లు కడిగి పిల్లనిచ్చిన మామవి.. నీ తిట్లే మా దీవెనలు అంటూ శ్రీధర్ అంటాడు.

విశ్వరూపం చూస్తావంటూ వార్నింగ్

ఇంతలో మగపెళ్లి వాళ్లు వస్తారు. నువ్వు ఏదైనా గొడవ చేస్తే శివన్నారాయణ విశ్వరూపం చూస్తావంటూ దశరథ్‍కు వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. గౌతమ్‍ సహా మగపెళ్లి వారిని ఆహ్వానిస్తారు. నీ కోసం జ్యోత్స్న అడుగుతూనే ఉందని గౌతమ్‍తో పారిజాతం అంటుంది. నీ కోసం పెళ్లి ఒప్పుకుంది కానీ.. నా మేనకోడలి మనసులో నా కొడుకు కార్తీకే ఉంటాడని మనసులో అనుకుంటాడు శ్రీధర్. ఆ దరిద్రుడు పలుకరిస్తాడేమో ఆపు అని పారిజాతంతో శివన్నారాయణ చెబుతాడు. ఇంతలోనే హాయ్ గౌతమ్ అంటూ పలుకరిస్తాడు శ్రీధర్. ఎవరు అనిఅడిగితే ఇంటి అల్లుడిని కాకపోతే అంటూ శ్రీధర్ మాట్లాడుతుంటే.. లోపలికి వెళదాం అని అందరినీ పారు పిలుచుకుపోతుంది. నువ్వు లోపలికి రావొద్దని శ్రీధర్‌కు శివన్నారాయణ చెబుతాడు. భోజనాలు వస్తే తినేసి వెళ్లాలని పారిజాతం అంటుంది. అసలు ఇంతకీ మా ఫ్యామిలీ ఎక్కడ అని శ్రీధర్ అనుకుంటాడు.

ఈ దిష్టి బొమ్మే కనిపిస్తోంది

ఇంతలో ఓ ఆటో వస్తుంది. ఆటో వేసుకొని ఇక్కడికి వచ్చావేంట్రా.. ఇది శ్రీధర్ మామ ఇల్లు అని శ్రీధర్. ఇంతో ఆటో వెనుక కార్తీక్, దీప వస్తారు. శ్రీధర్‌ను వాళ్లు చూస్తారు. “ఊరు చివర పొలాల దగ్గరికి వెళితే దిష్టి బొమ్మలు కనిపిస్తాయి.. కానీ అదేంటో దరిద్రం ఊర్లో ఎవరికి వెళ్లినా ఈ దిష్టిబొమ్మే కనిపిస్తుంది” తండ్రి శ్రీధర్‌పై పంచ్‍లు వేస్తాడు కార్తీక్. మీరు వచ్చారేంట్రా అని శ్రీధర్ అంటుంటేనే.. కాంచన కూడా వచ్చేస్తుంది. మీ అమ్మ కూడా వచ్చిందా, మీరుమీరు కలిసిపోయారన్న మాట అని అంటాడు.

నేను, భార్య క్యాటరింగ్‍కు.. అమ్మ నిశ్చితార్థానికి..

మేం వచ్చింది క్యాటరింగ్‍కు అని కార్తీక్ అంటాడు. కుటుంబ సమేతంగా క్యాటరింగ్‍కు వస్తారా అని శ్రీధర్ ప్రశ్నిస్తాడు. కాంచనను తండ్రి, అన్న స్వయంగా ఇంటికి వచ్చి పిలిచారని దీప చెబుతుంది. దీంతో శ్రీధర్ ఆశ్చర్యంగా మాట్లాడతాడు. అందుకే వచ్చామని కార్తీక్ చెబుతాడు. మరి క్యాటరింగ్ అన్నారని శ్రీధర్ ప్రశ్నిస్తాడు. నేను, భార్య క్యాటరింగ్‍కు వచ్చాం.. మా అమ్మ నిశ్చితార్థానికి వచ్చామని కార్తీక్ సమాధానమిస్తాడు.

నా భార్యకు ఆహ్వానం లేకపోతే నాకు లేనట్టే..

ఇంతలో దశరథ్, సుమిత్ర వచ్చి కాంచనను లోపలికి ఆహ్వానిస్తారు. అన్నయ్య, వదినా అంటూ కాంచన పిలుకరిస్తుంది. లోపలికి వెళదాం పదా అని శ్రీధర్ అంటే.. సారీ అన్నయ్యా మామయ్య మిమ్మల్ని లోపలికి రానివొద్దన్నారని సుమిత్ర చెబుతుంది. దీంతో కార్తీక్ నవ్వుకుంటాడు. నేను ఈ ఇంటి అల్లుడిని అని, మీ వదిన పతీసమేతం అక్షింతలు వేయాలి కదా అని సుమిత్రతో శ్రీధర్ అంటాడు. విడిగా కూడా వేయొచ్చని దశరథ్ అంటాడు. కార్తీక్ లోలోపల నవ్వుకుంటాడు. కార్తీక్‍ను కూడా లోపలికి రమ్మంటుంది సుమిత్ర. నేను క్యాటరింగ్‍కు వచ్చానని కార్తీక్ చెప్పేస్తాడు. నా భార్యకు ఆహ్వానం లేకపోతే నాకూ ఆహ్వానం లేనట్టేనని కార్తీక్ అంటాడు.

నీ భార్య నా కూతురిని కొట్టినా.. మేం ఆ విషయం మరిచిపోయామని సుమిత్ర అంటుంది. నా కొడుకును అవమానించేందుకే కదా క్యాటరింగ్ ఇచ్చిందని శ్రీధర్ అంటాడు. నా గురించి అంత బాధపడొద్దు మాస్టారు అని కార్తీక్ బదులిస్తాడు. పిలవకుండా రావడం మీ తప్పు అని శ్రీధర్‌తో దశరథ్ అంటాడు. మేనకోడలిపై ప్రేమతో వచ్చానని శ్రీధర్ అంటాడు.

అందుకే వచ్చావ్

నువ్వు ఎందుకు వచ్చావో తెలుసులే అని కార్తీక్ మాట్లాడతాడు. జ్యోత్స్న కుటుంబాన్ని అడ్డుపెట్టుకొని మళ్లీ ఈ కుటుంబంతో కలిసే ప్రయత్నం చేస్తున్నావని శ్రీధర్‌ను అంటాడు. మగపెళ్లివాళ్లు లోపల ఉన్నందుకే శివన్నారాయణ ప్రశాంతంగా ఉండి ఉంటారని చెబుతాడు. ఎవరినీ ఏమీ అనొద్దని కార్తీక్‍తో దీప అంటుంది. మనం లోపలికి వెళదామని కాంచనతో దశరథ్ అంటాడు. భోజనాలు ఎక్కడో చెబితే.. క్యారేజీలు తీసుకెళతామని సుమిత్రను కార్తీక్ అడుగుతాడు. పనివాళ్లతో పంపిస్తామని సుమిత్ర అంటే.. ఇప్పుడు వీళ్లే పనివాళ్లు అని శ్రీధర్ అంటాడు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటూ కార్తీక్ కౌంటర్ వేస్తాడు. ఈ మాట అన్నందుకైనా పెత్తనం చేస్తానని, ఎవరు ఆపుతారో చూద్దామంటూ కాలర్ ఎగరేస్తాడు శ్రీధర్.

కాంచనను లోపలికి తీసుకెళతాడు దశరథ్. జ్యోత్స్నకు ఒకసారి కనిపించొచ్చు కదా అని సుమిత్ర అడిగేతే నో అంటాడు కార్తీక్. గౌతమ్‍కు తనకు తెలుసని, వాళ్ల కళ్లు ముందే తిరిగితే ఇబ్బందిగా ఉంటుందని చెబుతాడు.

నువ్వే దూరం చేసుకున్నావ్

ఆరోజు నేను మిమ్మల్ని కాపాడకపోయి ఉంటే బాగుండేదని అనుకుంటున్నారా అని సుమిత్రతో దీప మాట్లాడుతుంది. ఒకప్పుడు నేను నిన్ను కూతురులాగే అనుకున్నా కదా, నువ్వే ఆ అభిమానాన్ని దూరం చేసుకున్నావని సుమిత్ర చెబుతుంది. దూరం చేసుకునేలా నా అంతట నేను ఏ పనులు చేయలేదని దీప బదులిస్తుంది. కార్తీక్ అల్లుడు కాలేకపోయాడనే బాధ ఉందనేలా కాంచన మాట్లాడుతుంది. మీ ముఖం చూస్తే బాధ అర్థమవుతోందని దీప మనసులో అనుకుంటుంది. క్యారేజీలను కార్తీక్, దీప దించుతారు.

మేమంతా ఒక్కటే..

మగపెళ్లి వారితో శివన్నారాయణ, పారిజాతం మాట్లాడుతుంటారు. ఇంతలో శ్రీధర్ లోపలికి వస్తాడు. వీడిని లోపలికి ఎందుకు రానిచ్చారని మనసులో అనుకుంటాడు శ్రీధర్. మీ అల్లుడే కనిపిస్తున్నాడు.. అమ్మాయి, మనవడు రాలేదా అని శివన్నారాయణను గౌతమ్ తల్లి అడుగుతుంది. నా చెల్లి రాకుండా ఎలా ఉంటుందని కాంచనను తీసుకొస్తున్న దశరథ్ అంటాడు. నా మేనల్లుడు, వాడి భార్య కూాడా వచ్చారని, ఏర్పాట్లు చూడాలని చెప్పానని చెబుతాడు. మేమంతా ఒక్కటే అని, కలిసే ఉంటామని పారిజాతం అంటుంది.

క్యాటరింగ్ కూడా మా మనవడు కార్తీక్‍దే అని పారిజాతం అంటుంది. మరదలి ఎంగేజ్‍మెంట్‍లో క్యాటరింగ్ కార్తీక్ చూస్తున్నాడా అని గౌతమ్ ప్రశ్నిస్తాడు. పారు మాటకు శివన్నారాయణ కోపంగా చూస్తాడు. సత్యరాజ్ రెస్టారెంట్‍ను నా మేనల్లుడే రన్ చేస్తున్నాడని, క్యాటరింగ్ వాడే చేస్తానంటే కాదనలేకపోయామని కవర్ చేస్తాడు దశరథ్. మేమంతా ఒకటే కదా అని చెబుతాడు. కాంచనకు అందరినీ పరిచయం చేస్తాడు దశరథ్. నా పెళ్లాన్ని పరిచయం చేస్తాడు కానీ, నన్ను పరిచయం చేయడు.. వదలని కదా అని మనసులో అనుకుంటాడు శ్రీధర్.

వాళ్లు కూడా నాకు అవసరం లేదు

క్యాటరింగ్ కోసం ఏర్పాట్లు చేస్తుంటారు కార్తీక్, దీప. మీరు లోపలికి వెళ్లాల్సిందని కార్తీక్‍తో దీప అంటుంది. అందరూ తెలివైన వారని, నువ్వు అమాయకురాలివి అని కార్తీక్ అంటాడు. ఎవరి అవసరాలను వారు చూసుకుంటున్నారని చెబుతాడు. మా అమ్మకు పుట్టింటి మీద గుండెల నిండా ప్రేమ ఉన్నా.. నన్ను దాటి వెళ్లదు.. వాళ్లు పిలువరు అని అంటాడు. మనల్ని విడదీసి చూస్తున్నారనేలా మాట్లాడతాడు. దీంతో దీప ఆలోచనలో పడుతుంది. నీ మీద ఎందుకు కోపం, శౌర్యను ఎవరైనా అడిగారా అని కార్తీక్ అంటాడు. నా కూతురు, నా భార్య అవసరం లేనప్పుడు వాళ్లు కూడా నాకు అవసరం లేదని చెబుతాడు. ఏమైనా అంటారని నిన్ను కూడా రావొద్దంటే వినలేదని అంటాడు. ఇది మన బిజినెస్ కదా అని దీప బదులిస్తుంది.

జ్యోత్స్న కుట్ర.. దీపపై కాంచనకు ద్వేషం కలిగేలా..

జ్యోత్స్న దగ్గరికి కాంచన వెళుతుంది. దీపపై ద్వేషం కలిగేలా కాంచనతో మాయమాటలు చెబుతుంది జ్యోత్స్న. దీప కోసం నిన్నైనా వదిలేస్తాడని అంటుంది. “దీప పక్కన ఉండగా.. బావకు మనసు పని చేయదు అత్తా. అయిన వాళ్లనే కాదు దీప కోసం ఏదో ఒక రోజు నిన్ను కూడా పక్కన పెడతాడు” అని జ్యోత్స్న అంటుంది. ఏంటా మాటలు అని సుమిత్ర అంటే.. నిజమే కదా అని వత్తాసు పలుకుతుంది పారిజాతం. “నిశ్చితార్థానికి ఆడపడుచుగా నన్ను పిలిచారా.. నా కోడలిని ఆడిపోసుకునేందుకు పిలిచారా” అని కాంచన కోప్పడుతుంది. నువ్వు, నేను ఒక్కటే.. ఇద్దరం రెండు తరాల ఆడపడుచులం అని జ్యోత్స్న కపటంగా మాట్లాడుతుంది. ఇది మన ఫ్యామిలీ అంటుంది. అందుకే కదా వచ్చానంటుంది కాంచన. ఎప్పుడైనా ఏ రకంగానైనా బాధపెట్టి ఉంటే సారీ అని కాంచనతో జ్యోత్స్న అంటుంది. సుమిత్ర ఆనందిస్తుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (మార్చి 24) ఎపిసోడ్ ముగిసింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం