దశరథ్, సుమిత్రలకు జీడిపప్పు, ములక్కాడ కర్రీ అంటే బాగా ఇష్టమని స్పెషల్‌గా ప్రిపేర్ చేస్తుంది దీప. వంట చేయడంలో దీపకు సాయం చేస్తాడు కార్తీక్. కూరగాయలు కట్ చేస్తాడు. వద్దని దీప అంటుంది. నా పెళ్లానికి నేను సాయం చేస్తే తప్పేంటి బదులిస్తాడు.
నేనేమో నిన్ను వారసురాలిని చేద్దామని అనుకున్నా...సుమిత్ర అత్త అసలు కూతురు కిచెన్‌లో కష్టపడుతుంటే, దొంగ కూతురు ఏసీ రూమ్‌లో సుఖపడుతుందని కార్తీక్ అంటాడు.
నేను కష్టపడేది మా అమ్మ నాన్నల గురించే కదా అని దీప అంటుంది. అసలు వారసురాలు అని నిజం తెలిసిన ఇలాగే ఉంటానని, నా వాళ్లతో నేను ఉండటంలో కాదు...వాళ్లకు కావాల్సినవి ఇవ్వడంలో నా సంతోషం ఉంటుందని దీప అంటుంది.
ఆస్తులు, ఐశ్వర్యాల్లో ఆనందం ఉండదని దీప లాజిక్‌లు మాట్లాడుతుంది. సుమిత్రమ్మ గారి అమ్మాయి కబుర్లు గట్టిగానే చెబుతుంది కార్తీక్ సెటైర్ వేస్తాడు. మీరు అస్తమానం ఆ పేరు వాడితే ఎవరైనా వింటారని దీప అంటుంది. ఎవరు విన్న పర్వాలేదు...బ్రహ్మరాక్షసి జ్యోత్స్న వింటే మాత్రం అని కార్తీక్ అనగానే అక్కడికి జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది.
నన్ను బ్రహ్మరాక్షసి అని ఎందుకు తిట్టారు అని కార్తీక్, దీపపై ఫైర్ అవుతుంది జ్యోత్స్న. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారని నిలదీస్తుంది. నాకు ఓ చెల్లి ఉందని, దానికి తలపొగరు ఎక్కువని దీప బదులిస్తుంది. ఏం చేస్తే దిగుతుందా అని ఆలోచిస్తున్నాం అని కార్తీక్ అంటాడు.
నువ్వు డ్రైవర్‌వి కదా వంటగదిలో నీకు పనేంటి అని కార్తీక్‌ను కోప్పడుతుంది జ్యోత్స్న. మొగుడు, పెళ్లాలు అన్న తర్వాత అన్ని పనులు కలిసి చేయాలి, పెళ్లి పెటాకులు లేని దానివి నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అని జ్యోత్స్నపై పంచ్ వేస్తాడు కార్తీక్.
మీరు పుట్టుకతోనే శ్రీమంతులు కదా మీలాంటి యజమానులను గౌరవించాలని కార్తీక్ అంటాడు. పుట్టుకతోనే శ్రీమంతులా...పుట్టిన తర్వాత శ్రీమంతులా రెండింటిలో ఏది కరెక్ట్ అని దీపను అడుగుతాడు కార్తీక్. నేను పెద్దగా చదువుకోలేదని దీప బదులిస్తుంది. జ్యోత్స్న గతం గురించి ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేస్తారు. వారి మాటలు విని జ్యోత్స్న కంగారు పడుతుంది.
నేను ఫ్రెండ్‌ను కలవడానికి బయటకు వెళుతున్నానని గంట పర్మిషన్ కావాలని కార్తీక్ అంటాడు. మీ కోసం స్వీట్ చేస్తున్నానని, త్వరగా వచ్చేయమని ప్రేమగా కార్తీక్‌తో అంటుంది దీప. జ్యోత్స్న ముందే ఇద్దరు కార్తీక్, దీప ఒకరిపై మరొకరు అంతులేని ప్రేమ కురిపిస్తారు. దీపతో లవ్ యూ...మిస్ యూ అని కార్తీక్ అంటాడు. వారి ప్రేమ చూసి జ్యోత్స్న అసూయ రగిలిపోతుంది. కోపంతో చిందులు తొక్కుతుంది.
కార్తీక్ వెళ్లగానే ...దాసు బాబాయ్ ఏమయ్యాడన్నది దీపను అడుగుతుంది జ్యోత్స్న. దశరథ్‌ను కాల్చింది ఎవరో నీకు తెలుసా అని దీప రివర్స్ క్వశ్చన్ వేస్తుంది. నిన్ను పొడించింది ఎవరో తెలుసుకున్నావా అని జ్యోత్స్న అడిగితే..లైసెన్స్‌డ్ గన్ నుంచి బుల్లెట్ ఏమయ్యిందో తెలుసా అని దీప బదులిస్తుంది. అసలైన నేరస్తులు ఎప్పటికి తప్పించుకోలేరని జ్యోత్స్నను హడలగొడుతుంది. నీ ఆటకు ముగింపును కార్తీక్ పలకబోతున్నాడని దీప మనసులో అనుకుంటుంది.
కార్తీక్ నేరుగా వెళ్లి గౌతమ్‌ను కలుస్తాడు. జ్యోత్స్నను పెళ్లిచేసుకోమని, ఈ సారి తాను, దీప అడ్డు చెప్పమని గౌతమ్‌కు మాటిస్తాడు. కార్తీక్ మాటలను గౌతమ్ నమ్మడు. దీప ఎలాంటి గొడవ చేస్తుందోనని భయపడతాడు. ఈ సారి అలాంటివేమి ఉండవు బ్రో అని పిలుపు మారుస్తాడు కార్తీక్.
నీ పెళ్లికి నా భార్య తరఫున ఎలాంటి అడ్డంకి ఉండదు...నాది గ్యారెంటీ అని గౌతమ్‌కు హామీ ఇస్తాడు. జ్యోత్స్నతో పెళ్లి గురించి శివన్నారాయణ, దశరథ్‌తో మాట్లాడటానికి ఇప్పుడే రమ్మని గౌతమ్‌కు కార్తీక్ చెబుతాడు. కార్తీక్ మాటలు నమ్ముతాడు గౌతమ్. నేను నిన్ను జ్యోత్స్న ఇంటికి రమ్మన్నానని అక్కడికి ఎవరికి చెప్పొద్దని గౌతమ్‌కు సలహా ఇస్తాడు కార్తీక్.
మంచి పేరు కూడా నీకే దక్కాలని చెబుతాడు. కార్తీక్ మాటలు నమ్మి గౌతమ్ సంబరపడిపోతాడు. రారా నా తోడల్లుడా...నీకు గట్టిగానే ప్లాన్...ఇప్పటి నుంచి ఆట మజాగా ఉంటుందని కార్తీక్ మనసులో అనుకుంటాడు.
కార్తీక్ అన్న మాటల గురించే ఆలోచిస్తుంది జ్యోత్స్న. అగ్రిమెంట్ పేరుతో ఎక్కడికి వెళ్లనివ్వడం లేదని, నోటికి వచ్చింది ఏదో వాగాడు...అది నీకు కనెక్ట్ అయ్యింది...అంతేనని భయపడొద్దని మనవరాలికి సర్ధిచెబుతుంది. అప్పుడే అక్కడికి గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు.
అతడిని చూసి జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు భయపడిపోతారు. మెసేజ్, ఫోన్ లేకుండా సడెన్‌గా ఊడిపడ్డాడని జ్యోత్స్న అనుకుంటుంది. పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చానని గౌతమ్ అంటాడు. జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ అని గౌతమ్ అంటాడు.
గౌతమ్‌ను దీప చూస్తే కాఫీ కప్ మొహాన కొట్టి కాలర్ పట్టుకొని రెండు చెంపలు వాయించి పంపిస్తుందని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. కిచెన్‌లో నుంచి కాఫీ కప్‌తో వస్తున్న దీపను చూసి గౌతమ్ భయపడిపోతాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం