Karthika deepam november 9th episode: దీప అందానికి ఫిదా అయిపోయిన కార్తీక్- రిసెప్షన్ లో రచ్చ చేసేందుకు ముగ్గురు రెడీ
Karthika deepam 2 today november 9th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కూతురి కోరిక మేరకు రిసెప్షన్ చేసుకునేందుకు దీప ఒప్పుకుంటుంది. అందంగా రెడీ అయిన దీపను చూసి కార్తీక్ ఫిదా అయిపోతాడు. అటు రిసెప్షన్ లో దీప పరువు తీయాలని జ్యోత్స్న, పారిజాతం, శ్రీధర్ రెడీ అయిపోతారు.
Karthika deepam 2 serial today november 9th episode: అమ్మానాన్న తనతో ప్రేమగా ఉండటం లేదని శౌర్య ఏడుస్తుంది. కూతురి బాధ చూడలేక దీప రిసెప్షన్ కు సరే అంటుంది. అమ్మ ఫంక్షన్ కు ఒప్పుకుందని శౌర్య చాలా ఆనందపడుతుంది. కాశీ, స్వప్న ప్రేమగా మాట్లాడుకుంటుంటే శౌర్య వచ్చి రిసెప్షన్ మా అమ్మకు నాన్నకు మీకు కాదని అంటుంది.
దీప అందానికి కార్తీక్ ఫిదా
ఇంట్లో స్వప్న హడావుడి చేస్తుంది. కాంచన తన పట్ల చూపించే ప్రేమకు స్వప్న మురిసిపోతుంది. ఏం జరిగినా కాస్త ప్రశాంతంగా ఉండమని దీపతో చెప్పాలని కార్తీక్ అనుకుంటాడు. దీప ఫంక్షన్ కోసం రెడీ అవుతుంటే కార్తీక్ వస్తాడు. వచ్చింది స్వప్న అనుకుని చీరకు పిన్ పెట్టమని అడుగుతుంది.
చేసేది లేక కార్తీక్ పిన్ పెడతాడు. కాసేపటికి వెనక్కి తిరిగి చూసుకుంటే కార్తీక్ ఉంటాడు. దీప తెగ సిగ్గుపడుతూ ఇబ్బంది పడుతుంది. చీర చాలా బాగుందని మెచ్చుకుంటాడు. పక్కనే ఉన్న గులాబీ పువ్వు ఇచ్చి పెట్టుకోమని అంటాడు. దీప మొహమాట పడితే కార్తీక్ తన తలలో పువ్వు పెడతాడు.
రిసెప్షన్ కు సుమిత్ర
దీప తలలో పువ్వు చూసి స్వప్న చాలా బాగుందని అంటుంది. కార్తీక్ తెగ సిగ్గుపడిపోతాడు. అందంగా ఉన్నావని స్వప్న కూడ మెచ్చుకుంటుంది. వాళ్ళు వెళ్లిపోయాక దీప తలలో పువ్వు చూసుకుంటుంటే కార్తీక్ తనని దొంగచాటుగా చూస్తాడు. పారిజాతం, జ్యోత్స్న రిసెప్షన్ చెడగొట్టేందుకు రెడీ అయిపోతారు.
సుమిత్ర గుడికి వెళ్తున్నానని శివనారాయణకు అబద్ధం చెప్తుంది. జ్యోత్స్నను తీసుకెళ్లవచ్చు కదా అంటాడు. క్షమించండి మావయ్య రిసెప్షన్ కి అని చెప్తే మీరు ఊరుకోరని అబద్ధం చెప్పానని అనుకుంటుంది. బయటకు వెళ్ళడం కోసం తెగ దగ్గుతునూ పారిజాతం డ్రామా ఆడుతుంది.
తప్పు తెలుసుకున్న అనసూయ
హాస్పిటల్ కి నేనే తీసుకెళ్తాను పదా అని శివనారాయణ అనేసరికి బిత్తరపోతుంది. తాత దగ్గర ఇరుక్కుపోయిందని అనుకుని జ్యోత్స్న వచ్చి గ్రానిని హాస్పిటల్ కు తీసుకెళ్తానని అంటుంది. ఇద్దరూ రిసెప్షన్ కు బయల్దేరతారు. కారు అందంగా రెడీ చేయడం చూసి అనసూయ కాశీని మెచ్చుకుంటుంది.
అక్క కోసం ఆ మాత్రం చేయలేనా అని అంటాడు. ఒకప్పుడు మీకు స్వప్నకు పెళ్లి చేస్తే ఎందుకు చేశావని నేనే తిట్టాను. కానీ ఇప్పుడు మీరే తనకు అండగా నిలిచారు. నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నానని అనసూయ అంటుంది. నా ప్రాణాలు కాపాడిన మనిషికి జీవితాంతం తొడబుట్టిన తమ్ముడిలా ఉంటానని కాశీ మాట ఇస్తాడు.
మేడ్ ఫర్ ఈచ్ అదర్
దీప, కార్తీక్ కలిసి రావడం చూసి శౌర్యతో సహా కుటుంబం అంతా మురిసిపోతుంది. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారని స్వప్న వాళ్ళను ఫోటో తీస్తుంది. అందరూ సంతోషంగా రిసెప్షన్ దగ్గరకు స్టార్ట్ అవుతారు. రిసెప్షన్ దగ్గరకు శ్రీధర్, కావేరి వస్తారు.
కాశీ గురించి శ్రీధర్ నోటికొచ్చినట్టు మాట్లాడటంతో గొడవ చేయొద్దని స్వప్న తిడుతుంది. తండ్రితో కాస్త పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోమని కావేరి స్వప్నను తిడుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్