Karthika deepam november 12th episode: కార్తీక్, శ్రీధర్ ని ఏకేసిన జ్యోత్స్న-సుమిత్ర ముందే తన కూతురి చెంప పగలగొట్టిన దీప
Karthika deepam 2 serial today november 12th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 12వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. రిసెప్షన్ కి వచ్చిన జ్యోత్స్న కార్తీక్, శ్రీధర్ ని కలిపి ఏకిపారేస్తుంది. దీప గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దీంతో దీప జ్యోత్స్న చెంప పగలగొడుతుంది.
Karthika deepam 2 serial today november 12th episode: జ్యోత్స్న రిసెప్షన్ లో రచ్చ చేస్తుంది. తనని మోసం చేశావని జ్యోత్స్న కార్తీక్ ని నిందిస్తుంది. శౌర్య తల మీద చెయ్యి పెట్టించి నిజం చెప్పమని జ్యోత్స్న కార్తీక్ ని ప్రశ్నిస్తుంది. మీరిద్దరూ కలిసి నాకు చేసిన ద్రోహం ఏంటో అందరికీ తెలియాలి. దీపను నేను నీకు పరిచయం చేయడానికి ముందే నీకు తెలుసా అని జ్యోత్స్న అడుగుతుంది.
దీప ముందే పరిచయం ఉందా?
కూతురి మీద ఒట్టు వేసి అబద్దం చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇది నీ కన్న కూతురు కాకపోయినా అంతకంటే ఎక్కువని నాకు తెలుసు. అందుకే దీని మీద ఒట్టు వేయించాను. నిజం చెప్పు దీపకు నీకు ముందే పరిచయం ఉందా లేదా అని మరోసారి ప్రశ్నిస్తుంది.
ఉంది అయితే ఏంటి? అంటాడు. నేను పుట్టక ముందే బావకు పెళ్ళాన్ని అన్నారు. బావకు నాకు పెళ్లి అన్నారు. నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టారు. రెండు రోజుల్లో పెళ్లి కానీ ఆగిపోయింది. ఎందుకో తెలుసా ఈ దీప వల్ల. ఈవిడ చేసే పని వల్ల దీని మాజీ మొగుడు చంపాలని అనుకుంటే కత్తికి అడ్డుపడి నాతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయేలా చేశాడు.
నన్ను మోసం చేశావు
తర్వాత చేసుకుంటావు అనుకుంటే దీప మెడలో తాళి కట్టావు. తన మెడలో నువ్వు ఊరికే తాళి కట్టలేదు. నీకు దీపకు ఇంతకముందే సంబంధం ఉంది. అందుకే నువ్వు లండన్ నుంచి నేరుగా దీపను చూడటానికి ముత్యాలమ్మ గూడెం వెళ్ళావు. దీపను కలిసి మాట్లాడి, తన కూతురికి సైకిల్ కూడా ఇచ్చావు.
అనసూయ శౌర్యను తీసుకుని పక్కకు వెళ్ళిపోతుంది. ఈ నిజాలు ఏవి నువ్వు నాతో నా కుటుంబంతో నువ్వు చెప్పలేదు. అంటే నేను నిన్ను ప్రేమించాను గుడ్డిగా నమ్మాను కానీ నువ్వు నన్ను మోసం చేశావు. ఆడవారి జీవితాలతో ఆడుకోవడం వాడి రక్తంలోనే ఉందని పారిజాతం నోరు పారేసుకుంటుంది.
పళ్ళు రాలగొడతానన్న కావేరి
శ్రీధర్ కోపంగా కాస్త జాగ్రత్తగా మాట్లాడమని అంటాడు. మొదటి పెళ్ళాం కొడుకు రిసెప్షన్ కు రెండో పెళ్ళాంతో వచ్చిన నువ్వు కూడా మాట్లాడుతున్నావా? బంగారం లాంటి మరదలిని ఇంట్లో పెట్టుకుని వంట మనిషిని పెళ్లి చేసుకున్నాడు. బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని నువ్వు ఒక పనికిమాలిన దాన్ని చేసుకున్నావని పారిజాతం అంటుంది.
అలా అంటే పళ్ళు రాలిపోతాయని కావేరి రివర్స్ అవుతుంది. అక్క ఆయన్ని నమ్మి తాళి కట్టిచ్చుకున్నట్టే నేను తాళి కట్టించుకున్నానని చెప్తుంది. నువ్వు ఇలాంటి దరిద్రం ఏదో చేస్తావని మిమ్మల్ని పిలవలేదు మర్యాదగా బయటకు పొమ్మని అనకముందే పోండి అని కాశీ అంటాడు.
జ్యోత్స్న మాటల దాడి
నువ్వు ఎవడు మమ్మల్ని పొమ్మని చెప్పడానికని జ్యోత్స్న అంటుంది. రిసెప్షన్ ప్రశాంతంగా జరగాలి బయటకు వెళ్లిపొమ్మని దాసు కూడా చెప్తాడు. జ్యోత్స్న దీప గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది. పారిజాతం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే అనసూయ వార్నింగ్ ఇస్తుంది.
ఆరోజు హాస్పిటల్ లో నిన్ను కాపాడకపోయి ఉంటే ఈరోజు నీ బిడ్డతో రోడ్డు మీద అడుక్కుతింటూ ఉండే దానివని జ్యోత్స్న దీపను దెప్పిపొడుస్తుంది. దీప మీ అమ్మను కాపాడకపోయి ఉంటే ఈరోజు మీ అమ్మ కోసం ఇక మూలన కూర్చుని ఏడుస్తూ ఉండే దానివని కార్తీక్ అంటాడు.
నా మీద ఉన్న ఇష్టం ఏమైంది?
పాత విషయాలు అన్నీ అడగటానికి అసలు నువ్వు ఎవరని కార్తీక్ అంటే నువ్వు తాళి కట్టని భార్యని. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి మళ్ళీ ఎందుకు చేసుకొను అన్నావ్. మావయ్య తప్పు చేస్తే తాత వద్దని అన్నాడు. వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే నీకు నా మీద ఉన్న ఇష్టం ఏమైంది?
అంతకముందు కలిసిన దీప మీద ఇష్టం ఉంది. పెళ్లి చేసుకుంటాను అన్న నా మీద ఇష్టం ఉంది. దీప అంటే ఇష్టం ఉంటే ముందే నాతో ఎందుకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని అనడం దీపకు నచ్చలేదు. అందుకే దీప ఇంట్లో నుంచి పోయినట్టే పోయి మళ్ళీ వచ్చింది.
నాకెందుకు తాళి కట్టలేదు
నీకు నీ బావకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చి కాశీ, స్వప్నకు పెళ్లి చేసి మా రెండు కుటుంబాలను విడదీసింది. తర్వాత ఇంట్లో నుంచి పోయి నీతో తన మెడలో తాళి కట్టించుకుందని నిందిస్తుంది. దీప అడిగిందని తాళి కట్టలేదు అది పూర్తిగా తన సొంత నిర్ణయమని కార్తీక్ చెప్తాడు.
మరి నేను తాళి కట్టమని అన్నప్పుడు ఏమన్నావ్. మీ తాత ఒప్పుకుంటే కడతాను అన్నావ్. నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేం అభ్యంతరం లేదు. మరి ఎవరికీ చెప్పకుండా దీప మెడలో తాళి కట్టడానికి కారణం ఏంటి?నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు.
జ్యోత్స్న చెంప పగలగొట్టిన దీప
అప్పుడే సుమిత్ర రిసెప్షన్ దగ్గరకు వస్తుంది. నీ కూతురిని అడ్డు పెట్టుకుని మా బావను పెళ్లి చేసుకున్నావ్. నువ్వు ఎలాంటి దానివో తెలిసి నీ మొగుడు నిన్ను వదిలేశాడు. శౌర్యను కూడా నువ్వు మా బావతోనే కని ఉంటావని జ్యోత్స్న అనేసరికి దీప తన చెంప చెల్లుమనిపిస్తుంది.
నా కూతురి గురించి తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తాను జాగ్రత్త. అరవడం తప్ప నా గురించి నీకేం తెలుసు. ఆత్మాభిమానంతో కష్టపడి బతికాను తప్ప ఏ నాడు ఎవరి ముందు చెయ్యి చాపలేదు. తప్పు చేశాడని మొగుడిని వదిలేశాను.
కార్తీక్ బాబు నాకు దేవుడు
నా కూతురి కోసం బతకాలని అనుకున్నాను. ఏ తోడు లేని నాకు సుమిత్రమ్మ ఒక చెయ్యి అందించారు. నాకు ఉండటానికి నీడ ఇచ్చి తినడానికి తిండి పెట్టారు. కార్తీక్ బాబు నాకు ముందే తెలుసు అయితే ఏంటి? పరిచయం ఉంటే తప్పు చేశామని అనుకుంటావా?
కార్తీక్ బాబు ప్లేస్ లో ఒక ఆడది ఉంటే ఇలాగే అనుకుంటావా? మీ అమ్మగారికి నాకు ఎలాంటి బంధం ఉందో నాకు కార్తీక్ బాబుకు అలాంటి బంధమే ఉంది. తోడుగా నిలబడ్డారు బతికేందుకు ధైర్యం ఇచ్చారు. శ్రేయోభిలాషిలాగా నా శ్రేయస్సు కోరుకున్నారు.
కార్తీక్ బాబు నీకు బావ అవ్వచ్చు కానీ నాకు దేవుడు. నేను పూజించే దేవుడు నా మెడలో మూడు ముళ్ళు వేసి భర్త అయ్యాడు. నా ముందు ఈయన్ని తక్కువ చేసి మాట్లాడినా ఎలాంటి నిందలు వేసినా రెండో చెంప కూడా పగులుతుంది జాగ్రత్త అని దీప వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్