Karthika deepam november 11th episode: రిసెప్షన్ లో కార్తీక్, జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ వీడియో- అందరిలో పరువు గోవిందా-karthika deepam 2 serial today november 11th episode jyotsna exposes her and karthik engagement at his reception ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam November 11th Episode: రిసెప్షన్ లో కార్తీక్, జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ వీడియో- అందరిలో పరువు గోవిందా

Karthika deepam november 11th episode: రిసెప్షన్ లో కార్తీక్, జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ వీడియో- అందరిలో పరువు గోవిందా

Gunti Soundarya HT Telugu
Nov 11, 2024 07:13 AM IST

Karthika deepam november 11th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 11వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్, దీప రిసెప్షన్ కు జ్యోత్స్న పారిజాతం వస్తారు. కార్తీక్ మంచితనం గురించి ఏవీ ప్లే చేయాలని కాశీ వాళ్ళు రెడీ చేస్తారు. కానీ జ్యోత్స్న అందరిలో కార్తీక్ పరువు తీసేస్తుంది.

కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 11 ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 11 ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today november 11th episode: దీప, కార్తీక్ అందరూ రిసెప్షన్ జరిగే దగ్గరకు వస్తారు. తాతయ్య ఊరు వెళ్లారని చెప్పారు కదా మరి ఫంక్షన్ కు ఎలా వచ్చారు. నువ్వు కార్తీక్ వాళ్ళ నాన్నను నాన్న అని పిలుస్తున్నావ్ ఏంటి అని స్వప్నను శౌర్య అడుగుతుంది. అవన్నీ తర్వాత చెప్తానులే అని కార్తీక్ కవర్ చేస్తాడు.

దండలు మార్చుకున్న దీప, కార్తీక్ 

రిసెప్షన్ దగ్గరకు జ్యోత్స్న, పారిజాతం వస్తారు. దాసు వాళ్ళను చూసి ఆశ్చర్యంగా చూస్తాడు. మీరు వస్తే ఏం గొడవ జరుగుతుందోనని భయంగా ఉందని అంటాడు. దీప, కార్తీక్ ఒకరికొకరు దండలు మార్చుకోవాలని స్వప్న వాళ్ళు పట్టుబడతారు.

కార్తీక్ సంతోషంగా దీప మెడలో పూల దండ వేస్తాడు. నాకు కష్టంగా ఉన్న నేను ఒప్పుకోవాల్సింది కార్తీక్ బాబు నా భర్త. నా కోసం మీ అందరినీ ఎందుకు బాధపెట్టడం మీ కోసం నేను నవ్వుతూనే ఉంటానని దీప మనసులో అనుకుని నవ్వుతూ కార్తీక్ మెడలో దండ వేస్తుంది. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది.

రిసెప్షన్ కు జ్యోత్స్న 

హమ్మయ్య దీప మొహంలో నవ్వు కనిపించింది అంటే మనసులో ఉన్న భయాలు పోయినట్టేనని కార్తీక్ ఊపిరి పీల్చుకుంటాడు. జ్యోత్స్న బొకే పట్టుకుని కార్తీక్ దగ్గరకు వస్తారు. మిమ్మల్ని ఎవరు పిలిచారని అంటాడు. నేను గొడవ చేయడానికి రాలేదు మిమ్మల్ని అభినందించడానికి వచ్చానని బొకే అందిస్తుంది.

నేను నా మనవడు కాశీ పిలిస్తే వచ్చానని పారిజాతం అంటుంది. నేను నిన్నేమి పిలవలేదు మేం చేస్తున్నామో అని చెప్పడం కోసం ఇన్విటేషన్ పంపించానని నోటి దురుసుగా మాట్లాడతాడు. కాంచన కాశీని వారిస్తుంది. మీ మావయ్యను స్టేజ్ మీదకు పిలవమని కాంచన చెప్తుంది.

మగజాతి ఆణిముత్యం 

దీప, కార్తీక్ ని చూసి కాంచన తెగ మురిసిపోతుంది. దాసు మహిళా మండలి అధ్యక్షురాలు సరోజని దేవిని ఫంక్షన్ కు పిలిచానని ఆమె వచ్చిందని చెప్తాడు. మీలాంటి మగజాతి ఆణిముత్యాన్ని అభినందించడం కోసం స్వయంగా వచ్చానని సరోజని చెప్తుంది. మీరు చేసిన మంచి పనికి మిమ్మల్ని శాలువా కప్పి సన్మానం చేస్తామని అడుగుతుంది.

మీలాంటి ఆదర్శ పురుషుడిని సన్మానించి సమాజానికి పరిచయం చేయాలని అంటుంది. ఇద్దరికీ మ్యారేజ్ విసెష్ చెప్తుంది. స్వప్న కార్తీక్ కి సంబంధించి ఏవీ రెడీ చేశానని అది చూస్తే తను ఎంత మంచివాడో అందరికీ తెలుస్తుందని అంటుంది. అందులో కార్తీక్, జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కి సంబంధించి వీడియో ప్లే అవుతుంది.

పరువు పాయే 

వీడియో చూసి మనం ఎడిట్ చేసిన వీడియో ఇది కాదని అనుకుంటాడు. ముందు వీడియో ఆఫ్ చేయమని కార్తీక్ అంటే జ్యోత్స్న ఆగు అందులో తప్పేమీ ఉంది కనిపించేది నిజమే కదా అంటుంది. నిజాన్ని దాచడం ఎందుకు అందరినీ చూడనివ్వమని అంటుంది.

ఫంక్షన్ కు వచ్చిన ఒక వ్యక్తి మీకు ఈ అమ్మాయితో ఎంగేజ్ మెంట్ అయ్యిందా? దానికి ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న మీ భార్య కూడా వచ్చిందా? పైగా ఆ అమ్మాయి మాజీ భర్త పాప కోసం గొడవ పడుతున్నట్టు ఉందిగా అని నిలదీస్తాడు. అయినా మీరు పెళ్లి చేసుకున్న దీప ఎవరు అని అడిగితే వంట మనిషి అని పారిజాతం అంటుంది.

మనకి నిశ్చితార్థం కాలేదు 

మీరందరూ ఏవీ చూశారు కాబట్టి మీకు అర్థం అయ్యే ఉంటుంది. మీ అందరి అనుమానాలు తీరాలి అంటే దీప ఎవరో చెప్పాలి. నరసింహ ఎవరో చెప్పాలని పారిజాతం దీర్ఘాలు తీస్తుంది. ఇది నా పెళ్లి రిసెప్షన్ ఏమైనా ఉంటే నేను చెప్పుకుంటానని కార్తీక్ చెప్తాడు.

ఏమని చెప్పుకుంటావ్ మనకు నిశ్చితార్థం అయిందని చెప్పుకుంటావా అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. తాంబూలాలు మార్చుకోలేదు, నేను నీ వేలికి ఉంగరం తొడగలేదు. మరి నిశ్చితార్థం ఎలా అవుతుందని కార్తీక్ ఎదురు ప్రశ్నిస్తాడు. నీ భార్య మాజీ మొగుడు రాకపోతే నిశ్చితార్థం జరిగేదని అంటుంది.

మోసం చేశావు 

నువ్వు గొడవ చేయడానికే వచ్చావని అంటాడు. నేను నిజం అడిగితే సమాధానం చెప్పుకునే ధైర్యం నీకు లేదని అంటుంది. అంత సమాధానం చెప్పుకోలేని తప్పు నేనేమీ చేయలేదని చెప్తాడు. నువ్వు తప్పు చేయలేదు మోసం చేశావు అంటుంది. నిన్ను నేను మోసం చేయడం ఏంటని అడుగుతాడు.

జ్యోత్స్న కార్తీక్ చేతిని శౌర్య మీద పెట్టి నేను అడిగే దానికి నీ కూతురి మీద ఒట్టేసి నిజం చెప్పమని అంటుంది. దీప కల్పించుకోబోతే నువ్వు మాట్లాడకని జ్యోత్స్న సీరియస్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner