కార్తీకదీపం 2 సీరియల్.. తాళి తెంపబోయిన భర్త, ఎదురుతిరిగిన దీప.. నరసింహకు బుద్ధి చెప్పేందుకు కార్తీక్ స్కెచ్
Karthika deepam 2 serial today may 21st episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. దీప పని చేస్తున్న హోటల్ దగ్గరకు నరసింహ వస్తాడు. నీకు నాకు సంబంధం ఉండకూడదని అంటే తాళి ఇచ్చేయమని తనని బలవంతం చేస్తాడు.

Karthika deepam 2 serial today may 21st episode: స్కూల్ ఫీజు చెప్పగానే దీప తాను కట్టలేనని భయపడుతుంది. అవుతుంది మీరు కట్టగలరు అనేసి కార్తీక్ దీప దగ్గర డబ్బులు తీసుకుని ఇంట్లోకి తీసుకుని వెళతాడు. మీరు ఒకేసారి డబ్బు ఇవ్వలేరు కదా అందుకే కొంత డబ్బు డబ్బాలో దాచుకుని మొత్తం అయిన తర్వాత ఇవ్వమని చెప్తాడు.
ఆరు నెలల్లో అప్పు తీరుస్తా
మీరు ఎంత టైమ్ కావాలన్నా తీసుకోండి. స్కూల్ కి కట్టిన ఫీజు మీరు అప్పుగా తీసుకున్నారు కాబట్టి దాన్ని తీర్చండి. అప్పుని ఆరు నెలల్లో తీరుస్తానని దీప అంటుంది. తీర్చలేకపోతే ఏం చేస్తారని అంటాడు. తీర్చలేకపోతే నేను ఇక ఆ డబ్బులు తీసుకోను.
మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ పందెంకి ఒప్పుకోమని చెప్తాడు. ఆరు నెలల్లో తీరుస్తానని మాట ఇస్తుంది. ఇప్పుడు మీ కూతురిని మీరే చదివించుకుంటున్నారు నేను కాదు. ఎవరైనా తప్పుగా మాట్లాడితే చెంప పగలగొట్టమని చెప్తాడు. ఇదంతా పారిజాతం కిటికీలో నుంచి చూస్తూనే ఉంటుంది.
మొరగని కుక్కలు ఉండవు. మీరు ఎంత ద్వేషిస్తున్నారో కూడా నాకు తెలుసు నేను క్షమించమని అడగను. ఎందుకంటే దాని కోసమే ఇదంతా చేస్తున్నానని అనుకుంటారు. ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని ఆశ ఉందని చెప్తాడు. మీరు నన్ను క్షమించకపోయినా నేను ఎప్పటికీ శ్రేయోభిలాషిని అంటాడు.
పాప తండ్రి అతడే
అటెండర్ నరసింహకు వివరాలు చెప్తాడు. పాప తండ్రి ఆ డబ్బున్న వ్యక్తి. స్కూల్ అడ్మిషన్ లో తండ్రిగా పేరు రాశాడని అప్లికేషన్ ఫోటో తీశానని చూపిస్తాడు. తండ్రి పేరు రాశాడు అంటే పాప తండ్రి అతనే కదా అంటాడు. దానికి అసలైన తండ్రిని నేనే ఈ ఒక్క సాక్ష్యం చాలు నీ బండారం బయట పెట్టడానికని నరసింహ అనుకుంటాడు.
శౌర్య కార్తీక్ గురించి మాట్లాడుతుంది. కార్తీక్ చాలా మంచివాడని అంటుంది. కార్తీక్ మాటలు దీప గుర్తు చేసుకుంటుంది. అమ్మమ్మ కారులో స్కూల్ కి వెళ్ళమని చెప్పిందని శౌర్య అంటుంది. వద్దు ఆటోలో తీసుకుని వెళ్తానని దీప కోపంగా చెప్తుంది.
శౌర్యని దూరంగా ఉంచడం అయ్యే పని కాదు ఇక తను పాపని తీసుకెళ్ళే పని లేకుండా నేనే తీసుకెళ్ళి తీసుకురావాలని అనుకుంటుంది. దీప హోటల్ లో పని చేస్తూ ఉండగా నరసింహ వస్తాడు. టిఫిన్ ఇంకా రెడీ అవలేదని కడియం అంటే నేను వచ్చింది దీప కోసం అంటాడు.
పాపకు తండ్రి ఎవడు?
దీప మొగుడిని తానే అని అంటాడు. ఎందుకు వచ్చావు. నీకు మాకు ఏ సంబంధం లేదని ఇంటి దగ్గర చెప్పారు. నా బతుకు నేను బతుకుతున్నాను. ఇంటి దగ్గరకు వచ్చి అందరితో ఛీ అనిపించావు. ఇక్కడ అయినా ప్రశాంతంగా ఉండనివ్వమని చెప్తాడు.
మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిసింది. పాపకి తండ్రి నేనా ఆ కార్తీక్. వాడే అని నాకు తెలుసు అంటాడు. నీ నోటి నుంచి ఇలాంటి తప్పుడు మాటలు వస్తే చెప్పు తెగేలా కొడతానని దీప వార్నింగ్ ఇస్తుంది. ఇది నిజమని నిరూపించే సాక్ష్యం ఉందని అంటాడు.
పాపని స్కూల్ లో చేర్పించింది ఎవరని నిలదీస్తాడు. వాడు పాపకు ఏమవుతాడని స్కూల్ లో చేర్పించాడు. పాప తండ్రిగా పేరు రాసి సంతకం కూడా పెట్టాడని ఫోటో చూపిస్తాడు. అంటే తండ్రి వాడేనని ఒప్పుకున్నట్టే కదా. వాడు రాశాడా నువ్వు రాయమన్నావా? అంటాడు.
తాళి తెంపబోయిన నరసింహ
దీప షాక్ అవుతుంది. నా పేరు ఉండాల్సిన చోట వాడి పేరు లేకపోతే నీ చెప్పు తీసుకుని కొట్టు. ఉంటే నా చెప్పు తీసుకుని నిన్ను కొట్టనా అంటాడు. నువ్వు చెప్పేది నిజం అయితే ఆ మనిషికి ఎలా బుద్ధి చెప్పాలో తనకి తెలుసని దీప అంటుంది. నీతో నాకు ఏ సంబంధం లేదని దీప అంటే అయితే నేను కట్టిన తాళి ఇచ్చేయమని నరసింహ అడుగుతాడు.
నేను కట్టిన తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీకు నాకు సంబంధం ఉన్నట్టు. అది లేకపోతే నాకు ఏ ఇబ్బంది లేదని దీప తాళిని నరసింహ తెంపబోతాడు. అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. దీప నరసింహని తోసేస్తుంది. నా తాళి మీద చెయ్యి వేస్తే రక్తం కళ్ళ చూస్తానని బెదిరిస్తుంది.
నరసింహ వెళ్ళిపోతాడు. నరసింహని ఊరికే వదిలి పెట్టకూడదు. గట్టిగా బుద్ధి చెప్పాలని కార్తీక్ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడతాడు. దీప బాధగా కూర్చుని నరసింహ మాటలు తలుచుకుంటూ ఉంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్