Karthika deepam 2 serial.. కార్తీకదీపం 2 సీరియల్.. శౌర్యని స్కూల్ లో చేర్పించిన కార్తీక్.. అడ్మిషన్ లో ఫాదర్ గా సంతకం-karthika deepam 2 serial today may 18th episode shourya appreciate karthik for enrolling her in a school ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial.. కార్తీకదీపం 2 సీరియల్.. శౌర్యని స్కూల్ లో చేర్పించిన కార్తీక్.. అడ్మిషన్ లో ఫాదర్ గా సంతకం

Karthika deepam 2 serial.. కార్తీకదీపం 2 సీరియల్.. శౌర్యని స్కూల్ లో చేర్పించిన కార్తీక్.. అడ్మిషన్ లో ఫాదర్ గా సంతకం

Gunti Soundarya HT Telugu
May 18, 2024 07:06 AM IST

Karthika deepam 2 serial today May 18th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్యకి ఇష్టమైన స్కూల్ లోనే కార్తీక్ తనని జాయిన్ చేస్తాడు. అప్లికేషన్ ఫామ్ లో తండ్రి పేరు తనది రాస్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ మే 18వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ మే 18వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today May 18th episode: ఊర్లో కార్తీక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెప్పేస్తుంది. అది విని పారిజాతం షాక్ అయిపోతుంది. దీప శౌర్యని ఆపడానికి చూస్తుంది కానీ పారిజాతం ఆగదు. కార్తీక్ మా ఊరి జాతరకు వచ్చాడు, పోటీలో గెలిచినందుకు సైకిల్ ఇచ్చాడని అంటుంది.

yearly horoscope entry point

నటిస్తున్నారా?

కార్తీక్ కి దీప ఇక్కడికి రావడం కంటే ముందే తెలుసు. వీళ్లిద్దరికి ముందే పరిచయం ఉంటే ఏం తెలియనట్టు ఎందుకు నటిస్తున్నారని అనుకుంటుంది. మీ ఫ్రెండ్ ఎప్పుడైనా ఊర్లో ఉంటున్న మీ ఇంటికి వచ్చాడా అని పారిజాతం శౌర్యని అడుగుతుంది.

దీప కోపంగా పారిజాతంగారు అని అరుస్తుంది. నేను పోటీలో గెలిచాను ఇచ్చారు. మిగతా విషయాలు ఏమైనా కావాలంటే ఇచ్చిన వాళ్ళని అడగండి అంటుంది. శౌర్య ముందు మీకు మర్యాద చేస్తే బాగోదు ఇక మీరు వెళ్ళండి అంటుంది. పాత పరిచయాలు కూడా ఉన్నాయన్నమాట మరి తెలియనట్టు నాటకాలు ఎందుకో అని దెప్పిపొడుస్తుంది.

బంటు పురమాయింపు 

ఈ జాతరకేనా పోయిన జాతరకు కూడా వచ్చాడా అని అడుగుతుంది. మీకు కావాలంటే అడగాల్సిన వాళ్ళని అడగండి లేదంటే నాలుక సరిచేసి పంపిస్తానని దీప వార్నింగ్ ఇస్తుంది. పారిజాతం బంటుని కలుస్తుంది. దీప ఊరు వెళ్ళావ్ కదా ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది.

బంటు తెలిసిన విషయాల గురించి నసుగుతాడు. కార్తీక్ కి దీపకి ఇక్కడికి రాకముందే పరిచయం ఉందని సైకిల్ బహుమతిగా కూడా ఇచ్చాడని పారిజాతం చెప్తుంది. ఇవన్నీ మీకు ఎలా తెలుసు మీరు వాళ్ళ ఊరు వెళ్లారా అంటాడు. అంటే నువ్వు వెళ్లలేదా అని బంటుని పీకుతుంది.

నరసింహ అన్నది నిజమే కార్తీక్, దీపకు మధ్య సంబంధం ఉంది. ఈ విషయం తెలిస్తే జ్యోత్స్న బాధపడుతుంది. అది కోపంతో బావని పెళ్లి చేసుకోకపోతే నష్టం తనకేనని చెప్తుంది. ముత్యాలమ్మ గూడెం వెళ్ళి కార్తీక్, దీప గురించి మొత్తం తెలుసుకుని రమ్మని చెప్తుంది.

శౌర్యని స్కూల్ కి తెచ్చిన కార్తీక్ 

వాళ్ళ కథ ఏంటో తెలిస్తేనే కార్తీక్ శౌర్యని సొంత కూతురిలా చెయ్యి పట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడో తెలుస్తుందని చెప్తుంది. కార్తీక్ శౌర్యని తీసుకుని స్కూల్ కి వస్తాడు. స్కూల్ లో పిల్లలు చేరాలంటే వాళ్ళ పేరెంట్స్ బాగా చదువుకుని ఉండాలని ప్రిన్సిపల్ మళ్ళీ చెప్తాడు.

కార్తీక్ ప్రిన్సిపల్ తండ్రిని తీసుకుని వస్తాడు. మీ నాన్న ఏం చదువుకోలేదు కదా అయితే మీకు ప్రిన్సిపల్ అయ్యే అర్హత లేదని అంటాడు. దీంతో ప్రిన్సిపల్ శౌర్యకి స్కూల్ లో అడ్మిషన్ ఇస్తానని అంటాడు. జాలి పడి సీటు ఇవ్వొద్దు అందరి పిల్లలకు పెట్టినట్టు టెస్ట్ పెట్టి స్కూల్ లో జాయిన్ చేసుకోమని చెప్తాడు.

స్కూల్ లో శ్రీవాణి అనే మేడమ్ కార్తీక్ ని చూసి జ్యోత్స్న బావ అని గుర్తుపడుతుంది. వెంటనే జ్యోత్స్నకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. కోపంగా పారిజాతం దగ్గరకు వెళ్ళి నువ్వు అన్నట్టు నిజమైంది. శౌర్యని స్కూల్ లో జాయిన్ చేయడానికి తీసుకెళ్లాడని చెప్తుంది.

శౌర్యకు ముద్దు పెట్టిన కార్తీక్ 

పారిజాతం జ్యోత్స్నని తీసుకుని స్కూల్ దగ్గరకు వస్తుంది. ఆవేశంగా వెళ్ళి అడుగుదామని జ్యోత్స్న అంటే వద్దని వారిస్తుంది. అప్పుడే స్కూల్ దగ్గరకు నరసింహ కూడా వస్తాడు. కార్తీక్ ని చూస్తాడు. అప్పుడే శౌర్య సంతోషంగా కార్తీక్ దగ్గరకు వస్తుంది. టెస్ట్ రాశాను పాస్ అయ్యానని చెప్తుంది.

కార్తీక్ సంతోషంగా శౌర్యకు ముద్దు పెడతాడు. నా పెళ్ళానికి నీకు ఉన్న సంబంధాన్ని బయట పెట్టానని దాన్ని స్కూల్ లో చేర్పించడానికి వచ్చావా అనుకుని నరసింహ ఆవేశంగా వెళతాడు. అటెండర్ వచ్చి ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళకుండా ఆపుతాడు.

శౌర్య గురించి అడుగుతాడు. పాప నిన్న వాళ్ళ అమ్మతో వచ్చింది, పాప తండ్రి అనుకున్నా కానీ కాదని చెప్తాడు. ప్రిన్సిపల్ దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకుని చెప్పమని పురమాయిస్తాడు. కార్తీక్ అప్లికేషన్ ఫామ్ లో ఫాదర్ గా తన పేరు రాసుకుంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది. 

 

Whats_app_banner