Karthika Deepam 2 Serial March 8: జ్యోత్స్నను ఆగ్రహంతో నిలదీసిన తాత శివన్నారాయణ.. మంట పెడతానంటూ కార్తీక్ ఇంటికి శ్రీధర్-karthika deepam 2 serial today march 8 shivanarayana fires on jyothsna karthik also angry star maa channel jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial March 8: జ్యోత్స్నను ఆగ్రహంతో నిలదీసిన తాత శివన్నారాయణ.. మంట పెడతానంటూ కార్తీక్ ఇంటికి శ్రీధర్

Karthika Deepam 2 Serial March 8: జ్యోత్స్నను ఆగ్రహంతో నిలదీసిన తాత శివన్నారాయణ.. మంట పెడతానంటూ కార్తీక్ ఇంటికి శ్రీధర్

Karthika Deepam 2 Serial Today March 8: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జీవితంలో క్షమించనని జ్యోత్స్నపై కోప్పడతాడు కార్తీక్. అలాగే, శివన్నారాయణ కూడా జ్యోత్స్నపై ఫైర్ అవుతాడు. వీలునామా విషయం చెప్పేందుకు కార్తీక్ ఇంటికి వెళతాడు దశరథ్. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam 2 Serial March 8: జ్యోత్స్నను ఆగ్రహంతో నిలదీసిన తాత శివన్నారాయణ.. మంట పెడతానంటూ కార్తీక్ ఇంటికి శ్రీధర్

కార్తీక దీపం 2 నేటి (మార్చి 8) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. జోత్స్న రెస్టారెంట్‍లో పని చేసే ముఖ్యమైన ఉద్యోగులు కొందరు కార్తీక్ దగ్గరికి వస్తారు. కార్తీక్ కంపెనీలో చేరతామంటారు. జ్యోత్స్న గ్రూప్ కంపెనీలోనే పని చేయాలని సర్దిచెబుతాడు కార్తీక్. “మీరంతా జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ వర్కర్స్. ఎంతో కాలంగా ఆ సంస్థలోనే నమ్మకంగా పని చేస్తున్నారు. అక్కడ పని మానేసి మా రెస్టారెంట్‍లో జాయిన్ అవుతానంటే తప్పకుండా తీసుకోవాలి. కానీ తీసుకోలేను. ఎందుకంటే అది న్యాయం కాదు” అని కార్తీక్ అంటాడు.

సీఈవోకు తెలుసా.. జ్యోత్స్న ఎంట్రీ

జీతాలు సరిపోవడం లేదని అందుకే కంపెనీ మారాలని అనుకుంటున్నామని కార్తీక్‍తో చెబుతారు జ్యోత్స్న రెస్టారెంట్ ఉద్యోగులు. జ్యోత్స్న చెప్పిన వినడం లేదని అంటారు. చైర్మన్ శివన్నారాయణను అడగాలని కార్తీక్ అంటే.. ఏది ఉన్నా సీఈవో జ్యోత్స్ననే అడగాలని చెబుతున్నారని ఓ ఉద్యోగి చెబుతాడు. మీరు ఇక్కడికి వచ్చినట్టు మీ సీఈవో జ్యోత్స్నకు తెలుసా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. ఇంతలోనే కారులో కార్తీక్ రెస్టారెంట్‍కు వస్తుంది జ్యోత్స్న. తెలిసే తేల్చుకోవడానికి వస్తున్నాను బావ అంటూ కారు దిగుతుంది. కోపంగా కార్తీక్ వద్దకు వస్తుంది.

నా కూతురు చెప్పిందే నమ్ముతా

బావా.. చీటింగ్ చేసి గెలవాలనుకోవడం కరెక్ట్ కాదని కార్తీక్‍తో జ్యోత్స్న అంటుంది. చీటింగ్ అంటే తెలుగులో అర్థం మోసం చేయడం, అదే మర్డర్ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటో తెలుసా చంపడం అని కార్తీక్ అంటాడు. దీప, శౌర్యపై అటాక్ చేయించింది నువ్వే అని తెలిసిపోయిందనేలా కార్తీక్ మాట్లాడతాడు. మర్డర్ అటెంప్ట్ జరిగిన చోట నా కూతురు నిన్ను చూసిందని అంటాడు. ఆధారం ఉందా అని జ్యోత్స్న అడుగుతుంది. రెండు కుటుంబాలను దూరం చేసేందుకు దీప ఏదో ఒకటి చేస్తుందని జ్యోత్స్న మాటలు అంటుంది. ఏ సాక్ష్యం ఉందని నిలదీస్తున్నావని అడుగుతుంది. నా కూతురు చెప్పింది నేను నమ్ముతానని కార్తీక్ అంటాడు.

జీవితాంతం క్షమించలేను

నువ్వంటే నాకిష్టం బావ.. ఇంకా నీ కోసమే వేచిచూస్తున్నా.. ఈ విషయం తెలిసే నీ దృష్టిలో నన్ను విలన్ చేసేందుకు ఇలా చేస్తోందని జ్యోత్స్న కుటిలంగా మాట్లాడుతుంది. బంగారం కోసం మనుషులు వెంటపడితే.. నేనే చంపాలని అనుకున్నానని నా మీద నెట్టేయాలని దీప ప్రయత్నించిందని అంటుంది. మా ఇంట్లో వాళ్లు కూడా ఎవరు నమ్మలేదంటుంది. అబద్ధాలను త్వరగా.. నిజాలను ఆలస్యంగా నమ్మే కాలమిది అని కార్తీక్ చెబుతాడు.

“నేను నిన్ను జీవితాంతం క్షమించలేను జ్యోత్స్న” అని కార్తీక్ అంటాడు. నువ్వు మా అత్త కూతురిగా మంచి మనుషుల మధ్య పుట్టినందుకు దీప నిన్ను క్షమించిందని చెబుతాడు. “నీ అత్త కూతురిని నేను కాదు బావా.. దీప” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఇకనైనా మారి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తాడు కార్తీక్. ఇది కష్టం కానీ.. నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావో చెప్పు అని అడుగుతుంది. తన సంస్థంలోని ముఖ్యమైన ఉద్యోగులను ఎంతకు కొన్నావో చెప్పాలని అడుగుతుంది. మనుషులను కొనడం నీకు అలవాటు అంటూ మాటలు అంటాడు కార్తీక్.

ఉద్యోగులకు సర్దిచెప్పిన దీప

రా చూపిస్తా అంటూ జ్యోత్స్న చెయ్యి పట్టుకొని తీసుకెళతాడు కార్తీక్. తాతయ్య, దరశరథ్ ఎంతో మంచి వారని, జీతాలు తక్కువగా ఉన్నాయని మానేస్తే వారికి ఎంత కష్టమో చెప్పండని జ్యోత్స్న కంపెనీ ఉద్యోగులతో దీప చెబుతుంది. తాత, దశరథ్‍ను కలిసి జీతాలు పెంచాలని అడగాలని, కొద్ది రోజులు ఎదురుచూసినా ఫలితం కనిపించకపోతే అప్పుడు నిర్ణయం తీసుకోవాలని అంటుంది. మనం పెద్దాయన దగ్గరికి వెళదామని ఉద్యోగులు వెళ్లిపోతారు. అది దీప అంటే.. ఎవరు అవకాశవాదులో.. ఎవరు నిజాయితీపరులో ఇప్పటికే నీకు అర్థమైందా అని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు.

ఆవేశంతో ఎగేసుకుంటూ రావడం కాదు.. కాస్త ఆలోచించు అని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు. ఉద్యోగులకు జీతాలు పెంచాలని చెబుతాడు. వాళ్ల నా వరకు వచ్చారంటే.. అది నీ చేతకానితనం అని కార్తీక్ ఫైర్ అవుతాడు. నాలుగు మంచి మాటలు చెప్పినంత మాత్రాన దీపను దేవతను చేయాల్సిన అవసరం లేదని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఎప్పటికీ నా మీద గెలవలేవు బావ అని జ్యోత్స్న అంటే.. ఆల్‍ది బెస్ట్ చెబుతాడు కార్తీక్. కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న. జ్యోత్స్న ఇక మారదని దీప అంటే.. కోపంగా ఎవరూ గెలువలేరని కార్తీక్ చెబుతాడు.

జ్యోత్స్నపై తాత ఆగ్రహం.. నిలదీత

ఉద్యోగులు కార్తీక్ దగ్గరికి వెళ్లిన విషయం తెలుసుకున్న తాత శివన్నారాయణ.. జ్యోత్స్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. జ్యోత్స్న ఇంట్లోకి వస్తుంటే.. “ఆగు.. ఏం జరుగుతోంది.. ఏం చేస్తున్నావ్ నువ్వు. వర్కర్లకు మన మీద ఎందుకు నమ్మకం తగ్గుతోంది. ప్రాఫిట్స్ ఎందుకు పడిపోతున్నాయ్. ఒకప్పుడు ది బెస్ట్ అనిపించుకున్న రెస్టారెంట్ ఇప్పుడు ఎందుకు లాస్‍లోకి వెళుతోంది. ఎందుకు ఉద్యోగులు మన దగ్గర మానేసి.. కార్తీక్ రెస్టారెంట్‍కు వెళదామంటున్నారు. ఏ ఇవన్నీ నాకు తెలియదని అనుకుంటున్నావా. తెలియకూడదని అనుకుంటున్నావా” అని నిలదీస్తాడు శివన్నారాయణ. దీంతో జ్యోత్స్న కంగారు పడుతుంది.

ఎలా పడగొట్టాలని ఆలోచించకూడదు

మేనేజ్‍మెంట్‍లో ఎందుకు ఫెయిల్ అవుతున్నావని శివన్నారాయణ కోప్పడతాడు. సారీ తాత.. ఇదంతా నాకు తెలియకుండా జరిగిందని జ్యోత్స్న అంటుంది. నీకు అందుకే కదా బాధ్యత ఇచ్చిందని సుమిత్ర చెబుతుంది. కార్తీక్ కావాలనే మన వర్కర్లను లాక్కోవాలని చూస్తున్నాడని కపటంగా మాట్లాడుతుంది పారిజాతం. చేసింది బావేనని, ప్లాన్ మాత్రం దీపది అని అబద్ధం చెబుతుంది జ్యోత్స్న. ఈరోజు మన రెస్టారెంట్‍లో స్పెషల్స్ ఏంటో చెప్పు అని శివన్నారాయణ ప్రశ్నిస్తే.. తెలియక నీళ్లు నములుతుంది జ్యోత్స్న. “ఇలా ఉంటే దీప ఏంటి.. ఎవరైనా ఆడుకుంటారు. మనం ఎంతసేపు ఆలోచించాల్సింది మనం ఎలా ఎదగాలని. ఎదుటివారిని ఎలా పడగొట్టాలని కాదు” అని శివన్నారాయణ కోప్పడతాడు.

చేతకాకపోతే చెప్పండి రేపటి నుంచి అన్నీ నేనే చూసుకుంటానని శివన్నారాయణ అరుస్తాడు. అవసరం లేదు తాత.. మేం చూసుకుంటామని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ ఎదిగితే తమకు సమస్య లేదని, కానీ మనం తగ్గడం మొదలు పెట్టాం.. ప్రాబ్లం ఉంది అని శివన్నారాయణ అంటాడు. ఇక్కడితో ఆగి ఏం చేయాలో ఆలోచించి పేరు నిలబెట్టాలని చెబుతాడు. జ్యోత్స్న సీఈవోగా ఉన్నంత కాలం మన రెస్టారెంట్ పరిస్థితి ఇంతే నాన్న అని మనసులో అనుకుంటాడు దశరథ్.

ఊపిరి పీల్చుకున్న పారిజాతం

వీలునామా రాసేందుకు లాయర్ వినాయక రావును పిలిపించానని శివన్నారాయణ చెబుతాడు. నన్ను భయపెట్టినట్టు విడాకుల కోసం కాదా అని పారిజాతం ఊపిరిపీల్చుకుంటుంది. ఈ యావదాస్తికి సంబంధించి వీలునామా రాయించేందుకు పిలిచానని అంటాడు శివన్నారాయణ. ఇప్పుడెందుకని దశరథ్ చెబుతాడు. ఎవరెవరికి ఏం రాశారని శివన్నారాయణను పారిజాతం అడుగుతుంది. లాయరే చెబుతాడని శివన్నారాయణ అంటాడు.

శ్రీధర్ ఇంటికి పారిజాతం

వీలునామాలో ఎవరికి ఏం రాశాడో.. కాంచన, కార్తీక్‍కు ఏమైనా రాశాడా.. ఆస్తి మొత్తం నా మనవరాలు జ్యోత్స్న పేరు మీదే ఉండాలని మనసులో అనుకుంటుంది పారిజాతం. లాయర్ వినాయక రావు వద్ద ఎలాగైనా వివరాలు తెలుసుకోవాలని అనుకుంటుంది. వినాయక రావు దగ్గరి నుంచి వివరాలు తెలుసుకోవాలని శ్రీధర్‌ ఇంటికి వెళుతుంది పారిజాతం. అప్పుడే రెస్టారెంట్‍లో జరిగిన విషయంపై కావేరిపై శ్రీధర్ కోప్పడుతుంటాడు. రెస్టారెంట్‍లో పనివాడిని చేశావ్ కదే అంటూ ఫైర్ అవుతాడు. ఇలా గొడవ పడుతూనే ఉంటారు. ఇంతలో పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. పారిజాతం, కావేరి మధ్య మటాలు సాగాతాయి. కావేరి పార్టీ మార్చిందని శ్రీధర్ అంటాడు. కావేరి మాటలను పట్టించుకోవద్దని చెబుతాడు.

నా పెద్ద భార్యకు వాటా రావాల్సిందే

లాయర్ వినాయక రావు నీ ఫ్రెండ్ కదా అని శ్రీధర్‌ను అడుగుతుంది పారిజాతం. ఓ సమాచారం తెలుసుకోవాలని అంటుంది. మీ మామ (శివన్నారాయణ) ఆస్తి వీలునామా రాయించారని, ఎవరి పేరున ఏం రాశారో తెలుసుకోవాలని శ్రీధర్ సాయం కోరుతుంది పారు. ఇందులో తెలుసుకోవడానికి ఏముంది.. ఒక వాటా కొడుక్కి.. ఓ వాటా కూతురికి.. ఓ వాటా మీకు అని శ్రీధర్ అంటాడు. అందరికీ పంచేందుకు ఇదేమైనా కేకా అని, ఎవరి పేరు మీదైనా రాసే హక్కు ఆయనకు ఉందని పారిజాతం అంటుంది. తేడాగా రాస్తే నేను ఊరుకుంటానా.. నేను కాంచన మొగుడిని.. న్యాయంగా నా పెద్ద భార్యకు రావాల్సిన వాటా రాకపోతే నేను ఊరుకోను అని శ్రీధర్ అంటాడు. దీంతో పారిజాతం షాక్ అవుతుంది.

మంట పెట్టాల్సిందే

మామయ్య సొంత ఆస్తి అయినా అందరికీ రావాల్సిందేనని శ్రీధర్ అంటాడు. వినాయక రావు నాకు పరిచయం అయ్యిందే మామయ్య వల్ల.. ఇలాంటి వివరాలు అడిగానని తెలిస్తే వీలునామా కాదు, నాకు పంచనామా రాస్తాడని చెబుతాడు. సాయం చేస్తావని.. నీ దగ్గరికి వస్తే నాలాగే తయారయ్యావని పారు అంటుంది. నేను సాయం చేయలేనని శ్రీధర్ అంటాడు. శివ మామ నువ్వు నాకు దొరికావని అనుకుంటాడు. వెళ్లాల్సిన చోటికి వెళ్లి.. పెట్టాల్సిన మంట పెడుతున్నామని కావేరిని తీసుకొని కార్తీక్ ఇంటికి బయలుదేరతాడు శ్రీధర్.

పారిజాతం కపట ప్రేమ.. గుర్తించిన శివన్నారాయణ

అడగకుండానే శివన్నారాయణకు కాఫీ తీసుకెళుతుంది పారిజాతం. నేను అడగలేదే అని శివన్నారాయణ అంటాడు. “దేవుడు అడిగాడనా భక్తులు నైవేద్యం పెట్టేది” అని పారు అంటుంది. కపట ప్రేమను శివన్నారాయణ గుర్తించి.. విషయం ఏంటో చెప్పాలని అడుగుతాడు. పారు మాత్రం డైలాగ్‍లు విసురుతూనే ఉంటుంది. శివన్నారాయణ వెటకరిస్తాడు. ఎవరిని ఎలా బుట్టలో వేయాలో నీ దగ్గర నేర్చుకోవాలి పారిజాతం అని అంటాడు. వీలునామా వివరాలు తెలుసునేందుకు కదా నువ్వు వచ్చిందని చెబుతాడు. “ఎవరు చూపించే ప్రేమ వెనుక ఏ స్వార్థం ఉందో నాకు తెలుసు పారిజాతం” అని శివన్నారాయణ అంటాడు. వీలునామా గురించి రేపు లాయరే వచ్చి.. అందరికీ ఒకేసారి చెబుతాడని అంటాడు. ఈ ప్రసాదాలు, నైవేద్యాలు నువ్వు తీసుకెళ్లు అంటూ పంచ్ వేస్తాడు.

కార్తీక్ ఇంటికి శ్రీధర్, కావేరి

తమతో పాటు రెస్టారెంట్‍కు రావాలని కాంచన, అనసూయను దీప అడుగుతుంది. తాను రామని, టిఫిన్ బండి మీద సాయంత్రం మిర్చి పునుగులు పెడదామని అక్కడ చెప్పిందని కాంచన అంటుంది. ఇంతలో శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. వీలునామా విషయం చెప్పి చిచ్చు పెట్టాలని ప్లాన్ చేస్తాడు. “మీరిలా మిర్చి పునుగులు వేస్తూ.. రూపాయిలు లెక్కపెట్టుకుంటూ ఉండండి. అవతల కోట్లు చేజారిపోయేలా ఉన్నాయి” అని శ్రీధర్ అంటాడు. కావేరి కూడా ఇంట్లోకి వస్తే కార్తీక్, కాంచన అందరూ పలకరిస్తారు. కావేరికి కుర్చీ వేసి కూర్చోబెడుతుంది దీప. “రేయ్.. మీ అందరి కంటికి నేను కనిపించడం లేదా.. లేక నా గొంతు వినిపించడం లేదా” అని శ్రీధర్ అంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (మార్చి 8) ఎపిసోడ్ ముగిసింది. శివన్నారాయణ.. తన వీలునామాలో ఎవరికి ఆస్తి రాశాడో, ఎంత రచ్చ జరుగుతుందో చూడాలి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం