Karthika deepam 2 serial: మన దారులు వేరు జ్యోత్స్న వెంటపడకు.. చితక్కొట్టిన దీప, కార్తీక్ కంటపడిన వంటలక్క-karthika deepam 2 serial today july 10th episode deepa thrashes a harasser for trying to misbehave with her ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: మన దారులు వేరు జ్యోత్స్న వెంటపడకు.. చితక్కొట్టిన దీప, కార్తీక్ కంటపడిన వంటలక్క

Karthika deepam 2 serial: మన దారులు వేరు జ్యోత్స్న వెంటపడకు.. చితక్కొట్టిన దీప, కార్తీక్ కంటపడిన వంటలక్క

Gunti Soundarya HT Telugu
Jul 10, 2024 07:03 AM IST

Karthika deepam 2 serial today july 10th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తనతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తిని దీప చితక్కొడుతుంది. రోడ్డు మీద వెళ్తూ ఉండగా కార్తీక్ కి కనిపిస్తుంది. తన జోలికి రావొద్దని దీప చెప్తుంది.

కార్తీకదీపం 2 సీరియల్ జులై 10వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జులై 10వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial today july 10th episode: శౌర్య మాటలు విన్నది ఏమోనని దీప చాలా టెన్షన్ పడుతుంది. కార్తీక్ బాబు సాయం పేరుతో మీరు చేసిన పని తనకి తలనొప్పి తెచ్చిపెట్టిందని అనుకుంటుంది. సుమిత్ర వాళ్ళు కాంచన దగ్గరకు వెళతారు.

yearly horoscope entry point

కార్తీక్ పెళ్ళికి రెడీ

దీప గురించి మాట్లాడుకుంటారు. దీప నన్ను కాపాడిన రోజు ఎంతో కొంత చేతిలో పెట్టి పంపించేసి ఉంటే అది మనకు ఇంత దగ్గర అయ్యేది కాదు. ఇప్పుడు ఇంత బాధ ఉండేది కాదని ఫీల్ అవుతుంది. కార్తీక్ దీప కోసం వెతుకుతున్నాడు కదా దొరుకుతుందిలే అని కాంచన సర్ది చెప్తుంది.

పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చామని దశరథ కాంచనతో చెప్తాడు. కోరి కోడలిని చేసుకుంటుంది నేనే కదా. ఇక కార్తీక్ తో పని ఏముంది. నువ్వు ఎప్పుడు ముహూర్తాలు పెట్టించినా కూడా మా వాడు పెళ్ళికి రెడీ అని మాట ఇస్తుంది. దీప కోసం అటు కార్తీక్, ఇటు జ్యోత్స్న వెతుకుతూ ఉంటారు.

జ్యోత్స్న కార్తీక్ కారును గమనించి పారిజాతానికి చెప్తుంది. ఇక ఎందుకు ఆలస్యం కార్తీక్ కారును ఫాలో ఆవు వాడు ఖచ్చితంగా దీప దగ్గరకే వెళ్తున్నాడని అంటుంది. జ్యోత్స్న ఫాలో అవడం కార్తీక్ చూస్తాడు. కారు ఆపేసి జ్యోత్స్న దగ్గరకు వెళ్ళి నాతో ఏమైనా పని ఉందా ఎందుకు ఫాలో అవుతున్నావని అడుగుతాడు.

మన దారులు వేరు జ్యోత్స్న వెంట పడకు

ఎక్కడికి వెళ్తున్నావని పారిజాతం అంటే దీపను వెతకడానికి అంటుంది. నేను నీతో వస్తాను బావ ఇద్దరం ఒకరి కోసమే కదా. విడివిడిగా ఎందుకు కలిసే వెతుకుదాము ఒకటే కారు ఒకటే దారి అంటుంది. మన కారుల్లాగే మన దారులు కూడా వేరు జ్యోత్స్న అవి ఎప్పటికీ కలవవు. కానీ కాదని వెంటపడితే నీకు నిరాశ మిగులుతుంది.

ఇక్కడ వరకు వెంట పడింది చాలు ఇక ఆగిపో నన్ను ముందుకు పోనివ్వు అనేసి వెళ్ళిపోతాడు. బావ ఏంటి డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నాడు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. నా ఆట ఎలా ఉంటుందో తొందర్లోనే చూపిస్తానని అనుకుంటుంది.

బుద్ధి చెప్పిన దీప

దీప సరుకులు తీసుకోవడానికి షాపుకు వస్తుంది. అతడు దీపతో వంకరగా మాట్లాడతాడు. నా మనిషిగా ఉండిపో అని నోటికొచ్చినట్టు వాగుతాడు. దీప కన్నెర్ర చేసి లాగిపెట్టి ఒకటి పీకుతుంది. ఇంకొకసారి ఇలా వాగితే నాలిక చీరేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.

దీప దెబ్బకి షాపు అతను వణికిపోతాడు. కాంచనతో మాట్లాడాను మీ ఇష్టం అన్నది తొందర్లోనే ముహూర్తం పెట్టించాలని దశరథ అంటుంది. రెండు రోజుల్లో పంతులిని పిలిచి ముహూర్తం పెట్టించమని శివనారాయణ అంటాడు. అబ్బా మంచి వార్తా చెప్పారు కానీ ఒకటే లోటు దీప లేదు.

కన్నీళ్ళు పెట్టుకున్న సుమిత్ర

శౌర్య ఇంట్లో అందరితో ఎంతో ప్రేమగా ఉండేది. అందరినీ ముద్దుగా పిలుచుకుంటుందని అనేసరికి సుమిత్ర కన్నీళ్ళు పెట్టుకుంటుంది. జ్యోత్స్న తల్లిని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. దీప మీద కోపం ఉన్నప్పటికీ నిన్ను కాపాడినందుకు తన మీద నాకు కృతజ్ఞత ఉంది.

నా ఎంగేజ్ మెంట్ లో శౌర్య బాగా అల్లరి చేయాలి. ఎలాగైనా దీపను తీసుకురావాలి అంటుంది. సుమిత్ర దీప, శౌర్యను తలుచుకుని ఏడుస్తుంది. కార్తీక్ వెతుకుతున్నాడు కదా మీ ఎంగేజ్ మెంట్ లోపే కనిపిస్తుందిలే అని దశరథ ఓదారుస్తాడు. కార్తీక్ మళ్ళీ దీప కోసం వెతుకుతూనే ఉంటాడు.

కార్తీక్ కంటపడిన దీప

నువ్వు నన్ను ఇంతగా అపార్థం చేసుకుంటావని అనుకోలేదు ఒక్కసారి కనిపించు నేను ఇలా ఎందుకు మాట్లాడానో అర్థం అయ్యేలా చెప్తానని అనుకుంటాడు. అప్పుడే అటుగా దీప వెళ్ళడం కార్తీక్ కంట పడుతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ దీప దగ్గరకు వెళతాడు. నేను నీ కోసమే వెతుకుతున్నానని అంటాడు.

ఎందుకు నేను బతికానో చచ్చానో అని చూడటానికా? ఇప్పటి వరకు చేసింది చాలు. పాత జీవితం వదిలేసి కొత్త జీవితం ప్రారంభించాను. తల్లిలా చూసుకునే సుమిత్ర గారు, తండ్రిలా చూసుకునే దశరథ గారు ఉన్నారు అనుకున్నాను. బంధుత్వాలు లేకుండా ఉన్న నా జీవితానికి ఈ కొన్ని బంధాలు ఉన్నాయని అనుకున్నాను. కానీ మీరు వాటిని కూడా వదిలేసుకునేలా చేశారు. నన్ను మళ్ళీ అనాథలా బతుకుతున్నాను. నేను కొత్త జీవితం మొదలుపెట్టాను నన్ను వదిలేయండి అంటుంది.

దీప నేను తప్పు చేశానని ఇప్పటికీ అనుకోవడం లేదు. మీరు ఎందుకు శిక్ష వేసుకుంటున్నారని అడుగుతాడు. పాప నా కూతురు కాదని చెప్తే వెళ్లిపోతాను మీ జీవితంలోకి రానని అన్నాడు. మీరు అలా ఉంటే నేను ఎలా వదిలేస్తాను. నేను అలా మాట్లాడకపోతే రౌడీ దగ్గరకు వెళ్ళి నేనే మీ నాన్నను అంటాడు. అప్పుడు ఏంటి పరిస్థితి రౌడీని కాపాడటానికి నాకు వేరే దారి కనిపించలేదని చెప్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

 

Whats_app_banner